ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్ రెండో విడత షెడ్యూల్ ఇవాళ (మార్చి 25) విడుదలైంది. తొలి విడతలో 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా మిగతా 53 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రస్తుత సీజన్‌లో ఓవరాల్‌గా 74 మ్యాచ్‌లు (ప్లే ఆఫ్స్‌తో కలుపుకుని) జరగాల్సి ఉన్నాయి.
సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్..
రెండో విడత షెడ్యూల్ మ్యాచ్‌లు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమవుతాయి. ఈ విడత ఆరంభ మ్యాచ్‌లో సీఎస్‌కే.. కేకేఆర్‌తో తలపడనుంది. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటించారు. ఎన్నికల తేదీలు క్లాష్ కాకుండా ఉండేందుకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అన్ని కసర్తులు పూర్తి చేసిన అనంతరం ఇవాళ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
IPL 2024 SCHEDULE....!!! ⭐ pic.twitter.com/M80vWCBE40
— Johns. (@CricCrazyJohns) March 25, 2024
చెన్నైలో ఫైనల్..
ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనుంది. మే 21న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1, మే 22న అదే నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్, మే 24న చెపాక్ వేదికగా క్వాలిఫయర్-2 జరుగనున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
హైదరాబాద్‌లో ఐదు..
రెండో విడతలో హైదరాబాద్‌లో ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఏప్రిల్ 25- సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ (రాత్రి 7:30 గంటలకు)
- మే 2- సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (రాత్రి)
- మే 8- సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో (రాత్రి)
- మే 16-సన్‌రైజర్స్ వర్సెస్ గుజరాత్ (రాత్రి)
- మే 19- సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్ (రాత్రి)
Comments
Please login to add a commentAdd a comment