'ప్రత్యర్థికి హారర్ మూవీ చూపించాను' | this fight was a horror show for him, says vijender singh | Sakshi
Sakshi News home page

'ప్రత్యర్థికి హారర్ మూవీ చూపించాను'

Published Sat, May 14 2016 11:18 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

'ప్రత్యర్థికి హారర్ మూవీ చూపించాను'

'ప్రత్యర్థికి హారర్ మూవీ చూపించాను'

లండన్: వరుస బౌట్లలో విజయాలతో భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ దూసుకుపోతున్నాడు. ఆంద్రెజ్ సోల్డ్రా (పోలండ్)తో శుక్రవారం జరిగిన బౌట్‌లో విజేందర్ సింగ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయాన్ని దక్కించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడాడు. తన ప్రత్యర్థి సోల్డ్రాకు ఈ బౌట్ లో హారర్ మూవీ చూపించానంటూ వ్యాఖ్యానించాడు. అందుకే ఎనిమిది రౌండ్‌లుండగా మూడో రౌండ్ లోనే అతడి పని అయిపోయిందని చెప్పాడు. ఈ గెలుపు తనకు మరింత కిక్ ఇచ్చిందని మరో బౌట్ కు సిద్ధమని ప్రకటించాడు.


విజేందర్ ఇచ్చే పంచ్‌లకు సోల్డ్రా ఎదురు నిలువలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. వరుసగా ఆరో బౌట్ గెలవడంతో తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. సోల్డ్రా నుంచి ప్రతిఘటన ఎదురైనా, తన పంచ్ లతో మట్టి కరిపించి హారర్ సినిమా షో చూపించానని వ్యాఖ్యలుచేశాడు. అయితే జూన్ 11న ప్రపంచ బాక్సింగ్ ఆర్గరైజేషన్ వారు న్యూఢిల్లీలో ఆసియా టైటిల్ ను నిర్వహించనున్నారు. ఆ పోరులోనూ విజయం సాధించి స్వదేశంలో విజయాల ఖాతాను తెరవాలని ఆశపడుతున్నట్లు వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement