న్యూఢిల్లీ: భారత బాక్సర్ విజేందర్ సింగ్ తలపడబోయే డబ్ల్యుబీవో ఆసియా బౌట్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 11వ తేదీన ఈ బౌట్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాంచెస్టర్ లో విజేందర్ కు ప్రయాణ పరమైన సమస్యలు తలెత్తడంతో బౌట్ జూలై నెలకు వాయిదా పడింది. 'భారత్ లో జరిగే డబ్యూబీవో టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాను. నా అభిమానుల మధ్య తొలి బౌట్ లో తలపడబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ఆ బౌట్ లో నా అత్యుత్తమ ప్రతిభను కనబరచడానికి యత్నిస్తా. అప్పటివరకూ నా శిక్షణ కొనసాగుతూనే ఉంటుంది' అని విజేందర్ తెలిపాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే ఆ బౌట్లో చైనీస్ లేదా కొరియా బాక్సర్‌ను విజేందర్ ఎదుర్కొనే అవకాశం ఉంది.
శుక్రవారం ఆంద్రెజ్ సోల్డ్రా (పోలండ్)తో జరిగిన బౌట్‌లో విజేందర్ సింగ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయాన్ని దక్కించుకుని ప్రొఫెషనల్ కెరీర్ లో ఆరో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. నిర్ణీత ఎనిమిది రౌండ్‌లపాటు జరగాల్సిన బౌట్ విజేందర్ ధాటికి ముచ్చటగా మూడో రౌండ్‌లోనే ముగిసింది.
విజేందర్ డబ్యూబీవో బౌట్ వాయిదా
Published Sat, May 14 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement