India Cement
-
ఐపీఎల్ 2025.. చెన్నై సూపర్ కింగ్స్‌లోకి అశ్విన్!?
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ బాధ్యతలను అశ్విన్‌కు సీఎస్కే ఫ్రాంచైజీ యాజయాన్యం ఇండియా సిమెంట్స్ గ్రూప్ అప్పగించింది. దీంతో అశూతో సీఎస్కే మరోసారి ఒప్పందం కుదుర్చుకోవడం దాదాపు ఖాయమైంది. కాగా తమిళనాడులో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తయారు చేసేందుకు సీఎస్కే ఫ్రాంచైజీ చెన్నై శివారులో హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. "వేలానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్ల ఎంపిక అనేది వేలం డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటుంది. ముందే మేము ఏ ప్లాన్స్ చేయలేం. అశ్విన్‌ను కొనుగోలు చేసే ఛాన్స్ మాకు వస్తుందో లేదో కూడా తెలియదు. అతడు మొదటగా మా హై పెర్ఫార్మెన్స్ సెంటర్ ఛీప్‌గా బాధ్యతలు చేపడతాడు. అక్కడ ప్రోగ్రామ్‌లు, క్రికెట్‌కు సంబంధించిన విషయాలను అతడు చూసుకుంటాడు. అతడితో మేము ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. అశూ ఇప్పుడు సీఎస్కే వెంచర్లో భాగమయ్యాడు.అదే విధంగా టీఎన్సీఎ ఫస్ట్-డివిజన్ క్రికెట్లో ఇండియా సిమెంట్స్ జట్లకు సైతం ప్రాతినిథ్యం వహిస్తాడని" ఓ ప్రకటనలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ పేర్కొన్నాడు. కాగా అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు.అయితే ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి అశ్విన్‌ను రాజస్తాన్ విడిచిపెట్టే ఛాన్స్ ఉంది. కాగా అంతకముందు అశ్విన్ 2005 నుంచి 2015 వరకు సీఎస్కే ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ పదేళ్ల తర్వాత సీఎస్కే ఫ్యామిలీలో అశూ భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. -
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
ఇండియా సిమెంట్స్‌కు నష్టాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 113 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం 7.5 శాతం బలపడి రూ. 1,327 కోట్లను దాటింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 27 శాతం పెరిగి రూ. 1,528 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్పంగా లాభపడి రూ. 248 వద్ద ముగిసింది. -
ఇండియా సిమెంట్స్‌కు నష్టం రూ. 31 కోట్లు
చెన్నై: గడిచిన ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో ఇండియా సిమెంట్స్ రూ. 30.6 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) క్యూ4లో రూ. 26.3 కోట్ల నికర లాభాన్ని సాధించింది. స్టాండెలోన్ ఫలితాలివి. సిమెంట్‌కు డిమాండ్ మందగించడం, సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమైనట్లు కంపెనీ వైస్‌చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. దక్షిణాదిలో డిమాండ్‌కు మించిన సరఫరా ఉండటంతో సిమెంట్ అమ్మకపు ధరలపై ఒత్తిడి పడినట్లు చెప్పారు. 2009లో ఆంధ్రప్రదేశ్‌లో సిమెంట్‌కు 24 లక్షల టన్నుల డిమాండ్ నమోదుకాగా, ప్రస్తుతం 16 లక్షల టన్నులకు పరిమితమైనట్లు తెలిపారు. కాగా, క్యూ4లో నికర అమ్మకాలు కూడా రూ. 1,191 కోట్ల నుంచి రూ. 1,080 కోట్లకు క్షీణించాయి. పూర్తి ఏడాదికి పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ రూ. 117 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. అంతక్రితం ఏడాదిలో రూ. 188 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక నికర అమ్మకాలు సైతం రూ. 5,159 కోట్ల నుంచి రూ. 5,085 కోట్లకు తగ్గాయి. సిమెంట్‌కు తగిన స్థాయిలో డిమాండ్ పుంజుకునేందుకు కనీసం ఆరు నెలల కాలం పడుతుందని శ్రీనివాసన్ అంచనా వేశారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి సిమెంట్ అమ్మకాలు పెరిగే అవకాశమున్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకాలు పడిపోగా, తమిళనాడు, కేరళలో సిమెంట్‌కు మంచి డిమాండ్ ఉన్నదని చెప్పారు. దేశీ కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గులు, రైల్వే రవాణా చార్జీల్లో పెరుగుదల వంటి అంశాలు కూడా ఫలితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా రూ. 166 కోట్ల ఆదాయం సమకూరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు దాదాపు 5% పతనమై రూ. 99 వద్ద ముగిసింది.