
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.
ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.
గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రబాడ, సాయికిషోర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు.