Arjuna awards
-
హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ఖేల్‌రత్న’ అవార్డు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ అర్జున, ఖేల్‌రత్న, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది. మార్పులు లేకుండా దాదాపు ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘ఖేల్‌రత్న’ పేరు కోసం ప్రతిపాదించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. హర్మన్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మనూ భాకర్ పేరు ఖేల్‌రత్న జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న ప్లేయర్‌గా మరో చర్చ లేకుండా ‘ఖేల్ రత్న’ అవార్డుకు ఆమె అర్హురాలు. అయితే మనూ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. దానిని మనూ తండ్రి రామ్‌కిషన్ ఖండించారు. తాను సరైన ఫార్మాట్లోనే అప్లికేషన్ అందించామని స్పష్టం చేశారు. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోయినా ... ప్రదర్శనను బట్టి అవార్డుకు ఎంపిక చేసే అధికారం జ్యూరీకి ఉంది. కాబట్టి మనూ సాధించిన ‘డబుల్ ఒలింపిక్ మెడల్’ ఘనతను బట్టి చూస్తే ఆలస్యంగానైనా ఆమె పేరు ఈ జాబితాలో చేరవచ్చు. ‘అర్జున’ జాబితాలో 30 మంది కమిటీ ప్రతిపాదించిన ‘అర్జున’ అవార్డీల జాబితాలో 13 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, మరో 17 మంది పారా ఆటగాళ్లు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న అమన్ (రెజ్లింగ్), సరబ్జోత్, స్వప్నిల్ కుసాలే (షూటింగ్) పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పారా ఆటగాళ్లలో తెలంగాణకు చెందిన దీప్తి జివాంజికి ‘అర్జున’ దక్కనుండటం విశేషం. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు (టి20)లో కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు ఆసియా పారా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఖాతాలో రెండు స్వర్ణాలు ఉన్నాయి. పారా షూటింగ్ కోచ్ సుభాష్ రాణా పేరును ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం కమిటీ సిఫారసు చేసింది. ఈ జాబితాలో మరో కోచ్ అమిత్ కుమార్ సరోహా పేరు కూడా ఉండటం చర్చకు దారి తీసింది. అతను ఎప్పుడూ అధికారికంగా కోచ్‌గా పని చేయలేదని... పైగా ఇటీవల పారిస్‌లోనూ ఆటగాడిగా బరిలోకి దిగాడు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అర్హుడు కాదని విమర్శలు వస్తున్నాయి. -
‘ధ్యాన్‌చంద్’ ఇకపై అర్జున లైఫ్‌టైమ్ అవార్డుగా...
క్రీడాకారులకు దివంగత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ పేరిట ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారం పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మార్చింది. ఆటగాళ్లు తమ కెరీర్లో కనబరిచిన విశేష సేవలకు గుర్తింపుగా 2002 నుంచి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డును ప్రదానం చేయడం మొదలు పెట్టారు. దీన్ని ఇకపై ‘అర్జున లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డుగా అందజేయనున్నారు.ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పతకాలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2023లో మంజూష కన్వర్ (షట్లర్), వినీత్ కుమార్ (హాకీ), కవిత సెల్వరాజ్ (కబడ్డీ)లకు ఈ జీవితసాఫల్య పురస్కారాన్ని అందజేశారు.ఈ ఏడాది అవార్డుల కోసం నామినేషన్లను దాఖలు చేసేందుకు వచ్చే నెల 14వ తేదీ వరకు గడువు ఉంది. ‘ఖేలో ఇండియా’ భాగంగా యూనివర్సిటీ స్థాయిలో జరిగే పోటీల్లో ఓవరాల్ విజేతకు మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీని అందజేస్తారు. వీటితో పాటు ఎప్పట్లాగే ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులు కూడా ఉంటాయి. -
‘అర్జున’ అందుకున్న ఇషా
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను బుధవారం అందుకుంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ఇషా సింగ్‌కు బహూకరించారు. ఈనెల 9న రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అయితే అదే సమయంలో ఇషా జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతుండటంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇషాకు ‘అర్జున’ అందించిన అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇషా పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
శుభాకాంక్షలు షమీ అన్నా: విరాట్ కోహ్లి కామెంట్ వైరల్
Mubarak Ho Lala: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత పేసర్ మహ్మద్ షమీ పట్ల ఆప్యాయత ప్రదర్శించిన తీరుకు ఫిదా అవుతున్నారు. కాగా షమీకి ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం తనకు దక్కిన అత్యుత్తమ గౌరవమని మురిసిపోయాడు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు చవిచూశానన్న షమీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచి సహాయం చేసిన వారందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశాడు. తనకు బౌలింగ్‌లో మెళకువలు నేర్పిన కోచ్‌లు, ఎల్లవేళలా తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ.. సహచర ఆటగాళ్లు, అభిమానుల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. తన ప్రతిభ, కఠిన శ్రమను గుర్తించి ఈ అవార్డు అందజేసినందుకు దేశం గర్వపడేలా అత్యుత్తమంగా ఆడి రుణం తీర్చుకుంటానని షమీ పేర్కొన్నాడు. తనతో పాటు ఈ అవార్డు అందుకున్న భారత క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసిన షమీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న వీడియోను షేర్ చేశాడు. Today I am feeling very proud that I have been honored with the prestigious Arjuna Award by the President. I want to thank all those people who have helped me a lot to reach here and have always supported me in my ups and downs... thanks to My Coach, BCCI,team mates,my family,… pic.twitter.com/fWLGKfY5g8 — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) January 9, 2024 ఇందుకు స్పందించిన విరాట్ కోహ్లి.. ‘‘శుభాకాంక్షలు అన్నా(ముబారక్ హో లాలా)’’ అంటూ షమీని ప్రేమగా విష్ చేశాడు. హార్ట్ ఎమోజీ జతచేసి సహచర ఆటగాడి పట్ల ఆత్మీయతను ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో షమీ పట్ల కోహ్లి వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ‘‘హుందాతనం ప్రదర్శించడంలో కింగ్ తనకు తానే సాటి’’ అంటూ ఫ్యాన్స్ ఈ పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు. కాగా పంజాబీలో లాలా అంటే అన్నయ్య అనే అర్థం ఉంది. కాగా తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లి షమీకి దన్నుగా నిలిచిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్-2021 పాకిస్తాన్‌తో మ్యాచ్ సమయంలో షమీపై విమర్శలు రాగా.. కోహ్లి ఖండించాడు. దీంతో కొంతమంది ఆకతాయిలు కోహ్లి చిన్నారి కుమార్తె వామికాను ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. దాదాపు 14 నెలల తర్వాత అఫ్గనిస్తాన్‌తో సిరీస్ ద్వారా విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇస్తుండగా.. వరల్డ్‌కప్-2023 టాప్ వికెట్ టేకర్ షమీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. చీలమండ నొప్పితో బాధపడుతున్న ఈ స్టార్ పేసర్ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ చివరి మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
‘అర్జున’తో అందలం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు ప్రదాన కార్యక్రమం మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. వేర్వేరు క్రీడాంశాల్లో సత్తా చాటి ఈ పురస్కారానికి ఎంపికైన భారత ఆటగాళ్లు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీనిని సగర్వంగా అందుకున్నారు. భారత క్రికెట్ జట్టు స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీతో పాటు తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ అర్జున అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతున్న కారణంగా తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఈ అవార్డును అందుకోలేకపోయింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికైన టాప్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొంటున్నారు. భారత మహిళా చెస్ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు అమ్మాయి ఆర్. వైశాలి, రెజ్లర్ అంతిమ్ పంఘాల్, అథ్లెట్ పారుల్ చౌదరి, భారత కబడ్డీ జట్టు కెపె్టన్, తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ప్లేయర్ పవన్ కుమార్ సెహ్రావత్ కూడా అర్జున పురస్కారాన్ని అందుకున్నారు. పారా ఆర్చర్ శీతల్ దేవి అవార్డు అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించగా... వీల్‌చైర్‌లో కూర్చుకున్న పార్ కనోయిస్ట్ ప్రాచీ యాదవ్ వద్దకు వెళ్లి స్వయంగా రాష్ట్రపతి అవార్డు అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంధ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున అవార్డును అందుకోగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన స్విమ్మర్ మోతుకూరి తులసీ చైతన్య టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని స్వీకరించాడు. విజయవాడ సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న 34 ఏళ్ల తులసీ చైతన్య కాటలీనా చానెల్, జిబ్రాల్టర్ జలసంధి, పాక్ జలసంధి, ఇంగ్లిష్ చానెల్, నార్త్ చానెల్లను విజయవంతంగా ఈది తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2023 సంవత్సరానికి ఇద్దరికి ‘ఖేల్ రత్న’... 26 మందికి ‘అర్జున’... ఐదుగురికి ‘ద్రోణాచార్య’ రెగ్యులర్ అవార్డు... ముగ్గురికి ‘ద్రోణాచార్య’ లైఫ్‌టైమ్... ముగ్గురికి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్’ అవార్డులు ప్రకటించారు. ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29న) ఈ అవార్డులను అందజేస్తారు. అయితే ఆ సమయంలో హాంగ్జౌ ఆసియా క్రీడలు జరుగుతుండటంతో అవార్డుల ఎంపికతోపాటు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. -
మహ్మద్ షమీకి అర్జున అవార్డు
-
రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న షమీ
టీమిండియా పేస్ బాద్షా మొహమ్మద్ షమీ ఇవాళ (జనవరి 9) దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నాడు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా షమీ ప్రతిష్టాత్మక అవార్డుచే సత్కరించబడ్డాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో అద్భుత ప్రదర్శన (7 మ్యాచ్‌ల్లో 3 ఐదు వికెట్ల ఘనతలతో 24 వికెట్లు) కారణంగా షమీ అర్జున్ అవార్డుకు ఎంపికయ్యాడు. A proud day for cricket...!!! Shami is now a Arjuna Awardee. 🫡pic.twitter.com/A8NDBqcjt1 — Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2024 షమీతో పాటు వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి. గతేడాది బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమంగా రాణించిన చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌లకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. షమీకి ముందు ప్రస్తుత భారత క్రికెటర్లు శిఖర్ ధవన్ (2021), రవీంద్ర జడేజా (2019), రోహిత్ శర్మ (2015), రవిచంద్రన్ అశ్విన్ (2014), విరాట్ కోహ్లి (2013) అర్జున అవార్డులు గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ అనంతరం షమీ గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు సైతం అతను దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ సమయానికి షమీ ఫిట్‌గా ఉంటాడని తెలుస్తుంది. 33 ఏళ్ల షమీ టీమిండియా తరఫున 64 టెస్ట్‌లు, 101 వన్డేలు, 23 టీ20లు ఆడి 448 వికెట్లు పడగొట్టాడు. షమీ ఖాతాలో రెండు టెస్ట్ అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. షమీకి ఐపీఎల్లో సైతం ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. తన ఐపీఎల్ కెరీర్లో 110 మ్యాచ్‌లు ఆడి 127 వికెట్లు పడగొట్టాడు. -
వినేశ్ కూడా వెనక్కిచ్చేసింది!
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా కేంద్ర క్రీడా అవార్డులను వెనక్కి ఇచ్చేసింది. శనివారం కర్తవ్యపథ్ వద్ద ఆమె ‘ఖేల్‌రత్న’, అర్జున అవార్డులను వదిలేసి వెళ్లింది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పతకాలతో ఆమె దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఫొగాట్ ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’, అర్జున అవార్డులను ఇచ్చింది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ వర్గమే కొత్తగా ఎన్నికైంది. ఆయన విధేయుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడు అయ్యారు. దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ నిమిషాల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించింది. బజరంగ్ ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చాడు. బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా తన పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఫొగాట్ కూడా ముందు ప్రకటించినట్లే ఖేల్‌రత్న, అర్జున అవార్డుల్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రధానమంత్రి నివాసానికి బయల్దేరింది. కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో అవార్డుల్ని రోడ్డుపైనే వదిలేసింది. ఆ పురస్కారాలు ఇప్పుడు పోలీసుల ఆ«దీనంలో ఉన్నాయి. -
షమీకి అర్జున.. చిరాగ్, సాత్విక్‌లకు ఖేల్‌రత్న అవార్డులు
జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ ఏడాది వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు, బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమంగా రాణించిన ఇద్దరికి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమంగా రాణించిన మొహమ్మద్ షమీని అర్జున అవార్డు వరించగా.. చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌లకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. అర్జున, ఖేల్‌రత్న అవార్డులతో పాటు కేంద్రం ద్రోణాచార్య (రెగ్యులర్, లైఫ్‌టైమ్), ధ్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్) అవార్డులను కూడా ప్రకటించింది. అవార్డు పొందిన వారందరూ వచ్చే ఏడాది (2024) జనవరి 9న భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటారు. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు 2023: చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి (బ్యాడ్మింటన్) రాంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్ (బ్యాడ్మింటన్) అర్జున అవార్డులు 2023: ఓజాస్ ప్రవీణ్ దియోటలే (ఆర్చరీ) అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ) ఎం శ్రీశంకర్ (అథ్లెటిక్స్) పారుల్ చౌదరీ (అథ్లెటిక్స్) మొహమ్మద్ హుస్సాముద్దీన్ (బాక్సింగ్) ఆర్ వైశాలీ (చెస్) మొహమ్మద్ షమీ (క్రికెట్) అనూషా అగర్వల్లా (ఈక్వెస్ట్రియన్) దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్) దీక్షా దాగర్ (గోల్ఫ్) కృషణ్ బహదూర్ పాఠక్ (హాకీ) పుఖ్రంబం సుశీల చాను (హాకీ) పవన్ కుమార్ (కబడ్డీ) రీతు నేగి (కబడ్డీ) నస్రీన్ (ఖోఖో) పింకీ (లాన్ బౌల్స్) ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్) ఈషా సింగ్ (షూటింగ్) హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్) అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్) సునీల్ కుమార్ (రెజ్లింగ్) అంటిమ్ (రెజ్లింగ్) నౌరెమ్ రోషిబినా దేవి (ఉషు) శీతల్ దేవి (పారా ఆర్చరీ) ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్) ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్) ద్రోణాచార్య అవార్డులు 2023 (రెగ్యులర్): లలిత్ కుమార్ (రెజ్లింగ్) ఆర్ బి రమేష్ (చదరంగం) మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్) శివేంద్ర సింగ్ (హాకీ) గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లఖాంబ్) ద్రోణాచార్య అవార్డులు 2023 (లైఫ్‌టైమ్): జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్) ఈ భాస్కరన్ (కబడ్డీ) జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్) ధ్యాన్‌చంద్ అవార్డులు 2023 (లైఫ్‌టైమ్): మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్) వినీత్ కుమార్ శర్మ (హాకీ) కవిత సెల్వరాజ్ (కబడ్డీ) మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023: గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్సర్ (విజేత) లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ (మొదటి రన్నరప్) కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర (రెండో రన్నరప్) -
భారత దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారానికి నామినేట్ అయిన షమీ..?
టీమిండియా పేస్ సెన్సేషన్, వన్డే వరల్డ్‌కప్ 2023 హీరో మొహమ్మద్ షమీ భారత దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుకు నామినేట్ అయినట్లు తెలుస్తుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షమీ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు సమాచారం. షమీ అర్జున అవార్డుకు పూర్తి స్థాయి అర్హుడని బీసీసీఐ కేంద్రానికి సమర్పించిన ప్రత్యేక అభ్యర్ధనలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. 2021లో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధవన్ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత భారత జట్టులోని సభ్యులు విరాట్ కోహ్లి (2013), రోహిత్ శర్మ (2015), రవిచంద్రన్ అశ్విన్ (2014), రవీంద్ర జడేజా (2019) అర్జున అవార్డు గెలుచుకున్న వారిలో ఉన్నారు. 33 ఏళ్ల షమీ ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో లీడింగ్ వికెట్‌టేకర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భారత్.. చివరివరకు అజేయ జట్టుగా నిలిచి, తుది సమరంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో భారత విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన షమీ.. 7 మ్యాచ్‌ల్లో 3 ఐదు వికెట్ల ఘనతలతో 24 వికెట్లు పడగొట్టాడు. త్వరలో సౌతాఫ్రికాతో జరుగనున్న టెస్ట్ సిరీస్ కోసం షమీ ప్రిపేర్ అవుతున్నాడు. -
రాష్ట్రపతి భవన్లో ఘనంగా క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం(నవంబర్ 30న) కన్నుల పండువగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు పురస్కారాలు అందుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ అందుకోగా.. 25 మంది క్రీడాకారులు అర్జున అవార్డు అందుకున్నారు. వీరిలో బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింట్న్ స్టార్ హెచ్ ప్రణయ్, చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద, ఆకుల శ్రీజ తదితరులు ఉన్నారు. ఇక 8 మంది కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను అందజేశారు.భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది క్రీడా అవార్డులను నవంబర్ 14న ఈ అవార్డులను ప్రకటించింది. విజేతల జాబితా: మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు: ఆచంట శరత్ కమల్ అర్జున అవార్డులు: సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్) , ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్) ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ విభాగంలో కోచ్‌లకు): జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్) మరియు సుజిత్ మాన్ (రెజ్లింగ్) జీవితకాల పురస్కారం: దినేష్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు: అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్వీర్ సింగ్ (హాకీ), బిసి సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్) President Droupadi Murmu presents the Arjuna award to Badminton players Lakshya Sen and Prannoy HS at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/Tv4QLAPbtj — ANI (@ANI) November 30, 2022 President Droupadi Murmu presents the Arjuna award to Chess player R Praggnanandhaa at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/1OPxS7DaoW — ANI (@ANI) November 30, 2022 చదవండి: FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు -
2017లో ‘అర్జున’ అవార్డుకు ఎంపిక.. ఇప్పుడు అందుకున్న పుజారా
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత తనకు ప్రకటించిన ‘అర్జున’ అవార్డును అందుకున్నాడు. క్రికెట్లో రాణిస్తున్న అతన్ని 2017లోనే భారత ప్రభుత్వం ఆ అవార్డుకు ఎంపిక చేసింది. కానీ టీమిండియా బిజీ షెడ్యూల్ వల్ల ఆ ఏడాది అందుకోలేకపోయాడు. ఢిల్లీలో ప్రస్తుతం సౌరాష్ట్ర తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న అతనికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘అర్జున’ పురస్కారం బహూకరించారు. దీనిపై స్పందించిన పుజారా తనను ప్రోత్సహించిన బోర్డు (బీసీసీఐ)కు, తన ఘనతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. చదవండి: IND vs NZ: వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్! Thankful to @IndiaSports, @BCCI and @ianuragthakur to organise and handover the Arjuna Award belatedly, which I could not collect the year it was awarded to me due to my cricket commitments. Honoured and grateful🙏 pic.twitter.com/Dokz4ZP3Hs — Cheteshwar Pujara (@cheteshwar1) November 19, 2022 -
శరత్ కమల్‌కు ఖేల్‌రత్న.. శ్రీజ, నిఖత్‌లకు అర్జున
న్యూఢిల్లీ: తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ ‘అర్జున’ విజేతలయ్యారు. అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకాలతో సత్తా చాటుకుంటున్న తెలంగాణ మహిళా చాంపియన్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా బాక్సర్ నిఖత్, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ శ్రీజలను ‘అర్జున’ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీజ ‘మిక్స్డ్’ భాగస్వామి, స్టార్ టీటీ ప్లేయర్ అచంట శరత్ కమల్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ లభించింది. ఈ నెల 30న రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల్ని అందజేయనున్నారు. కొన్నేళ్లుగా ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ముగ్గురు, నలుగురేసి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. కానీ ఈసారి శరత్ మాత్రమే ఆ అవార్డుకు ఎంపికయ్యాడు. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల శరత్ కమల్ నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో (204 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో) భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐదుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెల్చుకున్నాడు. మొత్తం 25 మంది క్రీడాకారులకు ‘అర్జున’ దక్కింది. ఇందులో నలుగురు పారాథ్లెట్లున్నారు కానీ ఒక్క భారత మహిళా, పురుష క్రికెటర్ లేడు. ఆటగాళ్లను తీర్చిదిద్దే కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డుకు జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మొహమ్మద్ అలీ ఖమర్ (బాక్సింగ్), సుమ షిరూర్ (పారా షూటింగ్), సుజీత్ మాన్ (రెజ్లింగ్)... ద్రోణాచార్య ‘లైఫ్ టైమ్’ అవార్డుకు దినేశ్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) ఎంపికయ్యారు. అశ్విని అకుంజీ (అథ్లెటిక్స్), ధరమ్వీర్ (హాకీ), సురేశ్ (కబడ్డీ), నీర్ బహదూర్ (పారాథ్లెటిక్స్) ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. తెలంగాణ స్టార్లకు... ఇంటాబయటా అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలతో మెరిసిన ఆకుల శ్రీజ ఈ ఏడాది కెరీర్లోనే అత్యుత్తమ సాఫల్యాన్ని బర్మింగ్‌హామ్‌లో సాకారం చేసుకొంది. ఈ ఏడాది అక్కడ జరిగిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వెటరన్ స్టార్ శరత్ కమల్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించింది. 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఆమె మహిళల డబుల్స్, టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు నెగ్గింది. నిఖత్ ఈ ఏడాది ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. 2019లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్ షిప్లో కాంస్య పతకంతో మెరిసింది. అవార్డీల జాబితా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న: శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్). అర్జున: నిఖత్ జరీన్, అమిత్ (బాక్సింగ్), శ్రీజ (టేబుల్ టెన్నిస్), సీమా పూనియా, ఎల్డోస్ పాల్, అవినాశ్ సాబ్లే (అథ్లెటిక్స్), లక్ష్య సేన్, ప్రణయ్ (బ్యాడ్మింటన్), భక్తి కులకర్ణి, ప్రజ్ఞానంద (చెస్), దీప్గ్రేస్ ఎక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్), సాగర్ కైలాస్ (మల్లకంబ), ఇలవేనిల్ వలరివన్, ఓంప్రకాశ్ మిథర్వాల్ (షూటింగ్), వికాస్ ఠాకూర్ (వెయిట్‌లిఫ్టింగ్), అన్షు, సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మానసి జోషి, తరుణ్ థిల్లాన్, జెర్లిన్ అనిక (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్). -
ఖేల్‌రత్నకు శరత్ కమల్.. అర్జున బరిలో నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ
2022 ఏడాదికి గానూ భారత్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్‌ను సెలక్షన్ కమిటీ ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేసింది. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఈ ఏడాది శరత్ కమల్ మినహా మరెవరిని ఎంపిక చేయకపోవడం విశేషం. దీంతో శరత్ కమల్‌కు ఖేల్‌రత్న అవార్డు రావడం గ్యారంటీ. ఇక 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ ఈ ఏడాది టేబుల్ టెన్నిస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించగా.. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఉంది. అలాగే శరత్ కమల్ ఏషియన్ గేమ్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన తొలి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. ఇక అర్జున అవార్డుకు 25 మంది పేర్లను సిఫార్సు చేసినట్లు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వీరిలో తెలంగాణకు చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ కూడా ఉంది. జరీన్‌తో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్, చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద, రెజ్లర్ అన్షు మాలిక్ తదితరులు ఉన్నారు. అయితే ఈసారి అర్జున అవార్డుకు సిఫార్సు చేసిన జాబితాల ఒక్క క్రికెటర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. అంతకముందు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి దేశ ఖ్యాతిని పెంపొందించింది. ఇక తెలంగాణకే చెందిన టేబుల్ టెన్నిస్ సంచనలం ఆకుల శ్రీజ కూడా అర్జున అవార్డు బరిలో ఉంది. ఖేల్ రత్న అవార్డు సిఫార్సు: ఆచంట శరత్ కమల్ అర్జున అవార్డు సిఫార్సులు: సీమా పునియా (అథ్లెటిక్స్), ఎల్దోస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సేబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ పంఘల్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్), ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఎక్కా (హాకీ), శుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్స్), సాగర్ ఓవల్కర్ (మల్లాఖాంబ్), ఎలవేనిల్ వలరివన్ (షూటింగ్), ఓం ప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్), శ్రీజ అకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు మాలిక్ (రెజ్లింగ్), సరితా మోర్ (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మనాషి జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా (డెఫ్ బ్యాడ్మింటన్) చదవండి: 144లో ఒక్కటి కూడా ఒరిజినల్ కాదు.. అందుకే సీజ్ ఐపీఎస్ ఆఫీసర్‌పై పిటిషన్ దాఖలు చేసిన ధోని -
‘అర్జున పిచ్చయ్య’ ఇక లేరు
వరంగల్ స్పోర్ట్స్: అవార్డునే ఇంటి పేరుగా మలుచుకున్న అర్జున పిచ్చయ్య ఇకలేరు. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిచ్చయ్య (104) ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ పరిధిలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలోని తన మనవడి (చిన్న కుమార్తె కొడుకు) ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అసలు పేరు జమ్మలమడక పిచ్చయ్య. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1918లో జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బందరులో గడిచింది. క్రీడలపై ఉన్న అమితాసక్తి కారణంగా టెన్త్ ఫెయిల్ అయ్యారు. పదిహేనేళ్ల వయసు వరకు ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడేవారు. ఆ తర్వాత అన్నయ్య నారాయణరావు స్ఫూర్తితో బాల్ బ్యాడ్మింటన్ వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ఆ క్రీడలో అర్జున అవార్డును అందుకునే స్థాయికి ఎదిగారు. 1970లో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించగా.. 1972లో అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా స్వీకరించారు. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా స్పోర్ట్స్ కోటాలో ఆజంజాహి మిల్లులో ఉద్యోగం కోసం 1947లో వరంగల్‌కు వచ్చిన పిచ్చయ్య ఇక్కడే స్థిరపడిపోయారు. ఈనెల 21న పిచ్చయ్య 104వ జన్మదిన వేడుకలు పలువురు క్రీడ, ఇతర ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఆ రోజు అందరితో ఉత్సాహంగా మాట్లాడిన ఆయన ఆ తర్వాత జ్వరంతో బాధపడుతూ మంచం పట్టి ఆదివారం కన్ను మూశారు. పిచ్చయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా, భార్య సత్యవతి 2007లో మరణించారు. -
రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు అందుకున్న శిఖర్ ధావన్.. వీడియో వైరల్
Shikhar Dhawan Honoured With Arjuna Award, Video: జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఆట్టహాసంగా జరిగింది. 2021లో మొత్తం 62 మందికి ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ రాష్ట్రపతి చేతుల మీదగా అర్జున అవార్డు అందుకున్నాడు. అధేవిధంగా భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్రత్నఅవార్డులను .. టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, భారత స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో పాటు పలువురు క్రీడాకారులకు ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. గణతంత్ర్య దినోత్సవం సందర్బంగా జనవరి 26న ఈ అవార్డులను ప్రకటిస్తారు. చదవండి: రిజ్వాన్ కోలుకోవడంలో భారత డాక్టర్ కీలక పాత్ర... కృతజ్ఞతగా ఏమి ఇచ్చాడంటే.. #WATCH | Cricketer Shikhar Dhawan receives Arjuna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/X7G45x9lzn — ANI (@ANI) November 13, 2021 -
నీరజ్ చోప్రా, లవ్లీనా, మిథాలీ రాజ్, పీఆర్ రాజేశ్... ఈసారి వీళ్లంతా..
Mithali And Neeraj Among 11 Recommended For Khel Ratna Award: ఒకవైపు ఒలింపిక్ పతక విజేతలు... మరోవైపు ముగ్గురు జాతీయ జట్ల కెప్టెన్లు... దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి తగిన అర్హత ఉన్న ఆటగాళ్లను ప్రభుత్వం సముచితంగా గౌరవించనుంది. ‘ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డుకు ఒకేసారి 11 మంది పేర్లను ఎంపిక కమిటీ ప్రతిపాదించగా... వీటికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారిక ఆమోద ముద్ర వేయడం లాంఛనం కానుంది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి అథ్లెట్ నీరజ్ చోప్రాకు ఊహించిన విధంగానే ‘ఖేల్‌రత్న’ చెంత చేరగా... సుదీర్ఘ కెరీర్లో జాతీయ జట్టుకు సేవలు అందించిన భారత ఫుట్‌బాల్, హాకీ, మహిళల క్రికెట్ జట్ల సారథులు సునీల్ ఛెత్రి, శ్రీజేశ్, మిథాలీ రాజ్‌లకు ఈ అవార్డు మరింత శోభ తెచ్చింది. తమ ప్రతిభతో దేశానికి పేరు తెచి్చన మరో 35 మంది పేర్లను ‘అర్జున’ అవార్డు కోసం కూడా సిఫారసు చేశారు. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్) ప్రస్తుతం భారత్‌లో పరిచయం అవసరం లేని పేరు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పాల్గొనడమే గొప్ప విజయంగా ఇన్నాళ్లూ భావిస్తూ రాగా, ఏకంగా స్వర్ణ పతకంతో మెరిసి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఐదేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మొదలైన ఈ జావెలిన్ త్రోయర్ విజయ ప్రస్థానం టోక్యోలో ఒలింపిక్స్ గోల్డ్ వరకు చేరింది. 2018లో ‘అర్జున’ అందుకున్న 24 ఏళ్ల నీరజ్ ఒలింపిక్ ప్రదర్శనకు ‘ఖేల్‌రత్న’ అవార్డు ఒక లాంఛనంలాంటిదే. సునీల్ ఛెత్రి ఫుట్‌బాల్ ప్రపంచంలో ఏమాత్రం గుర్తింపు లేకుండా ఎక్కడో మూలన మిణుకుమిణుకుమంటూ కనిపించే భారత జట్టుకు సుదీర్ఘ కాలంగా సునీల్ ఛెత్రి ఊపిరి పోస్తున్నాడు. 16 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఛెత్రి 120 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 80 గోల్స్ సాధించిన అతను ఇటీవలే దిగ్గజ ఫుట్‌బాలర్ లయోనల్ మెస్సీతో సమంగా నిలిచాడు. భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, అత్యధిక గోల్స్ చేసిన ఛెత్రి... ఫుట్‌బాల్‌లో తొలి ‘ఖేల్‌రత్న’ కావడం విశేషం. 2011లో అతను ‘అర్జున అవార్డు’ గెలుచుకున్నాడు. రవికుమార్ దహియా (రెజ్లింగ్) టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన రజత పతకానికి దక్కిన గుర్తింపు ఇది. హరియాణాలోని సోనెపట్‌లో ‘మ్యాట్’ల నుంచి ఒలింపిక్ విజేతగా నిలిచే వరకు రవి తన పట్టుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒలింపిక్ విజయానికి ముందు 2019లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్యం అతని అత్యుత్తమ ప్రదర్శన కాగా... రవికి ప్రభుత్వం తరఫున ఇదే తొలి పురస్కారం. ఒలింపిక్స్‌కు ముందే అతని పేరును ‘అర్జున’ అవార్డు కోసం ఫెడరేషన్ ప్రతిపాదించినా... టోక్యో విజయంతో అతని అవార్డు స్థాయి సహజంగానే పెరిగింది. లవ్లీనా (బాక్సింగ్) అసోంకు చెందిన 24 ఏళ్ల లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో కాంస్యం సాధించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన లవ్లీనా వరుసగా రెండేళ్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్యాలు సాధించి ఒలింపిక్స్ దిశగా దూసుకెళ్లింది. గత ఏడాదే ఆమెకు ‘అర్జున’ పురస్కారం దక్కింది. తనకు లభించనున్న ‘ఖేల్‌రత్న’ అవార్డును తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు లవ్లీనా తెలిపింది. మిథాలీ రాజ్ (క్రికెట్) 22 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్... 10 వేలకు పైగా పరుగులు... ఒకటా, రెండా...అంకెలకు అందని ఎన్నో ఘనతలు భారత స్టార్ మిథాలీ రాజ్ అందుకుంది. భారత మహిళల క్రికెట్‌కు పర్యాయపదంగా మారి రెండు తరాల వారధిగా నిలిచిన మిథాలీ అమ్మాయిలు క్రికెట్లోకి అడుగు పెట్టేందుకు అసలైన స్ఫూర్తిగా నిలిచింది. 39 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్నెస్, ఆటతో కొనసాగడమే కాకుండా భారత టెస్టు, వన్డే జట్టు కెపె్టన్‌గా కూడా జట్టును నడిపిస్తోంది. 1999లో తొలి మ్యాచ్ ఆడిన ఈ హైదరాబాదీ కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులు, రివార్డులు చేరాయి. ఇప్పుడు ‘ఖేల్‌రత్న’ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలవడం సహజ పరిణామం. 2003లోనే ‘అర్జున’ అందుకున్న మిథాలీ సాధించిన ఘనతలకు ‘ఖేల్‌రత్న’ నిజానికి బాగా ఆలస్యంగా వచ్చినట్లే భావించాలి! భారత్ తరఫున మిథాలీ 12 టెస్టులు, 220 వన్డేలు, 89 టి20 మ్యాచ్‌లు ఆడింది. పీఆర్ శ్రీజేశ్ (హాకీ) భారత హాకీకి బలమైన ‘గోడ’లా నిలుస్తూ అనేక అంతర్జాతీయ విజయాల్లో శ్రీజేశ్ కీలకపాత్ర పోషించాడు. గోల్‌కీపర్‌గా అనేక ఘనతలు సాధించిన అతను జట్టు కెపె్టన్‌గా కూడా వ్యవహరించాడు. కేరళకు చెందిన శ్రీజేశ్ 244 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన టీమ్‌లో అతను భాగస్వామి. అంతకుముందే కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, చాంపియన్స్ ట్రోఫీలలో చిరస్మరణీయ విజయాలు సాధించిన జట్లలో శ్రీజేశ్ కూడా ఉన్నాడు. 2015లో అతనికి ‘అర్జున’ పురస్కారం లభించింది. ఐదుగురు పారాలింపియన్లకు ‘ఖేల్‌రత్న’ ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సుమీత్ అంటిల్ (జావెలిన్ త్రో): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం అవని లేఖరా (షూటింగ్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం, రజతం కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం మనీశ్ నర్వాల్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం చదవండి: న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం పాక్ ఫ్యాన్స్ ఓవరాక్షన్.. ఏం చేశారో చూడండి..! -
రాజీవ్‌ఖేల్‌రత్న రేసులో అశ్విన్, మిథాలీ రాజ్
ఢిల్లీ: 2021 ఏడాదికి సంబంధించి క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ఖేల్ రత్న అవార్డుకు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌లను సిఫార్సు చేస్తున్నట్లు బీసీసీఐ బుధవారం వెల్లడించింది. వీరితో పాటు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్‌ల పేర్లను అర్జున అవార్డుకు సిఫార్సు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ కేంద్ర క్రీడాశాఖకు సిఫార్సు చేస్తు దరఖాస్తును పంపించింది. కాగా అశ్విన్, మిథాలీ రాజ్‌లు రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డుకు అన్ని అర్హతలు ఉన్నాయని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా రవిచంద్రన్ అశ్విన్ కొన్ని రోజులుగా టెస్టుల్లో మంచి ఫామ్‌ను కనబరుస్తున్నాడు. 2019-21 డబ్ల్యూటీసీ టోర్నీలో భాగంగా అశ్విన్ 71 వికెట్లు తీసి తొలిస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో టీమిండియా తరపున 400 వికెట్లకు పైగా తీసిన మూడో స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక మిథాలీ రాజ్ 22 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మిథాలీ రెండేళ్ల తర్వాత టాప్-5లోకి అడుగుపెట్టింది. కాగా గతేడాది రాజీవ్‌ఖేల్ రత్న అవార్డును టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
Corona: టీటీ మాజీ ప్లేయర్ చంద్రశేఖర్ మృతి
న్యూఢిల్లీ: భారత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మాజీ క్రీడాకారుడు, ‘అర్జున అవార్డు’ గ్రహీత వేణుగోపాల్ చంద్రశేఖర్ (64) కరోనాతో కన్నుమూశారు. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన చంద్రశేఖర్ 1982 కామన్వెల్త్ క్రీడల్లో సెమీఫైనల్ చేరారు. క్రీడాకారుడిగా కెరీర్ ముగిశాక ఆయన కోచ్‌గా మారారు. ప్రస్తుత యువ ఆటగాడు సత్యన్, జాతీయ మాజీ చాంపియన్ ఎస్.రామన్ ఆయన శిష్యులే. చనిపోయే సమయానికి చంద్రశేఖర్ చెన్నైలోనే ఎస్‌డీఏటీ–మెడిమిక్స్ టీటీ అకాడమీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
వీల్ చెయిర్..విల్ చెయిర్
పట్టుదలతో ఏదైనా మార్చుకోవచ్చు అని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది దీపా మాలిక్. దేశంలో పారా ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి మహిళ గా ఘనత సాధించింది. హర్యానాలో పుట్టి పెరిగిన దీప వెన్నెముకలో ఏర్పడిన కణితి కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. అనేక సవాళ్లను ఎదుర్కొని పతకాలు, పురస్కారాలు అందుకుంది. తన సమస్యలతో ఇప్పటికీ పోరాడుతూనే ఆ శక్తిని కుటుంబానికీ ఇస్తూ తనలాంటి వారిలో స్ఫూర్తిని నింపుతోంది. పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ఆసియా పారా గేమ్స్‌లో 4 పతకాలు, యమునా నది మీదుగా ఈత కొట్టడం ఇవన్నీ సాధించడానికి ఒక జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. కానీ, వాటన్నింటినీ సాధించి, ఓడిస్తున్న జీవితం తో పోరాడి గెలిచి చూపించింది. శక్తి పుంజం దీపా మాలిక్ తన చక్రాల కుర్చీలో కూర్చోగానే ఆ కుర్చీకే శక్తి వస్తుందేమో అనిపిస్తుంది. విధికి లొంగని శక్తి పుంజం అక్కడా ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. ‘భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఎప్పుడూ ఫుల్‌గా ఛార్జ్ చేసి ఉంచండి. పరుగు, ఆట, గెంతడం.. వంటి వాటితో మీలో శక్తిని నింపండి’ అని మహిళలకు చెబుతుంది. దీపా బాల్యమంతా జైపూర్ లో గడిచింది. పెళ్లై ఇద్దరు కూతుళ్లకు తల్లి ఆమె. వారిద్దరూ చదువుకుంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు దీపా తన కుటుంబానికి వెన్నెముక. జూన్ 3, 1999న వెన్నెముక లో కణితి ఉన్నట్టు వైద్య పరీక్షలో తేలింది. నడుస్తున్న జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. కణితి ఆపరేషన్ తర్వాత, పక్షవాతం బారిన పడింది. కొన్నాళ్లు మంచానికే పరిమితమైన దీప తనకు తాను శక్తిని కూడగట్టుకుంది. రెండు యుద్ధాలను జయించిన వేళ కార్గిల్ యుద్ధ మేఘాలు శివార్లలో ఉరుముతున్న కాలం. ఈ యుద్ధంలో దీప భర్త విక్రమ్ కూడా దేశం కోసం పోరాడుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇది చాలా కష్టమైన సమయం, ఒకటి దేశ శివార్లలో, మరొకటి శరీర శివార్లలో. ఈ సమయం దీప కుటుంబానికి చాలా సవాల్‌గా మారింది. కానీ చివరికి దీప కుటుంబం రెండు యుద్ధాలను గెలిచింది. ఒక వైపు భారత్ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది. దీపకు మూడు వెన్నెముక కణితి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. కానీ, పక్షవాతం రావడంతో మంచానికే పరిమితం అయ్యింది. దీంతో కొన్నిసార్లు దీప విచారంగా ఉండేది. ‘ఆ సమయంలో మా నాన్న ‘చీకటిని శపించడంలో అర్థం లేదు, నువ్వే దీపం కావాలి. అందుకే నీకా పేరు పెట్టాను’ అని చెప్పడంతో ఓ కొత్త శక్తి ఆవరించినట్టు అనిపించింది. అప్పటి నుంచి నాకు నేనుగా నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నం చేశానో మాటల్లో చెప్పలేను’ అని వివరించిన దీపా మాలిక్ చేతల్లో తన విజయాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పటికీ చాటుతూనే ఉంది. -
‘అర్జున’తో ఆనందంగా ఉన్నా
దుబాయ్: శరీరం సహకరించినంత కాలం క్రికెట్ ఆడతానని అర్జున అవార్డు విజేత, భారత పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం దుబాయ్ వెళ్లిన ఇషాంత్ శనివారం జరిగిన జాతీయ క్రీడా అవార్డుల వేడుకకు హాజరు కాలేకపోయాడు. అయినప్పటికీ ఈ ఏడాది అవార్డు గెలుపొందిన వారందరికీ అభినందనలు తెలిపాడు. ‘చిన్న వయస్సులోనే క్రికెట్‌పై నాకున్న ఇష్టాన్ని తెలుసుకున్నా. నాటి నుంచి ఇప్పటివరకు ప్రతీ మ్యాచ్‌లోనూ 100 శాతం ప్రదర్శన కనబరిచా. 13 ఏళ్ల తర్వాత లభించిన ఈ అర్జున అవార్డు మరింత రాణించేందుకు కావాల్సిన స్ఫూర్తినిచ్చింది. (చదవండి : చెన్నై ‘హైరానా’ ) ఈ గౌరవాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు. నా ప్రయాణంలో వెన్నంటే నిలిచిన బీసీసీఐకి ధన్యవాదాలు. ఈ ఏడాది అవార్డు గెలుపొందిన వారందరికీ అభినందనలు’ అని ఇషాంత్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. 31 ఏళ్ల ఇషాంత్ భారత్ తరఫున 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది ఇషాంత్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మ అర్జునకు ఎంపిక కాగా....రోహిత్ శర్మ ‘ఖేల్‌రత్న’కు ఎంపికయ్యాడు. -
ఎన్ని సాధించినా అవార్డులు ఎందుకివ్వరు?!
క్రీడా పురస్కారాల సమయంలో ప్రతీసారి వివాదాలు, విమర్శలు సర్వ సాధారణమైపోయాయి. ఈసారీ సెలెక్షన్ కమిటీ ఏకంగా ఐదుగురు ‘రాజీవ్ ఖేల్‌రత్న’లను, 27 మంది ‘అర్జున’ విజేతల్ని ఎంపిక చేసింది. ఇంత మందిని ఎంపిక చేసినా నిఖార్సయిన అర్హుల్ని మరోసారి అవార్డులకు దూరం చేయడమే తీవ్ర విమర్శలకు దారితీసింది. –సాక్షి క్రీడా విభాగం యేటా జాతీయ క్రీడా అవార్డులంటేనే ఓ ప్రహసనంలా మారింది. దీనికి ఓ కమిటీ... ఓ కొలమానం అంటూ అన్నీ ఉన్నా... మరీ అర్హులు, అంతర్జాతీయ వేదికల్లో విజేతలు భారత క్రీడా పురస్కారాలకు ఎందుకు దూరమవుతున్నారో ఎవరికీ అంతుచిక్కని సమస్యలా మారింది. అందరూ ఆర్జీలు పెట్టుకున్నా... కొందరైతే సులభంగానే అవార్డులు కొట్టేస్తున్నారు. కానీ... ముఖ్యంగా విశేష ప్రతిభ కనబరిచిన వారైతే ఎందుకు ఖేల్‌రత్నాలు, అర్జున అవార్డీలు కాలేకపోతున్నారో? సమధానం లేని ప్రశ్నలా ఎందుకు మిగులుతున్నారో అర్థం కావడం లేదు. ‘జావెలిన్ త్రోయర్’ నీరజ్ చోప్రా కొన్నేళ్లుగా ‘ప్రపంచ పతకాలు’ సాధిస్తున్నాడు. కానీ భారత్‌లో ‘ఖేల్‌రత్న’ం కాలేదు. హాకీ ప్లేయర్ రూపిందర్ పాల్ సింగ్... ‘ట్రిపుల్ జంపర్’ అర్పిందర్ సింగ్ అంతర్జాతీయ వేదికలపై మెరుస్తున్నారు. అయినా అర్జునకు అనర్హులే! దివ్యాంగ షట్లర్ మానసి జోషి కాలు లేకపోయినా కదన కుతూహలంతో రాణిస్తోంది. ఎందుకనో అవార్డుల కమిటీనే మెప్పించలేకపోతోంది. వీళ్ల పతకాలు, ప్రదర్శన తెలిసిన వారెవరైనా సరే... ‘అర్హుల జాబితాలో ఉండాల్సింది వీరే కదా’ అనే అంటారు. కానీ వీళ్లు మాత్రం లేరు. (చదవండి: నా కష్టానికి దక్కిన ఫలం) ముమ్మాటికి చోప్రా ‘రత్న’మే... ఈ ఏడాది ఐదుగురు క్రీడాకారులు ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఎంపికయ్యారు. చరిత్రలో ఐదుమందికి ఒకేసారి ‘ఖేల్‌రత్న’ లభించడం ఇదే మొదటిసారి. అయితే టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రా కంటే చాంపియన్ అథ్లెట్ నీరజ్ జోప్రా ఈ పురస్కారానికి ఎన్నో రెట్లు అర్హుడు. ప్రపంచ రికార్డుతో జూనియర్ చాంపియన్‌షిప్ (2016)లో స్వర్ణం నెగ్గాడు. అదే ఏడాది దక్షణాసియా క్రీడల్లోనూ చాంపియన్. 2017లో ఆసియా చాంపియన్‌షిప్ విజేత, ఆ మరుసటి ఏడాది 2018 కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్. వరుసగా మూడేళ్లు అంతర్జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన చోప్రా ఖేల్‌రత్నకు అనర్హుడు ఎలా అవుతాడో కమిటీనే చెప్పాలి. దీనిపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య చీఫ్ అదిల్ సమరివాలా తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. మరో అథ్లెట్, ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ 2018 ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచాడు. కామన్వెల్త్ గేమ్స్, కాంటినెంటల్ కప్ ఈవెంట్లతో పతకాలు నెగ్గి త్రివర్ణాన్ని రెపరెపలాడించాడు. కానీ అవార్డుల కమిటీ ముందు డీలా పడిపోయాడు. (చదవండి: నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే... ) రూపిందర్కూ అన్యాయమే... హాకీలో రూపిందర్ పాల్ సింగ్ స్టార్ ఆటగాడు. కానీ అవార్డుల విషయంలో ఆ ‘స్టార్’ తిరగబడింది. భారత హాకీలోనే అత్యుత్తమ డ్రాగ్ ఫ్లికర్లలో రూపిందర్ కూడా ఒకడు. మైదానంలో హాకీ స్టిక్‌తో చెమటలు కక్కే ఒంటితో ప్రత్యర్థులతో ముందుండి తలపడే ధీరుడు... అవార్డుల రేసులో మాత్రం వెనుకబడిపోయాడు. 2018 ఆసియా క్రీడల్లో భారత్ కాంస్యం గెలుపొందడంలో అతను కీలకపాత్ర పోషించాడు. కానీ పురస్కారం విషయంలో తిరస్కారానికి గురయ్యాడు. మానసి మెరిసినా... దివ్యాంగ షట్లర్ మానసి జోషి కూడా అర్జున కోసం దరఖాస్తు పెట్టుకున్నా... కమిటీ అనుగ్రహానికి దూరమైంది. 31 ఏళ్ల మానసి గత మూడు ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించింది. 2019లో స్వర్ణం నెగ్గి విశ్వవిజేతగా అవతరించిన మానసి 2017లో కాంస్యం, 2015లో రజతం గెలిచింది. అంతేకాకుండా 2018 ఆసియా పారా గేమ్స్‌లో కాంస్యం, 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. -
‘ఇది నా 13 ఏళ్ల కష్టం’
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలమే అర్జున అవార్డు అని భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ అభివర్ణించాడు. ఈ అవార్డు పట్ల తనకంటే కూడా కుటుంబం, ముఖ్యంగా భార్య ప్రతిమా సింగ్ ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నట్లు ఇషాంత్ పేర్కొన్నాడు. (చదవండి : మెరుపు రత్నాలు) ‘అర్జున అవార్డు నన్ను వరించిందని తెలిసిన క్షణం నుంచి చాలా ఆనందంగా ఉన్నా. నాపై నాకే చాలా గర్వంగా ఉంది. నా కుటుంబం కూడా ఎంతో గర్విస్తోంది.’ అని ఇషాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 2007లో భారత జట్టులోకి అడుగుపెట్టిన ఇషాంత్... ఇప్పటివరకు 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టి20లు ఆడాడు. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఆన్లైన్లో నిర్వహించే కార్యక్రమం ద్వారా అవార్డులను అందజేస్తారు. (చదవండి : ఉసేన్ బోల్ట్‌కు కరోనా పాజిటివ్) -
ఈ స్ఫూర్తితో టోక్యో బెర్త్ పట్టేస్తా: ద్యుతీ చంద్
న్యూఢిల్లీ: ‘అర్జున అవార్డు’ తనకు సరైన సమయంలో లభించిందని... ఈ పురస్కారం స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను పట్టేస్తానని భారత మహిళా స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఆశాభావం వ్యక్తం చేసింది. గత శుక్రవారం కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో ద్యుతీ చంద్ ‘అర్జున అవార్డు’కు ఎంపికైంది. ఒడిషాకు చెందిన 24 ఏళ్ల ద్యుతీ చంద్ ఇప్పటి వరకు మహిళల 100 మీటర్ల ఒలింపిక్ అర్హత మార్కును (11.15 సెకన్లు) అందుకోలేకపోవడంతో... ఆమె టోక్యో ఒలింపిక్స్ ఎంట్రీ అనుమానంగానే ఉంది. (చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్‌పై క్లారిటీ ఇచ్చిన దాదా) ‘అర్జున అవార్డు నాకు సరైన సమయంలో లభించింది. ప్రభుత్వం నుంచి లభించే ఏ గుర్తింపు అయినా సరే అథ్లెట్‌లోని అత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉంటుంది. ప్రస్తుతం నా విషయంలోనూ అదే జరిగింది. ప్రభుత్వం నన్ను గుర్తించిందనే భావన నాలో కొత్త శక్తినిచ్చింది. ఒలింపిక్ అర్హత మార్కు కష్టంగా ఉన్నా సరే... నేను సాధించి తీరుతా’ అని ద్యుతీ పేర్కొంది. 2018 ఆసియా క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో రజత పతకాన్ని సాధించిన ఆమె... 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా హీట్స్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. (చదవండి: బ్యాలెన్స్ నిల్) -
మెరుపు రత్నాలు
స్వర్ణం సాధించడం గొప్ప. రజతమూ తక్కువేం కాదు. కాంస్యం కూడా విలువైనదే. గెలుపు పతకాలు ఇవన్నీ. ఖేల్ రత్న.. అర్జున.. ఈ గెలుపు పతకాలకు తళుకులు. ఆ తళుకులకే మెరుపులు.. మహిళా క్రీడామణులు!! మహిళకు చిన్న గుర్తింపు రావడమే పెద్ద అవార్డు! ఇక పెద్ద అవార్డు వచ్చిందంటే అది దేశానికే గుర్తింపు. మహిళల నైపుణ్యాల సహాయం తీసుకున్న దేశం ముందుకు వెళుతుంది. మహిళల ప్రావీణ్యాలకు స్థానం కల్పించిన దేశం నాగరికం అవుతుంది. మహిళల ప్రతిభకు పట్టం కట్టిన దేశం ప్రపంచానికే దీటైన పోటీ, వెలుగు దివిటీ అవుతుంది. క్రీడారంగం అనే కాదు, ఏ రంగమైనా దేశానికి మహిళలు ఇచ్చే గుర్తింపు ఇది. అవును. దేశం మహిళలకు ఇవ్వడం కాదు, మహిళలు దేశానికి ఇవ్వడం. ఈ ఏడాది భారతీయ క్రీడారంగంలో వినేష్ ఫొగాట్, రాణీ రాంఫాల్, మణికా బాత్రా, మరో పదకొండు మంది మహిళలు దేశానికి గుర్తింపు ఇచ్చేవారి జాబితాలో ఉన్నారు. క్రీడారంగంలో అత్యున్నత పురస్కారాలైన ‘ఖేల్ రత్న’, ‘అర్జున’ అవార్డుల జాబితా అది. వినేశ్ ఫొగాట్, రాణి రాంఫాల్, మణికా బాత్రా ‘ఖేల్ రత్న’ పరిశీలనలో ఉన్నారు. దీపికా ఠాకూర్, సాక్షి మాలిక్, మీరాబాయ్, ద్యుతీచంద్, దివ్య కర్కాన్, లవ్లీనా, మనూ బకర్, దీప్తి శర్మ, మధురిక, అదితి అశోక్, సారిక ‘అర్జున’ బరిలో ఉన్నారు. మరో క్రీడా అవార్డు ‘ధ్యాన్‌చంద్’కు.. విశాఖపట్నం బాక్సర్ నగిశెట్టి ఉషకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 29న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అవార్డు విజేతల పేర్లను వర్చువల్‌గా (ఆన్లైన్ కార్యక్రమం) ప్రకటిస్తారు. ఖేల్ రత్న వడపోతలో మిగిలిన ముగ్గురు మహిళలూ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినవారే. వినేష్ ఫొగాట్ రెజ్లర్. 2018 కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ ఈవెంట్లలో స్వర్ణపతకాలు సాధించారు. 2019 ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం సంపాదించారు. హర్యానాలోని కుస్తీ యోధుల కుటుంబం నుంచి వచ్చారు వినేశ్. ఈ ఆగస్టు 25కి ఆమెకు ఇరవై ఆరేళ్లు నిండుతాయి. బహుశా ఖేల్ రత్న ఈసారి వినేశ్ పుట్టినరోజు కానుక అవుతుంది. ‘ఫ్రీ స్టెయిల్’లో ఒడుపు ఆమె ప్రత్యేకత. రాణీ రాంఫాల్ మహిళా హాకీ టీమ్ కెప్టెన్. ఖేల్ రత్న అవార్డు పరిశీలనకు ఎంపికైన మూడో హాకీ ప్లేయర్, తొలి మహిళా హాకీ ప్లేయర్ రాంఫాల్. ఆమె నేతృత్వంలోనే 2017 ‘ఉమెన్స్ ఏషియా కప్’లో భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. 2018 ఏషియన్ గేమ్స్‌లో రాంఫాల్ టీమ్ రజత పతకం గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా అర్హత సాధించడానికి అవసరమైన 2019 క్వాలిఫయర్స్ గేమ్‌లో టీమ్ కొట్టిన గేమ్–ఛేంజింగ్ గోల్ ఆమెను ఖేల్ రత్న కమిటీ దృష్టిలో పడేలా చేసి ఉండొచ్చు. రాణీ రాంఫాల్ కూడా హర్యానా అమ్మాయే. వినేశ్ ఫొగాట్ కన్నా నాలుగు నెలలు చిన్న. పేద కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి లాగుడు బండితో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. రాణి ఆరేళ్ల వయసులోనే హాకీ అకాడమీలో చేరారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్దేవ్ సింగ్ దగ్గర కోచింగ్ తీసుకున్నారు. ఖేల్ రత్నకు కమిటీ పరిశీలనలో ఉన్న మరో మహిళ మణికా బాత్రా టేబుల్ టెన్నిస్ ప్లేయర్. 2018 కామన్వెల్త్, ఏషియన్ గేమ్‌లలో సింగిల్స్‌లో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. 2019 జనవరి నాటికి మణిక టాప్ ర్యాంక్ మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రపంచంలో 47 ర్యాంకర్. (జనవరి 1–డిసెంబర్ 31 మధ్య క్రీడాకారులు సాధించిన విజయాలను అవార్డులకు పరిగణనలోకి తీసుకుంటారు). మణిక న్యూఢిల్లీ అమ్మాయి. వినేశ్, రాంపాల్‌ల కన్నా వయసులో ఏడాది చిన్న. ‘షేక్‌హ్యాండ్ గ్రిప్’ ప్లేయింగ్ స్టయిల్లో నిష్ణాతురాలు. అది యూరోపియన్ స్టెయిల్. రాకెట్ హ్యాండిల్‌ని బిగించి పట్టుకుని ఉన్నప్పుడు ఆ పొజిషన్ షేక్‌హ్యాండ్ ఇవ్వబోతున్నట్లుగా ఉంటుంది. పవర్‌ని, స్పిన్ని ఈ రకం గ్రిప్‌తో కావలసిన విధంగా నియంత్రించవచ్చు. పెన్హోల్డ్ గ్రిప్, వి–గ్రిప్, సీమిల్లర్ గ్రిప్ అనేవి కూడా ఉంటాయి. ఆ గ్రిప్‌లు కొట్టే బంతుల్ని షేక్‌హ్యాండ్ గ్రిప్‌తో ఎదుర్కోడానికి ఎంతో ప్రావీణ్యం కలిగి ఉండాలి. మణిక అందులో చెయ్యి తిరిగిన ప్లేయర్. ఇక ‘అర్జున’ అవార్డు పరిశీలనకు ఎంపికైన పదకొండుమంది మహిళలు కూడా మణికలా తమ ఆటల్లో ఏదో ఒక ప్రత్యేకమైన ‘గ్రిప్’ ఉన్నవారే. రాష్టపతి భవన్లో ప్రదానం చేసే అవార్డును ఆ ఉద్వేగంలో, ఆనందంలో.. పొదవి పట్టుకోడానికి ఎలాగూ ఆ గ్రిప్ ఉపయోగపడుతుంది. అయితే కరోనా వల్ల ఈసారి విజేతలు ఎక్కడి వాళ్లు అక్కడి నుంచే ఆన్లైన్లో అవార్డుల ప్రకటనను వినవలసి ఉంటుంది. చిన్న నిరాశే అయినా.. చరిత్రలో ఆ నిరాశ పక్కనే సాధించిన ఘనతా ఉండిపోతుంది. నగిశెట్టి ఉష (బాక్సర్) ‘ధ్యాన్‌చంద్’ క్రీడా అవార్డు బరిలో ఉన్న ఉష సీనియర్ బాక్సర్. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లలో రెండు రజత పతకాలు, ఒక స్వర్ణ పతకం సాధించిన రికార్డు ఉంది. ఆట నుంచి రిటైర్ అయ్యాక అనేక మహిళా బాక్సర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఉష ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వేలో (విశాఖ) పని చేస్తున్నారు. -
‘అర్జున’ ఒక్కరికే వస్తుందనుకున్నా...
