ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ బాధ్యతలను అశ్విన్‌కు సీఎస్‌కే ఫ్రాంచైజీ యాజయాన్యం ఇండియా సిమెంట్స్ గ్రూప్ అప్పగించింది. దీంతో అశూతో సీఎస్‌కే మరోసారి ఒప్పందం కుదుర్చుకోవడం దాదాపు ఖాయమైంది.
కాగా తమిళనాడులో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తయారు చేసేందుకు సీఎస్‌కే ఫ్రాంచైజీ చెన్నై శివారులో హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. "వేలానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్ల ఎంపిక అనేది వేలం డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటుంది. ముందే మేము ఏ ప్లాన్స్ చేయలేం. అశ్విన్‌ను కొనుగోలు చేసే ఛాన్స్ మాకు వస్తుందో లేదో కూడా తెలియదు.
అతడు మొదటగా మా హై పెర్ఫార్మెన్స్ సెంటర్ ఛీప్‌గా బాధ్యతలు చేపడతాడు. అక్కడ ప్రోగ్రామ్‌లు, క్రికెట్‌కు సంబంధించిన విషయాలను అతడు చూసుకుంటాడు. అతడితో మేము ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. అశూ ఇప్పుడు సీఎస్‌కే వెంచర్‌లో భాగమయ్యాడు.
అదే విధంగా టీఎన్‌సీఎ ఫస్ట్-డివిజన్ క్రికెట్‌లో ఇండియా సిమెంట్స్ జట్లకు సైతం ప్రాతినిథ్యం వహిస్తాడని" ఓ ప్రకటనలో సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ పేర్కొన్నాడు. కాగా అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు.
అయితే ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి అశ్విన్‌ను రాజస్తాన్ విడిచిపెట్టే ఛాన్స్ ఉంది. కాగా అంతకముందు అశ్విన్ 2005 నుంచి 2015 వరకు సీఎస్‌కే ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ పదేళ్ల తర్వాత సీఎస్‌కే ఫ్యామిలీలో అశూ భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment