క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఐపీఎల్-2022కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. వాంఖడే వేదికగా శనివారం సాయంత్రం 7: 30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ముందు సీఎస్కే కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకుని అందరనీ షాక్ గురిచేశాడు. అతడి స్థానంలో సీఎస్కే నూతన కెప్టెన్‌గా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు.
ఇక ఇరు జట్లు కూడా ఈ ఏడాది సీజన్‌లో సరికొత్తగా కన్పిస్తున్నాయి. కేకేఆర్ కెప్టెన్‌గా భారత స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఎంపికైన సంగతి తెలిసిందే. అదే విధంగా ఐపీఎల్ మెగా వేలంలో ఇరు జట్లు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ తొలి పోరుకు ముందు ఇరు జట్లు బలాబలాలను ఓ సారి పరీశీలిద్దాం. తొలి మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ దూరం కానున్నాడు. అదే విధంగా స్టార్ బౌలర్ దీపక్ చహర్ గాయపడటం సీఎస్‌కేకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. ఇక బ్యాటింగ్ పరంగా చెన్నై పటిష్టంగా కన్పిస్తోంది.
ఓపెనర్లుగా భారత యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్, కివీ ప్లేయర్ డేవాన్ కాన్వే బరిలోకి దిగనున్నారు. మొయిన్ అలీ దూరం కావడంతో మూడో స్థానంలో రాబిన్ ఊతప్ప వచ్చే అవకాశం ఉంది. అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోని, శివమ్ దూబేతో మిడిలార్డర్ దృడంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. చహర్ స్థానాన్ని భారత యువ బౌలర్ రాజవర్ధన్ హంగర్కర్ భర్తీ చేసే అవకాశం ఉంది. క్రిస్ జోర్డాన్ లేదంటే మహీశ్ తీక్షణ తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది.
కేకేఆర్ విషయానికొస్తే.. వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే కేకేఆర్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ అయ్యర్ లేదా నితీశ్ రాణా బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక మిడిలార్డర్‌లో సామ్ బిల్లింగ్స్ రసెల్, నబీ, సునిల్ రైన్ హిట్టర్లు ఉండడం కేకేఆర్‌కు కలిసొచ్చే ఆంశం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఆ జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ ఆరంభమ్యాచ్‌లకు దూరం కానున్నాడు. శిమ్ మావి ఉమేశ్ యాదవ్ వరుణ్ చక్రవర్తి లతో కేకేఆర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా ఇరు జట్లకు కొత్త కెప్టెన్‌లు కావడం విశేషం. ఇక ఈ రెండు టీంల మధ్య 26 మ్యాచ్‌లు జరగగా, చెన్నై 17 మ్యాచ్‌లు గెలవగా, కోల్‌కతా కేవలం 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు (అంచనా): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంస్ ధోని (వికెట్), డ్వేన్ బ్రావో, రాజవర్ధన్ హంగార్కర్, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు (అంచనా) అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment