MS Dhoni Thanks To Kolkata Crowd, They Are Trying To Give Me Farewell - Sakshi
Sakshi News home page

MS Dhoni On Eden Gardens Crowd: వాళ్లకు థాంక్స్‌ చెప్పడం తప్ప ఇంకేం చేయగలను.. నాకు ఫేర్‌వెల్‌ ఇచ్చేందుకు: ధోని

Published Mon, Apr 24 2023 3:57 PM | Last Updated on Mon, Apr 24 2023 4:20 PM

Dhoni Thanks Kolkata Crowd They Are Trying To Give Me Farewell - Sakshi

కేకేఆర్‌ మ్యాచ్‌లో ధోని సేన విజయం (PC: IPL Twitter)

IPL 2023 CSK Vs KKR- MS Dhoni Comments: ‘‘పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.. వాళ్ల మద్దతుకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప నేను ఇంకేం చేయగలను. వాళ్లలో చాలా మంది తదుపరి మ్యాచ్‌కి కేకేఆర్‌ జెర్సీలో వస్తారు. ఇప్పుడైతే నాకు ఫేర్‌వెల్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది.

నా మీద ఇంతలా అభిమానం చూపుతున్నందుకు ప్రేక్షకులకు థాంక్స్‌’’ అంటూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని తన అభిమానుల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా చెన్నై ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడింది.

కోల్‌కతానా లేదంటే చెపాక్‌!
ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు వేలాది మంది ప్రేక్షకులు తరలివచ్చారు. కేకేఆర్‌కు ఇది సొంతమైదానమైనా.. స్టేడియం మొత్తం పసుపు వర్ణంతో నిండిపోవడం విశేషం. టీవీలో మ్యాచ్‌ వీక్షిస్తున్న వారికి.. ఒక్కసారిగా.. మ్యాచ్‌ జరుగుతోంది కోల్‌కతాలోనా లేదంటే చెపాక్‌లోనా అన్న సందేహం వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.


PC: IPL Twitter

ప్రేక్షకుల్లో మెజారిటీ మంది సీఎస్‌కే జెర్సీలు ధరించి.. ‘‘ధోని కోసమే వచ్చాం’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వీరి అభిమానానికి ఉప్పొంగిపోయిన మిస్టర్‌ కూల్‌ ధోని మ్యాచ్‌ అనంతరం అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

రహానే విధ్వంసం
ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ కాన్వే 56 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అజింక్య రహానే 29 బంతుల్లోనే 71 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.

శివం దూబే అర్ధ శతకం(50)తో చెలరేగగా.. రహానే ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో టార్గెట్‌ ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌ 186 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో 49 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. 

రహానే ఏం చేయగలడో తెలుసు
ఈ క్రమంలో విజయానంతరం ధోని మాట్లాడుతూ.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రహానే సత్తా ఏమిటో తమకు తెలుసని.. అందుకే అతడికి అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపాడు. అదే విధంగా యువ ఆటగాళ్లు సైతం అద్భుతంగా రాణిస్తున్నారంటూ తమ బౌలర్లను కొనియాడాడు.  

చదవండి: మహిపాల్‌ను దూషించిన సిరాజ్‌! ఇప్పటికే రెండుసార్లు సారీ చెప్పాను.. పర్లేదు భాయ్‌!
ప్రేమ విషయం పేరెంట్స్‌కు చెప్పలేనన్న సచిన్‌! అంజలి అంతటి త్యాగం చేసిందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement