ఐపీఎల్ 2024కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్ (15 రోజులు) ఇవాళ (ఫిబ్రవరి 22) సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. లీగ్ అనవాయితీ ప్రకారం తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్.. రన్నరప్ జట్టు తలపడతాయి. ఈ లెక్కన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. గత సీజన్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ప్రత్యర్ధిని మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ప్రత్యర్ధిగా గుజరాత్ టైటాన్స్ కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉండనున్నట్లు తాజా సమాచారం. ఇదే జరిగితే 16 సీజన్లుగా కొనసాగుతున్న ఆనవాయితీకి బ్రేక్ పడినట్లవుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో వీక్షించవచ్చు. నేడు విడుదల చేసే షెడ్యూల్ కేవలం 15 రోజులకు మాత్రమే ఉండనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విడతల వారీగా షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు ధుమాల్ సృష్టం చేశారు. టోర్నీ మొత్తం భారత్‌లోనే జరగనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment