WBO
-
డబ్ల్యూబీవో బౌట్లో విజేందర్ ప్రత్యర్థి ఖరారు
న్యూఢిల్లీ:ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో దూసుకుపోతున్న భారత బాక్సర్ విజేందర్ సింగ్ తన తదుపరి పోరులో భాగంగా సొంత ప్రేక్షకుల మధ్య ఆడనున్న డబ్ల్యూబీవోఆసియా టైటిల్ బౌట్ లో ప్రత్యర్థిని తాజాగా ఖరారు చేశారు. ఈనెల 16 వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో త్యాగరాజ స్టేడియంలో జరగునున్న డబ్యూబీవో బౌట్లో ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్ తో విజేందర్ తలపడనున్నాడు. ఇప్పటివరకూ విజేందర్‌తో చైనా బాక్సర్ తో కానీ, కొరియన్ బాక్సర్ తో కానీ తలపడే అవకాశం ఉందని భావించారు. అయితే యూరోపియన్ మాజీ చాంపియన్ కెర్రీతో విజేందర్ పోరును ఖరారు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. గత ఏడాది ప్రొఫెషన్ బాక్సింగ్‌లో అడుగుగపెట్టిన విజేందర్ వరుస ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి అప్రతిహతంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ ఆరు బౌట్లను నాకౌట్‌గా ముగించి విజేందర్ తన సత్తా చాటుకున్నాడు. మరోవైపు 30 బౌట్లకు గాను 23 బౌట్లలో విజయం సాధించిన కెర్రీ.. అందులో రెండింటిని మాత్రమే నాకౌట్‌గా గెలిచాడు. ఈ బౌట్‌పై కెర్రీ హోప్ స్పందించాడు. భారత్‌లో విజేందర్ సూపర్ స్టార్ కావొచ్చు. నా దృష్టిలో అతనొక బాక్సర్. అతను ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టి ఏడాది మాత్రమే అయ్యింది. నాకు అందులో 12 సంవత్సరాల అనుభవం ఉంది. భారత్ లో జరిగే ఈ పోరులో విజేందర్ కే మద్దతు ఉంటుందని నాకు తెలుసు. దాంతో నేను అండర్ డాగ్‌గానే బరిలోకి దిగుతాను. ఆ నేపథ్యంలో నాపై ఎటువంటి ఒత్తిడి ఉంటుంది. విజేందర్ పై ఒత్తిడి ఉంటుంది 'అని కెర్రీ తెలిపాడు. -
విజేందర్ డబ్యూబీవో బౌట్ వాయిదా
న్యూఢిల్లీ: భారత బాక్సర్ విజేందర్ సింగ్ తలపడబోయే డబ్ల్యుబీవో ఆసియా బౌట్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 11వ తేదీన ఈ బౌట్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాంచెస్టర్ లో విజేందర్ కు ప్రయాణ పరమైన సమస్యలు తలెత్తడంతో బౌట్ జూలై నెలకు వాయిదా పడింది. 'భారత్ లో జరిగే డబ్యూబీవో టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాను. నా అభిమానుల మధ్య తొలి బౌట్ లో తలపడబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ఆ బౌట్ లో నా అత్యుత్తమ ప్రతిభను కనబరచడానికి యత్నిస్తా. అప్పటివరకూ నా శిక్షణ కొనసాగుతూనే ఉంటుంది' అని విజేందర్ తెలిపాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే ఆ బౌట్లో చైనీస్ లేదా కొరియా బాక్సర్‌ను విజేందర్ ఎదుర్కొనే అవకాశం ఉంది. శుక్రవారం ఆంద్రెజ్ సోల్డ్రా (పోలండ్)తో జరిగిన బౌట్లో విజేందర్ సింగ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయాన్ని దక్కించుకుని ప్రొఫెషనల్ కెరీర్ లో ఆరో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. నిర్ణీత ఎనిమిది రౌండ్లపాటు జరగాల్సిన బౌట్ విజేందర్ ధాటికి ముచ్చటగా మూడో రౌండ్లోనే ముగిసింది. -
'ప్రత్యర్థికి హారర్ మూవీ చూపించాను'
లండన్: వరుస బౌట్లలో విజయాలతో భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ దూసుకుపోతున్నాడు. ఆంద్రెజ్ సోల్డ్రా (పోలండ్)తో శుక్రవారం జరిగిన బౌట్లో విజేందర్ సింగ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయాన్ని దక్కించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడాడు. తన ప్రత్యర్థి సోల్డ్రాకు ఈ బౌట్ లో హారర్ మూవీ చూపించానంటూ వ్యాఖ్యానించాడు. అందుకే ఎనిమిది రౌండ్లుండగా మూడో రౌండ్ లోనే అతడి పని అయిపోయిందని చెప్పాడు. ఈ గెలుపు తనకు మరింత కిక్ ఇచ్చిందని మరో బౌట్ కు సిద్ధమని ప్రకటించాడు. విజేందర్ ఇచ్చే పంచ్‌లకు సోల్డ్రా ఎదురు నిలువలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. వరుసగా ఆరో బౌట్ గెలవడంతో తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. సోల్డ్రా నుంచి ప్రతిఘటన ఎదురైనా, తన పంచ్ లతో మట్టి కరిపించి హారర్ సినిమా షో చూపించానని వ్యాఖ్యలుచేశాడు. అయితే జూన్ 11న ప్రపంచ బాక్సింగ్ ఆర్గరైజేషన్ వారు న్యూఢిల్లీలో ఆసియా టైటిల్ ను నిర్వహించనున్నారు. ఆ పోరులోనూ విజయం సాధించి స్వదేశంలో విజయాల ఖాతాను తెరవాలని ఆశపడుతున్నట్లు వివరించాడు.