అదొక చెత్త నిర్ణయం.. హార్దిక్ పాండ్యాతో అట్లుంటది మరి!? | Hardik Can Never Pick A Good Team: Fans Fire On MI Dropping Vignesh Puthur | Sakshi
Sakshi News home page

IPL 2025: అదొక చెత్త నిర్ణయం.. హార్దిక్ పాండ్యాతో అట్లుంటది మరి!?

Published Sat, Mar 29 2025 10:24 PM | Last Updated on Sun, Mar 30 2025 12:18 PM

Hardik Can Never Pick A Good Team: Fans Fire On MI Dropping Vignesh Puthur

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో అహ్మదాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో యువ స్పిన్న‌ర్  విఘ్నేష్ పుతూర్‌కు మంబై ఇండియ‌న్స్ తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. త‌న అరంగేట్రంలో సీఎస్‌కేపై మూడు వికెట్ల‌తో స‌త్తాచాటిన‌ప్ప‌టికి విఘ్నేష్ పుతూర్‌ను ముంబై ఇండియ‌న్స్ ప‌క్క‌న పెట్ట‌డం అంద‌రిని ఆశ్య‌ర్య‌ప‌రిచింది.

అత‌డి స్ధానంలో స్పిన్న‌ర్‌గా ముజీబ్ ఆర్ రెహ్మాన్‌ను ముంబై మెనెజ్‌మెంట్ ఆడించింది. జ‌ట్టులోకి వ‌చ్చిన రెహ్మాన్ త‌న మార్క్ చూపించ‌లేక‌పోయాడు. రెండు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన ముజీబ్‌.. 28 ప‌రుగులిచ్చి ఓ వికెట్ సాధించాడు. ఈ క్ర‌మంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు. 

తొలి మ్యాచ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన విఘ్నేష్‌ను ఎందుకు ప‌క్క‌న పెట్టారాని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. మ‌రి కొంత‌మంది ఇదొక చెత్త నిర్ణ‌య‌మ‌ని పోస్ట‌లు పెడుతున్నారు. కాగా సీఎస్‌కే తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన విఘ్నేష్ త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 32 ప‌రుగులిచ్చి మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ మ్యాచ్‌తో అంద‌రి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయిసుద‌ర్శ‌న్‌(63) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. శుబ్‌మ‌న్ గిల్‌(38), జోస్ బ‌ట్ల‌ర్‌(39) రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బౌల్ట్‌, దీప‌క్ చాహ‌ర్‌, ముజీబ్ త‌లా వికెట్ సాధించారు.
చ‌ద‌వండి: IPL 2025: శుబ్‌మ‌న్ గిల్ అరుదైన ఫీట్‌.. డేవిడ్ వార్న‌ర్ రికార్డు బ‌ద్ద‌లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement