
ట్రైనర్ లీ బీర్డ్ తో కలిసి విజేందర్ ప్రాక్టీస్(ఫైల్)
ప్రొఫెషనల్ కెరీర్ అరంగేట్రం బౌట్‌లోనే అదరగొట్టిన భారత బాక్సర్ విజేందర్ సింగ్(30) రెండో బౌట్‌కు సిద్ధమయ్యాడు.
డబ్లిన్: ప్రొఫెషనల్ కెరీర్ అరంగేట్రం బౌట్‌లోనే అదరగొట్టిన భారత బాక్సర్ విజేందర్ సింగ్(30) రెండో బౌట్‌కు సిద్ధమయ్యాడు. శనివారం రాత్రి బ్రిటన్‌కు చెందిన 33 ఏళ్ల డీన్ జిలెన్‌తో తలపడేందుకు విజేందర్ సన్నద్ధమవుతున్నాడు. గురువారం భారత ప్రమోటర్ నీరవ్ తోమర్, ట్రైనర్ లీ బీర్డ్ తో కలిసి డబ్లిన్ కు చేరుకున్న విజేందర్.. ఈసారి పోరులో అద్భుత విజయాన్ని సాధించి ఐరిష్ అభిమానులను అలరించాలనే యోచనలో ఉన్నాడు. దీనిలో భాగంగానే ట్రైనర్ లీ బీర్డ్ తో కలిసి ముమ్మర ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యాడు.
గత నెల్లో మాంచెస్టర్ ఎరీనాలో సోనీ వైటింగ్ జరిగిన తొలి బౌట్‌లో విజేందర్ మూడో రౌండ్‌లోనే గెలిచి అందర్నీ దృష్టిని ఆకర్షించాడు. తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్ లో మరో విజయాన్నిసొంతం చేసుకోవాలని విజేందర్ ఉవ్విళ్లూరుతున్నాడు. గత మేలో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన జిలెన్ ఆడిన రెండు బౌట్‌లలో విజయం సాధించి ఊపు మీద ఉన్నాడు. దీంతో విజేందర్- జిలెన్ ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.