Vignesh Puthur
-
అదొక చెత్త నిర్ణయం.. హార్దిక్ పాండ్యాతో అట్లుంటది మరి!?
ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యువ స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్‌కు మంబై ఇండియన్స్ తుది జట్టులో చోటు దక్కలేదు. తన అరంగేట్రంలో సీఎస్కేపై మూడు వికెట్లతో సత్తాచాటినప్పటికి విఘ్నేష్ పుతూర్‌ను ముంబై ఇండియన్స్ పక్కన పెట్టడం అందరిని ఆశ్యర్యపరిచింది.అతడి స్ధానంలో స్పిన్నర్‌గా ముజీబ్ ఆర్ రెహ్మాన్‌ను ముంబై మెనెజ్‌మెంట్ ఆడించింది. జట్టులోకి వచ్చిన రెహ్మాన్ తన మార్క్ చూపించలేకపోయాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన ముజీబ్.. 28 పరుగులిచ్చి ఓ వికెట్ సాధించాడు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విఘ్నేష్‌ను ఎందుకు పక్కన పెట్టారాని ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి కొంతమంది ఇదొక చెత్త నిర్ణయమని పోస్టలు పెడుతున్నారు. కాగా సీఎస్కే తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన విఘ్నేష్ తన 4 ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.I'm so furious seeing this playing 11/12 of Mumbai Indians, brainless decision making. Chutiye left both the departments weak by leaving Will Jacks & Vignesh Puthur out. Absolutely pathetic.— Vipul 🇮🇳 (@Vipul_Espeaks) March 29, 2025ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: శుబ్‌మన్ గిల్ అరుదైన ఫీట్.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు -
విఘ్నేశ్‌ను సత్కరించిన నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్
ముంబై ఇండియన్స్ యువ సంచలనం విఘ్నేశ్ పుతూర్ (Vignesh Puthur)పై ఆ జట్టు యజమాని నీతా అంబానీ ప్రశంసలు కురిపించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతంగా ఆడావని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో అద్భుతంగా ఆడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ‘బెస్ట్ బౌలర్’ బ్యాడ్జ్‌ను నీతా అంబానీ (Nita Ambani) విఘ్నేశ్‌కు అందించారు.కాగా ఐపీఎల్-2025 మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం (మార్చి 23) మ్యాచ్ జరిగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఇందుకు వేదిక కాగా.. టాస్ గెలిచిన రుతురాజ్ సేన తొలుత బౌలింగ్ చేసింది.నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు స్టార్ బ్యాటర్లు విఫలం కావడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (Rohit sharma) డకౌట్ కాగా.. రియాన్ రెకెల్టన్ 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ 11 రన్స్ మాత్రమే చేయగా.. తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29, తిలక్ వర్మ 31, దీపక్ చహర్ 28(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టార్గెట్‌ను సులువుగానే పూర్తి చేస్తుందని అంతా భావించారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర (65 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53) అద్భుత అర్ధ శతకాలు సాధించారు. అయితే, మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకువెళ్లింది మాత్రం ముంబై అరంగేట్ర బౌలర్ విఘ్నేశ్ పుతూర్ అని చెప్పవచ్చు. స్పిన్ మాయాజాలంతోరుతురాజ్తో పాటు శివం దూబే(9), దీపక్ హుడా(3) వికెట్లను విఘ్నేశ్ తన ఖాతాలో వేసుకున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో సీఎస్కే మూడు కీలక వికెట్లను కూల్చి సత్తా చాటాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు పరాజయం తప్పలేదు. తాజా ఎడిషన్ ఆరంభ సీజన్లో చెన్నై చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ముంబై ఓటమిని చవిచూసింది.విఘ్నేశ్ ఎక్కడ?అయితే, విఘ్నేశ్ ప్రదర్శన మాత్రం జట్టు యాజమాన్యానికి సంతృప్తినిచ్చింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం డ్రెసింగ్ రూమ్‌కి వెళ్లిన ముంబై జట్టు యజమాని నీతా అంబానీ విఘ్నేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ‘‘ఈరోజు మొదటి అవార్డును మన యువ స్పిన్నర్.. ముంబై ఇండియన్స్‌కు తొలిసారిగా ఆడిన విఘ్నేశ్‌కు ఇస్తున్నా. విఘ్నేశ్ ఎక్కడ?’’ అంటూ అక్కడున్న ఆటగాళ్లను అడిగారు.ఇంతలో గుంపులో నుంచి పరిగెత్తుకు వచ్చిన విఘ్నేశ్‌కు నీతా అంబానీ స్వయంగా బ్యాడ్జ్ తొడిగారు. అద్భుతంగా ఆడావు అంటూ అతడికి కితాబు ఇచ్చారు. ఈ పరిణామంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బపోయిన విఘ్నేశ్ నీతా అంబానీ పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేశాడు.థాంక్యూ సూర్య భాయ్‘‘నాకు మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చిన ముంబై ఫ్రాంఛైజీకి ధన్యవాదాలు. అసలు ఇలా నేను స్టార్లతో కలిసి ఆడతానని అస్సలు ఊహించలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము గెలవలేకపోవడం మాత్రం కాస్త బాధగా ఉంది.మా జట్టు మొత్తానికి థాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా సూర్య భాయ్ నాకు పూర్తి మద్దతుగా నిలిచాడు. అందుకే నేను ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. నాకు అండగా ఉన్నందుకు థాంక్యూ భయ్యా’’ అని విఘ్నేశ్ పుతూర్ సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్షేర్ చేయగా వైరల్‌గా మారింది.కాగా కేరళకు చెందిన విఘ్నేశ్ స్పిన్ బౌలర్. 24 ఏళ్ల ఈ స్పిన్నర్ ఇంత వరకు డొమెస్టిక్ క్రికెట్లోనూ అరంగేట్రం చేయలేదు. అయితే, అతడిలోని ప్రతిభను గుర్తించిన ముంబై ఫ్రాంఛైజీ మెగా వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోనిLocal Kerala talent ➡️ MI debut in a big game ➡️ Wins the Dressing Room Best Bowler 🏅Ladies & gents, Vignesh Puthur! ✨#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #CSKvMI pic.twitter.com/UsgyL2awwr— Mumbai Indians (@mipaltan) March 24, 2025 -
కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- ముంబై ఇండియన్స్ (MI)మధ్య పోరు అని చెప్పవచ్చు. చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ జట్ల మధ్య పోటీ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఐపీఎల్-2025లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన తీరు ఇందుకు నిదర్శనం.ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే స్టార్లు రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53)ల మెరుపులు.. మహేంద్ర సింగ్ ధోని మెరుపు స్టంపింగ్‌లతో పాటు.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఓ కుర్రాడు హైలైట్‌గా నిలిచాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ధోని చేత ప్రశంసలు అందుకున్నాడు.ఇంతకీ ఎవరా ప్లేయర్?అతడిపేరు విఘ్నేశ్ పుతూర్. లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్ బౌలర్. 24 ఏళ్ల ఈ కుర్ర బౌలర్ స్వస్థలం కేరళలోని మలప్పురం. పదకొండేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించిన విఘ్నేశ్.. ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దృష్టిని ఆకర్షించాడు.అతడి ప్రతిభకు ఫిదా అయిన ముంబై యాజమాన్యం.. ఇంతవరకు కేరళ తరఫున కనీసం దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టకపోయినప్పటికీ... ఐపీఎల్ కాంట్రాక్టు ఇచ్చింది. రూ. 30 లక్షలకు ఐపీఎల్-2025 మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసింది.ఈ క్రమంలో పద్దెనిమిదవ ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా సీఎస్కేతో పోరు సందర్భంగా విఘ్నేశ్‌ను బరిలోకి దించింది. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన ఈ స్పిన్ బౌలర్.. రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే (9), దీపక్ హుడా (3) రూపంలో మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.చెన్నై చేతిలో ముంబై సులువుగానే ఓటమిని అంగీకరిస్తుందా? అనే పరిస్థితి నుంచి .. చివరి ఓవర్ దాకా మ్యాచ్ సాగేలా చేయడంలో విఘ్నేశ్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని విఘ్నేశ్‌ను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. అతడి భుజం తట్టి శెభాష్ అంటూ తలా.. ఈ కుర్రాడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి.The men in 💛 take home the honours! 💪A classic clash in Chennai ends in the favour of #CSK ✨Scorecard ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/ZGPkkmsRHe— IndianPremierLeague (@IPL) March 23, 2025 తండ్రి ఆటో డ్రైవర్.. కొడుకు ఐపీఎల్ స్టార్అన్నట్లు విఘ్నేశ్ పుతూర్ తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. కష్టపడుతూ కుటుంబాన్ని పోషించే ఆయన.. కొడుకులోని ప్రతిభను గుర్తించి క్రికెట్ ఆడేలా ప్రోత్సహించాడు. కేరళ క్రికెటర్ మహ్మద్ షరీఫ్ సలహాతో మీడియం పేసర్ బౌలర్ నుంచి స్పిన్నర్‌గా మారిన విఘ్నేశ్ ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. కలకాలం గుర్తుండిపోతుంది!‘‘ధోని.. విఘ్నేశ్ పుతూర్ భుజం తట్టి అభినందించాడు. నాకు తెలిసి తన జీవితకాలం ఈ కుర్రాడు ఈ సంఘటనను గుర్తుంచుకుంటాడు’’- కామెంటేటర్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. అవును.. విఘ్నేశ్ పుతూర్‌కు ఇది లైఫ్‌టైమ్ మొమరీగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, ఈ సీజన్లో బౌలర్‌గా తనదైన ముద్ర వేయగలిగితే.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాలో చోటు సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో.. త్వరలోనే విఘ్నేశ్ కూడా చేరే అవకాశాలను కొట్టిపారేయలేము!! ఏమంటారు?!ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ ముంబై స్కోర్లు👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై👉టాస్: చెన్నై.. తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 155/9 (20)👉చెన్నై స్కోరు: 158/6 (19.1)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ముంబైపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నూర్ అహ్మద్ (చెన్నై స్పిన్నర్- 4/18).చదవండి: జట్టు స్వరూపమే మారిపోయింది.. కావ్యా మారన్‌కు ఇంతకంటే ఏం కావాలి?