ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.
ఈ ఏడాది సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు.
"ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్‌లో మా జట్టు కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. అతడు గత రెండు సీజన్ల నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీకి వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా చాలా అనుభవం ఉంది.
గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. కెప్టెన్సీ చేసే అవకాశం రావడంతో అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ దూరం కావడం మా దురదృష్టం. మేము అతడి బ్యాన్‌పై అప్పీల్ చేశాము. కానీ ఫలితం మాత్రం మాకు అనుకూలంగా రాలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాంటింగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment