ఐపీఎల్‌ 2025లో SRH షెడ్యూల్‌ ఇదే.. హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే..! | Sunrisers Hyderabad Schedule In IPL 2025 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2025లో SRH షెడ్యూల్‌ ఇదే.. హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే..!

Published Sun, Feb 16 2025 8:31 PM | Last Updated on Mon, Feb 17 2025 8:38 AM

Sunrisers Hyderabad Schedule In IPL 2025

ఐపీఎల్‌ 2025 షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదల చేసింది. 65 రోజుల పాటు జరిగే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 13 వేదికల్లో మెగా లీగ్‌ నిర్వహించబడుతుంది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కేకేఆర్‌ హోం గ్రౌండ్‌ అయిన ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగుతుంది.

ఇదే ఈడెన్‌ గార్డెన్స్‌లో క్వాలిఫయర్‌-2 (మే 23) మరియు ఫైనల్‌ మ్యాచ్‌లు (మే 25) జరుగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో క్వాలిఫయర్‌-1 (మే 20) మరియు ఎలిమినేటర్‌ (మే 21) మ్యాచ్‌లు జరుగుతాయి.

మార్చి 23న జరిగే సీజన్‌ రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ తమ సొంత మైదానమైన ఉప్పల్‌ స్టేడియంలో ఆడుతుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడుతుంది (ప్లే ఆఫ్స్‌ కాకుండా). ఇందులో ఏడు మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. వీటితో పాటు క్వాలిఫయర్‌-1 (మే 20) మరియు ఎలిమినేటర్‌ (మే 21) మ్యాచ్‌లు కూడా హైదరాబాద్‌లోనే జరుగుతాయి.

విశాఖపట్నంలో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో ఒకటి సన్‌రైజర్స్‌ ఆడే మ్యాచ్‌ కాగా.. రెండోది ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ (మార్చి 24) మ్యాచ్‌.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌.. ఢిల్లీ, కేకేఆర్‌, ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌తో తలో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. రాజస్థాన్‌, ఆర్సీబీ, పంజాబ్‌, సీఎస్‌కేతో తలో మ్యాచ్‌ ఆడుతుంది. 

ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే మ్యాచ్‌లు..
మార్చి 23 (ఆదివారం​)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌‌ (హైదరాబాద్‌)
మార్చి 27 (గురువారం)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ (హైదరాబాద్‌)
మార్చి 30 (ఆదివారం​)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ (వైజాగ్‌)
ఏప్రిల్‌ 3 (గురువారం)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ కేకేఆర్‌ (కోల్‌కతా)
ఏప్రిల్‌ 6 (ఆదివార​ం)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ (హైదరాబాద్‌)
ఏప్రిల్‌ 12 (శనివారం​)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌ (హైదరాబాద్‌)
ఏప్రిల్‌ 17 (గురువారం)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ (ముంబై)
ఏప్రిల్‌ 23 (బుధవారం)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ (హైదరాబాద్‌)
ఏప్రిల్‌ 25 (శుక్రవారం)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ సీఎస్‌కే (చెన్నై)
మే 2 (శుక్రవారం)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ (అహ్మదాబాద్‌)
మే 5 (సోమవారం)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ (హైదరాబాద్‌)
మే 10 (శనివారం)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ కేకేఆర్‌ (హైదరాబాద్‌)
మే 13 (మంగళవారం)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ఆర్సీబీ (బెంగళూరు)
మే 18 (ఆదివారం)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ లక్నో (లక్నో)

ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు..
అథర్వ తైడే, అభినవ్‌ మనోహర్‌, అనికేత్‌ వర్మ, సచిన్‌ బేబి, ట్రవిస్‌ హెడ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిషేక్‌ శర్మ, కమిందు మెండిస్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఇషాన్‌ కిషన్‌, జీషన్‌ అన్సారీ, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మొహమ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చాహర్‌, సిమ్రన్‌జీత్‌ సింగ్‌, ఎషాన్‌ మలింగ, ఆడమ్‌ జంపా, జయదేశ్‌ ఉనద్కత్‌, బ్రైడన్‌ కార్స్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement