ఐపీఎల్ తొలి పోరులో కోల్కతా, ముంబై ఢీ
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఏడో ఎడిషన్ మొదటి దశ షెడ్యూల్ విడుదలయింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా మొదటి దశలో జరిగే మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించనున్నారు. 20 మ్యాచ్లను దుబాయ్లోని మూడు మైదానాల్లో నిర్వహించనున్నట్టు ఐపీఎల్ పాలక మండలి తెలిపింది. ఏప్రిల్ 16న జరిగే ఆరంభ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఇక్కడ మ్యాచ్లు జరుగుతాయి.
మే 1 నుంచి 12 వరకు రెండో విడత మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో నిర్వహించనున్నారు. కేంద్ర హోం శాఖ అనుమతిస్తే ఈ మ్యాచ్లను భారత్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించడం ఇది రెండోసారి. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండో సీజన్‌ను పూర్తిగా దక్షిణాఫ్రికాలోనే నిర్వహించాల్సి వచ్చింది.