
శ్రీనగర్: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లో సోమవారం ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది కాంగ్రెస్. భారీ సభకు ఏర్పాట్లు చేసింది.
అయితే కశ్మీర్‌లో సోమవారం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి మంచు వర్షం కురుస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం చూసి రాహల్ గాంధీ చిన్నపిల్లాడిలా మారిపోయారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి మంచులో ఆటలాడుకున్నారు. ఒకరిపై ఒకరు మంచు పెల్లలు విసురుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూడా రాహుల్ మంచు విసిరి ఆహ్లాదంగా, సంతోషంగా గడిపారు. రాహుల్, ప్రియాంక మళ్లీ చిన్న పిల్లల్లా మారిపోవడం చూసి కార్యకర్తలు మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
शीन मुबारक! 😊pic.twitter.com/V9Y8jCf0MS
— Congress (@INCIndia) January 30, 2023
చదవండి: త్రిపుర ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి కొత్త సవాల్!