క్రికెట్ అభిమానుల ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 షెడ్యూల్ విడుదలకు సమయం అసన్నమైంది. గురువారం(ఫిబ్రవరి 22) ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేయనున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో వీక్షించవచ్చు.
తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే వర్సెస్ గుజరాత్...
కాగా మార్చి 22వ తేదీ నుంచి ఈ ఏడాది ధనాధన్ లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొదటి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించి తొలి 15 రోజుల షెడ్యూల్ షెడ్యూల్ మాత్రమే విడుదల కానున్నట్లు సమాచారం.
సాధారణ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ సైతం సృష్టం చేశారు. అదే విధంగా టోర్నీ మొత్తం భారత్‌లోనే జరగనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment