Vijender Singh
-
భారత బాక్సింగ్‌ను ముందుకు తీసుకెళ్తా!
న్యూఢిల్లీ: దేశంలో బాక్సింగ్‌కు మరింత వన్నె తెచ్చేందుకు తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ పేర్కొన్నాడు. అందుకోసం అవసరమైతే భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనకాడనని వెల్లడించాడు. భారత్ నుంచి ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన ఏకైక పురుష బాక్సర్ అయిన విజేందర్ సింగ్... బీఎఫ్ఐ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆకాంక్షించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన విజేందర్ సింగ్... 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారమెత్తాడు.గత మూడేళ్లుగా ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోనూ యాక్టివ్‌గా లేని 39 ఏళ్ల విజేందర్ తాజాగా బీఎఫ్ఐ ఎన్నికలపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించాడు. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయాలనుకుంటున్నా. నా జీవితం మొత్తం పోరాటాలే. ఇది కొత్త తరహాది అనుకుంటా. అయితే ఎన్నికల్లో మద్దతు లభిస్తుందా లేదా అనే అంశాలను పట్టించుకోవడం లేదు. ఆటకు నా వల్ల ప్రయోజనం చేకూరుతుందనుకుంటే తప్పకుండా పోటీలో ఉంటా. మార్పు తెచ్చే అవకాశం ఉంటే దాని కోసం నా వంతు కృషి చేస్తా. ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన బాక్సర్‌గా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు కాదు. నేనెప్పటికీ అలా చేయను’ అని అన్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సౌత్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన విజేందర్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరాడు. విదేశీ శిక్షణ ముఖ్యం భారత యువ బాక్సర్లు విదేశాల్లో శిక్షణ తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని విజేందర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘బాక్సింగ్ సమాఖ్యను మరింత బలోపేతం చేసేందుకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఏదైనా బాధ్యత అప్పగిస్తే దాన్ని నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నా. మన దేశం క్రీడల్లో వేగంగా వృద్ధి చెందుతోంది. మరో మూడేళ్లలో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో విశ్వక్రీడల్లో మరిన్ని పతకాలు సాధించాలంటే భారత బాక్సర్లు విదేశీ బాక్సర్లతో తరచూ తలపడాలి’ అని విజేందర్ ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. ప్రపంచ బాక్సంగ్ చాంపియన్‌షిప్ (2009)లో పతకం నెగ్గిన తొలి భారత పురుష బాక్సర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన విజేందర్... గతంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్గానూ కొనసాగాడు. బాక్సింగ్ సమాఖ్య పరిపాలన సంబంధించిన విధులను ఇటీవల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్హాక్ కమిటీకి అప్పగించిన నేపథ్యంలో... విజేందర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫిబ్రవరి 3తోనే బీఎఫ్ఐ ఆఫీస్ బేరర్ల పదవీ కాలం ముగియగా... ఎన్నికల నిర్వహణలో సమాఖ్య జాప్యం చేస్తుండటంతోనే ఐఓఏ ఈ చర్యకు పూనుకుంది. దీనిపై బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఓఏ ఆదేశాలు చట్టవిరుద్ధమని... దీనిపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు వెల్లడించారు.కాగా... బీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు ఆర్థిక అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలోనే ఐఓఏ అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మాజీ కోశాధికారి మధుకాంత్ పాఠక్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. సమాఖ్యలో గందరగోళం కారణంగా బాక్సర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో రిక్తహస్తాలతో వెనుదిరిగిన మన బాక్సర్లు... ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే గగనమైంది. ఇక మహిళల జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల బల్గేరియాలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలోనూ మన బాక్సర్లు పాల్గొనలేదు. -
Olympics 2024: హార్ట్ బ్రేక్.. మనూ చేజారిన పతకం
Paris Olympics 2024: భారత యువ షూటర్ మనూ భాకర్ చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా మూడు వ్యక్తిగత పతకాలు గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా ఈ హర్యానా అమ్మాయి నిలుస్తుందని భావించగా.. నిరాశే మిగిలింది.కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మనూ... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యం కైవసం చేసుకుంది. తాజాగా.. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలోనూ పతక రేసులో మనూ నిలిచింది. అయితే, ఆదిలో కాస్త వెనుకబడ్డా.. తర్వాత తిరిగి పుంజుకున్న మనూ.. కాంస్య పతకానికి చేరువగా వచ్చింది. అయితే, మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన ఎలిమినేషన్ ప్లే ఆఫ్‌లో దురదృష్టవశాత్తూ మనూ ఓడిపోయింది. ఏదేమైనా అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే రెండు మెడల్స్ గెలిచిన మనూ భారతీయలు మనసులు గెలుచుకుంది. మనూ ప్రయాణం సాగిందిలా..👉మొత్తం 3 సిరీస్‌లు- 5 షాట్ల చొప్పున మొత్తం 15 షాట్లు👉తొలి సిరీస్👉శుభారంభం అందుకోలేకపోయిన మనూ.. 👉ఐదింటిలో రెండు సఫలం👉ఆరు పాయింట్లతో రేసులోకి వచ్చిన మనూ.. 8 పాయింట్లతో టాప్‌లో సౌత్ కొరియా షూటర్👉రెండో సిరీస్👉ఐదింటిలో 4 సఫలం.. రెండోస్థానానికి చేరిన మనూ👉తొలి ఎలిమినేషన్- యూఎస్ఏ షూటర్ కేటలిన్ మోర్గాన్ రేసు నుంచి అవుట్👉ఆరోస్థానానికి పడిపోయిన మనూ భాకర్👉మూడో సిరీస్👉ఐదింటిలో ఐదూ సఫలం.. మూడో స్థానంలోకి మనూ భాకర్👉ఇరానియన్ షూటర్ రోస్తమియాన్ అవుట్..రెండో స్థానంలో మనూ👉ఐదింట నాలుగు సఫలం- రెండో స్థానంలోనే మనూ👉చైనా షూటర్ నాన్ జావో ఎలిమినేట్👉మూడో స్థానానికి పడిపోయిన మనూ👉మూడో స్థానం కోసం జరిగిన షూట్ ఆఫ్‌లో మనూ ఓటమి👉నాలుగోస్థానంలో సరిపెట్టుకున్న మనూ👉కాంస్య పతక రేసు నుంచి కూడా మనూ అవుట్నాలుగో స్థానంలోసౌత్ కొరియా షూటర్ జిన్ యాంగ్‌కు స్వర్ణంఫ్రాన్స్ షూటర్ కమిలె జెద్రెజెజ్వ్స్కికి రజతంహంగేరీ షూటర్ వెరోనికాకు కాంస్యంనాలుగో స్థానంతో సరిపెట్టుకున్న మనూ భాకర్భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు గెలిచిన క్రీడాకారులు వీరే👉మనూ భాకర్- షూటింగ్- రెండు కాంస్యాలు- ప్యారిస్ ఒలింపిక్స్-2024👉నార్మన్ ప్రిచర్డ్(బ్రిటిష్- ఇండియన్)- అథ్లెటిక్స్- రెండు రజతాలు- ప్యారిస్ ఒలింపిక్స్- 1900 పారిస్👉సుశీల్ కుమార్- రెజ్లింగ్- ఒక కాంస్యం, ఒక రజతం- బీజింగ్ ఒలింపిక్స్- 2008, లండన్ ఒలింపిక్స్- 2012 👉పీవీ సింధు- బ్యాడ్మింటన్- ఒక రజతం, ఒక కాంస్యం- రియో ఒలింపిక్స్- 2016, టోక్యో ఒలింపిక్స్- 2020 -
కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ప్రముఖ భారత బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు కాగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు విజేందర్ సింగ్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం పార్టీ అధిష్టానం ఈ యువ బాక్సర్‌ను దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. అయితే, ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓడిపోయారు. అయితే ఈ సారి విజేందర్‌ను సింగ్ దక్షిణ ఢిల్లీ నుంచి కాకుండా ఉత్తర్ ప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ అభ్యర్ధిగా బరిలోకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో బాక్సర్ విజేందర్ సింగ్ బీజేపీలో చేరడంతో ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక మధుర నుంచి నుంచి బీజేపీ తరపున నటి హేమమాలని పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు. అయితే హేమమాలినికి చెక్ పెట్టేందుకు జాట్ వర్గం ప్రభావం ఎక్కువ ఉండి, అదే వర్గానికి చెందిన విజేందర్‌ను లోక్‌సభ అభ్యర్ధిగా దించాలని కాంగ్రెస్ పెద్దలు భావించారు. కానీ అనూహ్యంగా విజేందర్ సింగ్ బీజేపీలో చేరడం ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. జాట్ వర్గం ప్రభావం ఎక్కువగా చూపే హర్యానా, పశ్చిమ యూపీలలో బాక్సర్ విజేందర్ సింగ్ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. -
కేవలం ఉద్యోగం కోసం మొదలుపెట్టాడు.. విధిరాత మరోలా ఉంది! అందుకే ఇలా..
Achievers- Vijender Singh: బాక్సింగ్‌ను మన దేశంలో చాలా మంది ఒక ఆటగానే చూడరు. బాక్సర్లంటే గొడవలు చేసేవాళ్లనో లేదంటే పిచ్చివాళ్లుగానో ముద్ర వేస్తారు.. చాలా కాలంగా, చాలా మందిలో ఉన్న అభిప్రాయమది. ఆ కుర్రాడు కూడా మొదట్లో అలాగే అనుకున్నాడు. అందుకే ఆ ఆటకు దూరంగా ఉండటమే మేలనుకున్నాడు. కానీ తన ప్రమేయం లేకుండానే బాక్సింగ్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఒక ఉద్యోగం పొందడానికి ఆ ఆట ఉంటే సరిపోతుందని సాధన చేశాడు. ఏకంగా ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశం గర్వించదగిన బాక్సర్‌గా నిలిచాడు. అతడే విజేందర్ సింగ్ బేనివాల్... ఒలింపిక్స్‌లో మెడల్ గెలుచుకున్న తొలి భారత బాక్సర్. హరియాణాలోని భివానీ పట్టణం.. ఢిల్లీ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో దాదాపు 2 లక్షల జనాభాతో ఉంటుంది. ఆ రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులను అందించిన ఊరు. రాజకీయపరమైన విశేషాన్ని పక్కన పెడితే అది భారత బాక్సింగ్‌కు సంబంధించి ఒక పెద్ద అడ్డా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు చెందిన కోచింగ్ కేంద్రం అక్కడ ఉండటంతో ఎంతో మంది బాక్సర్లు అక్కడి నుంచి వెలుగులోకి వచ్చారు. రెండు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన హవా సింగ్ పట్టుబట్టి మరీ ‘సాయ్’ కేంద్రాన్ని అక్కడికి తీసుకొచ్చారు. అనంతరం అది అద్భుతమైన ఫలితాలను అందించింది. PC: Vijender Singh Instagram ఒకే ఒక్కడు.. విజేందర్ సింగ్ కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఐదుగురు బాక్సర్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తే అందులో నలుగురు.. ‘మినీ క్యూబా’గా పిలిచే భివానీ సెంటర్‌కు చెందినవారు కావడంతో ఒక్కసారిగా దాని గుర్తింపు పెరిగిపోయింది. ఈ ఐదుగురిలో విజేందర్ సింగ్ ఒక్కడే సత్తా చాటి కాంస్య పతకంతో మెరిశాడు. భారత బాక్సింగ్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అన్న స్ఫూర్తితో.. విజేందర్ తండ్రి హరియాణా ఆర్టీసీలో డ్రైవర్. మరీ పెద్ద సంపాదన కాదు. కానీ ఇద్దరు పిల్లల్ని బాగా చదివించాలనే తాపత్రయంతో సాధ్యమైనంతగా కష్టపడేవాడు. అయితే పెద్ద కొడుకు మనోజ్ సహజంగానే స్థానిక మిత్రుల సాన్నిహిత్యంతో బాక్సింగ్ వైపు వెళ్లాడు. గొప్ప విజయాలు సాధించకపోయినా.. స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో ఉద్యోగం దక్కించుకునేందుకు అది సరిపోయింది. విజేందర్కు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అన్నకు ఉద్యోగం వచ్చి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడింది. దాంతో అప్పటి వరకు బాగానే చదువుతున్న విజేందర్కు చదువుకంటే ఆటనే బాగుంటుందనిపించింది. చివరకు తండ్రి, అన్న కూడా అతడిని కాదనలేకపోయారు. దాంతో పూర్తి స్థాయిలో బాక్సింగ్ శిక్షణ వైపు మళ్లించారు. సహజ ప్రతిభ కనబర్చిన అతను ఆటలో వేగంగా మంచి ఫలితాలు సాధించాడు. భార్యాపిల్లలతో విజేందర్‌సింగ్ PC: Vijender Singh Instagram వరుస విజయాలు.. హరియాణా రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచిన తర్వాత 12 ఏళ్ల వయసులో జాతీయ సబ్ జూనియర్ చాంపియన్ కావడంతో తొలిసారి విజేందర్కు గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో 2003లో జరిగిన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అతని కెరీర్‌కు కీలకంగా మారాయి. అప్పటికి జూనియర్ స్థాయిలోనే ఆడుతున్నా.. పట్టుదలగా పోటీ పడి సీనియర్ టీమ్‌లో చోటు దక్కించుకున్న విజేందర్ రజతంతో సత్తా చాటాడు. అయితే ఇదే ఊపులో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ కోసం సిద్ధమైన విజేందర్కు షాక్ తగిలింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా అతను తొలి రౌండ్లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. దాంతో తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని విజేందర్కు అర్థమైంది. ఒలింపిక్ పతకం వైపు.. ఏథెన్స్ ముగిసిన రెండేళ్ల తర్వాత విజేందర్ కెరీర్ కీలక మలుపు తీసుకుంది. తన వెయిట్ కేటగిరీని మార్చుకోవాలని అతను తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను అందించింది. 75 కేజీల మిడిల్వెయిట్కు అతను మారాడు. అదే ఏడాది దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన విజేందర్.. ఆ ఏడాదే కామన్వెల్త్ క్రీడల్లోనూ రజత పతకం గెలుచుకున్నాడు. దాంతో అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. జర్మనీలో ప్రత్యేక శిక్షణ అనంతరం అది రెట్టింపైంది. ఒలింపిక్స్‌లోనూ రాణించగలననే నమ్మకంతోనే అతను బీజింగ్‌లో అడుగు పెట్టాడు. చివరకు దానిని సాధించడంలో విజేందర్ సఫలమయ్యాడు. 22 ఆగస్టు, 2008న కంచు పతకం సాధించి ఒలింపిక్స్‌లో ఈ ఘనత నమోదు చేసి తొలి భారత బాక్సర్‌గా వేదికపై సగర్వంగా నిలిచాడు. ఈ విజయంలో ఒక్కసారిగా విజేందర్‌ను కీర్తి, కనకాదులు వరించాయి. కానీ అతను ఏ దశలోనూ ఆటపై ఏకాగ్రత కోల్పోలేదు. ఒలింపిక్ పతకం తర్వాత కూడా వరల్డ్ చాంపియన్ షిప్లో, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్ షిప్లో వరుస పతకాలు గెలుచుకున్నాడు. వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకున్నాడు. PC: Vijender Singh Instagram డ్రగ్స్ వివాదాన్ని దాటి.. ఆటగాడిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన తర్వాత ఒలింపిక్స్ మెడల్ గెలిచిన నాలుగేళ్లకు విజేందర్ కెరీర్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా స్పోర్ట్స్‌మన్ డ్రగ్స్ అంటే నిషేధిత ఉత్ప్రేరకాలే అని వినిపిస్తుంది. కానీ ఇది అలాంటిది కాదు. విజేందర్ హెరాయిన్ తదితర డ్రగ్స్‌ను తీసుకుంటూ పట్టుబడ్డాడని పోలీసులు ప్రకటించారు. ఒక డ్రగ్ డీలర్ ఇంటి ముందు విజేందర్ భార్య కారు ఉండటం కూడా పోలీసు విచారణంలో కీలకంగా మారింది. పోటీలు లేని సమయంలో తీసుకునే డ్రగ్స్‌కు సంబంధించి తాము పరీక్షలు చేయలేమంటూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రకటించడం విజేందర్కు ఊరటనిచ్చింది. అయితే యువ ఆటగాళ్లపై ఇలాంటి ఘటనలు ప్రభావితం చూపిస్తాయంటూ నేరుగా కేంద్రప్రభుత్వం ఆదేశించడంతో ‘నాడా’ పరీక్షలు నిర్వహించింది. దాదాపు 14 నెలలు వివాదం సాగిన తర్వాత విజేందర్కు ‘క్లీన్చిట్’ లభించింది. పురస్కారాలు ఆటగాడిగా అద్భుత ప్రదర్శనకు భారత ప్రభుత్వం అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న విజేందర్ సింగ్... పలు సంస్థలకు మాడలింగ్ చేయడంతో పాటు ‘పగ్లీ’ అనే బాలీవుడ్ సినిమాలోనూ నటించాడు. త్వరలో రాబోయే సల్మాన్ ఖాన్ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లోనూ అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు.. ఇతర భారత బాక్సర్లతో పోలిస్తే విజేందర్ సింగ్ కెరీర్ కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఒలింపిక్ పతకం అందించిన అమెచ్యూర్ బాక్సింగ్‌ను దాటి ఏ భారత బాక్సర్ ఆలోచించలేదు. కానీ విజేందర్ మాత్రం సాహసం ప్రదర్శించాడు. అమెచ్యూర్తో పోలిస్తే ఎంతో ప్రమాదకరంగా, రక్షణ ఉపకరణాలు వాడే అవకాశం లేని ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగు పెట్టాడు. ‘సాధించిన పేరు ప్రతిష్ఠలు చాలు. ఇప్పుడు ఇదంతా అవసరమా? లేనిపోని ప్రమాదం కొనితెచ్చుకోవడమే’ అని సహచరులు వారించినా అతను వెనుకడుగు వేయలేదు. నేను బాక్సర్‌ను, ఎక్కడైనా పోరాడతాను అంటూ తన గురించి తాను చెప్పుకున్న విజేందర్, 2015 అక్టోబరులో తొలిసారి ఇందులోకి అడుగు పెట్టాడు. అంచనాలకు మించి రాణించిన అతను అక్కడా మంచి విజయాలు అందుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో 14 బౌట్లు ఆడిన అతను 13 గెలిచి ఒకసారి మాత్రమే ఓడాడు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే విజేందర్ సింగ్ 2011లో ఢిల్లీకి చెందిన అర్చనా సింగ్‌ను వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు అబీర్ సింగ్, అమ్రిక్ సింగ్ సంతానం. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు.. అలాంటిది.. వాళ్లకేం ఖర్మ? ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు.. బీసీసీఐని చూసి పీసీబీ నేర్చుకోవాలి: పాక్ మాజీ ప్లేయర్ -
రాహుల్ భారత్ జోడో యాత్రలో ప్రత్యేక అతిథి.. ల్యూనా ఫొటోలు వైరల్..
చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అయితే హరియాణలో రాహుల్ శనివారం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ ప్రత్యేక అతిథి కన్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ అతిథి ఎవరో కాదు.. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ పెంపుడు శునకం ల్యూనా. ఇదంటే రాహుల్‌కు ఎంతో ఇష్టమట. అందుకే ఆయనతో పాటు పాదయాత్రలో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్, ప్రియాంక గాంధీ ట్విట్టర్లో షేర్ చేశారు. Luna has been patiently watching you pour all your love on her other canine cousins. So she decided enough is enough - and joined you herself! You see, no one wants to share your affection :) We get you Luna! (Luna, lives with Priyanka Ji - Rahul Ji adores her) pic.twitter.com/6CcpBMKUPt — Congress (@INCIndia) January 7, 2023 ఎట్టకేలకు భారత్ జోడో యాత్ర 100 రోజులు దాటిన తర్వాత ల్యూనాను ఆహ్వానించారు. అని ప్రియాంక ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాంగ్రెస్ కూడా ఈ ఫొటోలను షేర్ చేసింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఇతరులపై చూపిస్తున్న ప్రేమను చూసి ఇక తాను కూడా భాగం కావాలనుకొని ల్యూనా పాదయాత్రకు వచ్చిందని ట్వీట్ చేసింది. హర్యానాలో రాహుల్ యాత్రలో బాక్సర్, ఒలింపిక్స్ పతక విజేత విజేందర్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్ టీ షర్టులో కన్పించిన విషయం గురించి అడిగారు. అందుకు రాహుల్ బుదిలిస్తూ.. తాను రుషి, మునిలా ఓ తపస్సులో ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: 'ఆ విషయం తెలిస్తే రౌత్‌ను ఉద్ధవ్ థాక్రే చెప్పుతో కొడతారు' -
బాక్సర్తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
భోపాల్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి దగ్గర ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటి వరకు అయిదు రాష్ట్రాల్లో పూర్తయ్యింది. రోజుకీ సగటున 20-25 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తున్నారు. భిన్న నేపథ్యాలు, భిన్న రాష్ట్రాలకు చెందిన వారు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. మొత్తం 12 రాష్ట్రల్లో యాత్ర కొనసాగనుంది. 150 రోజుల్లో ఆయన 3,500 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జోడో యాత్ర ముగుస్తుంది. రాహుల్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడి ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, నటీనటులు పాల్గొని జోడో యాత్రలో జోష్ నింపుతున్నారు. వీరే కాక వేలాది మంది విద్యార్థులు, యువత, మధ్య వయస్కులు, మహిళలు, ఉద్యమకారులు.. ఇలా ఎందరో రాహుల్ చేపట్టిన యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా ఒలంపిక్ మెడలిస్ట్, బాక్సర్, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ జోడో యాత్రలో జాయిన్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో కాంగ్రెస్ నాయకుడితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్‌తో మాట్లాడుకుంటూ కొన్ని కిలోమీటర్లు నడిచారు. ఆ సమయంలో ఇద్దరూ హర్యాన్వీ స్టైల్లో తమ మీసాలు తిప్పారు. బాక్సింగ్ పంచ్ ఇస్తున్నట్లు కూడా ఫోజు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఈ వీడియోలో రాహుల్, విజేందర్ సింగ్‌తో పాటు పక్కన ప్రియాంక కూడా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. बॉक्सिंग रिंग के अजेय योद्धा @boxervijender आज आपने #BharatJodoYatra में सड़क पर उतरकर खेत-खलिहान और युवाओं की आवाज़ को ताकत दी है। शुक्रिया आपका...🙏🏻 pic.twitter.com/4oZOFqPdp9 — Congress (@INCIndia) November 25, 2022 హర్యానాలోని భివాని జిల్లాకు చెందిన విజేందర్ సింగ్.. గత లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అతను బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారతీయ బాక్సర్‌గా నలిచారు. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు రజతాలు, ఒక కాంస్యం కూడా గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొఫెషనల్ బాక్సర్‌గా రాణిస్తూ అనేక దేశాల్లో పోటీల్లో పాల్గొంటున్నారు. -
19 నెలలు గ్యాప్ వచ్చినా.. ఏ మాత్రం తగ్గని జోరు
భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్.. రీ ఎంట్రీలో అదరగొట్టాడు. దాదాపు 19 నెలల పాటు దూరంగా ఉన్న ఈ స్టార్ బాక్సర్ బుధవారం రాయపూర్‌లోని బల్బీర్ సింగ్ జునేజా స్టేడియంలో 'జంగిల్ రంబుల్' నాకౌట్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. సూపర్ మిడిల్ వెయిట్ విభాగంలో ఘనా బాక్సర్ ఎలియాసు సుల్లీని.. విజేందర్ తన పంచ్ పవర్‌తో చిత్తు చేశాడు. కాగా విజేందర్కు ఇది 13వ బౌట్ విజయం. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్ బాక్సింగ్ నాకౌట్లో 13-1తో తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. మ్యాచ్ అనంతరం విజేందర్ సింగ్ ఎమోషనల్ అయ్యాడు. ''రాయపూర్ ప్రజలకు నా ధన్యవాదాలు. నా టీమ్‌తో కలిసి చత్తీస్‌ఘర్‌కు రావడం సంతోషంగా ఉంది. గత రెండేళ్ల నుంచి మేము ఎలాంటి బౌట్స్‌కు దిగలేదు. 19 నెలల విరామం తర్వాత కెరీర్‌ను విజయంతో ఆరంభించడం మంచి సూచకం. ఈ బ్రేక్ తర్వాత నేను తలపడిన ఘనా బాక్సర్ మీ దృష్టిలో అంత పేరున్న బాక్సర్ కాకపోవచ్చు. కానీ నాకు, టీమ్‌కు, నా సహాయ సిబ్బందికి అతని పంచ్ పవర్‌పై అవగాహన ఉంది. అందుకే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ముగించాలని అనుకున్నా. ఈ క్రమంలోనే చత్తీస్‌ఘర్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కు ధన్యవాదాలు. ఈ మ్యాచ్ నిర్వహించడంలో ఆయన మద్దతు చాలా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ యువతను క్రీడలకు మరింత దగ్గర చేయడం ఒక బహుమతిగా అనుకోవచ్చు. ఇక నా తర్వాతి బౌట్ డిసెంబర్లో జరగనుంది. దానికోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Mike Tyson: వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..? Vijender Singh returned to winning ways as he outpunched Ghana's Eliasu Sulley in a professional boxing event 'The Jungle Rumble' at the Balbir Singh Juneja Stadium in Raipur on Wednesday, August 17. Congratulations Jatta ❤️#जाट_समाज pic.twitter.com/YhpypIznC3 — जाट समाज (@JAT_SAMAAJ) August 17, 2022 -
తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టనున్న స్టార్ బాక్సర్
భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ స్వల్ప విరామం తర్వాత స్వదేశంలో మరో ప్రొ బాక్సింగ్ బౌట్లో తలపడనున్నాడు. ఆగస్టులో రాయ్‌పూర్ వేదికగా తొలిసారి జరిగే ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన విజేందర్ 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు. వరుసగా 12 బౌట్లలో గెలిచాడు ప్రస్తుతం మాంచెస్టర్‌లో శిక్షణ పొందుతున్నానని రాయ్‌పూర్ బౌట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని విజేందర్ చెప్పాడు. -
మూడో బాక్సర్‌గా లవ్లీనా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది!
టోక్యో/న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో బాక్సింగ్ విభాగంలో భారత్‌కు మూడో పతకం అందించిన మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో ఓడినప్పటికీ ఇప్పటి దాకా ఆమె సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అంకితభావంతో ముందుకు సాగి కాంస్య పతకం గెలిచినందుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు.. ‘‘చాలా బాగా పోరాడావు లవ్లీనా! బాక్సింగ్ రింగ్‌లో ఆమె విజయం ఎంతో మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చింది. కాంస్యం సాధించినందుకు శుభాకాంక్షలు. భవిష్యత్‌లో మరింత మెరుగ్గా రాణించాలి’’ అని ట్విటర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. కాగా బుధవారం జరిగిన బాక్సింగ్ మహిళల 69 కిలోల విభాగం సెమీ ఫైనల్లో లవ్లీనా.. టర్కీ బాక్సర్ బుసేనాజ్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 0-5 తేడాతో లవ్లీనా పరాజయం పాలైంది. అయితే, గతనెల 30న జరిగిన క్వార్టర్స్‌లో చిన్ చైన్‌పై విజయం సాధించినందుకు గానూ లవ్లీనాకు కాంస్య పతకం దక్కింది. ఇక ఇప్పటి వరకు భారత బాక్సింగ్‌లో విజేందర్ సింగ్(2008), మేరీ కోమ్(2012) ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. గర్వంగా ఉంది లవ్లీనా.. ‘‘బాక్సింగ్‌లో భారత్‌కు కాంస్యం. నిన్ను చూసి భారత్ గర్వపడుతోంది లవ్లీనా’’ అని లండన్ ఒలింపిక్స్ పతక విజేత, భారత బాక్సర్ విజేందర్ సింగ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. #IND's Lovlina Borgohain wins India's THIRD medal at #Tokyo2020 - and it's a #Bronze in the women's #Boxing welterweight category! #StrongerTogether | #UnitedByEmotion | #Olympics pic.twitter.com/wcX69n3YEe — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 4, 2021 𝐁𝐑𝐎𝐍𝐙𝐄 𝐈𝐓 𝐈𝐒 🥳 We are proud of you @LovlinaBorgohai , you went on to @Tokyo2020 to play your maiden #Olympics and clinched 🥉 in it. It's a all time 3️⃣rd Olympic medal from #Boxing for 🇮🇳.#RingKeBaazigar#Tokyo2020#Cheer4India#TeamIndia pic.twitter.com/snmCiuWwtL — Boxing Federation (@BFI_official) August 4, 2021 Well fought @LovlinaBorgohai! Her success in the boxing ring inspires several Indians. Her tenacity and determination are admirable. Congratulations to her on winning the Bronze. Best wishes for her future endeavours. #Tokyo2020 — Narendra Modi (@narendramodi) August 4, 2021 -
‘రాననుకున్నారా! రాలేననుకున్నారా!!’
‘రాననుకున్నారా! రాలేననుకున్నారా!!’ అనే సీన్మా డైలాగ్‌ను విజేందర్‌సింగ్ విషయంలో భేషుగ్గా వాడుకోవచ్చు. 2019 తరువాత ఈ ప్రొఫెషనల్ బాక్సర్ మళ్లీ రింగ్‌లోకి దిగుతున్నాడు. రష్యన్ బాక్సర్ లొప్సన్తో తలపడబోతున్నాడు. ఈసారి ప్రత్యేకత షిప్. గోవా మాండవి నదిలో మెజిస్టిక్ ప్రైడ్ క్యాసీనో షిప్ పై భాగంలో ఎల్లుండి జరిగే ఈ బౌట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.... ఇప్పుడిప్పుడే రింగ్‌లో బుడిబుడి అడుగులు వేస్తున్న బాక్సర్లతో పాటు, బాలీవుడ్ సినిమాలలో బాక్సర్ వేషాలు వేయాలనుకునే నటులకు కూడా విజేందర్ రోల్‌మోడల్. యువ నటుడు అక్షయ్ ఒబెరాయ్‌కి ఒక సినిమా కోసం బాక్సర్ ఫిజిక్ కావల్సి వచ్చింది. దీని కోసం లోకల్ ట్రైనర్‌ను సంప్రదిస్తే ‘విజేందర్ సింగ్ డైట్’ సూచించాడు. అక్షరాల ఆ డైట్‌ను పాటించి అద్భుత ఫలితాన్ని సాధించాడు ఆ నటుడు. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అపురూపమైన విజయాలు సాధించిన ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్‌సింగ్ బెనివాల్ రకరకాల సందర్భాల్లో వ్యక్తిత్వవికాసం, ఫిట్‌నెస్‌కు సంబంధించి చెప్పిన విషయాలు కొన్ని ఆయన మాటల్లోనే... ►నాన్న బస్సు డ్రైవర్(హరియాణాలో) ఆదాయం అంతంత మాత్రమే. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఆయనకు ఉండేది. నాకేమో బాక్సింగ్ అంటే ఇష్టం పెరిగింది. బాక్సింగ్‌లో నాకు ఓనమాలు దిద్దించిన తొలి గురువు మా అన్న మనోజ్. ‘మనకెందుకు బాక్సింగ్. బాగా చదువుకో’ అని నాన్న అనేవారు. ‘బాక్సింగ్ వద్దు క్రికెట్ నేర్చుకో’ అని కొందరు సలహా ఇచ్చేవారు. అయితే నేనేమీ లెక్కలు వేసుకోలేదు. బాక్సింగ్‌పై గట్టిగా మనసు పెట్టాను. బాక్సింగ్ సాధన చేస్తున్నప్పుడు గోడలపై కనిపించే ‘నో గట్స్ నో గ్లోరీ’ ‘నో పెయిన్, నో గెయిన్’లాంటి వాక్యాలు ఉత్తేజపరిచేవి. ►కష్టపడేతత్వం, క్రమశిక్షణ...ఇవి ఫిట్‌నెస్‌కు కీలకమైనవి. స్ట్రెచెస్, వామప్స్...ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు వర్కవుట్లు చేస్తాను. బాడీ చురుగ్గా లేకపోతే, రోటిన్ బోర్ అనిపిస్తే స్కిప్కింగ్ చేస్తాను. దీన్ని ఎంజాయ్ చేస్తాను. ట్రెడ్మిల్ అనేది నా కోసం కాదు అనుకుంటాను. బహిరంగ ప్రదేశాలలో పరుగెత్తడానిక బాగా ఇష్టపడతాను. బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్లు, సీజనల్ పండ్లు తీసుకుంటాను. లంచ్, డిన్నర్లలో రొట్టే, సబ్జీ, అన్నం, పప్పు, సాయంత్రం పాలు తీసుకుంటాను. రోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు తాగు తాను. క్యాంప్‌లో మాత్రం నా డైట్ ప్రత్యేకంగా ఉంటుంది. గుడ్లు, ప్రొటిన్షేక్, చేపలు, చికెన్, బ్రౌన్‌రైస్...మొదలైనవి తీసుకుంటాను. స్వీట్లు తినడం నా బలహీనత, అయితే క్యాంప్‌లో ఉన్నప్పుడు వాటి గురించి కనీసం ఆలోచించను. మంచి ఫిట్‌నెస్‌కు మంచి నిద్ర కావాలి. ప్రతికూల ఆలోచనలను మనసులో నుంచి తీసేసి ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటే శరీరం మన మాట వింటుంది. పంజాబీ సంగీతం విని రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతాను. ►బాక్సర్ శారీరకంగానే కాదు మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. రోజూ 30 నుంచి 50 నిమిషాల పాటు ధ్యానం చేస్తాను. ధ్యానం అనేది మనలోని అహాన్ని చంపేస్తుంది. గెలవగానే గెలుపు మైకంలో ‘నేనే గొప్ప’ అనే భ్రాంతి తప్ప ఏదీ కనిపించదు. నేను గెలిచినప్పుడు ‘గెలిచాను. ఓకే. దీన్ని నా మనసు నుంచి తీసేస్తున్నాను’ అనుకుంటాను. ఓడినప్పుడు ‘ఓడిపోయాను. దీన్ని నా మనసు నుంచి తీసేస్తున్నాను’ అనుకుంటాను. ‘నీ హృదయం యవ్వనమయమైతే వయసు అనేది సంఖ్య మాత్రమే అవుతుంది’ గురుదాస్ మాన్ పాటను తరచుగా గుర్తు చేసుకుంటాను. ►నేను నెంబర్‌వన్‌గా ఉండవచ్చు, ఉండక పోవచ్చు. కానీ ఎంత కష్టపడ్డామన్నదే నాకు ముఖ్యం. కలలు కనడం ఎంత మాత్రం తప్పు కాదు. అయితే అవి గాలిమేడలు కాకూడదు. ఎప్పుడూ వాస్తవం అనే పునాది మీదే మన పాదాలు ఉండాలి. ‘రాత్రికే రాత్రి విజయం నా సొంతం కావాలి’ అనుకునేవారు ఫీల్డ్‌లో నిలవ లేరు. స్టెప్–బై–స్టెప్ మాత్రమే ఏదైనా సాధించగలం. -
విజేందర్ 12 నాటౌట్..ఈసారి రష్యా బాక్సర్!
పనాజీ: తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో 12–0తో అజేయంగా దూసుకెళ్తున భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ మరో బౌట్‌కు సిద్ధమయ్యాడు. ఏడాది తర్వాత అతను మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఈనెల 19న గోవాలో జరిగే బౌట్లో రష్యా బాక్సర్ ఆర్తిస్ లాప్సన్తో విజేందర్ తలపడనున్నాడు. సూపర్ మిడిల్ వెయిట్ విభాగంలో జరిగే ఈ బౌట్ పనాజీలోని మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో షిప్లో జరగనుంది. విజేందర్ ప్రత్యర్థి లాప్సన్ ఇప్పటివరకు ఆరు ప్రొఫెషనల్ బౌట్లలో పాల్గొనగా... నాలుగింటిలో విజయం సాధించాడు. కాగా, 2019, నవంబర్‌లో చివరిసారి తలపడిన విజేందర్..కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ చార్లెస్ అడామూ (ఘనా)ను ఓడించాడు. దాంతో తన విజయాల సంఖ్యను 12కు పెంచుకున్నాడు. -
మరో బౌట్‌కు విజేందర్ రె‘ఢీ’
దుబాయ్: ప్రొఫెషనల్ బాక్సర్‌గా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆసియా పసిఫిక్, ఓరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్ విజేందర్ సింగ్ మరో బౌట్‌కు సిద్ధమయ్యాడు. నవంబర్ 22న జరిగే ఫైట్‌లో అతను కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ చార్లెస్ అడామూ (ఘనా)తో పోటీపడతాడు. 10 రౌండ్ల పాటు జరిగే ఈ బౌట్లోనూ గెలిచి తన విజయాల సంఖ్యను 12కు పెంచుకోవాలని విజేందర్ పట్టుదలతో ఉన్నాడు. 2020లో ప్రపంచ బాక్సింగ్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ 34 ఏళ్ల బాక్సర్ ఈ మ్యాచ్‌ను సన్నాహకంగా భావిస్తున్నట్లు తెలిపాడు. మరోవైపు తాను ఆడిన బౌట్లలో 33 గెలిచి, 14లో ఓడిన అడామూ... విజేందర్ విజయాల రికార్డుకు బ్రేక్ వేస్తానంటున్నాడు. -
వచ్చే నెల 22న విజేందర్ బౌట్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ మరో ప్రత్యర్థిని మట్టికరిపించే పనిలో పడ్డాడు. వచ్చేనెల 22న తన తదుపరి బౌట్ కోసం కసరత్తు చేస్తున్నాడు. ప్రత్యర్థి ఇంకా ఖరారు కానప్పటికీ... దుబాయ్‌లో ఈ బాక్సింగ్ పోరు జరగనుంది. ప్రొఫెషనల్ సర్క్యూట్లో భారత బాక్సర్ది దుర్బేధ్యమైన రికార్డు. ఇప్పటి వరకు పాల్గొన్న 11 బౌట్లలో విజేందర్దే విజయం. ఇందులో ఏకంగా ఎనిమిది మందిని నాకౌట్ చేయడం మరో విశేషం. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అరంగేట్రం నుంచి అద్భుతాలు చేస్తున్న విజేందర్ అందుకు అనుగుణంగానే రాటుదేలుతున్నాడు. ప్రస్తుతం మాంచెస్టర్‌లో ఉన్న ఈ మిడిల్ వెయిట్ బాక్సర్ తదుపరి బౌట్ కోసం చెమటోడ్చుతున్నాడు. ట్రెయినర్ లీ బర్డ్‌తో కలిసి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. అ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ ‘నా ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. దీన్ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగించాలనుకుంటున్నాను. దుబాయ్‌లో నా అభిమానులు ఆశించే పోరాటాన్నే కనబరుస్తాను. నా శక్తి సామార్థ్యాల్ని చాటేందుకు ప్రొఫెషనల్ సర్క్యూట్ చక్కని అవకాశాన్ని కల్పించింది. నా జైత్రయాత్రను ఇలాగే కొనసాగించి మెల్లగా ప్రపంచ టైటిల్‌పై దృష్టిసారిస్తా’ అని అన్నాడు. -
ఒలింపిక్స్‌కు విజేందర్ గ్రీన్‌సిగ్నల్
చెన్నై: సుమారు రెండేళ్ల క్రితం భారత బాక్సర్ విజేందర్ సింగ్ ప్రొషెనల్ రింగ్‌లోకి అడుగుపెట్టడంతో దేశం తరఫున అధికారిక ఈవెంట్లలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రొఫెషనల్ బాక్సర్లగా మారిన వాళ్లు ఇకపై దేశం తరఫున ఆడేందుకు సైతం అనుమతిస్తూ భారత బాక్సింగ్ ఫెడరేషన్(బీఎఫ్ఐ) నిర్ణయం తీసుకోవడంతో విజేందర్ ముందు సువర్ణావకాశం వచ్చి పడింది. ఒలింపిక్స్ సహా అన్ని అధికారిక క్రీడల్లో భారత ప్రొఫెషనల్ బాక్సర్ల పాల్గొనే అవకాశాన్ని కల్పించడంతో విజేందర్కు మెగా ఈవెంట్లో తన సత్తాను మరోసారి చాటేందుకు అవకాశం ఏర్పడింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విజేందర్.. వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు చాన్స్ దొరికింది. దాంతో పాటు మరో భారత ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయత్‌కు కూడా ఒలింపిక్స్ బాక్సింగ్ రింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. దీనిపై విజేందర్ మాట్లాడుతూ.. ‘కచ్చితంగా మెగా ఈవెంట్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఉన్నాను. నాకు ప్రొఫెషనల్ అయినా, అమెచ్యూర్ అయినా ఒక్కటే. ఎక్కడైనా రెండొందల శాతం ప్రదర్శను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి భారత జెండాను నా షర్ట్‌పై చూడాలనుకుంటున్నా. దేశం కోసం పోరాడటం ఎప్పుడూ గౌరవమే’ అని పేర్కొన్నాడు. కాగా, ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే అంతకుముందు జరిగే క్వాలిఫయింగ్ ఈవెంట్లో తలపడాల్సి ఉంటుంది. -
పొలిటికల్ రింగ్‌లో విజేందర్ ఘోర ఓటమి
ఢిల్లీ: తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజేందర్ సింగ్.. పొలిటికల్ రింగ్‌లో మాత్రం ఘోర ఓటమి చవిచూశారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిచిన విజేందర్ సింగ్ ఎటువంటి పోటీ ఇవ్వకుండా పరాజయం పాలయ్యారు. దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగిన విజేందర్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. కేవలం లక్షా అరవై నాలుగు వేల నూట యాభై ఎనిమిది ఓట్లకు మాత్రమే పరిమితమైన విజేందర్ సింగ్ ప్రత్యర్థులకు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ఇక్కడ దక్షిణ ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ రమేష్ బిధూరీ ఘన విజయం సాధించారు. రమేష్ బిధూరీ 6, 83, 578 ఓట్లు సాధిస్తే, ఆప్ నుంచి పోటీ చేసిన రాఘవ్ చాధా 3,18, 584 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. దక్షిణ ఢిల్లీ స్థానం హర్యానాకు ఆనుకొని ఉండటంతో జాట్లు, గుర్జర్ సామాజిక వర్గాల ఓటర్లను విజేందర్ తనవైపు తిప్పుకోగలడని భావించిన కాంగ్రెస్ ఈ సీటును అతనికి కేటాయించింది. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఓటమి ఎరుగకుండా విజేందర్ తనదైన మార్కును చూపెట్టారు. వరుసగా పది బాక్సింగ్ ఫైట్లలో విజయం సాధించడం ద్వారా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇందులో 7 విజయాల్ని నాకౌట్ రూపంలో సాధించడం విశేషం. 2008 బీజింగ్ ఒలింపిక్‌లో కాంస్య పతకం సాధించిన విజేందర్కు హర్యాన ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో సత్కరించింది. రాజకీయాల్లోకి రావడంతో ఆయన తన డీఎస్పీ పదవికి కూడా రాజీనామా చేశారు. 2010లో పద్మశ్రీ అవార్డును అందుకున్న విజేందర్... 2014లో బాలీవుడ్లో నటుడిగా అరంగేట్రం చేశారు. ఫగ్లీ సినిమా ద్వారా వెండితెరకు ఈ బాక్సర్ పరిచయయమ్యారు. అక్షయ్ కుమార్, అశ్విని యార్డిల సొంత ప్రొడక్షన్ గ్రేజింగ్ గోట్ ప్రొడక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రం యావరేజ్ టాక్‌ను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక 2015 అక్టోబర్‌లో తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత బాక్సర్‌గా నిలిచిన విజేందర్.. తాజాగా రాజకీయ పంచ్ విసురుదామనుకుని బరిలోకి దిగినప్పటికీ ఆయన ఆశలు ఫలించలేదు. -
‘గెలిచినా ఓడినా రాజకీయాల్లో కొనసాగుతా’
ఢిల్లీ: బాక్సింగ్ తన రక్తంలోనే ఉందని, బాక్సింగ్, రాజకీయాలను సమాంతరంగా కొనసాగిస్తానని, గెలిచినా ఓడినా రాజకీయాల్లో కచ్చితంగా కొనసాగుతున్నానని ఒలంపిక్ కాంస్య విజేత, దక్షిణ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజేందర్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో విజేందర్ సింగ్ సాక్షిటీవీతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఆప్‌తో పొత్తు పెట్టుకోపోవడమే మంచిదైందన్నారు. రాజకీయాలు , క్రీడలు వేర్వేరు రంగాలని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో బాగా శ్రమించాల్సి ఉంటుందన్నారు. పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ధనవంతులకే బీజేపీలో స్థానం ఉంటుందన్నారు. తాను ఒక మామూలు డ్రైవర్ కుమారుడినని, తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. దక్షిణ ఢిల్లీ అభివృద్ధి కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాననితీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
ఆ ముసుగు వెనుక ఏముందో?!
న్యూఢిల్లీ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ విమర్శించారు. ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత బాక్సర్‌గా చరిత్రకెక్కిన విజేందర్ రాజకీయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. హర్యానాకు చెందిన ఆయన ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘ కొంతమంది వ్యక్తులు ముసుగు వెనకాల ఎలా ఉంటారో మనకు తెలియదు. ముసుగు వెనుక ఏముందో కూడా తెలుసుకోకుండానే మనం కొన్నిసార్లు ఎదుటి వారిని పొగిడేస్తాం. అబద్ధపు ముసుగు వేసుకుని 2014లో బీజేపీ పెద్ద విజయం సాధించింది. పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఏమయ్యింది. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు’ అని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఓ మాయా ప్రపంచాన్ని సృష్టించి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చాను ‘ మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. మా నాన్న బస్ డ్రైవర్, తాతయ్య ఆర్మీలో పనిచేసేవారు. ప్రసార మాధ్యమాల ద్వారా నిరంతరం జరిగే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం కదా. ఇందులో భాగంగా యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలనను, మోదీజీ పాలనను నిశితంగా గమనించాను. అందులో ఉన్న తేడాను గమనించాను. దేశ అభివృద్ధికై నా వంతు కృషి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను. నా సిద్ధాంతాలు, కాంగ్రెస్ సిద్ధాంతాలు ఒకటే. పేదలు, యువత, మధ్యతరగతి వారు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు ఇలా ప్రతీవర్గానికి న్యాయం చేయాలనే తపన కాంగ్రెస్ నేతలకు ఉంటుంది. బీజేపీ వాళ్లలాగా అర్థంపర్థంలేని మాటలు మాట్లాడటం, ఫాంటసీలు క్రియేట్ చేయడం మాకు చేతకాదు. ముఖ్యంగా నాలాంటి చదువుకున్న వ్యక్తులు బీజేపీకి దూరంగా ఉంటారు’ అని విజేందర్ సింగ్ పేర్కొన్నారు. ఇక తన ప్రత్యర్థి రమేష్ బిధూరి గురించి మాట్లాడుతూ.. 2014లో ఉన్న మోదీ వేవ్ కారణంగా ఆయన గెలుపొందారు.. కానీ ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యం అని విమర్శించారు. కాగా దక్షిణ ఢిల్లీ స్థానం హర్యానాకు ఆనుకొని ఉండటంతో.. జాట్లు, గుర్జర్ సామాజిక వర్గాల ఓటర్లను విజేందర్ తనవైపు తిప్పుకోగలడని భావించిన కాంగ్రెస్ ఈ సీటును అతనికి కేటాయించిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల బరిలో ఒలింపిక్ విజేత
న్యూఢిల్లీ : ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి మరో క్రీడాకారుడు దిగారు. ఇప్పటికే భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన పొలిటికల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా.. తాజాగా ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ సైతం ఎన్నికల సమరానికి సై అన్నారు. బాక్సింగ్ రింగ్‌ను వదిలి పొలిటికల్ బౌట్లో పంచ్‌లు విసిరేందుకు సిద్దమయ్యారు. గంభీర్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా.. దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజేందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన తన డీఎస్పీ పదవికి కూడా రాజీనామా చేశారు. విజేందర్ రాజీనామాను ఆమోదించినట్లు హర్యానా అడిషనల్ సీఎస్ ఎస్ఎస్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. 2008 బీజింగ్ ఒలింపిక్‌లో కాంస్య పతకం సాధించిన విజేందర్కు హర్యాన ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో సత్కరించింది. ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత బాక్సర్ విజేందరేనన్న విషయం తెలిసిందే. ఇక తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్‌కు విజేందర్ సింగ్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘20 ఏళ్ల నా బాక్సింగ్ కెరీర్లో దేశం తలెత్తుకునేలా చేశాను. ఇప్పుడు ఈ దేశానికి ఇంకా ఏదో చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అంగీకరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు, పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు.’ అని ట్వీట్ చేశారు. దక్షిణ ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ రమేష్ బిధూరీ పోటీ చేయనుండగా.. ఆమ్ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చాధా బరిలో ఉన్నారు. దక్షిణ ఢిల్లీ స్థానం హర్యానాకు ఆనుకొని ఉండటంతో.. జాట్లు, గుర్జర్ సామాజిక వర్గాల ఓటర్లను విజేందర్ తనవైపు తిప్పుకోగలడని భావించిన కాంగ్రెస్ ఈ సీటును అతనికి కేటాయించింది. దక్షిణ ఢిల్లీ మినహా ఢిల్లీలోని ఆరు లోక్ సభ స్థానాలకు శనివారం సాయంత్రమే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. దక్షిణ ఢిల్లీ స్థానాన్ని మాత్రం సోమవారం అర్థరాత్రి తర్వాత విజేందర్ సింగ్ కేటాయించినట్లు పేర్కొంది. మూడుసార్లు ఢిల్లీ సీఎంగా పని చేసిన షీలా దీక్షిత్‌కి ఆ పార్టీ ఈశాన్య ఢిల్లీ టికెట్ కేటాయించగా.. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన అజయ్ మాకెన్‌ను న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలో దింపుతోంది. చాందినీ చౌక్ నుంచి జేపీ అగర్వాల్, తూర్పు ఢిల్లీ నుంచి అర్విందర్ సింగ్ లవ్లీలకు అవకాశం కల్పించింది. వాయవ్య ఢిల్లీ నుంచి రాజేశ్ లిలోతియా, పశ్చిమ ఢిల్లీ నుంచి మహాబల్ మిశ్రాలు పోటీ చేస్తారని ప్రకటించింది. -
విజేందర్ బౌట్ వాయిదా
న్యూఢిల్లీ: అమెరికా గడ్డపై భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ అరంగేట్రం ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 12వ తేదీన విజేందర్ బౌట్ జరగాల్సింది. అయితే ఈ బౌట్ కోసం సిద్ధమవుతున్న సందర్భంగా ప్రాక్టీస్ సెషన్లో విజేందర్ ఎడమ కంటికి గాయమైంది. గాయం తీవ్రతదృష్ట్యా అతని కంటికి ఆరు కుట్లు వేశారు. ‘స్పారింగ్ సెషన్లో నా సహచరుని మోచేయి నా కంటికి బలంగా తాకింది. వైద్యుల సూచనతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నాను. గాయం నుంచి కోలుకున్నాకే బౌట్ తదుపరి తేదీని నిర్ణయిస్తాం. దేవుడు ఏది చేసినా మంచి కోసమే చేస్తాడని నేను విశ్వసిస్తాను. ఈ గాయం కూడా నా మంచి కోసమే జరిగిందని భావిస్తున్నాను’ అని 33 ఏళ్ల విజేందర్ వ్యాఖ్యానించాడు. 2015లో ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఇప్పటివరకు 10 బౌట్లలో పోటీపడి అన్నింట్లోనూ విజయం సాధించాడు. -
అమెరికాలో విజేందర్ అరంగేట్రం ఖరారు
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అమెరికన్ ఫ్రొఫెషనల్ సర్క్యూట్ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. ఇంకా ప్రత్యర్థి ఖరారు కానప్పటికీ వచ్చే నెల 12న అక్కడి స్టేపుల్స్ సెంటర్లో అతని పోరు జరుగనుంది. ఎనిమిది రౌండ్ల పాటు ఈ ప్రొఫెషనల్ బౌట్ జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇందుకోసం బాక్సింగ్‌లో కోవిదుడైన విశిష్ట కోచ్ ఫ్రెడ్డీ రోచ్ వద్ద భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలో రోచ్ బాక్సింగ్ దిగ్గజాలు మైక్ టైసన్, పకియావోలకు శిక్షణ ఇచ్చారు. ప్రొఫెషనల్ కెరీర్లో విజేందర్ అజేయంగా కొనసాగుతున్నాడు. ఇప్పటిదాకా 10 బౌట్లలో విజయం సాధించిన భారత బాక్సర్ ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని ది వైల్డ్‌కార్డ్ బాక్సింగ్ క్లబ్లో శిక్షణ మొదలుపెట్టాడు. 2012లో అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ (ఐబీహెచ్ఓఎఫ్)లోకి ఎంపికైన రోచ్... విజేందర్ పంచ్‌లకు పదును పెంచుతున్నాడు. 32 ఏళ్ల సుదీర్ఘ కోచింగ్ కెరీర్లో రోచ్.. విజయవంతమైన శిక్షకుడిగా ఘనతకెక్కాడు. -
ఆరు నెలల తర్వాత మళ్లీ రింగ్‌లోకి...
భారత ప్రొఫెషనల్ బాక్సింగ్ స్టార్ విజేందర్ ఆరు నెలల తర్వాత రింగ్‌లోకి అడుగు పెట్టనున్నాడు. వచ్చే నెల 13న కామన్వెల్త్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ కోసం బ్రిటన్ బాక్సర్ లీ మార్క్‌హామ్‌తో లండన్‌లో తలపడనున్నాడు. 2015లో ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఇప్పటివరకు బరిలో దిగిన 10 బౌట్లలోనూ విజయం సాధించాడు. గతేడాది డిసెంబర్ 23న జైపూర్‌లో జరిగిన తన చివరి బౌట్లో ఘనా బాక్సర్ ఎర్నెస్ట్ అమూజుపై గెలిచిన విజేందర్ తిరిగి బరిలో దిగలేదు. విజేందర్ వద్ద ప్రస్తుతం డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్, ఓరియంటల్ టైటిల్స్ ఉన్నాయి. -
విజేందర్
జైపూర్: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఖాతాలో వరుసగా పదో విజయం వచ్చి చేరింది. ఘనా బాక్సర్ ఎర్నెస్ట్ అముజుతో శనివారం ఇక్కడ జరిగిన బౌట్లో విజేందర్ ఏకపక్ష విజయాన్ని సాధించాడు. మూడు నిమిషాల నిడివిగల 10 రౌండ్ల బౌట్లో విజేందర్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. బౌట్‌ను పర్యవేక్షించిన ముగ్గురు న్యాయ నిర్ణేతలు విజేందర్కు 100 పాయింట్ల చొప్పున ఇవ్వగా... అముజుకు 90 పాయింట్లు మాత్రమే ఇచ్చారు. ఈ విజయంతో 32 ఏళ్ల విజేందర్ డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌తో పాటు ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఈ బౌట్‌కు ముందు విజేందర్‌ను ఓడించడంతో పాటు అతని ఎముకలు విరగ్గొడతానని చాలెంజ్ చేసిన 34 ఏళ్ల అముజుకు అసలు సమరంలో మాత్రం విజేందర్ పంచ్‌లకు చుక్కలు కనిపించాయి. ఒకానొక దశలో విజేందర్ పంచ్‌లకు తాళలేక అముజు రింగ్ చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఘనా బాక్సర్‌ను అలవోకగా మట్టి కరిపిస్తానని మ్యాచ్‌కు ముందే చెప్పిన విజేందర్ చెప్పిందే చేసి చూపించాడు. -
గౌరవ్‌కు పతకం ఖాయం
హాంబర్గ్ (జర్మనీ): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత బాక్సర్ గౌరవ్ బిధురి సంచలనం సృష్టించాడు. ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన నాలుగో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. ఈ మెగా ఈవెంట్‌కు గౌరవ్ నేరుగా అర్హత పొందకపోయినా ఆసియా బాక్సింగ్ సమాఖ్య ‘వైల్డ్ కార్డు’ ఇవ్వడంతో బరిలోకి దిగాడు. వాస్తవానికి ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ భూటాన్‌కు కేటాయించినా వారు ఆసక్తి చూపకపోవడంతో గౌరవ్‌కు ఈ అవకాశం లభించింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గౌరవ్ 3–0తో బిలెల్ మహమ్‌దీ (ట్యూనిషియా)పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్ తరఫున విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015) కాంస్య పతకాలను సాధించారు. వీరి సరసన గౌరవ్ కూడా చేరనున్నాడు. మరోవైపు ఒలింపిక్ చాంపియన్ హసన్‌బాయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన 49 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో అమిత్ ఫంగల్ (భారత్)... కిమ్ ఇన్‌క్యు (దక్షిణ కొరియా)తో జరిగిన 52 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో కవీందర్ బిష్త్ (భారత్) ఓడిపోయారు. దాంతో ఈ పోటీల్లో భారత్ ఖాతాలో ఒక పతకం మాత్రమే చేరనుంది. -
నేటి నుంచి ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్
హాంబర్గ్: ప్రతిష్టాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి పది రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారత బాక్సర్లు సిద్ధమయ్యారు. భారత్ తరఫున అమిత్ సాంగ్వాన్ (49 కేజీలు), కవీందర్ బిష్త్ (52 కేజీలు), గౌరవ్ బిధురీ (56 కేజీలు), శివ థాపా (60 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (91 కేజీలు), సతీశ్ (+ 91 కేజీలు) బరిలోకి దిగనున్నారు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో విజేందర్ సింగ్ (2009), వికాస్ (2011), శివ (2015) మాత్రమే కాంస్యాలను సాధించారు. -
బాక్సర్ విజేందర్ సింగ్ జైత్రయాత్ర
-
విజేందర్ జైత్రయాత్ర
డబ్ల్యూబీవో ‘డబుల్’ టైటిల్ సొంతం చైనా బాక్సర్ జుల్పికర్పై 3–0తో విజయం ముంబై: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్... రింగ్‌లో తనకు ఎదురేలేదని మరోసారి నిరూపించుకున్నాడు. శనివారం చైనా ప్రత్యర్థి జుల్పికర్ మైమైటియాలితో జరిగిన బౌట్లో విజేందర్ 3–0తో నెగ్గాడు. దీంతో డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌తో పాటు ప్రత్యర్థికి చెందిన ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 31 ఏళ్ల విజేందర్కు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం. పది రౌండ్ల పాటు జరిగిన ఈ బౌట్లో చివరకు ముగ్గురు జడ్జిలు విజేందర్కు అనుకూలంగా 96–93, 95–94, 95–94 స్కోరును ప్రకటించారు. దీంతో భారత బాక్సర్ ఏకగ్రీవంగా విజేతగా నిలిచినట్టయ్యింది. అయితే ఇంతకుముందులా ఈ బౌట్ విజేందర్కు అంత సులువుగా జరగలేదు. చైనా బాక్సర్ నుంచి తీవ్ర పోటీయే ఎదుర్కొన్నాడు. తొలి రౌండ్లో ఇద్దరూ పూర్తి డిఫెన్సివ్ ఆటను ప్రదర్శించగా తొలి పంచ్ మాత్రం విజేందర్దే అయ్యింది. ఇక రెండో రౌండ్లో ఇద్దరూ వ్యూహాత్మకంగానే కదిలారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా పంచ్ విసిరినందుకు చైనా బాక్సర్‌ను రిఫరీ హెచ్చరించారు. ఒక పంచ్ విజేందర్ కంటికింద తాకడంతో కాస్త వాచినట్టయింది. నాలుగో రౌండ్లో జుల్పికర్ దూకుడును కనబరిచాడు. అయితే అతడి వేగవంతమైన పంచ్‌లను విజేందర్ సులువుగానే తప్పించుకోగలిగాడు. ఐదో రౌండ్ వరకు కూడా నువ్వా నేనా అనే రీతిలోనే బౌట్ సాగినా ఆ తర్వాత విజేందర్ కాస్త పైచేయి సాధించాడు. అఖిల్, జితేందర్ టెక్నికల్ నాకౌట్ విజయాలు అఖిల్ కుమార్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను నాకౌట్ విజయంతో ఆరంభించాడు. జూనియర్ వెల్టర్ వెయిట్ కేటగిరీలో టై గిల్‌క్రిస్ట్ (ఆసీస్)ను ఓడించాడు. అలాగే జితేందర్ కూడా లైట్‌వెయిట్ కేటగిరీలో థానెట్ లిఖిట్కామ్పోమ్పై గెలిచాడు. -
విజేందర్(vs)జుల్పికర్
‘డబుల్’ టైటిల్ కోసం నేడు అమీతుమీ ముంబై: డబ్ల్యూబీవో ‘డబుల్’ టైటిల్ కోసం భారత స్టార్ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ నేడు చైనాకు చెందిన జుల్పికర్ మైమైటియాలితో తలపడనున్నాడు. ఇప్పటిదాకా ఓటమి లేకుండా ఎనిమిది నాకౌట్ విజయాలతో దూసుకెళుతున్న విజేందర్ ఈ బౌట్‌పై కూడా ధీమాగా ఉన్నాడు. ‘ఇది భారత్, చైనా మధ్య పోరు. దేశం మొత్తం నా వెనకాలే ఉందని తెలుసు. ఈ బౌట్‌పై నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. కచ్చితంగా నాదే గెలుపు. పూర్తి ఫిట్నెస్ కోసం ఒక్క రోజులోనే రెండు కిలోలు తగ్గాను. బౌట్లో అతడు ఆడే విధానాన్ని బట్టి నా ప్రణాళికలు ఉంటాయి. నా టెక్నిక్ కూడా మార్చుకున్నాను’ అని డబ్లు్యబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్ విజేందర్ తెలిపాడు. జుల్పికర్ ప్రస్తుతం డబ్లు్యబీవో ఓరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్ విజేతగా ఉండగా నేటి బౌట్లో గెలిచిన విజేతకు ప్రత్యర్థి టైటిల్ కూడా దక్కుతుంది. రాత్రి గం. 7.00 నుంచి సోనీ టెన్–1లో ప్రత్యక్ష ప్రసారం -
'మరో నాకౌట్ విజయం సాధిస్తా'
న్యూఢిల్లీ: తన ప్రొఫెషనల్ కెరీర్లో ఇప్పటివరకు ఎనిమిది బౌట్లలో పోటీపడి ఏడింటిలో నాకౌట్ ద్వారా విజయాలు సాధించిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అదే జోరును కొనసాగిస్తానని అన్నాడు. ముంబైలో శనివారం జరిగే బౌట్లో జుల్పికర్ మైమైతియాల్ (చైనా)తో విజేందర్ తలపడనున్నాడు. విజేందర్ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ చాంపియన్ కాగా... జుల్పికర్ డబ్ల్యూబీఓ ఒరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ చాంపియన్. ఈ బౌట్లో గెలిచిన బాక్సర్‌కు ఏకకాలంలో రెండు టైటిల్స్ లభిస్తాయి. ‘నా కోసం ప్రార్థించండి. మరో నాకౌట్ విజయం కోసం వంద శాతం కృషి చేస్తాను. సాధ్యమైనంత తొందరగా బౌట్‌ను ముగిస్తాను’ అని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. -
ఆగస్టు 5న విజేందర్ బౌట్
తొలి టికెట్ సచిన్‌కు ముంబై: భారత స్టార్ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్, చైనా స్టార్ జుల్పికర్ మమటియలి మధ్య బౌట్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలో ఆగస్టు 5న ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరుగనుందని నిర్వాహకులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వర్లీలోని ఎన్ఎస్సీఐ స్టేడియంలో ఈ బౌట్ జరగనుంది. తొలి టికెట్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఆయన నివాసంలో స్వయంగా విజేందరే అందజేయనున్నాడు. ప్రొఫెషనల్ కెరీర్లో భారత స్టార్‌ది అజేయమైన రికార్డు. డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ మిడిల్ వెయిట్ చాంపియన్ అయిన విజేందర్... డబ్ల్యూబీఓ ఒరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇది ఒక రకంగా డబుల్ టైటిల్ బౌట్. ఇందులో గెలిచిన బాక్సర్ తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో పాటు... ప్రత్యర్థి టైటిల్‌ను ఎగరేసుకుపోతాడు. మీడియా సమావేశంలో విజేందర్ మాట్లాడుతూ ‘జుల్పికర్‌తో ఆగస్టు 5న జరిగే పోరుకు సిద్ధంగా ఉన్నా. ఎడంచేతి వాటమున్న యువకుడు నన్ను నాకౌట్ చేస్తాననడం వింటే నవ్వొచ్చింది. చైనాకు నా సత్తా ఏంటో ఆ బౌట్లో చూపిస్తా’ అని అన్నాడు. మేటి శిక్షణ కోసం తాను బుధవారం మాంచెస్టర్‌కు పయనమవుతున్నట్లు చెప్పాడు. నిజానికి ఈ పోరు మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సివున్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. -
ఆగస్టులో విజేందర్ బౌట్
న్యూఢిల్లీ: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ బౌట్‌కు రంగం సిద్ధమైంది. ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ చాంపియన్, చైనా బాక్సర్ జుల్పికర్ మైమైతియలితో ఆగస్టులో ముంబైలో ఈ బౌట్ జరగనుంది. నిజానికి మూడు నెలల క్రితమే ఇద్దరి మధ్య ఈ బౌట్ జరగాల్సివున్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల ఈ బాక్సర్లను ప్రమోట్ చేస్తున్న సంస్థల మధ్య పోరుకు సంబంధించిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. -
ప్రమోటర్స్‌తో విజేందర్ తెగతెంపులు
న్యూఢిల్లీ: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ప్రమోటర్స్ ‘క్వీన్స్బెరీ ప్రమోషన్స్’తో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నాడు. విజేందర్ ఇప్పటి వరకు 8 బౌట్లలో పాల్గొని అజేయంగా నిలవగా, క్వీన్స్బెరీ వాటిని ప్రమోట్ చేసింది. అయితే గత ఏడాది కాలంలో క్వీన్స్బెరీ ప్రతినిధులు తాను ఆశించిన స్థాయిలో అవకాశాలు కల్పించలేకపోయారని విజేందర్ చెప్పాడు. ‘ఏడాదిలో కనీసం ఆరు బౌట్లలో పాల్గొనే అవకాశం ఇస్తామని వారు ఒప్పందం చేసుకున్నారు. తొలి ఏడాది అలాగే ఆరు బౌట్లు జరిగాయి. కానీ తర్వాతి సంవత్సరం మాత్రం రెండే బౌట్లు రాగా, వాటిలోనూ వారి ప్రమేయం పెద్దగా లేదు. కాబట్టి వారిని కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి నిబంధనల ప్రకారం రద్దు చేసుకున్నాను’ అని విజేందర్ స్పష్టం చేశాడు. ఇకపై విజేందర్ వ్యవహారాలను ఐఓఎస్ బాక్సింగ్ ప్రమోషన్స్ పర్యవేక్షిస్తుంది. అతని తర్వాత బౌట్ జులైలో జరుగుతుందని, ప్రస్తుతానికి లీ బియర్డ్ కోచ్‌గా కొనసాగుతాడని కూడా ఐఓఎస్ ప్రతినిధి నీరవ్ తోమర్ వెల్లడించారు. -
విజేందర్ సింగ్ మరో నాకౌట్ విజయం
-
విజేందర్ మరో నాకౌట్ విజయం
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన అనంతరం పరాజయమన్నది లేకుండా దూసుకెళుతున్న విజేందర్ సింగ్ మరో నాకౌట్ విజయం సాధించాడు. ప్రపంచ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (డబ్లు్యబీవో) ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ పోరులో నేటి (శనివారం) రాత్రి జరిగిన బౌట్ లో భారత బాక్సర్ విజేందర్ సత్తా చాటాడు. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగుతున్న చెకాతో విజేందర్ పది రౌండ్లపాటు జరగాల్సిన ఫైట్ లో మాజీ ప్రపంచ చాంపియన్ ఫ్రాన్సిస్ చెకా (టాంజానియా)తో మూడో రౌండ్లోనే ప్రత్యర్థి చెకాను నాకౌట్ చేసి టైటిల్ నిలబెట్టుకున్నాడు. పంచ్ విసరడమే నా పని. బౌట్ లో అదే చేయబోతున్నానని చెప్పిన విజేందర్ ఢిల్లీలోని త్యాగరాజ్ స్డేడియం రింగ్ లో తాను చెప్పింది చేసి చూపించాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టిన విజేందర్ ఇప్పటివరకూ 8 విజయాలు సాధించగా, అందులో ఏడు నాకౌట్ విజయాలు ఉండటం విశేషం. విజేందర్ పంచ్ లను తట్టుకోలేక మూడో రౌండ్లోనే ఓటమిని అంగీకరించాడు. విజేందర్ ప్రత్యర్థి చెకా 43 ఫైట్లలో తలపడగా 32 విజయాలున్నాయి. ఇందులో 17 నాకౌట్స్ ఉన్నాయి. -
విజేందర్ సత్తాకు పరీక్ష
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన అనంతరం అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్న విజేందర్ సింగ్ మరో నాకౌట్ విజయంపై కన్నేశాడు. ప్రపంచ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (డబ్లు్యబీవో) ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ పోరులో భాగంగా మాజీ ప్రపంచ చాంపియన్ ఫ్రాన్సిస్ చెకా (టాంజానియా)తో నేడు (శనివారం) విజేందర్ తలపడనున్నాడు. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగుతున్న చెకాతో విజేందర్ పది రౌండ్లపాటు ఫైట్ చేయనున్నాడు. ఇప్పటిదాకా విజేందర్కు ఎదురైన అత్యంత అనుభవశాలి బాక్సర్ చెకానే. అందుకే రింగ్‌లో సత్తా చూపిస్తానని సవాల్ విసిరాడు. అయితే ఇందుకు విజేందర్ దీటుగా స్పందించాడు. ‘పంచ్ విసరడమే నా పని. బౌట్లో అదే చేయబోతున్నాను. ఈ టైటిల్ ఎక్కడికీ పోదు’ అని అన్నాడు. 34 ఏళ్ల చెకా ఇప్పటిదాకా 43 ఫైట్లలో తలపడగా 32 విజయాలున్నాయి. ఇందులో 17 నాకౌట్స్ ఉండగా.. 16 ఏళ్ల కెరీర్లో 300 రౌండ్లలో తలపడ్డాడు. విజేందర్ కేవలం 27 రౌండ్లు మాత్రమే ఆడాడు. ఈ బౌట్‌తో పాటు ఐదు అండర్కార్డ్ బౌట్స్ కూడా జరుగుతాయి. అన్ని బౌట్లు రాత్రి గం. 7.30 నుంచి 10.30 వరకు స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. -
విజేందర్ ఇక సర్దుకో..
న్యూఢిల్లీ:వచ్చే నెల్లో డబ్యూబీవో పసిఫిక్ ఆసియా మిడిల్ వెయిట్ చాంపియన్‌షిప్‌ను కాపాడుకోవడానికి సిద్ధమవుతున్న భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ఇక మూటముళ్లూ సర్దుకోవాల్సిందేనని అంటున్నాడు అతని ప్రత్యర్థి ఫ్రాన్సిస్ చెకా. ఇప్పటివరకూ పెద్దగా అనుభవం లేని వాళ్ల దగ్గరే విజేందర్ ఆటలు సాగాయని, తన వద్ద అతని బాక్సింగ్ పంచ్ పనిచేయదని హెచ్చరించాడు. 'ఆ బాక్సింగ్ బాలుడికి పాఠాలు నేర్పేందుకు సిద్ధమయ్యా. త్వరలోనే భారత్ కు వస్తా.. విజేందర్ పని పడతా. ఆ భారత బాక్సర్ గురించి చాలా విన్నా. అతన్ని చాలా ఎత్తులో చూస్తున్నారు. ఆ స్థానం నుంచి అతన్ని వెనక్కు నెట్టడానికి నా ఒక పంచ్ చాలు'అని చెకా ఘాటుగా వ్యాఖ్యానించాడు. విజేందర్ మాంచెస్టర్, యూకేలో శిక్షణ తీసుకున్న సంగతి తనకు తెలుసని, అతని సొంత దేశంలో ఓడించి తన పవర్ చూపిస్తానన్నాడు. ఈసారి ఆ టైటిల్ విజేందర్ దూరం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. తన ట్రాక్ రికార్డును ఒకసారి చూస్తే ఆ విషయం అర్థమవుతుందన్నాడు. ఇప్పటివరకూ తాను 32 విజయాలు సాధిస్తే, అందులో 17 నాకౌట్ విజయాలున్నాయన్నాడు. విజేందర్ పని ముగించడానికి తనకు ఒక రౌండ్ చాలంటూ అమితమైన విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ విజేందర్ ఆడిన బౌట్లలో అతని తిరుగులేని విజేత కావొచ్చు కానీ ఒకసారి రింగ్ లో కి వచ్చానంటే అతను తిరిగి సమాధానం చెప్పడానికి కూడా ఏమీ ఉండదంటూ ఈ మాజీ చాంపియన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.వచ్చే నెల17వ తేదీన ఇరువురి మధ్య పోరు జరుగునుంది. ఈ ఏడాది జూలైలో త్యాగరాజ స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ పోరులో విజేందర్ తొలిసారి విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్‌ను ఓడించి టైటిల్ ను సాధించాడు. ఇప్పటివరకూ ఏడు ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్లలో పాల్గొన్న విజేందర్ అన్నింటా విజయం సాధించాడు. అందులో ఆరు గేమ్‌లను నాకౌట్‌గా ముగించాడు. -
విజేందర్ ప్రత్యర్థి ఫ్రాన్సిస్ చెకా
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ స్టార్ విజేందర్ సింగ్ తన డబ్ల్యుబీవో సూపర్ మిడిల్వెరుుట్ ఆసియా పసిఫిక్ టైటిల్‌ను కాపాడుకునేందుకు వచ్చే నెల 17న బరిలోకి దిగనున్నాడు. మాజీ ప్రపంచ చాంపియన్, ప్రస్తుత ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్ అరుున ఫ్రాన్సిస్ చెకా ఈసారి విజేందర్ ప్రత్యర్థి. ఇప్పటిదాకా విజేందర్ ఎదుర్కొన్న వారిలో ఇతడే అత్యంత అనుభవశాలి. 34 ఏళ్ల ఈ టాంజానియన్ 43 బౌట్లలో 32 సార్లు గెలిచాడు. ఇందులో 17 నాకౌట్ విజయాలున్నారుు. 16 ఏళ్ల కెరీర్లో అతడికి 300 రౌండ్ల అనుభవం ఉండగా విజేందర్కు కేవలం 27 రౌండ్ల అనుభవం మాత్రమే ఉంది. ఇప్పటిదాకా విజేందర్ బరిలోకి దిగిన ఏడు పోటీల్లోనూ ఓటమి లేకుండా దూసుకెళుతున్నాడు. -
విజేందర్ కెరీర్ నాశనం చేస్తాను..
తనతో భవిష్యత్తులో బాక్సింగ్ రింగ్‌లో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్ మరోసారి తీవ్రంగా స్పందించాడు. 'విజేందర్ నాతో పోటీకి సిద్ధమని చాలెంజ్ చేయడం ఏంటి? అతడికి ఇది చాలా తమాషాగా ఉంది. అసలు విజేందర్కు కెరీర్ లేకుండా చేస్తాను' అని అమీర్ పేర్కొన్నాడు. తనలాంటి స్టార్ ఆటగాళ్లతో పోటీకి రెడీ అని వ్యాఖ్యానించేముందు ఎంతో అనుభవాన్ని సంపాదించాలని విజేందర్కు సూచించాడు. ప్రస్తుతం మిణికట్టు సర్జరీ చేయించుకున్న అమీర్.. విజేందర్ తో పోటీకి తాను సిద్ధమేనని, అయితే ఇంతటి పెద్ద బౌట్లో పాల్గొనాలంటే ఎంతో అనుభవం కావాలని అందుకు కొన్నేళ్ల సమయం పడుతుందన్నాడు. డబ్ల్యూబీఏ లైట్‌వెయిట్ ప్రపంచ చాంపియన్‌గా ఉన్న అమీర్, ఒలింపిక్స్‌లో ఓ రజతం కూడా సాధించాడు. పాకిస్తాన్-భారత్ సంబంధాల తరహాలోనే ఈ బౌట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ క్రేజ్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. వచ్చే 10 బౌట్లు విజేందర్కు సవాల్ విసురుతాయన్నాడు. అతడి ఆటను, బౌట్ కెరీర్ గ్రాఫ్ ను తాను గమనిస్తున్నట్లు వెల్లడించాడు. మా ఇద్దరి మధ్య జరిగే బౌట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడం ఖాయమనీ, అలాకాని పక్షంలో విజేందర్కు తానెప్పుడు మద్ధతిస్తానని పేర్కొన్నాడు. వరుస బౌట్లలో విజయాలతో దూసుకెళ్తోన్న విజేందర్‌ను చిన్నపిల్లాడితో పోల్చుతూ అమీర్ ఇదివరకే ట్వీట్ చేశాడు. విజేందర్ తన కోరిక(అమీర్‌తో బౌట్) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. -
విజేందర్ సింగ్‌పై కేసు నమోదు
న్యూఢిల్లీ: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల జరిగిన డబ్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌షిప్‌ను సాధించిన విజేందర్ ఆ పోరు సందర్భంగా మువ్వన్నెల రంగుతో ఉన్న షార్ట్ ను ధరించడమే వివాదానికి కారణమైంది. దీనిపై ఢిల్లీకి చెందిన ఉల్లాస్ అనే వ్యక్తి స్థానిక అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఇలా త్రివర్ణ రంగులతో ఉన్న ఒక షార్ట్‌ను ధరించి పోటీలో పాల్గొనడం భారత జాతీయ జెండాను అవమానపరిచినట్లేనని ఉల్లాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు విజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన బౌట్లో విజేందర్ 98-92, 98-92, 100-90తో ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ పై గెలిచి టైటిల్ సాధించాడు. పది రౌండ్ల పాటు జరిగిన బౌట్లో విజేందర్ ఏకపక్ష విజయం నమోదు చేశాడు. అంతకుముందు ప్రొ బాక్సింగ్‌లో ఆరు బౌట్లను గెలిచిన విజేందర్.. స్వదేశంలో అభిమానుల మధ్య తొలిసారి జరిగిన పోరులో అపూర్వమైన గెలుపును సొంతం చేసుకున్నాడు. కాగా, తాజా వివాదంపై విజేందర్ ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. -
విజేందర్.. ఇప్పటికీ పిల్లాడివే..!
న్యూఢిల్లీ: తనతో భవిష్యత్తులో బాక్సింగ్ రింగ్‌లో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్ స్పందించాడు. వరుస బౌట్లలో విజయాలతో దూసుకెళ్తోన్న విజేందర్‌ను చిన్నపిల్లాడితో పోల్చుతూ ట్వీట్ చేశాడు. విజేందర్ తన కోరిక(అమీర్‌తో బౌట్) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అంటే తనతో పోటీపడితే ఓడిపోవతావని పరోక్షంగా అమీర్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించాడు. తొలిసారి టైటిల్ నెగ్గిన విజేందర్కు శుభాకాంక్షలు తెలిపాడు. అభినందనతో పాటు విజేందర్ కు హెచ్చరికలు పంపాడు. పాక్ సంతతికి చెందిన అమీర్, విజేందర్ వెయిట్ కేటగిరిలు వేర్వేరు కావడంతో ఇప్పట్లో ఇద్దరి మధ్య మ్యాచ్ జరిగే అవకాశం లేదు. డబ్ల్యూబీఏ లైట్‌వెయిట్ ప్రపంచ చాంపియన్‌గా ఉన్న అమీర్, ఒలింపిక్స్‌లో ఓ రజతం కూడా సాధించాడు. గత శనివారం రాత్రి ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ బౌట్లో తాను సాధించిన అద్భుత విజయాన్ని బాక్సింగ్ గ్రేట్ మొహమ్మద్ అలీకి అంకితమిచ్చిన విజేందర్.. అమీర్ తో పోరుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. Congratulations to @boxervijender on the win. Careful what you wish for kid! https://t.co/HUwvjMeQCL — Amir Khan (@amirkingkhan) 18 July 2016 -
'అమీర్ ఖాన్తోపోరుకు సిద్ధం'
న్యూఢిల్లీ: అన్ని అనుకూలిస్తే పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్‌తో తలపడేందుకు తాను సిద్ధమేనని భారత మేటి బాక్సర్ విజేందర్ సింగ్ అన్నాడు. శనివారం రాత్రి ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ బౌట్లో తాను సాధించిన అద్భుత విజయాన్ని బాక్సింగ్ గ్రేట్ మొహమ్మద్ అలీకి అంకితమిచ్చిన విజేందర్ ఓ నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. ‘హోప్‌పై గెలుపుతో నా ర్యాంక్ మెరుగుపడింది. ప్రస్తుతం నేను టాప్-15లో ఉన్నా. కాబట్టి ఇక నుంచి మరింత కఠినమైన బౌట్లలో పాల్గొనాలి. ఇందుకోసం నేనూ సిద్ధంగా ఉన్నా. నా కోచ్, టీమ్‌తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా. ఇక బ్రిటిష్ బాక్సర్ అమీర్, నా వెయిట్ కేటగిరీల్లో తేడాలున్నాయి. అమీర్ బరువైనా పెరగాలి... లేదంటే నేనైనా తగ్గాలి. అప్పుడే మా ఇద్దరి మధ్య బౌట్ సాధ్యమవుతుంది. నేనైతే అతనితో బౌట్ జరగాలనే కోరుకుంటున్నా. అది కూడా భారత్‌లోనే జరగాలి’ అని విజేందర్ పేర్కొన్నాడు. ప్రస్తుతానికైతే విజేందర్ తర్వాతి బౌట్లో కామన్వెల్త్ చాంపియన్ ల్యూక్ బ్లాక్లెడ్జ్తో తలపడే అవకాశాలున్నాయి. -
అది వారినే అడగండి: విజేందర్ సింగ్
న్యూఢిల్లీ:డబ్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను సాధించిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్‌తో జరిగిన పది రౌండ్ల బౌట్లో ఏకపక్ష విజయం సాధించడం తన కెరీర్లోనే అతి పెద్ద విజయంగా విజేందర్ అభివర్ణించాడు. ' ఇదొక అద్భుత విజయం. అసలు ఈ పోరు గురించి ఏమీ చెప్పాలో కూడా తెలియడం లేదు. కానీ నా దేశానికి ఈ గెలుపు చాలా ముఖ్యం. సరైన ప్రణాళికలతో రింగ్ లోకి దిగడంతోనే హోప్‌పై విజయం సాధించాను. ఇప్పటివరకూ నేను ఎదుర్కొన్న బాక్సర్లలో హోప్ కఠిన ప్రత్యర్థి. అతనిపై విజయం అంత సులువుగా లభించలేదు. కాకపోతే చివరకు గెలవడం చాలా ఆనందాన్నిచ్చింది' అని విజేందర్ తన మనసులో ఆనందాన్ని పంచుకున్నాడు. కాగా, భారత్‌లో బాక్సింగ్ క్రీడపై ఈ విజయం ప్రభావం ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు విజేందర్ బదులిస్తూ... ఆ విషయం తనకు తెలియదన్నాడు. చాలామంది భారత ప్రజలు తన పోరును వీక్షించిన మాట వాస్తవమే అయినా, ఈ క్రీడ గురించి వారిని అడిగితేనే బాగుంటుందన్నాడు. అసలు బాక్సింగ్ క్రీడను భారత ప్రజలు ఇష్టపడతారా?లేదా? అనేది వారి ద్వారా మాత్రమే తెలుస్తుందన్నాడు. అయితే తన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించడంతో భారత్‌లో బాక్సింగ్ మరింత ముందుకెళుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. గత ఆరు బౌట్లలో ప్రత్యర్థులను నాకౌట్ చేసి జోరు మీదున్న విజేందర్... శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన బౌట్లో 98-92, 98-92, 100-90తో కెర్రీపై నెగ్గాడు. దీంతో ప్రపంచ ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరి మరిన్ని పెద్ద బౌట్లకు రంగం సిద్ధం చేసుకున్నాడు. -
ఈ టైటిల్ ఆ దిగ్గజానికి అంకితం
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ వరుస బౌట్లలో ప్రత్యర్థులను మట్టికరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రొఫెషనల్‌గా మారిన ఈ స్టార్ ఆటగాడు తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని సాధించాడు. శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కెర్రీ హోప్ (ఆస్ట్రేలియా)తో జరిగిన బౌట్లో విజయం సాధించి ‘డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్’ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ ను గతనెల మూడో తేదీన కన్నుమూసిన బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ అలీ కి అంకితమిస్తున్నట్లు విజేందర్ ప్రకటించాడు. ఈ తాజా బౌట్లో 98-92, 98-92, 100-90 తేడాతో కెర్రీపై నెగ్గడంతో ప్రపంచ ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరి మరిన్ని పెద్ద బౌట్లకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మూడు రౌండ్ల వరకూ బౌట్ హోరాహోరీగా సాగింది. అయితే నాలుగో రౌండ్లో విజేందర్ విసిరిన రైట్ హుక్ ప్రత్యర్థి కెర్రీ హోప్ ఎడమ కన్నుపై బలంగా తాకింది. అక్కడి నుంచి విజేందర్ బౌట్ లో చురుగ్గా కదులుతూ, డిఫెన్స్ కు ప్రాధాన్యమిస్తూ ప్రత్యర్థిపై సంచలన విజయాన్ని నమోదుచేశాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, క్రికెటర్లు యువరాజ్, రైనా, సెహ్వాగ్, బాక్సర్ మేరీకామ్, నటి నేహా ధూపియా, ఇతర ప్రముఖులు ఈ బౌట్‌ను తిలకించారు. -
నేడు విజేందర్ డబ్ల్యుబీవో టైటిల్ బౌట్
తొలిసారిగా భారత్‌లో బరిలోకి న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన అనంతరం విజేందర్ సింగ్ తొలిసారిగా స్వదేశంలో బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటిదాకా తలపడిన ఆరు బౌట్లలో ఓటమనేది లేకుండా దూసుకెళుతున్న ఈ స్టార్ నేడు (శనివారం) జరిగే డబ్ల్యుబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ బెల్ట్ కోసం పోటీపడనున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్ తన ప్రత్యర్థి. ‘ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆరేళ్ల అనంతరం ఢిల్లీలో పోటీకి దిగుతున్నాను. చివరిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నాను. నా శిక్షణ చాలా కఠినంగానే సాగింది. హోప్‌పై విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇందులో నెగ్గితే డబ్ల్యుబీవో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-15లో ఉంటాను. దీంతో ప్రపంచ టైటిళ్ల కోసం పోటీపడే అర్హత దక్కుతుంది’ అని 30 ఏళ్ల విజేందర్ తెలిపారు. త్యాగరాజ స్టేడియంలో జరిగే ఈ ఫైట్‌ను తిలకించేందుకు క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ, సినీ రంగానికి చెందినవారు కూడా హాజరుకానున్నారు. అలాగే ఈ ఫైట్‌కు ముందు మరో ఏడు ఇతర బౌట్స్ జరుగుతాయి. రా. గం. 7.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
అది నాకు బిగ్ డీల్ కాదు: విజేందర్
న్యూఢిల్లీ:తనకు డబ్యూబీవో ఆసియా టైటిల్ బౌట్ అనేది ఎంతమాత్రం బిగ్ డీల్ కాదని భారత ప్రొ బాక్సర్ విజేందర్ సింగ్ స్పష్టం చేశాడు. ఈ పోరును సాధారణ బౌట్ గా మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నట్లు విజేందర్ పేర్కొన్నాడు. తన కెరీర్ లో పాల్గొన్న బాక్సింగ్ బౌట్ ల మాదిరిగానే, డబ్యూబీవో బౌట్ ను కూడా చూస్తున్నట్లు తెలిపాడు. ' నేను వరుసగా ఆరు ప్రొ బాక్సింగ్ బౌట్లు గెలిచా. అదే తరహాలో ఇది నాకు మరొక బౌట్. ఇప్పుడు నేను ప్రొ బాక్సర్ ని. అలానే తదుపరి బౌట్ కు సిద్దమవుతున్నా' అని విజేందర్ అన్నాడు. శనివారం జరిగే పోరుతో తన బాక్సింగ్ కెరీర్ ఏమీ ముగిసిపోదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ తో జరిగే ఆ బౌట్ హోరాహోరీగా జరిగినా, మిగతా ఫైట్ తరహాలోనే ఈ పోరును కూడా చూస్తానన్నాడు. రింగ్ లోకి వెళ్లాక విజయంపైనే తన దృష్టి ఉంటుందన్నాడు. ఆ బౌట్ ముగిశాక మరో బౌట్ పై దృష్టిపెడతానని విజేందర్ పేర్కొన్నాడు. తన బౌట్లను ఉద్యోగంతో పోల్చిన విజేందర్.. ఈ పోరుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు తెలిపాడు. డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం జూలై 16న స్థానిక త్యాగరాజ స్టేడియంలో విజేందర్ -హోప్‌లు తలపడనున్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉన్న హోప్... ఇప్పటిదాకా తను 30 బౌట్లలో రెండు నాకౌట్లతో పాటు 23 విజయాలను సాధించాడు. -
'విజేందర్ కళ్లలో భయం చూశా'
న్యూఢిల్లీ: డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌తో తలపడబోతున్న ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ మాటల యుద్ధాన్ని ముమ్మరం చేశాడు. భారత్ లో విజేందర్ స్టార్ కావొచ్చని, కానీ తన వరకూ బాక్సర్ మాత్రమేనని గతంలో వ్యాఖ్యానించిన హోప్.. తనతో పోటీ పడే స్థాయి అతనికి లేదన్నాడు. 'విజయం సాధించాలనే ఆసక్తి విజేందర్‌లో చాలా ఎక్కువ. అయితే నా బౌట్లో అది వదులుకోవాల్సిందే. ఆ విషయం అతనికి, నాకు తెలుసు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విజేందర్ కళ్లలో భయం చూశా. నాతో పోరంటే విజేందర్ భయపడుతున్నాడు. వరుస విజయాలు అతను సాధిస్తూ ఉండవచ్చు. అసలైన ప్రొఫెషనల్ బాక్సింగ్ అంటే ఏమిటో విజేందర్కు చూపిస్తా' అని కెర్రీ హోప్ విజయంపై భరోసా వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ విజేందర్ సుదీర్ఘ రౌండ్ల పోరు ఆడిన సందర్భాలు చాలా తక్కువని హోప్ పేర్కొన్నాడు. ఆది నుంచి విజేందర్ పై ఒత్తిడి పెంచి అతని భరతం పడతానన్నాడు. స్వదేశంలో విజేందర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగుందని, అయితే అథ్లెట్‌కు కావాల్సింది అనుభవం మాత్రమేనన్న సంగతి గుర్తుంచుకోవాలన్నాడు. అభిమానుల సహకారం అనేది బాక్సింగ్‌లో అస్సలు పనిచేయదన్నాడు. కేవలం ఇద్దరు బాక్సర్లతో పాటు రిఫరీ మాత్రమే ఉండే రింగ్ లో విశేష అభిమానం ఎంతమాత్రం ఉపయోగపడదని చురకలంటించాడు. డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం జూలై 16న స్థానిక త్యాగరాజ స్టేడియంలో విజేందర్ -హోప్‌లు తలపడనున్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉన్న హోప్... ఇప్పటిదాకా తను 30 బౌట్లలో రెండు నాకౌట్లతో పాటు 23 విజయాలను సాధించాడు. -
డబ్ల్యూబీవో బౌట్లో విజేందర్ ప్రత్యర్థి ఖరారు
న్యూఢిల్లీ:ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో దూసుకుపోతున్న భారత బాక్సర్ విజేందర్ సింగ్ తన తదుపరి పోరులో భాగంగా సొంత ప్రేక్షకుల మధ్య ఆడనున్న డబ్ల్యూబీవోఆసియా టైటిల్ బౌట్ లో ప్రత్యర్థిని తాజాగా ఖరారు చేశారు. ఈనెల 16 వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో త్యాగరాజ స్టేడియంలో జరగునున్న డబ్యూబీవో బౌట్లో ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్ తో విజేందర్ తలపడనున్నాడు. ఇప్పటివరకూ విజేందర్‌తో చైనా బాక్సర్ తో కానీ, కొరియన్ బాక్సర్ తో కానీ తలపడే అవకాశం ఉందని భావించారు. అయితే యూరోపియన్ మాజీ చాంపియన్ కెర్రీతో విజేందర్ పోరును ఖరారు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. గత ఏడాది ప్రొఫెషన్ బాక్సింగ్‌లో అడుగుగపెట్టిన విజేందర్ వరుస ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి అప్రతిహతంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ ఆరు బౌట్లను నాకౌట్‌గా ముగించి విజేందర్ తన సత్తా చాటుకున్నాడు. మరోవైపు 30 బౌట్లకు గాను 23 బౌట్లలో విజయం సాధించిన కెర్రీ.. అందులో రెండింటిని మాత్రమే నాకౌట్‌గా గెలిచాడు. ఈ బౌట్‌పై కెర్రీ హోప్ స్పందించాడు. భారత్‌లో విజేందర్ సూపర్ స్టార్ కావొచ్చు. నా దృష్టిలో అతనొక బాక్సర్. అతను ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టి ఏడాది మాత్రమే అయ్యింది. నాకు అందులో 12 సంవత్సరాల అనుభవం ఉంది. భారత్ లో జరిగే ఈ పోరులో విజేందర్ కే మద్దతు ఉంటుందని నాకు తెలుసు. దాంతో నేను అండర్ డాగ్‌గానే బరిలోకి దిగుతాను. ఆ నేపథ్యంలో నాపై ఎటువంటి ఒత్తిడి ఉంటుంది. విజేందర్ పై ఒత్తిడి ఉంటుంది 'అని కెర్రీ తెలిపాడు. -
విజేందర్ డబ్యూబీవో బౌట్ వాయిదా
న్యూఢిల్లీ: భారత బాక్సర్ విజేందర్ సింగ్ తలపడబోయే డబ్ల్యుబీవో ఆసియా బౌట్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 11వ తేదీన ఈ బౌట్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాంచెస్టర్ లో విజేందర్ కు ప్రయాణ పరమైన సమస్యలు తలెత్తడంతో బౌట్ జూలై నెలకు వాయిదా పడింది. 'భారత్ లో జరిగే డబ్యూబీవో టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాను. నా అభిమానుల మధ్య తొలి బౌట్ లో తలపడబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ఆ బౌట్ లో నా అత్యుత్తమ ప్రతిభను కనబరచడానికి యత్నిస్తా. అప్పటివరకూ నా శిక్షణ కొనసాగుతూనే ఉంటుంది' అని విజేందర్ తెలిపాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే ఆ బౌట్లో చైనీస్ లేదా కొరియా బాక్సర్‌ను విజేందర్ ఎదుర్కొనే అవకాశం ఉంది. శుక్రవారం ఆంద్రెజ్ సోల్డ్రా (పోలండ్)తో జరిగిన బౌట్లో విజేందర్ సింగ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయాన్ని దక్కించుకుని ప్రొఫెషనల్ కెరీర్ లో ఆరో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. నిర్ణీత ఎనిమిది రౌండ్లపాటు జరగాల్సిన బౌట్ విజేందర్ ధాటికి ముచ్చటగా మూడో రౌండ్లోనే ముగిసింది. -
'ప్రత్యర్థికి హారర్ మూవీ చూపించాను'
లండన్: వరుస బౌట్లలో విజయాలతో భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ దూసుకుపోతున్నాడు. ఆంద్రెజ్ సోల్డ్రా (పోలండ్)తో శుక్రవారం జరిగిన బౌట్లో విజేందర్ సింగ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయాన్ని దక్కించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడాడు. తన ప్రత్యర్థి సోల్డ్రాకు ఈ బౌట్ లో హారర్ మూవీ చూపించానంటూ వ్యాఖ్యానించాడు. అందుకే ఎనిమిది రౌండ్లుండగా మూడో రౌండ్ లోనే అతడి పని అయిపోయిందని చెప్పాడు. ఈ గెలుపు తనకు మరింత కిక్ ఇచ్చిందని మరో బౌట్ కు సిద్ధమని ప్రకటించాడు. విజేందర్ ఇచ్చే పంచ్‌లకు సోల్డ్రా ఎదురు నిలువలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. వరుసగా ఆరో బౌట్ గెలవడంతో తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. సోల్డ్రా నుంచి ప్రతిఘటన ఎదురైనా, తన పంచ్ లతో మట్టి కరిపించి హారర్ సినిమా షో చూపించానని వ్యాఖ్యలుచేశాడు. అయితే జూన్ 11న ప్రపంచ బాక్సింగ్ ఆర్గరైజేషన్ వారు న్యూఢిల్లీలో ఆసియా టైటిల్ ను నిర్వహించనున్నారు. ఆ పోరులోనూ విజయం సాధించి స్వదేశంలో విజయాల ఖాతాను తెరవాలని ఆశపడుతున్నట్లు వివరించాడు. -
'అతడి బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తా'
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. ఆరో బౌట్ కు సిద్ధంగా ఉన్న విజేందర్ తన చివరి బౌట్ లో ఫ్రాన్స్‌కు చెందిన మటియోజ్ రోయర్ పై విజయం సాధించాడు. దీంతో అతను వరుసగా ఐదో టెక్నికల్ నాకౌట్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆటగాడయ్యాడు. తొలిసారి ఆరు రౌండ్ల బౌట్లో పాల్గొన్న విజేందర్ మరో రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచాడు. . ఆరో బౌట్ లో పోలాండ్ కు చెందిన ఆండ్రిజెజ్ సోల్డ్రాతో పోటీ పడనున్నాడు. ఆరో రౌండ్ మాత్రం అంత సులువుకాదంటూ అతడి ప్రత్యర్థి సవాలు చేస్తున్నాడు. బోల్టాన్ లోని ప్రీమియర్ సూట్ మాక్రాన్ స్టేడియంలో సోల్డ్రాతో తలపడేందుకు కసరత్తులు చేస్తున్నాడు. మొత్తం 14 రౌండ్లు ఆడిన విజేందర్ వరుసగా ఐదు విజయాలను సాధించాడు. ప్రత్యర్థి సోల్డ్రా మ్యాచ్ వీడియోలు చూశాను. ఆరో బౌట్ గెలవాలని తాను చాలా ఆసక్తిగా ఉన్నానని చెబుతండగా, తనలాంటి ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ కు ఇంతకుముందు ఎదురుకాలేదని బౌట్ రోజు తన సత్తా చూపిస్తానంటూ సవాల్ విసిరాడు. విజేందర్ బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తానంటూ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీంతో మే 13న జరగనున్న వీరి పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. -
జోరు కొనసాగిస్తాడా..?
⇒ నేడు బాక్సర్ విజేందర్ పోరు ⇒ తొలి రౌండ్లోనే ఓడిస్తా: ప్రత్యర్థి హోర్వత్ లివర్‌పూల్: గతేడాది ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విజేందర్ సింగ్‌కు ఇప్పటిదాకా ఓటమి లేదు. ఇప్పటిదాకా మూడు బౌట్లలో తలపడిన అతను అన్నీ నాకౌట్ విజయాలనే సాధించి అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ బాక్సర్ నేడు (శనివారం) నాలుగో ఫైట్‌కు సిద్ధమవుతున్నాడు. అతనికి ఈ ఏడాది ఇదే తొలి ఫైట్ అవడంతో ఇప్పటిదాకా కనబరిచిన జోరునే మరోసారి చూపి సీజన్‌ను విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాడు. ఇక ఈ బౌట్లో విజేందర్ ప్రత్యర్థిగా హంగేరికి చెందిన అలెగ్జాండర్ హోర్వత్ బరిలోకి దిగుతున్నాడు. విజేందర్కన్నా అతను అనుభవశాలి. అలాగే ఈ పోటీ కోసం పటిష్టంగా తయారయ్యేందుకు పాము ర క్తం తీసుకుంటున్నట్టు 20 ఏళ్ల హోర్వత్ ఇప్పటికే ప్రకటించి ఆసక్తిని మరింత పెంచాడు. ఏడు ఫైట్లలో తలపడిన ఈ యువ బాక్సర్ ఐదింటిలో నెగ్గాడు. అలాగే 31 రౌండ్లపాటు ఆడిన అనుభవం ఉంది. అందుకే ఈ బౌట్‌ను అంత తేలిగ్గా తీసుకోవడం ఇష్టం లేని 30 ఏళ్ల విజేందర్ కూడా రోజుకు 10 గంటలపాటు ప్రాక్టీస్‌తో చెమటోడ్చుతున్నాడు. నిజానికి ఈ బౌట్ గత నెలలోనే జరగాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. నా విజయాల రికార్డును కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకే హోర్వత్పై పైచేయి సాధించడమే కాకుండా ఆ తర్వాత హారోలో జరిగే ఫైట్ కూడా నెగ్గి భారత్‌లో టైటిల్ పోరుకు సిద్ధమవ్వాలి. హోర్వత్ కచ్చితంగా గట్టి పోటీదారు. నాకన్నా అనుభవం కలిగి ఉన్నా నా పంచ్‌లకు అతడు ఎక్కువ సేపు రింగ్‌లో నిలబడడనే అనుకుంటున్నాను’ అని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు హోర్వత్ కూడా ఇంతే ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్నాడు. తన ముందు విజేందర్ గట్టి ప్రత్యర్థే కాదని అంటున్నాడు. అతడికి మూడు విజయాలే ఉన్నా, తనకు ఐదున్నాయని గుర్తుచేశాడు. ‘ఇంతకుముందు విజేందర్ బౌట్స్ను వీడియోలో చూశాను. నా ప్రణాళికలు అతడికి బాక్సింగ్ అంటే ఏంటో నేర్పుతాయి. అతడిలో కొన్ని బలహీనతలు గమనించాను. మొదటి లేక రెండో రౌండ్లోనే మట్టికరిపించి స్వదేశానికి వెళ్లే ముందు తొలి ఓటమిని అందిస్తాను’ అని హోర్వత్ సవాల్ విసిరాడు. -
'నా పంచ్ పవర్ రుచి చూపిస్తాను'
న్యూఢిల్లీ: తన తర్వాతి గేమ్ లో ప్రత్యర్థికి పంచ్ పవర్ రుచి చూపిస్తానని భారత బాక్సర్ విజేందర్ సింగ్ వ్యాఖ్యానించాడు. రెగ్యులర్ బాక్సింగ్ నుంచి ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఓటమనేది లేకుండా ముందుకు సాగుతున్నాడు ఈ భారత బాక్సర్. లివర్ పూల్ లో శనివారం హంగేరికి చెందిన బాక్సర్ అలెగ్జాండర్ హోవర్త్ తో విజేందర్ తలపడనున్నాడు. ఈ సందర్భంగా మీడియా బాక్సర్ తో కాసేపు ముచ్చటించింది. గేమ్ సన్నాహకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంది. 'నా ప్రతిభను చూపించాల్సిన సమయం. రేపటి మ్యాచ్ కు ఎంతగానో కృషి చేశాను. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. బౌట్ లో ప్రత్యర్థికి తన పంచ్ పవర్ రుచి చూపిస్తాను' అని విజేందర్ పేర్కొన్నాడు. అమెచ్యూర్ బాక్సింగ్ కెరీర్ అద్భుతంగా సాగుతుందని, 75 కేజీల విభాగంలో ఇప్పటికే మూడు బౌట్స్ గెలిచిన విషయాన్ని హర్యానా బాక్సర్ గుర్తుచేశాడు. గత బౌట్ లో ఇంగ్లండ్ బాక్సర్ సోని వైటింగ్ ను మూడో రౌండ్ లో ఓడించాడు. ప్రత్యర్థి ఐదు బౌట్స్ గెలిచాడని, మీపై ఒత్తిడి లేదా అని మీడియా ప్రశ్నించింది. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో తాను అంతగా సీనియర్ బాక్సర్ కాదని, అయినా మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తానన్నాడు. భారత్ లో తన విజయం కోసం ప్రార్థించే అభిమానుల కోసమైనా ఈ బౌట్ గెలుస్తానని చెప్పాడు. -
నా నరాల్లో పామురక్తం...మాజికల్ పవర్ నా సొంతం
హంగరీ: బాక్సింగ్ లో బారతీయ ఆటగాడిని ఎలాగైనా ఓడించాలనే తపనతో హంగేరియన్ బాక్సర్ అష్టకష్టాలు పడుతున్నాడు. భారత బాక్సర్ ఒలంపిక్ విజేత, పద్మశ్రీ, విజయేంద్ర సింగ్ ను ఎదర్కోవడానికి హంగరీ బాక్సర్ అలెగ్జాండెర్ హోర్వాత్(20) తన డైట్ లో సాంప్రదాయ పద్ధతులను ఫాలో అవుతున్నాడట. పాము రక్తాన్ని తాగుతున్నానని, దీంతో తన పవర్ పంచ్ లతో ఇక అతనికి సరైన గుణపాఠం చెబుతానంటున్నాడు. బాక్సింగ్ రింగ్ లో విజయేంద్ర సింగ్ తో తలపడేందుకు పాము రక్తాన్ని తాగుతున్నాడు. పాము తాజా రక్తాన్ని తాగడం ద్వారా తన శరీరాన్ని మరింత ధృఢంగా శక్తివంతంగా తయారు చేసుకోవాలని అతని ప్లాన్. పాము రక్తాన్ని సేవించడం వల్ల అద్భుతమైన శక్తి సామర్ధ్యాలను సాధించ వచ్చని హంగేరియన్లు నమ్ముతారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం సైనికుల్లో కూడా అమల్లో ఉంది. అనేక శతాబ్దాలుగా తన కుటుంబంలో తాజా పాము రక్తాన్ని తాగడం సంప్రదాయం గా కొనసాగుతోందని స్వయంగా అలెగ్జాండర్ తెలిపాడు. ఇది తనకు చాలా గర్వకారణమని, దాని మాజికల్ పవర్ ను మాటల్లో చెప్పలేనన్నాడు. పాము రక్తం తన నరాల్లో ప్రవహిస్తున్నంతసేపు తనకిక ఎదురే ఉండదని, తన ప్రధాన ప్రత్యర్థి విజయేందర్ ను మట్టికరిపిస్తానని వ్యాఖ్యానించాడు. కాగా మార్చి 12 న భారతీయ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తో హంగేరియన్ బాక్సర్ అలెగ్జాండర్ తలపడనున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో మూడు విజయాల తర్వాత విజయేందర్ కు ఇది నాల్గవ పోటీ. అటు అలెగ్జాండర్ తనకు గట్టి పోటి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అతణ్ని ఓడించడం పెద్దకష్టం కాదని విజయేందర్ ఇప్పటికే ప్రకటించాడు. -
విజేందర్ నాల్గో బౌట్ వాయిదా
మాంచెస్టర్: ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో వరుసగా మూడు విజయాలు సాధించి దూసుకుపోతున్న భారత బాక్సర్ విజేందర్ సింగ్ నాల్గో బౌట్ ఆకస్మికంగా వాయిదా పడింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం డబ్యూబీవో వరల్డ్ లైట్ వెయిట్ చాంపియన్ టెర్రీ ఫ్లానాగాన్-విజేందర్‌ల మధ్య నాల్గో బౌట్ ఫిబ్రవరి 23 వ తేదీన జరగాల్సి ఉంది. కాగా, వరల్డ్ టైటిల్ పోరులో భాగంగా డెర్రీ మాథ్యూస్ తలపడిన మ్యాచ్ లో టెర్రీ ఫ్లానాగాన్ గాయపడ్డాడు. దీంతో ఆ బౌట్ ను మార్చి 12కు వాయిదా వేశారు. దీనిపై విజేందర్ మాట్లాడుతూ.. నాల్గో బౌట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు. బౌట్ అర్థాంతరంగా వాయిదా పడటంతో నిరాశ చెందినట్లు పేర్కొన్నాడు. ఆ బౌట్ లో కూడా విజయం సాధించాలనే కసితో ఉన్న తాను ప్రస్తుతం తీవ్రమైన ప్రాక్టీస్ లో నిమగ్నమైనట్లు పేర్కొన్నాడు. -
మూడు రౌండ్లలోనే ముగిస్తా: విజేందర్
అనుభవజ్ఞుడైన సమిట్ హుసినోవ్ (హంగేరి)ని ఓడించడానికి తనకు అదనపు రౌండ్లు అవసరం లేదని భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ అన్నాడు. శనివారం రాత్రి జరిగే తన మూడో బౌట్లో విజేందర్... హుసినోవ్తో తలపడనున్నాడు. ఈ బౌట్ ఆరు రౌండ్ల పాటు జరుగుతుంది. అయితే గత రెండు బౌట్లలో ప్రత్యర్థులను మూడు రౌండ్లలోనే నాకౌట్ చేసిన విజేందర్ ఈసారి కూడా దాన్నే పునరావృతం చేస్తానని చెబుతున్నాడు. -
ప్రొ బాక్సింగ్‌ను అభివృద్ధి చేస్తా..
విజేందర్ సింగ్ న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారి సత్తా చూపిస్తున్న విజేందర్ సింగ్ భారత్‌లోనూ ఈ తరహా ఆటను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాడు. దీంట్లో భాగంగా కేంద్ర క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్‌ను శుక్రవారం విజేందర్ కలిశాడు. ‘నా ప్రొఫెషనల్ కెరీర్‌కు ఎంతగానో మద్దతు ఇచ్చిన మంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపాను. భవిష్యత్‌లోనూ నాకు ఇలాగే తోడ్పడుతానని చెప్పారు. అలాగే భారత్‌లోనూ ప్రొ బాక్సింగ్‌ను అభివృద్ధి చేసే ప్రణాళికల గురించి చర్చించాను. ఈ విషయంలో ఆయన చాలా సానుకూలంగా స్పందించడం సంతోషాన్నిచ్చింది. అమెచ్యూర్ కెరీర్లో ఉన్న బాక్సర్లు ముందుకు వచ్చి ప్రొగా మారితే వారి భవిష్యత్ బాగుంటుంది. ఈ విషయంలో వారికి నా మద్దతు ఉంటుంది. అలాగే భారత్‌లో అమెచ్యూర్ బాక్సింగ్ పరిస్థితి గురించి నా ఆందోళన మంత్రికి తెలిపాను. రియో ఒలింపిక్స్‌కు వారు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు’ అని విజేందర్ తెలిపాడు. -
మరిన్ని విజయాలు సాధిస్తా: విజేందర్
డబ్లిన్: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించిన భారత అగ్రశ్రేణి బాక్సర్ విజేందర్ సింగ్ ఇదే ఉత్సాహంతో దూసుకెళ్తానని చెప్పాడు. ‘ప్రొఫెషనల్ కెరీర్లో ఒక్కో మెట్టెక్కుతున్నాను. నిలకడతో మరిన్ని విజయాలు సాధిస్తాను. నా తొలి ప్రొఫెషనల్ మ్యాచ్ అనంతరం మెరుగవుతానని చెప్పాను. రెండో పోటీలో అనుకున్నట్లే పరిణతి సాధించాను’ అని విజేందర్ అన్నాడు. శనివారం జరిగిన బౌట్లో ప్రత్యర్థి డీన్ జిలెన్ను విజేందర్ కేవలం తొలి రౌండ్లోనే ఓడించిన సంగతి తెలిసిందే. -
రెండో బౌట్ కు విజేందర్ సిద్ధం
డబ్లిన్: ప్రొఫెషనల్ కెరీర్ అరంగేట్రం బౌట్‌లోనే అదరగొట్టిన భారత బాక్సర్ విజేందర్ సింగ్(30) రెండో బౌట్‌కు సిద్ధమయ్యాడు. శనివారం రాత్రి బ్రిటన్‌కు చెందిన 33 ఏళ్ల డీన్ జిలెన్తో తలపడేందుకు విజేందర్ సన్నద్ధమవుతున్నాడు. గురువారం భారత ప్రమోటర్ నీరవ్ తోమర్, ట్రైనర్ లీ బీర్డ్ తో కలిసి డబ్లిన్ కు చేరుకున్న విజేందర్.. ఈసారి పోరులో అద్భుత విజయాన్ని సాధించి ఐరిష్ అభిమానులను అలరించాలనే యోచనలో ఉన్నాడు. దీనిలో భాగంగానే ట్రైనర్ లీ బీర్డ్ తో కలిసి ముమ్మర ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యాడు. గత నెల్లో మాంచెస్టర్ ఎరీనాలో సోనీ వైటింగ్ జరిగిన తొలి బౌట్లో విజేందర్ మూడో రౌండ్లోనే గెలిచి అందర్నీ దృష్టిని ఆకర్షించాడు. తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్ లో మరో విజయాన్నిసొంతం చేసుకోవాలని విజేందర్ ఉవ్విళ్లూరుతున్నాడు. గత మేలో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన జిలెన్ ఆడిన రెండు బౌట్లలో విజయం సాధించి ఊపు మీద ఉన్నాడు. దీంతో విజేందర్- జిలెన్ ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. -
'నా తదుపరి ఫైట్ పైనే దృష్టి'
లండన్: ప్రొఫెషనల్ బాక్సింగ్ పోరులో భాగంగా వచ్చే వారం డబ్లిన్ లో జరిగే తన రెండో బౌట్ పైనే పూర్తిగా దృష్టి నిలిపినట్లు భారత బాక్సర్ విజేందర్ సింగ్ స్పష్టం చేశాడు. గురువారం(అక్టోబర్ 29) నాడు ముఫ్పైవ ఒడిలోకి అడుగుపెట్టిన విజేందర్.. ఈ పుట్టిన రోజు వేడుకలకు భారత్ లోని స్నేహితులతో పాటు తన సహచరులను మిస్ అవుతున్నట్లు పేర్కొన్నాడు. ఇక్కడ బాక్సర్లు, ట్రైనర్లు తన కోసం ప్రత్యేక కేక్ ను తయారు చేయించి అభినందలు తెలిపారని ఆనందం వ్యక్తం చేశాడు. డబ్లిన్ లో ఉన్న భారత దేశ ప్రజల నుంచి తనకు సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. 'వచ్చే శనివారం జరిగే రెండో బౌట్ కోసం ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యా. ఇప్పుడు నా తదుపరి దృష్టి ఆ పోరుపైనే. గత రాత్రి హౌజ్ ఆఫ్ కామన్స్ లో ఎంపీ కైత్ వేత్ ను కలిశా. నేను రెండో బౌట్ లో విజయం సాధించాలని కోరుతూ ముందుగా ఆయన నుంచి అభినందలను అందుకున్నా' అని విజేందర్ తెలిపాడు. నవంబర్ ఏడవ తేదీన డబ్లిన్ జరిగే పోరులో బ్రిటన్‌కు చెందిన డీన్ జిలెన్ తో విజేందర్ తలపడతాడు. విజేందర్ సింగ్ పాల్గొనబోయే రెండో బౌట్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 30న తేదీన ఇరువురి మధ్య పోరు జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ బౌట్ నవంబర్ 7 వ తేదీకి వాయిదా పడింది. -
విజేందర్ రెండో బౌట్ వాయిదా
లండన్: ప్రొఫెషనల్ బాక్సింగ్ లో భాగంగా భారత బాక్సర్ విజేందర్ సింగ్ పాల్గొనబోయే రెండో బౌట్ వాయిదా పడింది. ముందు నిర్ణయించిన తేదీ ప్రకారం అక్టోబర్ 30న బ్రిటన్‌కు చెందిన డీన్ జిలెన్ - విజేందర్ సింగ్ ల మధ్య బాక్సింగ్ పోరు జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ బౌట్ నవంబర్ 7 వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని విజేందర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. అంతకుముందు జరిగిన బాక్సింగ్ పోరులో బ్రిటన్ బాక్సర్ సన్నీ వైటింగ్ పై వి జేందర్ టెక్నికల్ నాకౌట్ లో విజయం సాధించి మంచి ఉత్సాహంతో ఉన్నాడు. ఆ ఫైట్ లో విజేందర్ తిరుగులేని గెలుపుని సొంతం చేసుకుని తాను ప్రొఫెషనల్ బాక్సర్ గా మారడం సరైందేనని నిరూపించాడు. My fight is postponed its on 7 nov in Dublin — Vijender Singh (@boxervijender) October 26, 2015 -
వారెవ్వా... విజేందర్
భారత బాక్సర్ శుభారంభం అరంగేట్రంలోనే అదుర్స్ ప్రొఫెషనల్ కెరీర్లో తొలి గెలుపు వైటింగ్పై టెక్నికల్ నాకౌట్ విజయం మాంచెస్టర్ సిటీ: అమెచ్యూర్ బాక్సింగ్‌ను వదిలి ప్రొఫెషనల్ కెరీర్లో అడుగుపెట్టాలని తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ నిరూపించాడు. తన ప్రొఫెషనల్ కెరీర్లో బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే ఈ హరియానా బాక్సర్ విజయం రుచి చూశాడు. అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. బ్రిటన్ బాక్సర్ సన్నీ వైటింగ్‌తో శనివారం రాత్రి జరిగిన మిడిల్‌వెయిట్ బౌట్లో విజేందర్ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో జయభేరి మోగించాడు. మూడు నిమిషాల నిడివి గల నాలుగు రౌండ్లు జరగాల్సిన బౌట్ విజేం దర్ ధాటికి మూడో రౌండ్లోనే ముగిసింది. బౌట్‌కు ముందు తన మాటలతో చెలరేగినవైటింగ్ రింగ్‌లో మాత్రం విజేందర్ పంచ్‌ల వర్షానికి తట్టుకోలేకపోయాడు. మూడో రౌండ్లో రెండున్నర నిమిషాలకే చేతులెత్తేశాడు. విజేందర్ పంచ్‌ల ధాటికి వైటింగ్ తాళలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. పక్కా ప్రణాళికతో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన విజేందర్ మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థి వైటింగ్పై ఆధిపత్యం చలాయించాడు.ఈనెల 30న విజేందర్ తన రెండో ప్రొఫెషనల్ బౌట్లో తలపడతాడు. ‘ప్రొఫెషనల్ బాక్సింగ్ నాకు కొత్తది. దీని కోసం నేను చాలా కష్టపడ్డాను. ఇది ఆరంభం మాత్రమే. నన్ను ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు’ అని బౌట్ అనంతరం విజేందర్ వ్యాఖ్యానించాడు. -
ఆ పంచ్ లో పవర్ సూపర్!
మాంచెస్టర్: ప్రొఫెషనల్ బాక్సర్ గా శనివారం తొలిసారి రింగ్ లోకి దిగబోతున్న భారత క్రీడాకారుడు విజేందర్ సింగ్ పై అతనికి శిక్షణ అందిస్తున్న బ్రిటీష్ ట్రైనర్ లీ బీర్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. విజేందర్ సింగ్ పంచ్ లో ఓ పవర్ ఉందంటూ కొనియాడాడు. విజేందర్ టెక్నీకల్ గా చాలా పరిణితి చెందిన బాక్సరే కాకుండా అతనిలో సహజసిద్ధమైన ప్రతిభ దాగి వుందన్నాడు. 'విజేందర్ పంచ్ గురించి అతని కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. అతని పంచ్ లో సూపర్ పవర్ ఉంది. దాంతో పాటు చాలా తెలివైన బాక్సర్. అతనిపై నాకు చాలా అంచనాలే ఉన్నాయి' అంటూ లీ బీర్డ్ స్పష్టం చేశాడు. రేపు మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ బాక్సర్ వైటింగ్ తో తో విజేందర్ తలపడనున్నాడు. ఇప్పటికే ప్రొఫెషనల్ బాక్సర్ గా వైటింగ్ కు 2-1 రికార్డు ఉంది. రాత్రి 10.20 ని.లకు సోనీ సిక్స్ లో ప్రసారం కానున్నఈ పోరులో విజేందర్ విజయం సాధించాలంటూ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ముందుగా శుభాకాంక్షలు తెలిపాడు. -
విజేందర్కు హర్యానా ప్రభుత్వ మద్దతు
చండీగఢ్: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాలనుకున్న విజేందర్ సింగ్‌కు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. తమ అనుమతి లేకుండా విజేందర్ ప్రొఫెషనల్‌గా మారరాదని అతను ఉద్యోగిగా ఉన్న పోలీస్ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయంలో సహకారం కోరుతూ విజేందర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశాడు. లండన్ వెళ్లి ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో భాగమయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అతను సీఎంకు విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ అంశంలో తాము నిబంధనలకు అనుగుణంగానే పని చేస్తామని, ప్రభుత్వంనుంచి ఏదైనా ఆదేశాలు వస్తే పాటిస్తామని హర్యానా డీజీపీ వైపీ సింఘాల్ స్పష్టం చేశారు. -
హర్యానా సీఎంను కలిసిన విజేందర్
చండీగఢ్: ప్రొఫెషనల్ గా మారిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ గురువారం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశాడు. సీఎం అధికార నివాసంలో అరగంట పాటు మనోహర్ లాల్ తో మంతనాలు జరిపాడు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అమెచ్యూర్ నుంచి ప్రొఫెషనల్ గా మారే క్రమంలో నిబంధనలు పాటించాలని విజేందర్ కు సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుంటే డీఎస్పీ హోదాలో ఉన్న విజేందర్ పై చర్య తీసుకుంటామని హర్యారా పోలీసు విభాగం హెచ్చరించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అమెచ్యూర్ కెరీర్ కు స్వస్తి చెప్పిన ఈ హర్యానా బాక్సర్ లండన్ లోని క్వీన్స్ బెర్రీ ప్రమోషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసింది. -
'పద్మభూషణ్' కోసం రచ్చకెక్కిన మరో ఆటగాడు!
న్యూఢిల్లీ:' పద్మ' అవార్డుల అంశం కేంద్రానికి మరింత తలనొప్పిగా మారింది. భారత నంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఉదంతానికి ముగింపు పలికి కొన్ని గంటలు అయ్యిందో లేదో తన పేరును కూడా పద్మ భూషణ్ అవార్డు కోసం సిఫార్సు చేయాలంటూ బాక్సర్ విజేందర్ రచ్చకెక్కాడు. తనకు పద్మభూషణ్ ఇవ్వాలంటూ ఈ అథ్లెటిక్ పట్టుబడుతున్నాడు. ఈ మేరకు కేంద్ క్రీడా మంత్రిత్వ శాఖకు లేఖ పంపాడు. విజేందర్ సింగ్ 2008 జరిగిన ఒలింపిక్స్ లో కాంస్యం సాధించాడు. అంతకుముందు సైనా నెహ్వాల్ తన పేరును ఖరారు చేయకపోవడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటు తరువాత కేంద్ర క్రీడల శాఖ స్వయంగా కల్పించుకుని ఆమె పేరును పద్మ భూషణ్ అవార్డుకు ప్రతిపాదించింది. -
గుండె లోతుల్లో నుంచి అనిపిస్తేనే...
హిందీ చలనచిత్ర సీమలో ఇటీవల అందరినీ ఆకర్షిస్తున్న నటి - సోనాక్షీ సిన్హా. ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాల్లో వంద కోట్ల వసూళ్ళు సాధించిన ‘మసాలా’ సినిమాలు అనేకం. సల్మాన్ ఖాన్ ‘దబంగ్’ (తెలుగు ‘గబ్బర్ సింగ్’కు మాతృక)తో సినీ రంగానికి వచ్చిన ఆమె ఆ తరువాత వరుసగా ‘రౌడీ రాథోడ్’, ‘బుల్లెట్ రాజా’, ‘ఆర్... రాజ్‌కుమార్’, ‘దబంగ్ 2’, ‘సన్ ఆఫ్ సర్దార్’ చిత్రాల్లో అలరించారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చే నెల మొదటి వారంలో రానున్న ‘హాలీడే - ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ’ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన ఆమె కనిపించనున్నారు. ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాకు కుమార్తె అయిన సోనాక్షి అదృష్టం ఇప్పుడు ఎంతలా ఉందంటే, ఆమె ఏ సినిమాలో నటిస్తే అది వసూళ్ళ వాన కురిపిస్తోంది. ఇక, ఆమె ఇమేజ్ ఎంత వరకు పాకిందంటే, చివరకు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రజనీకాంత్ కొత్త సినిమా ‘లింగ’లో కూడా ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు. బాక్సాఫీస్ వసూళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టే సినీ రంగంలో సోనాక్షీ సిన్హా ఇప్పుడు అభినయ ప్రధాన చిత్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. ‘‘ఓ పక్కన వంద కోట్లు వసూలు చేసే భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూనే, మరో పక్కన ‘లూటేరా’ లాంటి అభినయ ప్రధాన చిత్రాలు చేయాలని ఉంది. ఈ రెంటికీ మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నా’’ అని సోనాక్షి తన మనసులో మాట వెల్లడించారు. ‘‘నా మటుకు నాకు ‘లూటేరా’ లాంటి మరిన్ని సినిమాల్లో నటించాలని ఉంది. కానీ, అలాంటి సమగ్రమైన స్క్రిప్టులు చాలా అరుదుగా వస్తాయి. అందుకే, ఇప్పుడు ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నా. స్క్రిప్టు వినగానే, ఈ సినిమా చేయాలని నా గుండె లోతుల్లో నుంచి అనిపిస్తేనే, ఓకే చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. ‘‘అలాగని మసాలా సినిమాలంటే నాకు ద్వేషమేమీ లేదు. వాటిని చూడడమన్నా, అందులో నటించడమన్నా ఇష్టమే. కాకపోతే, వాటికీ, అభినయ ప్రధాన చిత్రాలకూ మధ్య సమతూకం పాటించాలనే నా తపన’’ అన్నారామె. రానున్న ‘హాలీడే’ చిత్రంలో పట్టణ ప్రాంత కాలేజీ అమ్మాయిగా నటిస్తున్న ఆమె... కథలో భాగంగా బాక్సర్‌గా కనిపిస్తారు. బడిలో చదువుకొనే రోజుల నుంచి ఆటలన్నా, అందులోనూ బాక్సింగ్ క్రీడ అన్నా ఇష్టమైన సోనాక్షి ఈ సీరియస్ థ్రిల్లింగ్ చిత్రంలోని తన పాత్ర మనసుకు ఎంతో నచ్చిందన్నారు. అన్నట్లు ఈ పాత్రపోషణ కోసం ప్రముఖ భారతీయ బాక్సింగ్ యోధుడు విజేందర్ సింగ్ నుంచి కొన్ని మెలకువలు కూడా నేర్చుకున్నారు. ఆ సంగతి ఆమె ఆనందంగా చెప్పారు. ఎంతైనా... మనసుకు నచ్చిన పాత్ర, సినిమా వస్తే ఏ నటికైనా, నటుడికైనా అంతకన్నా ఇంకేం కావాలి! -
ఆటగాళ్లకు ఇక 'లక్ష్మీ' కటాక్షం లేదు
లక్ష్మి ఇక ఆటగాళ్లను కరుణించదు. వాళ్ల బాధలేవో వాళ్లే పడాలి ఇక. అవును. ఉక్కు పరిశ్రమతో ప్రపంచమంతటా పేరుపొందిన లక్ష్మీ మిత్తల్ ఇక క్రీడాకారులను స్పాన్సర్ చేయడం లేదు. ఇప్పటి వరకూ వివిధ ఆటల్లో ఆటగాళ్లను స్పాన్సర్ చేయడానికి దాదాపు ఎనభై కోట్లు ఖర్చుపెట్టిన లక్ష్మీ మిత్తల్ ఛాంపియన్స్ ట్రస్ట్ ఇక తెరమరుగు కానుంది. దీంతో ఇప్పటి వరకూ ట్రెయినింగ్ నుంచి, ఎక్విప్ మెంట్ దాకా, కోచ్ నుంచి ఫిజియో దాకా అయ్యే ఖర్చును ఆటగాళ్లో లేక కల్మాడీలకు కేరాఫ్ అయిన క్రీడా సంఘాలో భరించాలి. దీంతో రాబోయే ఒలింపిక్స్ తయారీల్లో ఆటగాళ్లకు చాలా పెద్ద చిక్కే వచ్చి పడింది. లక్ష్మీ మిత్తల్ ఛాంపియన్స్ ట్రస్ట్ 2005 నుంచి ఇప్పటి దాకా దాదాపు 40 మంది ఆటగాళ్లను స్పాన్సర్ చేసింది. అందులో 16 గురు కంచు నుంచి కనకం దాకా వివిధ మెడల్స్ గెలుచుకున్నారు. అందులో షూటర్ అభినవ్ బింద్రా, యోగేశ్వర్ దత్త, బాక్సర్ విజేందర్ సింగ్, బాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ లు ఉన్నారు. ఈ విజయగాధ బీజింగ్ నుంచి లండన్ దాకా కొనసాగింది. కానీ రాబోయే ఒలింపిక్స్ సంగతేమిటన్నది మాత్రం ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. సరైన క్రీడా వ్యవస్థలు, ప్రణాళికలు, వ్యూహాలు లేని మన దేశంలో స్టార్ ప్లేయర్లున్నా వనరులు, వసతులు లేక, భుజం తట్టేవారు లేక ఇబ్బందులు పడుతున్నాం. లక్ష్మీ మిత్తల్ ఛాంపియన్స్ ట్రస్ట్ ఈ లోటును పూరించింది. ఇప్పుడు వివిధ కారణాల వల్ల లక్ష్మీ మిత్తల్ డబ్బు సంచీలను ముడి బిగించేయడంతో క్రికెట్టేతర ఆటలు, ఆటగాళ్లు ఇబ్బందుల్లో పడటం ఖాయం. -
విజేందర్ శుభారంభం
అల్మాటీ (కజకిస్థాన్): డ్రగ్స్ వివాదం నేపథ్యంలో కొన్నాళ్లపాటు ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ హర్యానా బాక్సర్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల 75 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో విజేందర్ 3-0తో (30-27, 30-26, 30-26) హ్యాంపస్ హెన్రిక్సన్ (స్వీడన్)పై గెలిచాడు. 2009 ఈవెంట్లో విజేందర్ కాంస్య పతకం నెగ్గి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన భారత తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. ‘ఇక్కడకు వచ్చినప్పటి నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాను. రెండు రోజులుగా మందులు వాడుతున్నాను. తొలి రౌండ్లో గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. శారీరకంగా బలహీనంగా ఉన్నా మానసికంగా దృఢంగా ఉండాలని ఈ బౌట్‌కు ముందు కోచ్‌లు చెప్పారు. నేను సానుకూల దృక్పథంతో బరిలోకి దిగి విజయాన్ని అందుకున్నాను ’ అని విజేందర్ వ్యాఖ్యానించాడు. శనివారం జరిగే రెండో రౌండ్లో యూరోపియన్ చాంపియన్ జాసన్ క్విగ్లీ (ఐర్లాండ్)తో విజేందర్ పోటీపడనున్నాడు. శుక్రవారం జరిగే పోటీల్లో ఇద్దరు భారత బాక్సర్లు బరిలోకి దిగనున్నారు. కెడ్డీ ఆగ్నెస్ (సీషెల్స్)తో మన్‌ప్రీత్ (91 కేజీలు); ఫాతి కెలెస్ (టర్కీ)తో మనోజ్ కుమార్ (64 కేజీలు) తలపడతారు.