Paris Olympics 2024: భారత యువ షూటర్ మనూ భాకర్ చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా మూడు వ్యక్తిగత పతకాలు గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా ఈ హర్యానా అమ్మాయి నిలుస్తుందని భావించగా.. నిరాశే మిగిలింది.
కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మనూ... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యం కైవసం చేసుకుంది. తాజాగా.. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలోనూ పతక రేసులో మనూ నిలిచింది.
అయితే, ఆదిలో కాస్త వెనుకబడ్డా.. తర్వాత తిరిగి పుంజుకున్న మనూ.. కాంస్య పతకానికి చేరువగా వచ్చింది. అయితే, మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన ఎలిమినేషన్ ప్లే ఆఫ్‌లో దురదృష్టవశాత్తూ మనూ ఓడిపోయింది. ఏదేమైనా అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే రెండు మెడల్స్ గెలిచిన మనూ భారతీయలు మనసులు గెలుచుకుంది.
మనూ ప్రయాణం సాగిందిలా..
👉మొత్తం 3 సిరీస్‌లు- 5 షాట్ల చొప్పున మొత్తం 15 షాట్లు
👉తొలి సిరీస్
👉శుభారంభం అందుకోలేకపోయిన మనూ..
👉ఐదింటిలో రెండు సఫలం
👉ఆరు పాయింట్లతో రేసులోకి వచ్చిన మనూ.. 8 పాయింట్లతో టాప్‌లో సౌత్ కొరియా షూటర్
👉రెండో సిరీస్
👉ఐదింటిలో 4 సఫలం.. రెండోస్థానానికి చేరిన మనూ
👉తొలి ఎలిమినేషన్- యూఎస్‌ఏ షూటర్ కేటలిన్ మోర్గాన్ రేసు నుంచి అవుట్
👉ఆరోస్థానానికి పడిపోయిన మనూ భాకర్
👉మూడో సిరీస్
👉ఐదింటిలో ఐదూ సఫలం.. మూడో స్థానంలోకి మనూ భాకర్
👉ఇరానియన్ షూటర్ రోస్తమియాన్ అవుట్..రెండో స్థానంలో మనూ
👉ఐదింట నాలుగు సఫలం- రెండో స్థానంలోనే మనూ
👉చైనా షూటర్ నాన్ జావో ఎలిమినేట్
👉మూడో స్థానానికి పడిపోయిన మనూ
👉మూడో స్థానం కోసం జరిగిన షూట్ ఆఫ్‌లో మనూ ఓటమి
👉నాలుగోస్థానంలో సరిపెట్టుకున్న మనూ
👉కాంస్య పతక రేసు నుంచి కూడా మనూ అవుట్
నాలుగో స్థానంలో
సౌత్ కొరియా షూటర్ జిన్ యాంగ్‌కు స్వర్ణం
ఫ్రాన్స్ షూటర్ కమిలె జెద్రెజెజ్‌వ్స్కికి రజతం
హంగేరీ షూటర్ వెరోనికాకు కాంస్యం
నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న మనూ భాకర్
భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు గెలిచిన క్రీడాకారులు వీరే
👉మనూ భాకర్- షూటింగ్- రెండు కాంస్యాలు- ప్యారిస్ ఒలింపిక్స్-2024
👉నార్మన్ ప్రిచర్డ్(బ్రిటిష్- ఇండియన్)- అథ్లెటిక్స్- రెండు రజతాలు- ప్యారిస్ ఒలింపిక్స్- 1900 పారిస్
👉సుశీల్ కుమార్- రెజ్లింగ్- ఒక కాంస్యం, ఒక రజతం- బీజింగ్ ఒలింపిక్స్- 2008, లండన్ ఒలింపిక్స్- 2012
👉పీవీ సింధు- బ్యాడ్మింటన్- ఒక రజతం, ఒక కాంస్యం- రియో ఒలింపిక్స్- 2016, టోక్యో ఒలింపిక్స్- 2020
Comments
Please login to add a commentAdd a comment