న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ప్రముఖ భారత బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు
కాగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు విజేందర్ సింగ్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం పార్టీ అధిష్టానం ఈ యువ బాక్సర్‌ను దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. అయితే, ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓడిపోయారు.
అయితే ఈ సారి విజేందర్‌ను సింగ్ దక్షిణ ఢిల్లీ నుంచి కాకుండా ఉత్తర్ ప్రదేశ్లోని మధుర లోక్‌సభ అభ్యర్ధిగా బరిలోకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో బాక్సర్ విజేందర్ సింగ్ బీజేపీలో చేరడంతో ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఇక మధుర నుంచి నుంచి బీజేపీ తరపున నటి హేమమాలని పోటీ చేస్తున్నారు. ఇప‍్పటికే ఆమె 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు. అయితే హేమమాలినికి చెక్ పెట్టేందుకు జాట్ వర్గం ప్రభావం ఎక్కువ ఉండి, అదే వర్గానికి చెందిన విజేందర్‌ను లోక్‌సభ అభ్యర్ధిగా దించాలని కాంగ్రెస్ పెద్దలు భావించారు. కానీ అనూహ్యంగా విజేందర్ సింగ్ బీజేపీలో చేరడం ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. జాట్ వర్గం ప్రభావం ఎక్కువగా చూపే హర్యానా, పశ్చిమ యూపీలలో బాక్సర్ విజేందర్ సింగ్ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment