Sunrisers Hyderabad IPL 2022 Schedule, Timings, Dates And Venues - Sakshi
Sakshi News home page

IPL 2022 SRH: సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. రాజస్థాన్‌ రాయల్స్‌తో మొదలై..!

Published Sun, Mar 6 2022 7:04 PM | Last Updated on Mon, Mar 7 2022 12:10 PM

Sunrisers Hyderabad IPL 2022 Schedule, Timings, Dates And Venues - Sakshi

Sunrisers Hyderabad IPL 2022 Schedule: ఐపీఎల్ 2022 మెగా సమరానికి సైరన్ మోగింది. మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమవుతుంది. అనంతరం మే 29న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది. ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. కేన్‌ విలియమ్సన్‌ సారధ్యంలోని ఆరెంజ్‌ ఆర్మీ ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుంది. 

మార్చి 29 (మంగళవారం)న విలియమ్సన్‌ సేన తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలబడనుంది. ఈ మ్యాచ్‌కు పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదిక కానుంది. రాత్రి 7:30 మ్యాచ్‌ ప్రారంభంకానుంది. అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. గతేడాది మూడే మూడు విజయాలతో ఆఖరి స్థానంలో నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌..

  • తేదీ: ఏప్రిల్ 4 (సోమవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: లక్నో సూపర్ జెయింట్స్‌, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై 
  • తేదీ: ఏప్రిల్ 9 (శనివారం), సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: చెన్నై సూపర్ కింగ్స్‌, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై
  • తేదీ: ఏప్రిల్ 11 (సోమవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: గుజరాత్ టైటాన్స్‌, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై
  • తేదీ: ఏప్రిల్ 15 (శుక్రవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌, వేదిక: బ్రబోర్న్‌ స్టేడియం, ముంబై
  • తేదీ: ఏప్రిల్ 17 (ఆదివారం), సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: పంజాబ్‌ కింగ్స్‌, వేదిక: డివై పాటిల్ స్టేడియం, ముంబై
  • తేదీ: ఏప్రిల్ 23 (శనివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, వేదిక: బ్రబోర్న్‌ స్టేడియం, ముంబై
  • తేదీ: ఏప్రిల్ 27 (బుధవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: గుజరాత్‌ టైటాన్స్‌, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై
  • తేదీ: మే 1 (ఆదివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: చెన్నై సూపర్ కింగ్స్‌, వేదిక: ఎంసీఏ స్టేడియం, పూణే
  • తేదీ: మే 5 (గురువారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: ఢిల్లీ క్యాపిటల్స్‌, వేదిక: బ్రబోర్న్‌ స్టేడియం, ముంబై
  • తేదీ: మే 8 (ఆదివారం), సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రత్యర్ధి: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై
  • తేదీ: మే 14 (శనివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌, వేదిక: ఎంసీఏ స్టేడియం, పూణే
  • తేదీ: మే 17 (మంగళవారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: ముంబై ఇండియన్స్‌, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై
  • తేదీ: మే 22 (ఆదివారం), సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రత్యర్ధి: పంజాబ్‌ కింగ్స్‌, వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై 
    చదవండి: IPL 2022 Auction Day 1: పూరన్‌, సుందర్‌కు జాక్‌పాట్‌.. హైదరాబాద్‌ ప్లేయర్స్‌ వీళ్లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement