ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం (హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంట్నేషనల్ స్టేడియం) వేదిక కానుంది. రేపు (మార్చి 27) జరుగబోయే ఈ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ టీమ్ ఇవాళ హైదరాబాద్‌కు చేరుకుంది. జట్టుతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ హైదరాబాద్‌కు చేరకున్నాడు.
THE CRAZE OF ROHIT SHARMA AT HYDERABAD...!!!!
— CricketMAN2 (@ImTanujSingh) March 26, 2024
- The Hitman is everyone's favourite, The Icon! 🙌 pic.twitter.com/c5rVEwtP9r
హైదరాబాద్‌లో ల్యాండ్ కాగానే హిట్‌మ్యాన్‌కు ఘన స్వాగతం లభించింది. ఇక్కడ (హైదరాబాద్) హిట్‌మ్యాన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రోహిత్‌ను చూసేందుకు జనాలు ఎగబాడ్డారు. రోహిత్ హైదారాబాద్‌లో ల్యాండైన వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా వైరలవుతుంది. రోహిత్ నిన్న హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొని ఇవాళ హైదారాబద్‌కు చేరుకున్నాడు. సన్‌రైజర్స్‌తో ముంబై మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
కాగా, ముంబై ఇండియన్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ (29 బంతుల్లో 43; 7 ఫోర్లు, సిక్స్) రాణించినప్పటికీ.. స్వల్ప లక్ష్య ఛేదనలో (169) ముంబై తడబడింది. రోహిత్‌తో పాటు డెవాల్డ్ బ్రెవిస్ (38 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించినా ఉపయోగం లేకుండా పోయింది. గుజరాత్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగి ముంబైని కట్టడి చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (45), శుభ్‌మన్ గిల్ (31), రాహుల్ తెవాటియా (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బుమ్రా (4-0-14-3), కొయెట్జీ (4-0-27-2) విజృంభించడంతో గుజరాత్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఒమర్‌జాయ్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలా రెండు వికెట్లు తీయడంతో ముంబై నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment