IPL 2024 DC vs CSK Live Updates:
సీఎస్‌కేపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం..
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. వైజాగ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది.
సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆఖరిలో (16 బంతుల్లో 37, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో మెరుపులు మెరిపించినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. ధోనితో పాటు అజింక్యా రహానే(45) క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ రెండు, అక్షర్ పటేల్ ఒక్క వికెట్ సాధించారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(52), రిషబ్ పంత్(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అదేవిధంగా ఈ ఏడాది సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ షా(43) పరుగులతో రాణించాడు. వార్నర్,పృథ్వీ షా తొలి వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీఎస్‌కే బౌలర్లలో పతిరాన 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా, ముస్తఫిజర్ రెహ్మన్ తలా వికెట్ సాధించారు.
ధోని ఆన్ ఫైర్..18 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 146/6
18 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మెరుపులు మెరిపిస్తున్నాడు. కేవలం 6 బంతుల్లో 16 పరుగులతో ధోని బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఆరో వికెట్ డౌన్.. శివమ్ దూబే ఔట్
120 పరుగుల వద్ద సీఎస్‌కే ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన శివమ్ దూబే.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి ధోని వచ్చాడు.
సమీర్ రిజ్వీ ఔట్
సమీర్ రిజ్వీ రూపంలో సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో రిజ్వీ ఔటయ్యాడు. 16 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్ : 120/5
సీఎస్‌కే నాలుగో వికెట్ డౌన్.. రహానే ఔట్
102 పరుగుల వద్ద సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన అజింక్య రహానే.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు.
12 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 92/3
12 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో రహానే(45), దూబే(3) పరుగులతో ఉన్నారు.
6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 32/2
6 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే(18), డార్లీ మిచెల్(7) పరుగులతో ఉన్నారు.
సీఎస్‌కేకు బిగ్ షాక్.. 7 పరుగులకే 2 వికెట్లు
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఢిల్లీ పేసర్ ఖాలీల్ అహ్మద్ వీరిద్దరి ఔట్ చేశాడు. 4 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్ : 17/2
చెలరేగిన వార్నర్, పంత్.. సీఎస్‌కే టార్గెట్ 192 పరుగులు
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(52), రిషబ్ పంత్(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అదేవిధంగా ఈ ఏడాది సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ షా(43) పరుగులతో రాణించాడు. వార్నర్,పృథ్వీ షా తొలి వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీఎస్‌కే బౌలర్లలో పతిరాన 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా, ముస్తఫిజర్ రెహ్మన్ తలా వికెట్ సాధించారు.
18 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 162/4
18 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రిషబ్ పంత్(35),అక్షర్ పటేల్(5) పరుగులతో ఉన్నారు.
వారెవ్వా పతిరనా.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
సీఎస్‌కే పేసర్ మతీషా పతిరనా తన యార్కర్లతో ఢిల్లీ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. 15 ఓవర్ వేసిన పతిరనా వరుస క్రమంలో మార్ష్, స్టబ్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 15 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 134/4
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా ఔట్
103 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన పృథ్వీ షా.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. వార్నర్ ఔట్
92 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. ముస్తఫిజర్ రెహ్మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సీఎస్‌కే ఆటగాడు పతిరనా అద్బుతమైన క్యాచ్‌తో వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ : 95/1.
దంచి కొడుతున్న ఢిల్లీ ఓపెనర్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 62/0. క్రీజులో డేవిడ్ వార్నర్(35), పృథ్వీషా(24) పరుగులతో ఉన్నారు.
3 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 19/0
3 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్(13), పృథ్వీ షా(6) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా విశాఖపట్నం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. సీఎస్‌కే ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/ వికెట్ కీపర్ ), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా, ముస్తాఫిజుర్ రెహమాన్
Comments
Please login to add a commentAdd a comment