IPL 2022 Schedule: BCCI Announces Schedule for TATA IPL 2022, CSK and KKR First Clash - Sakshi
Sakshi News home page

IPL 2022: షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేను ఢీకొట్టనున్న కేకేఆర్‌

Published Sun, Mar 6 2022 5:41 PM | Last Updated on Sun, Mar 6 2022 8:02 PM

IPL 2022 Schedule Is Out, CSK To Face KKR In Opener - Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్‌ ఆదివారం విడుదలైంది. మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమవుతుంది. అనంతరం మే 29న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది. మార్చి 29న సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలబడనుంది.


గత సీజన్‌ ఆఖరి లీగ్ మ్యాచ్‌లను ఒకే సమయానికి నిర్వహించి, ప్రయోగం చేసిన బీసీసీఐ.. అది వర్కవుట్ కాకపోవడంతో పాత పద్ధతిలోనే డబుల్ హెడర్ మ్యాచ్‌లను (మధ్యాహ్నం 3:30 గంటలకు మొదటి మ్యాచ్, సాయంత్రం 7:30కి రెండో మ్యాచ్) నిర్వహించనుంది. ఈ సీజన్‌కు నాకౌట్ మ్యాచ్‌లకు సంబంధించిన తేదీలు, వేదికలను బీసీసీఐ ఖరారు చేయాల్సి ఉంది. అహ్మదాబాద్ వేదికగా నాకౌట్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌ ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement