Olympics 2024 Day 4: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ రెండో పతకం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్‌లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్ జోడీ మనూ భాకర్- సరబ్‌జోత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్ మెడల్ అందించారు.
దక్షిణ కొరియా జోడీ(జిన్ ఓయె–లీ వన్‌హో)ని 16-10తో ఓడించి పతకం సాధించారు. ఈ క్రమంలో మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్‌గా నిలిచింది. కాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఆమె కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.
సరబ్‌జోత్‌కు తొలి మెడల్
మరోవైపు.. పురుషుల వ్యక్తిగత విభాగంలో త్రుటిలో ఫైనల్ అవకాశాలు చేజార్చుకున్న సరబ్‌జోత్‌కు మిక్స్‌డ్ ఈవెంట్లో మాత్రం లక్ కలిసి వచ్చింది. పేలవంగా ఆరంభించినా మనూ ఆది నుంచే ఆకట్టుకోవడంతో కొరియన్ జంటను ఓడించగలిగారు. ఫలితంగా మనూ ఖాతాలో రెండో పతకం చేరగా.. సరబ్‌జోత్ తొలి మెడల్‌ను ముద్దాడాడు.
ఇక సోమవారం పతకం కోసం బరిలోకి దిగిన షూటర్లలో అర్జున్ బబూతా నాలుగో స్థానంలో నిలిచి దురదృష్టవశాత్తూ కాంస్యం చేజార్చుకోగా, రమిత ఏడో స్థానంతో నిరాశగా వెనుదిరిగిన విషయం తెలిసిందే.
THE HISTORIC MOMENT! 🇮🇳
Manu Bhakar and Sarabjot Singh wins clinching the bronze medal in the #Shooting double event! 🥉
- #ManuBhaker becomes the first Indian woman to win multiple medals at an Olympics. 🫡❤️#IndiaAtParis2024 #ManuBhakar pic.twitter.com/DSSwilaFdp— Ashish 𝕏|.... (@Ashishtoots) July 30, 2024
BREAKING: India WIN Bronze medal 🔥🔥🔥
Manu Bhaker & Sarabjot Singh beat Korean pair 16-10 in 10m Air Pistol Mixed team event to win India's 2nd medal in Paris. #Paris2024 #Paris2024withIAS pic.twitter.com/G2XcZRgpoN— India_AllSports (@India_AllSports) July 30, 2024
Comments
Please login to add a commentAdd a comment