
'మరో నాకౌట్ విజయం సాధిస్తా'
న్యూఢిల్లీ: తన ప్రొఫెషనల్ కెరీర్‌లో ఇప్పటివరకు ఎనిమిది బౌట్‌లలో పోటీపడి ఏడింటిలో నాకౌట్ ద్వారా విజయాలు సాధించిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అదే జోరును కొనసాగిస్తానని అన్నాడు. ముంబైలో శనివారం జరిగే బౌట్‌లో జుల్పికర్ మైమైతియాల్ (చైనా)తో విజేందర్ తలపడనున్నాడు.
విజేందర్ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ చాంపియన్ కాగా... జుల్పికర్ డబ్ల్యూబీఓ ఒరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ చాంపియన్. ఈ బౌట్‌లో గెలిచిన బాక్సర్‌కు ఏకకాలంలో రెండు టైటిల్స్ లభిస్తాయి. ‘నా కోసం ప్రార్థించండి. మరో నాకౌట్ విజయం కోసం వంద శాతం కృషి చేస్తాను. సాధ్యమైనంత తొందరగా బౌట్‌ను ముగిస్తాను’ అని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు.