
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ మరో ప్రత్యర్థిని మట్టికరిపించే పనిలో పడ్డాడు. వచ్చేనెల 22న తన తదుపరి బౌట్ కోసం కసరత్తు చేస్తున్నాడు. ప్రత్యర్థి ఇంకా ఖరారు కానప్పటికీ... దుబాయ్‌లో ఈ బాక్సింగ్ పోరు జరగనుంది. ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో భారత బాక్సర్‌ది దుర్బేధ్యమైన రికార్డు. ఇప్పటి వరకు పాల్గొన్న 11 బౌట్లలో విజేందర్‌దే విజయం. ఇందులో ఏకంగా ఎనిమిది మందిని నాకౌట్ చేయడం మరో విశేషం.
ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అరంగేట్రం నుంచి అద్భుతాలు చేస్తున్న విజేందర్ అందుకు అనుగుణంగానే రాటుదేలుతున్నాడు. ప్రస్తుతం మాంచెస్టర్‌లో ఉన్న ఈ మిడిల్ వెయిట్ బాక్సర్ తదుపరి బౌట్ కోసం చెమటోడ్చుతున్నాడు. ట్రెయినర్ లీ బర్డ్‌తో కలిసి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. అ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ ‘నా ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. దీన్ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగించాలనుకుంటున్నాను. దుబాయ్‌లో నా అభిమానులు ఆశించే పోరాటాన్నే కనబరుస్తాను. నా శక్తి సామార్థ్యాల్ని చాటేందుకు ప్రొఫెషనల్ సర్క్యూట్ చక్కని అవకాశాన్ని కల్పించింది. నా జైత్రయాత్రను ఇలాగే కొనసాగించి మెల్లగా ప్రపంచ టైటిల్‌పై దృష్టిసారిస్తా’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment