ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఢిల్లీ సజీవంగా నిలుపున్‌కుంది.
ఇక ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం ఐపీఎల్ మెన్‌జ్‌మెంట్ విధించే సూచనలు కన్పిస్తున్నాయి. శనివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు.
కాగా ఢిల్లీ క్యాపిటిల్స్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఇది మూడో సారి. అయితే ఐపీఎల్ నియమావళి ప్రకారం వరుసగా మూడో సారి స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్‌పై 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతోపాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఒకవేల అదే జరిగితే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తదపరి మ్యాచ్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment