విశ్వ క్రీడల్లో భారత షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి ఇండియన్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ మహిళల విభాగంలో 22 ఏళ్ల మనూ కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.
మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్లో
తద్వారా భారత్‌కు ఈ ఎడిషన్‌లో తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా మనూ నిలిచింది. తాజాగా మంగళవారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. దక్షిణ కొరియా జోడీని ఓడించి ఈ జంట మెడల్‌ను కైవసం చేసుకుంది.
124 ఏళ్ల క్రితం
ఈ క్రమంలో భారత్ తరఫున ఒలింపిక్స్ సింగిల్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన మనూ.. ఈ ఘనత అందుకున్న ప్యూర్ ఇండియన్‌గా రికార్డులకెక్కింది. అంతకు ముందు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటిష్- ఇండియన్ నార్మన్ ప్రిచార్డ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్‌లో రజతాలు సాధించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున 124 ఏళ్ల తర్వాత హరియాణా అమ్మాయి మనూ భాకర్ ఈ రికార్డు బద్దలు కొట్టింది.
చదవండి: నాడు కోచ్‌తో మనూ గొడవ.. శాపం పోయిందంటూ రాణా సంతోషం
THE HISTORIC MOMENT! 🇮🇳
Manu Bhakar and Sarabjot Singh wins clinching the bronze medal in the #Shooting double event! 🥉
- #ManuBhaker becomes the first Indian woman to win multiple medals at an Olympics. 🫡❤️#IndiaAtParis2024 #ManuBhakar pic.twitter.com/DSSwilaFdp— Ashish 𝕏|.... (@Ashishtoots) July 30, 2024
Comments
Please login to add a commentAdd a comment