డబ్ల్యూబీవో బౌట్లో విజేందర్ ప్రత్యర్థి ఖరారు | Vijender to face ex-Euro champ Kerry Hope in WBO title bout | Sakshi
Sakshi News home page

డబ్ల్యూబీవో బౌట్లో విజేందర్ ప్రత్యర్థి ఖరారు

Published Mon, Jun 6 2016 3:17 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

డబ్ల్యూబీవో బౌట్లో విజేందర్ ప్రత్యర్థి ఖరారు

డబ్ల్యూబీవో బౌట్లో విజేందర్ ప్రత్యర్థి ఖరారు

న్యూఢిల్లీ:ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో దూసుకుపోతున్న భారత బాక్సర్ విజేందర్ సింగ్  తన తదుపరి పోరులో భాగంగా సొంత ప్రేక్షకుల మధ్య ఆడనున్న డబ్ల్యూబీవోఆసియా టైటిల్ బౌట్ లో ప్రత్యర్థిని తాజాగా ఖరారు చేశారు. ఈనెల 16 వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో త్యాగరాజ స్టేడియంలో జరగునున్న డబ్యూబీవో బౌట్లో ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్ తో విజేందర్ తలపడనున్నాడు. ఇప్పటివరకూ విజేందర్తో చైనా బాక్సర్ తో కానీ, కొరియన్ బాక్సర్ తో కానీ  తలపడే అవకాశం ఉందని భావించారు. అయితే యూరోపియన్ మాజీ చాంపియన్ కెర్రీతో విజేందర్ పోరును ఖరారు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.


గత ఏడాది ప్రొఫెషన్ బాక్సింగ్లో అడుగుగపెట్టిన విజేందర్ వరుస ఆరు మ్యాచ్ల్లో గెలిచి అప్రతిహతంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ ఆరు బౌట్లను నాకౌట్గా ముగించి విజేందర్ తన సత్తా చాటుకున్నాడు. మరోవైపు 30 బౌట్లకు గాను 23 బౌట్లలో విజయం సాధించిన కెర్రీ.. అందులో రెండింటిని మాత్రమే నాకౌట్గా గెలిచాడు. ఈ బౌట్పై కెర్రీ హోప్ స్పందించాడు.  భారత్లో విజేందర్ సూపర్ స్టార్ కావొచ్చు. నా దృష్టిలో అతనొక బాక్సర్. అతను ప్రొఫెషనల్ బాక్సింగ్లో అడుగుపెట్టి ఏడాది మాత్రమే అయ్యింది. నాకు అందులో 12 సంవత్సరాల అనుభవం ఉంది. భారత్ లో జరిగే ఈ పోరులో విజేందర్ కే మద్దతు ఉంటుందని నాకు తెలుసు. దాంతో నేను అండర్ డాగ్గానే బరిలోకి దిగుతాను. ఆ నేపథ్యంలో నాపై ఎటువంటి ఒత్తిడి ఉంటుంది. విజేందర్ పై ఒత్తిడి ఉంటుంది 'అని కెర్రీ తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement