ఐపీఎల్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ గట్టి షాక్ ఇచ్చింది. ఆదివారం చెపాక్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఓటమిపాలైంది. కాగా సీఎస్‌కేకు తమ హోం గ్రౌండ్ చెపాక్‌లో ఇదే చివరి లీగ్ మ్యాచ్. ఇక ఈ విషయం పక్కన పెడితే.. చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే కేకేఆర్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని అండ్ కో.. స్టేడియం చుట్టూ సీఎస్‌కే జెండాను పట్టుకుని తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. దీంతో ధోని రిటైర్మెంట్ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. అయితే సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం దోని వచ్చే ఏడాది సీజన్‌లో కూడా ఆడుతాడని థీమా వ్యక్తం చేశాడు.
"ధోని తదుపరి ఐపీఎల్‌లో సీజన్‌లో కూడా భాగం అవుతాడని మేము భావిస్తున్నాం.చాలాకాలంగా మాకు అండగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు" అని సీఎస్‌కే రిలీజ్ చేసిన ఓ వీడియో విశ్వనాథన్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో ధోని ఫినిషర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి ఇప్పటి వరకు 10 సిక్స్‌లు బాదాడు. అదే విధంగా 9 ఇన్నింగ్స్‌లో 98 పరుగులు చేశాడు. అందులో 7 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. 7 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
చదవండి: అతడిని భారత జట్టులోకి తీసుకోండి.. సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు సృష్టిస్తాడు
Comments
Please login to add a commentAdd a comment