తాను శక్తి ఉన్నంత వరకూ భారత్ తరఫునే బరిలోకి దిగుతానని అర్జున అవార్డీ మన్ దీప్ జంగ్రా స్పష్టం చేశాడు. బాక్సింగ్ లో తన సీనియర్ విజయేందర్ దారిలో నడవనని తెలిపాడు.
తాను శక్తి ఉన్నంత వరకూ భారత్ తరఫునే బరిలోకి దిగుతానని అర్జున అవార్డీ మన్ దీప్ జంగ్రా స్పష్టం చేశాడు. బాక్సింగ్ లో తన సీనియర్ విజయేందర్ ఈ నెలలో ప్రొఫెషనల్ బాక్సింగ్ అరంగేట్రం పై స్పందించిన మన్ దీప్.. సీనియర్ గా విజయేందర్ పై చాలా గౌరవం ఉందని అన్నాడు. అతడి ఆట చూస్తూనే పెరిగాం అని గుర్తుచేసుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా రాణించాలనేది అతడి వ్యక్తిగత నిర్ణయం అని అన్నాడు. కానీ.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవ మని..చెప్పాడు.
విజయేందర్ క్వీన్స్ బెర్రీ ప్రమోషన్స్ తో ఒప్పందం వల్ల ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆడే అవకాశం వచ్చిందని తెలిపాడు. తాను ఇలాంటి ఆఫర్ ను తిరస్కరిస్తానని స్పష్టం చేశాడు. డబ్బు కోసం ఆడటం కంటే.. దేశం కోసం తనకు సంతోషాన్ని ఇస్తుందని అన్నాడు.