ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌పై వేటు వేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు కెప్టెన్ రిషబ్ పంత్‌ను కూడా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు పంత్‌ను రిటైన్ చేసుకోడదని ఢిల్లీ భావిస్తున్నట్లు సమాచారం. పంత్‌కు ఢిల్లీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మద్దతు ఉన్నప్పటికీ.. ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం అతడిని విడిచి పెట్టే అవకాశముందని దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లు పేర్కొంది.
అదేవిధంగా పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు నుంచి విడుదల చేస్తే.. అతడిని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశముందని సదరు పత్రిక పేర్కొంది.
సీఎస్‌కే వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని వచ్చే ఏడాది సీజన్‌లో ఆడుతాడాలేదన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ కావాలని సీఎస్‌కే ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే పంత్ కెప్టెన్సీపై కూడా ఢిల్లీ ఫ్రాంచైజీ ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది సీజన్‌కు రోడ్డు ప్రమాదం కారణంగా దూరంగా ఉన్న రిషబ్. . ఈ ఏడాది సీజన్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.
అయితే పంత్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటకి.. జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని విడిచిపెట్టాలని ఢిల్లీ నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రిషబ్.. ఐపీఎల్‌లో ఢిల్లీ తరపున లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment