Pro boxing
-
తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టనున్న స్టార్ బాక్సర్
భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ స్వల్ప విరామం తర్వాత స్వదేశంలో మరో ప్రొ బాక్సింగ్ బౌట్లో తలపడనున్నాడు. ఆగస్టులో రాయ్‌పూర్ వేదికగా తొలిసారి జరిగే ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన విజేందర్ 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు. వరుసగా 12 బౌట్లలో గెలిచాడు ప్రస్తుతం మాంచెస్టర్‌లో శిక్షణ పొందుతున్నానని రాయ్‌పూర్ బౌట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని విజేందర్ చెప్పాడు. -
రేపు వికాస్-నిక్సన్‌ల ప్రొ బాక్సింగ్ బౌట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఏఐబీఏ), ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారత్ లో నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ బాక్సింగ్ పోరుకు రంగం సిద్ధమైంది. 75 కేజీల విభాగంలో శనివారం ఇక్కడ జరిగే భారత బాక్సర్ వికాస్ క్రిషన్తో కెన్యా బాక్సర్ నిక్సన్ అబాకా తలపడనున్నాడు. ప్రపంచ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత, ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత అయిన వికాస్ రేపు జరిగే ఆరు రౌండ్ల బౌట్లో నిక్సన్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇది తనకు ఒక గొప్పఅవకాశమని పేర్కొన్న వికాస్.. ఇందులో విజయం సాధించడమే తన ముందున్న లక్ష్యమని స్ప ష్టం చేశాడు. మరోవైపు ఏఐబీఏ ప్రొ బాక్సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ మిర్కో వూల్ఫ్ వికాస్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఏపీబీ పోటీల్లో పాల్గొంటున్న వికాస్ ఒక తెలివైన బాక్సర్ ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్ ద్వారా వికాస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాడన్నారు. -
అతనికి హారర్ షో చూపిస్తా!
బోల్టాన్: శుక్రవారం జరగనున్న తన ఆరో ప్రొఫెషనల్ ఫైట్‌లో విజయంపై దీమాతో ఉన్నాడు విజేందర్ సింగ్. ఇప్పటివరకు పాల్గొన్న ఐదు బౌట్లలో అన్నింటినీ టెక్నికల్ నాకౌట్ ద్వారా గెలుచుకున్న విజేందర్.. తొలిసారిగా సోల్డ్రాతో తలపడనున్న ఎనిమిది రౌండ్ల పోరు కోసం భారీగా కసరత్తులు చేసినట్లు వెల్లడించాడు. 'తొలి సారిగా ఎనిమిది రౌండ్ల పోరులో తలపడుతున్నాను. దీని కోసం ఓర్పుగా ఎక్కువ సమయం రింగ్‌లో సామర్థ్యం మేర రాణించడంపై దృష్టి పెట్టాను. రోజురోజుకూ కఠినమైన శిక్షణ పొందుతున్నాను. ఈ బౌట్లో విజయం ద్వారా నా ప్రొ బాక్సింగ్ కెరీర్‌ను 6-0కు తీసుకెళ్లాలనుకుంటున్నాను' అని విజేందర్ గురువారం వెల్లడించాడు. అయితే ఆరో రౌండ్లో తలపడనున్న ప్రత్యర్థి.. పోలాండ్‌కు చెందిన సోల్డ్రా మాత్రం రేపు విజేందర్కు హారర్ షో చూపిస్తానంటూ హెచ్చరికలు పంపాడు. అమెచ్యూర్ కేటగిరీలో పాల్గొన్న 98 ఫైట్లలో 82 విజయాలు సాధించిన సోల్డ్రా.. ప్రొ బాక్సింగ్ కెరీర్లో సైతం 16 ఫైట్లలో 12 విజయాలు సాధించి మంచి రికార్డుతోనే ఉన్నాడు. ఇప్పటికే విజేందర్ బొక్కలిరగ్గొడతానంటూ వ్యాఖ్యలు చేసిన సోల్డ్రా ఫైట్‌పై ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే. అయితే తుదిపోరులో సోల్డ్రా రాణిస్తాడా.. లేక గతంలో విజేందర్‌ను మట్టికరిపించేందుకు పామురక్తం తాగానంటూ వ్యాఖ్యానించి చివరికి రింగ్‌లో చేతులెత్తేసిన అలెగ్జాండర్ హోర్వత్ మాదిరిగానే తోకముడుస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. -
దేశం కోసం ఆడటం గౌరవం
తాను శక్తి ఉన్నంత వరకూ భారత్ తరఫునే బరిలోకి దిగుతానని అర్జున అవార్డీ మన్ దీప్ జంగ్రా స్పష్టం చేశాడు. బాక్సింగ్ లో తన సీనియర్ విజయేందర్ ఈ నెలలో ప్రొఫెషనల్ బాక్సింగ్ అరంగేట్రం పై స్పందించిన మన్ దీప్.. సీనియర్ గా విజయేందర్ పై చాలా గౌరవం ఉందని అన్నాడు. అతడి ఆట చూస్తూనే పెరిగాం అని గుర్తుచేసుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా రాణించాలనేది అతడి వ్యక్తిగత నిర్ణయం అని అన్నాడు. కానీ.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవ మని..చెప్పాడు. విజయేందర్ క్వీన్స్ బెర్రీ ప్రమోషన్స్ తో ఒప్పందం వల్ల ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆడే అవకాశం వచ్చిందని తెలిపాడు. తాను ఇలాంటి ఆఫర్ ను తిరస్కరిస్తానని స్పష్టం చేశాడు. డబ్బు కోసం ఆడటం కంటే.. దేశం కోసం తనకు సంతోషాన్ని ఇస్తుందని అన్నాడు.