
ఐపీఎల్–2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ హోం గ్రౌండ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో జరిగే పోరులో గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది. అదే రోజు ఆదివారం చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 12 రోజుల తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది.
మే 25న ఫైనల్‌కు కూడా కోల్‌కతానే వేదిక కానుండగా... క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే జరుగుతాయి. పది జట్లు పాల్గొనే ఈ టోర్నీలో పది టీమ్‌ల సొంత మైదానాలతో పాటు రెండు ఇతర వేదికలు (ధర్మశాల, గువహటి) కలిపి మొత్తం 12 చోట్ల లీగ్‌ను నిర్వహిస్తారు. రాజస్తాన్ రాయల్స్ టీమ్‌కు గువహటి తమ రెండో సొంత వేదిక కాగా...ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ తమ మూడు హోం మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment