Rahul Gandhi Bharat Jodo Yatra Special Guest Priyanka Pet Luna - Sakshi
Sakshi News home page

Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రలో ప్రత్యేక అతిథి.. ల్యూనా ఫొటోలు వైరల్..

Published Sat, Jan 7 2023 6:20 PM | Last Updated on Sat, Jan 7 2023 8:12 PM

Rahul Gandhi Bharat Jodo Yatra Special Guest Priyanka Pet Luna - Sakshi

చండీగఢ్‌: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అయితే హరియాణలో రాహుల్ శనివారం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ ప్రత్యేక అతిథి కన్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

ఈ అతిథి ఎవరో కాదు.. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ పెంపుడు శునకం ల్యూనా. ఇదంటే రాహుల్‌కు ఎంతో ఇష్టమట. అందుకే ఆయనతో పాటు పాదయాత్రలో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్, ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

ఎట్టకేలకు భారత్ జోడో యాత్ర 100 రోజులు దాటిన తర్వాత ల్యూనాను ఆహ్వానించారు. అని ప్రియాంక ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. కాంగ్రెస్ కూడా ఈ ఫొటోలను షేర్ చేసింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఇతరులపై చూపిస్తున్న ప్రేమను చూసి ఇక తాను కూడా భాగం కావాలనుకొని ల్యూనా పాదయాత్రకు వచ్చిందని ‍ట్వీట్ చేసింది.

హర్యానాలో రాహుల్ యాత్రలో బాక్సర్, ఒలింపిక్స్ పతక విజేత విజేందర్ సింగ్ కూడా పాల్గొన్నారు.  ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్ టీ షర్టులో కన్పించిన విషయం గురించి అడిగారు. అందుకు రాహుల్ బుదిలిస్తూ.. తాను రుషి, మునిలా ఓ తపస్సులో ఉ‍న్నట్లు పేర్కొన్నారు.
చదవండి: 'ఆ విషయం తెలిస్తే రౌత్‌ను ఉద్ధవ్ థాక్రే చెప్పుతో కొడతారు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement