
భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ స్వల్ప విరామం తర్వాత స్వదేశంలో మరో ప్రొ బాక్సింగ్ బౌట్‌లో తలపడనున్నాడు. ఆగస్టులో రాయ్‌పూర్ వేదికగా తొలిసారి జరిగే ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన విజేందర్ 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు. వరుసగా 12 బౌట్లలో గెలిచాడు ప్రస్తుతం మాంచెస్టర్‌లో శిక్షణ పొందుతున్నానని రాయ్‌పూర్ బౌట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని విజేందర్ చెప్పాడు.