హైదరాబాద్: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసిన జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘అర్జున అవార్డు’ కోసం తనతోపాటు తన భాగస్వామి చిరాగ్ శెట్టి పేరు కూడా ఉండటంపై ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. 2019లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో అద్భుత ఫలితాలు సాధించింది. థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గిన ఈ ద్వయం ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో పురుషుల డబుల్స్ ప్రపంచ చాంపియన్ జోడీని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న జంటను సాత్విక్–చిరాగ్ ద్వయం ఓడించింది. ‘చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరిలో ఒక్కరికే అవార్డు వచ్చే అవకాశముందని, ఇద్దరికీ రాకపోవచ్చని ఎవరో చెప్పారు. అయితే అవార్డుల సెలక్షన్ కమిటీ మా ఇద్దరి పేర్లను కేంద్ర క్రీడా శాఖకు పంపించడంతో ఊరట చెందాను’ అని సాత్విక్ అన్నాడు. ప్రస్తుతం అమలాపురంలోనే ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపిన సాత్విక్... రెండు వారాలలోపు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న జాతీయ శిక్షణ శిబిరానికి హాజరవుతానన్నాడు. . తన అర్జున అవార్డును తల్లిదండ్రులకు, కోచ్‌లకు, తానీ స్థాయికి చేరుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ అంకితం ఇస్తున్నానని ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ తెలిపాడు. 20 ఏళ్ల ప్రాయంలోనే ‘అర్జున’ అవార్డు వస్తుందని ఊహించలేదని... ఈ పురస్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సాత్విక్ పేర్కొన్నాడు. ‘టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తీవ్రంగా నిరాశ చెందాను. కొంతకాలంగా మేమిద్దరం మంచి ఫామ్‌లో ఉన్నాం. మరో రెండు నెలల వరకు ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలు లేవు. టోర్నీలు లేని సమయంలో ఏ క్రీడాకారుడికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ప్రాక్టీస్ మొదలుపెట్టిన రెండు వారాల్లో మేము ఫామ్‌లోకి వస్తామని ఆశిస్తున్నాను’ అని సాత్విక్ వివరించాడు. -
అర్జున అవార్డుకు ఇషాంత్ నామినేట్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. అతడితో పాటు ఆర్చర్ అతాను దాస్, హాకీ క్రీడాకారిణి దీపికా ఠాకూర్, క్రికెటర్ దీపక్ హుడా, టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరన్ సహా 29 మంది అథెట్ల పేర్లను ఈ పురస్కారానికి నామినేట్ చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా 31 ఏళ్ల ఇషాంత్ శర్మ 97 టెస్టులు, 80 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు తీశాడు. (ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మ నామినేట్) ఇక రియో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్, వరల్డ్ చాంఫియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను పేర్లను కూడా ఈ అవార్డుకు పరిశీలించగా చివరి నిమిషంలో పక్కకు పెట్టినట్లు సమాచారం. రియో ఒలంపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన సాక్షి 2016లో క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న పొందగా.. మీరాబాయి 2018లో ఈ అవార్డు అందుకున్నారు. ఈ కారణంతో వారి పేర్లను క్రీడా మంత్రి కిరణ్ రిజిజు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాభినందనలు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు క్రీడా మంత్రిత్వశాఖ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్‌తో పాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ సంచలనం మనిక బాత్రా, రియో పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లను ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రోహిత్ శర్మ, వినేశ్ ఫొగట్, మనిక బాత్రా, మరియప్పన్ తంగవేలుకు శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. -
గళమెత్తిన చెస్ క్రీడాకారులు
చెన్నై: క్రికెట్ క్రేజీ భారత్‌లో చదరంగం రారాజులూ ఉన్నారు. కానీ చెస్ ప్లేయర్లకు ఆదరణ అనేది ఉండదు. పాపులారిటీ పక్కనబెడితే ప్రభుత్వానికైతే అందరు ఆటగాళ్లు సమానమే కదా! మరి తమపై ఈ శీతకన్ను ఏంటని గ్రాండ్‌మాస్టర్లు (జీఎం) వాపోతున్నారు. అవార్డులు, పురస్కారాల సమయంలో (నామినేషన్లు) తామెందుకు కనపడమో అర్థమవడం లేదని మూకుమ్మడిగా గళమెత్తారు. నిజమే. చెస్ ఆటగాళ్ల గళానికి విలువ ఉంది. ఆవేదనలో అర్థముంది. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న చెస్ ప్లేయర్లను భారత ప్రభుత్వం తరచూ అర్జున, ద్రోణాచార్య అవార్డులకు విస్మరించడం ఏమాత్రం తగని పని. పైగా వీళ్లంతా వారి వారి సొంత ఖర్చులతోనే గ్రాండ్‌మాస్టర్ హోదాలు పొందారు. గ్రాండ్‌మాస్టర్లు (జీఎం), అంతర్జాతీయ మాస్టర్లు (ఐఎం)ల ఎదుగుదలకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) చేసేది శూన్యం. ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహకం లేకపోగా... కనీసం సొంతంగా ఎదిగిన వారికి పురస్కారాలు ఇప్పించడంలోనూ నిర్లక్ష్యం వహించడం మరింత విడ్డూరం. 2014 చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ సేతురామన్ రెండేళ్లుగా ‘అర్జున’కు దరఖాస్తు చేసుకుంటున్నా ఫలితం లేదు. దాంతో అతను అవార్డు గురించి పట్టించుకోకుండా తన ఆటపై దృష్టి సారించాడు. ఇటీవలే చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేసిన గ్రాండ్‌మాస్టర్ ఆర్బీ రమేశ్ తన శిక్షణతో పలువురు గ్రాండ్మాస్టర్లను తయారు చేశారు. ప్రపంచ చెస్‌లో జీఎం హోదా పొందిన రెండో అతి పిన్న వయస్కుడు ప్రజ్ఞానందతోపాటు జీఎంలు అరవింద్ చిదంబరం, కార్తికేయన్ మురళీ తదితరులను ఈయనే తీర్చిదిద్దారు. కానీ ఇప్పటికీ రమేశ్‌కు ‘ద్రోణాచార్య’ లభించలేదు. చెస్‌లో ఇప్పటివరకు ఇద్దరికే ‘ద్రోణాచార్య’ పురస్కారం దక్కింది. 1986లో రఘునందన్ వసంత్ గోఖలే, 2006లో ఆంధ్రప్రదేశ్ జీఎం హంపి తండ్రి కోనేరు అశోక్ ఈ అవార్డు సాధించారు. ప్రపంచస్థాయిలో పేరు తెస్తే చెస్ ఆటగాళ్లను పురస్కారాలతో గుర్తించకపోవడం దారుణం. భారతీయులు క్రికెట్‌ను అర్థం చేసుకుంటారు. అత్యున్నతస్థాయి చెస్ ఆడే దేశాలు 190 వరకు ఉన్నాయి. క్రికెట్లో మాత్రం 12 దేశాలకు టెస్టు హోదా ఉండగా.. ఇందులో తొమ్మిదింటికే అగ్రశ్రేణి జట్లుగా గుర్తింపు ఉంది. చెస్‌లో 2700 ఎలో రేటింగ్ ఉన్నవారు ప్రపంచ క్రికెట్లోని టాప్–25 ఆటగాళ్లతో సమానం. –విశాల్ సరీన్, కోచ్ జాతీయ క్రీడా పురస్కారాలు 1961లో మొదలుకాగా ... ఇప్పటి వరకు చెస్‌లో 17 మందికి ‘అర్జున’ దక్కింది. చివరిసారి 2013లో జీఎం అభిజిత్ గుప్తాకు ‘అర్జున’ వరించింది. తమిళనాడుకు చెందిన ఆధిబన్ ఖాతాలో గొప్ప విజయాలే ఉన్నాయి. 2014 చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం, 2010 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2010 ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2019 ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2014 ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం, 2012లో అండర్–20 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. అయినా ఇప్పటివరకు ఆధిబన్కు ‘అర్జున’ రాలేదు. బాధ పడాల్సిన విషయమేమిటంటే ‘అర్జున’ అవార్డు దరఖాస్తు పూరించేందుకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) కార్యాలయానికి వెళ్లగా అక్కడి సీనియర్ అధికారి నుంచి అవమానం ఎదురైంది. ‘ఏ అర్హతతో నువ్వు ‘అర్జున’ కోసం దరఖాస్తు చేసుకుంటున్నావు’ అని ఆధిబన్ను ఆయన ఎగతాళి చేయడం దారుణం. -
సంజితకు ‘అర్జున’ ఖాయం
న్యూఢిల్లీ: రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చానుకు న్యాయం జరుగనుంది. ఇటీవలే ఆమెను నిర్దోషిగా అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ప్రకటించగా... డోపింగ్ ఆరోపణల కారణంగా తనకు ఇన్నాళ్లూ దూరమైన అర్జున అవార్డు ఆమె చెంత చేరనుంది. 2018 ఏడాదికి గానూ ఆమెకు ప్రతిష్టాత్మక ‘అర్జున’ను అందజేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. 2018 ఏడాదికి సంజిత ‘అర్జున’ను పొందనుందని ఆయన వెల్లడించారు. 2018 మే నెలలో డోపింగ్ ఆరోపణలతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆగస్టులో సంజిత దాఖలు చేసిన ఫిటిషన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు... అవార్డు నామినీల కేటగిరీలో సంజిత దరఖాస్తును పరిశీలించాలని అవార్డుల కమిటీని కోరింది. తమ తుది నిర్ణయాన్ని సీల్డ్ కవర్లో భద్రపరచాలని సూచించిన హైకోర్టు ఆమె నిర్దోషిగా బయటపడినపుడు దాన్ని బయటపెట్టాలని పేర్కొంది. -
‘అర్జున’కు ప్రణయ్ నామినేట్
చీఫ్ కోచ్ గోపీచంద్ ‘అర్జున’ అవార్డు కోసం హెచ్ఎస్ ప్రణయ్‌ని నామినేట్ చేశారు. ఈ నెల 2న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సమీర్ వర్మలను ఆ అవార్డు కోసం సిఫార్సు చేయగా... తనను విస్మరించడంపై ప్రణయ్ బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఆ మరుసటి రోజే (3న) గోపీచంద్ అతని పేరును క్రీడాశాఖకు ప్రతిపాదించారు. ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డీ హోదాలో గోపీచంద్ ఈ సిఫార్సు చేశారని, చీఫ్ కోచ్ హోదాలో కాదని ‘బాయ్’ వర్గాలు తెలిపాయి. కాగా బహిరంగ విమర్శలపై ‘బాయ్’ ప్రణయ్‌కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
ఈ సారి ‘అర్జున’ను ఆశిస్తున్నా: సంజిత చాను
న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంలో నిర్దోషిగా బయటపడిన భారత వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత సంజిత చాను కేంద్ర ప్రభుత్వం అందించే క్రీడా పురస్కారం ‘అర్జున’ను ఆశిస్తోంది. 2016 నుంచి ఈ అవార్డు కోసం ప్రయత్నిస్తోన్న తనకు ఈ సారైనా ఈ గౌరవాన్ని అందజేయాలని ఆమె కోరింది. ‘నాలుగేళ్ల క్రితం అర్జున అవార్డు కోసం దరఖాస్తు చేశాను. అప్పుడు తిరస్కరించారు. 2017లో కూడా విస్మరించారు. ఆ తర్వాత డోపింగ్ ఆరోపణలతో నన్ను పక్కన బెట్టారు. కానీ ఈసారి అర్జున వస్తుందని నేను ఆశిస్తున్నా’ అని 26 ఏళ్ల చాను పేర్కొంది. గత నెలలోనే చాను అర్జున దరఖాస్తును క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది. అయితే డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఈ పురస్కారానికి అనర్హులని కేంద్ర క్రీడా శాఖ ఆమె దరఖాస్తును తిరస్కరించింది. -
ఆ జంప్... ఆహా!
స్కూల్‌గేమ్స్‌లో అంజూ తొలి గెలుపు హర్డిల్స్‌లో! హర్డిల్స్ అంటే తెలుసుగా... అన్నీ దాటుకుంటూ సాగే పరుగు పందెం. ఈ పందెం అమె కెరీర్‌కు చక్కగా నప్పుతుంది. పాఠశాల స్థాయి పోటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల దాకా ఎదురొచ్చిన అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ చివరకు ప్రపంచ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. అంజూ బాబీ జార్జి ఎన్నో హర్డిల్స్నైతే అధిగమించింది కానీ... చరిత్రలో నిలిచింది మాత్రం హర్డిల్స్ క్రీడాంశంలో కాదు... లాంగ్‌జంప్‌తో! స్కూల్లో హర్డిల్స్‌తో మొదలైన తన ఆటల బాటలో రిలే, లాంగ్‌జంప్, హైజంప్, హెప్టాథ్లాన్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్లి చివరకు లాంగ్‌జంప్ వద్ద ఆగింది. ఈ జంప్‌తోనే ‘ప్రపంచ’ పతకాన్ని గెలిచింది. ఆ వెంటే ‘ఖేల్‌రత్న’ం వరించింది. కన్నోడు... కట్టుకున్నోడు... చిన్నారి అంజూ చురుకైంది. చదువులో తెలివైంది. ఆటల పోటీల్లో గెలుపు గుర్రంలాంటిది. అందుకే ఆమె కన్నతండ్రి తనకు పుట్టింది అమ్మాయేగా చదువొక్కటి అబ్బితే చాల్లే అని అనుకోలేదు. 40 ఏళ్ల క్రితం ఆయన అలా అనుకొని వుంటే 2003లో పారిస్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించేది కాదు. 1980లో ఆమెను చదువుకోవాలన్నాడు. పోటీపడతానంటే ‘సై’ అన్నాడు. దీంతో 1992లో స్కూల్ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్ చాంపియనైంది. తదనంతరం క్రీడాకారుడే భర్తగా రావడం ఆమె కెరీర్‌ను ఉన్నతస్థితికి తీసుకెళ్లింది. ఇలా ఆమె జీవితంలో కన్నతండ్రి కె.టి.మార్కోజ్, కట్టుకున్న భర్త బాబీ జార్జిలది అమూల్యమైన ప్రోత్సాహం. వరల్డ్ ఫైనల్స్ చాంపియన్.... రెండేళ్ల తర్వాత (2005) మొనాకోలోని మోంటెకార్లోలో ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్ టోర్నీ జరిగింది. ఇందులో ఆమె 6.75 మీటర్ల దూరం గెంతి రజతం గెలిచింది. కానీ ఆమె రిటైరయ్యాక... తొమ్మిదేళ్లయ్యాక ఆ పతకం రంగు మారింది. ఆ పోటీల్లో స్వర్ణం నెగ్గిన తాతియానా కొటోవా (రష్యా–6.83 మీటర్లు) 2014లో డోపింగ్‌లో దొరికిపోవడంతో నిర్వాహకులు ఆమె స్వర్ణాన్ని రద్దు చేసి అంజూను చాంపియన్‌గా ప్రకటించి పసడి పతకాన్ని ఖాయం చేశారు. ఇలా భారత క్రీడాకీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన అంజూ ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’... ‘అర్జున’... ‘పద్మశ్రీ’ పురస్కారాలను అందుకుంది. ఆమె ఘనతలివీ.... ప్రపంచ అథ్లెటిక్స్ కంటే ముందే అంజూ మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్ (2002)లో కాంస్యంతో మెరిసింది. బుసాన్ (2002లో), దోహా (2006లో) ఆసియా క్రీడల్లో వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకుంది. అలాగే వరుసగా ఇంచియోన్ (2005లో), అమ్మాన్ (2007లో) ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ స్వర్ణ, రజతాలను రిపీట్ చేసింది. ప్రస్తుతం 43 ఏళ్ల అంజూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. ఐదో ప్రయత్నం... ప్రపంచ పతకం అంజూ 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం తుది సన్నాహాల్లో ఉంది. అయితే ఈ క్రమంలో ఆమె తీవ్రమైన అలసటతో అస్వస్థతకు గురైంది. ఓ దశలో పారిస్ ఈవెంట్ నుంచి తప్పుకుందామని భావించింది. కానీ భర్త బాబీ ముందుండి ధైర్యం చెప్పాడు. బరిలో దిగేందుకు తోవ చూపాడు. అలా చివరకు ఓ మేజర్ ఈవెంట్‌కు అయిష్టంగానే వచ్చినా మొక్కుబడిగా తలపడలేదు. దేశం కోసం, పతకం కోసం వందశాతం అంకిత భావం కనబరిచింది. ప్రపంచ మేటి అథ్లెట్లు, డిఫెండింగ్ చాంపియన్లు బరిలో ఉన్న లాంగ్‌జంప్‌లో ఒక్కొక్కరి ప్రయత్నాలు మొదలయ్యాయి. అంజూ ఐదో ప్రయత్నంలో 6.70 మీటర్ల దూరం మేర దూకింది. నిజానికి ఇది ఆమె గొప్ప ప్రయత్నమేమీ కాదు. ఎందుకంటే షూస్ స్పైక్ ఒక కాలితో మరొకటి తచ్చాడటంతో ఇబ్బంది పడింది. క్షణాల్లోనే ఇదంతా జరిగినా కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకొని అంత దూరం గెంతడం అంత ఆషామాషీ కాదు. కాసేపయ్యాక ఆరో ప్రయత్నం చేసినా అదేమంతా సక్సెస్ కాలేదు. చివరకు అందరివీ అన్నీ ప్రయత్నాలు పూర్తయ్యాక చూస్తే అంజూ మూడో స్థానం ఖాయమైంది. పోడియంలో కాంస్యం అందుకొని చరిత్ర పుటలకెక్కింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన ఉత్సాహంలో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన అంజూ ఐదో స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ ఆమె బరిలోకి దిగినా ఫైనల్ చేరలేకపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
‘అర్జున’ బరిలో అంకిత, దివిజ్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారులు అంకితా రైనా, దివిజ్ శరణ్ కేంద్ర ప్రభుత్వ పురస్కారం ‘అర్జున’ అవార్డు బరిలో నిలవనున్నారు. 2018 ఆసియా క్రీడల పతక విజేతలైన వీరిద్దరి పేర్లను అర్జున అవార్డు కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) సిఫారసు చేయనుంది. వీరిద్దరితో పాటు భారత డేవిస్ కప్ మాజీ కోచ్ నందన్ బాల్ పేరును ధ్యాన్‌చంద్ అవార్డు కోసం ‘ఐటా’ నామినేట్ చేయనున్నట్లు సమాచారం. -
‘అర్జున’కు బుమ్రా, ధావన్!
న్యూఢిల్లీ: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి ‘అర్జున’ అవార్డు బరిలో నిలవనున్నాడు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు బుమ్రా పేరును బీసీసీఐ నామినేట్ చేయనున్నట్లు సమాచారం. 2018లోనే బుమ్రా ఈ అవార్డు బరిలో నిలిచినా... సీనియారిటీ ప్రాతిపదికన రవీంద్ర జడేజా ‘అర్జున’ను కైవసం చేసుకున్నాడు. పురుషుల విభాగంలో ఒకరికంటే ఎక్కువ మంది పేర్లను నామినేట్ చేయాలని బీసీసీఐ అధికారులు భావిస్తే బుమ్రాతో పాటు సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు ఈ జాబితాలో చోటు దక్కే అవకాశముంది. రెండేళ్ల క్రితమే శిఖర్ ధావన్ పేరును బీసీసీఐ సిఫారసు చేసినప్పటికీ అవార్డుల కమిటీ మహిళల విభాగంలో స్మృతి మంధానకు మాత్రమే ఈ గౌరవాన్ని అందించింది. భారత్ తరఫున నాలుగేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న 26 ఏళ్ల బుమ్రా 14 టెస్టుల్లో 68 వికెట్లు, 64 వన్డేల్లో 104 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. ‘బుమ్రా కచ్చితంగా ఈ అవార్డుకు అర్హుడు. అతను ఐసీసీ నంబర్‌వన్ బౌలర్‌గానూ నిలిచాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ గడ్డలపై ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు దక్కించుకున్న ఏకైక ఆసియా బౌలర్’ అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మహిళల విభాగానికొస్తే ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, పేసర్ శిఖా పాండే పేర్లను బోర్డు పరిశీలించే అవకాశముంది. -
‘అర్జున’ రేసులో సందేశ్, బాలాదేవి
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా భారత ఫుట్‌బాల్ జట్టు తరఫున నిలకడగా రాణిస్తోన్న పురుషుల జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్... మహిళల జట్టు స్ట్రయికర్ బాలాదేవిలను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున’కు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నామినేట్ చేసింది. 2015లో జట్టులోకి వచ్చిన 25 ఏళ్ల చండీగఢ్ ప్లేయర్ సందేశ్ 36 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మణిపూర్‌కు చెందిన 30 ఏళ్ల బాలాదేవి ఇటీవల స్కాట్లాండ్కు చెందిన రేంజర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌తో 18 నెలల ఒప్పందాన్ని చేసుకుంది. తద్వారా విదేశీ ప్రొఫెషనల్ లీగ్‌లో ఆడిన తొలి మహిళా భారత ఫుట్‌బాలర్‌గా గుర్తింపు పొందింది. -
కారు రేసింగ్ మధ్యలోకి బైక్.. దాంతో
బర్మర్ (రాజస్థాన్): జాతీయ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో అనూహ్య దుర్ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ‘అర్జున అవార్డు’ అందుకున్న ప్రముఖ రేసింగ్ డ్రైవర్ గౌరవ్ గిల్ నడుపుతున్న కారు... ట్రాక్‌పైకి వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. దాంతో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో రేసింగ్ కారు దాదాపు 145 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది! దాంతో కారును అదుపు చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన గిల్, అతని సహచరుడు షరీఫ్‌లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియన్ నేషనల్ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడో రౌండ్ పోటీలను బర్మర్ వద్ద నిర్వహించారు. సాధారణంగా ఇలాంటి రేసింగ్‌లను నిర్వహించినప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తాము తీసుకున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ‘మా రేసింగ్‌కు పోలీసులతో పాటు సదరు గ్రామ పంచాయతీ అధికారుల అనుమతి ఉంది. సమీపంలోని గ్రామాల ప్రజలందరికీ 15 రోజుల ముందుగానే సమాచారం అందించాం. రోడ్లు మూసేస్తారని, రేసు రోజు తమ పెంపుడు జంతువులను కూడా అటు వైపు రానివ్వద్దని చెప్పాం. నిజానికి బైక్‌పై వచ్చిన వ్యక్తిని మా ఫీల్డ్ మార్షల్ అడ్డుకున్నాడు. అయితే అతడితో వాదనకు దిగి వద్దంటున్నా వినకుండా బ్యారికేడ్‌ను ఛేదించి ట్రాక్‌పై వెళ్లాడు. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈ దారుణం చోటు చేసుకుంది’ అని రేసింగ్ ప్రమోటర్లు వెల్లడించారు. ఘటనపై పోలీసు విచారణ ప్రారంభమైంది. -
సాయిప్రణీత్‌కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : అర్జున అవార్డు గ్రహిత సాయిప్రణీత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక అర్జున అవార్డును సాధించడం తెలుగు రాష్ట్రాలకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. కాగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సాయిప్రణీత్ అర్జున అవార్డును అందుకున్నారు. (చదవండి : ఒలంపిక్స్‌లో పతకంమే నా లక్ష్యం : సాయిప్రణీత్) రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగిన ఈ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అవార్డులను అందజేశారు. My heartiest congratulations to @saiprneeth92 on being honored with the Arjuna award for excellence in your Badminton career. Best wishes for your future endeavors. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2019 (చదవండి : రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానం) -
‘ఒలంపిక్స్‌లో పతకం గెలవడమే నా లక్ష్యం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక అర్జున అవార్డు తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు తెలుగు తేజం సాయిప్రణీత్. గురువారం ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నాడు. అనంతరం సాయి ప్రణీత్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం చేయడం ద్వారా క్రీడాకారులు మరింత స్ఫూర్తి పొందుతారని తెలిపారు. కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో అన్ని క్రీడల్లోనూ భారత్ మెరుగైన ప్రతిభ చూపిస్తోందన్నారు. హైదరాబాద్ క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో పతకాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పతకం సాధించిన అనంతరం మరిన్ని చాంపియన్ షిప్‌లపై దృష్టి సారిస్తున్నానని ప్రణీత్ చెప్పారు. గతంలో అనేక మందికి సాధ్యం కానిది తాను సాధించాను కాబట్టి వారికంటే గొప్పగా భావించడం లేదని, రానున్న ఒలంపిక్స్‌లో పతకం నెగ్గడమే లక్ష్యంగా కృషిచేస్తున్నాని సాయి ప్రణీత్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అవార్డులను అందజేశారు. -
అర్జున అవార్డు అందుకున్న సాయిప్రణీత్
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అవార్డులను అందజేశారు. (చదవండి : సాయి ప్రణీత్‌కు ‘అర్జున’) భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి భవన్లో అవార్డులు అందజేస్తారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, మహిళా పారాథ్లెట్ దీపా మలిక్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ అందుకున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున అవార్డు’ను పొందాడు. -
అర్జున జాబితాలో రవీంద్ర జడేజా
గోపీచంద్ అకాడమీ ఆణిముత్యం, తెలుగుతేజం సాయిప్రణీత్‌కు భారత ప్రభుత్వం నుంచి ఘనమైన గుర్తింపు లభించనుంది. యేటికేడు తన రాకెట్ పదును పెంచుకుంటున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్‌కు ‘అర్జున’ అవార్డు ఖాయమైంది. పారాలింపియన్ దీప మాలిక్ రెండో ‘ఖేల్‌రత్న’గా ఎంపిక కాగా... బ్యాడ్మింటన్ గురువు విమల్ కుమార్ ద్రోణాచార్యుడయ్యాడు. క్రికెటర్లు రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ అర్జునలుగా నిలిచారు. అయితే ఎప్పటిలాగే చిన్నపాటి అసంతృప్తుల సమేతంగానే ఈ సారి కూడా క్రీడా పురస్కారాల జాబితా వెలువడింది. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారానికి మరో తెలుగు షట్లర్ ఎంపికయ్యాడు. భమిడిపాటి సాయిప్రణీత్ ‘అర్జున’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంటాబయటా నిలకడగా రాణిస్తున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్ ప్రతిభను అవార్డుల కమిటీ గుర్తించింది. 2017లో ప్రణీత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నిలకడైన ప్రదర్శనతో సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పారాలింపియన్ దీపా మాలిక్‌కు భారత అత్యున్నత క్రీడాపురస్కారం దక్కనుంది. రియో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన ఆమెను ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు నామినేట్ చేశారు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆ అవార్డుకు ఎంపికవగా ఈ ఏడాది సంయుక్తంగా ఇద్దరికి ఆ పురస్కారం లభించనుంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్‌లు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని అవార్డుల కమిటీ 19 మందిని ‘అర్జున’కు, ఇద్దరిని ‘ఖేల్‌రత్న’కు ఎంపిక చేసింది. మరో ముగ్గురిని ‘ద్రోణాచార్య’కు నామినేట్ చేసింది. దీపకు మూడో పురస్కారం పారా అథ్లెట్ దీప 2012లో అర్జున అవార్డు అందుకుంది. రెండేళ్ల క్రితం 2017లో భారత పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని దక్కించుకుంది. వరుసగా మూడు పారా ఆసియా గేమ్స్ (2010, 2014, 2018)లో పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. జకార్తా (2018) ఈవెంట్లో ఆమె డిస్కస్ త్రో, జావెలిన్ త్రోలో కాంస్యాలు గెలిచింది. గడిచిన నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా ఇచ్చే ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఆమె అర్హురాలని కమిటీ నిర్ణయించింది. పూనియాతో పాటు ఆమెను ఎంపిక చేసింది. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ ఐసీసీ ఈవెంట్లలో పరుగుల ప్రవాహం సృష్టించడంతో ‘అర్జున’కు ఎంపికైంది. మహిళల భారత జట్టు 2017లో వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్, గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. విమల్‌కు ద్రోణాచార్య సైనా నెహ్వాల్ మాజీ కోచ్ విమల్ కుమార్ ‘ద్రోణాచార్య’కు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మొహిందర్ సింగ్ ధిల్లాన్ (అథ్లెటిక్స్) కోచ్‌లకు ఇచ్చే పురస్కారానికి ఎంపికయ్యారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోచ్ సంజయ్ భరద్వాజ్, మెర్జ్బన్ పటేల్, రణ్బిర్సింగ్ ఖోఖర్ జీవిత సాఫల్య పురస్కారాలకు నామినేట్ అయ్యారు. కమిటీ నామినీల జాబితాను కేంద్ర క్రీడాశాఖ ఆమోదించిన వెంటనే అధికారికంగా విజేతలను ప్రకటిస్తారు. యేటా హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 23)ని జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజు రాష్ట్రపతి భవన్లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఖేల్‌రత్న విజేతకు పతకంతో రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్యలకు మెమెంటో, రూ. 5 లక్షలు బహుమతిగా అందజేస్తారు. మేరీ తప్పుకుంది... భారత చాంపియన్ బాక్సర్ మేరీకామ్ అవార్డుల కమిటీలో ప్రధాన సభ్యురాలు. కానీ ఆమె శనివారం ‘ద్రోణాచార్య’ ఎంపికలో పాలుపంచుకోలేదు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ బాక్సర్ వ్యక్తిగత కోచ్ చోటేలాల్ యాదవ్ కూడా ‘ద్రోణాచార్య’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నారు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దూరంగా ఉండాలని భావించిన ఆమె ఎంపిక ప్రక్రియ నుంచి స్వయంగా తప్పుకుంది. అవార్డు నామినీల జాబితా రాజీవ్ ఖేల్‌రత్న: బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపామాలిక్ (పారా అథ్లెట్). అర్జున: సాయిప్రణీత్ (బ్యాడ్మింటన్), రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ (క్రికెట్), తేజిందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్ యాహియా, స్వప్న బర్మన్ (అథ్లెటిక్స్), సోనియా లాతర్ (బాక్సింగ్), చింగ్లేశన సింగ్ (హాకీ), అజయ్ ఠాకూర్ (కబడ్డీ), గౌరవ్‌సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), సుందర్‌సింగ్ గుర్జార్ (పారా అథ్లెట్), అంజుమ్ మోద్గిల్ (షూటింగ్), హర్మీత్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజ ధండ (రెజ్లింగ్), ఫౌవాద్ మిర్జా (ఈక్వెస్ట్రియన్), గుర్‌ప్రీత్‌సింగ్ సంధు (ఫుట్‌బాల్), సిమ్రన్‌సింగ్ షెర్గిల్ (పోలో). ఆర్డీటీకి పురస్కారం క్రీడలను ప్రోత్సహించడంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ సంస్థను అవార్డు కమిటీ ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’కు ఎంపిక చేసింది. ఐదు దశాబ్దాల క్రితం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’గా మొదలైన ఈ స్వచ్ఛంద సంస్థ మొదట్లో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం శ్రమించింది. కాలక్రమంలో రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్‌గా మారాక గత 20 ఏళ్లుగా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 2002లో స్పోర్ట్స్ సెంటర్‌ను ప్రారంభించింది. 32 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పరచింది. సకల సౌకర్యాలతో క్రీడలకు, క్రీడాకారులకు ఎనలేని సేవలందజేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన నిరుపేద బాలబాలికల్లో ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తోంది. ‘‘చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. రాబోయే టోర్నీల్లో మరింత పట్టుదలతో రాణించేందుకు ఈ అవార్డు ఊతమిస్తుంది’’ – ‘సాక్షి’తో సాయి ప్రణీత్ ‘‘మన దేశంలో తమవాళ్లకే అవార్డులు ఇచ్చుకుంటారు. అంటే కమిటీలో మనవారుంటే గుర్తిస్తారు. అంతే తప్ప ప్రదర్శనతోనూ, ప్రతిభతోనూ కాదు. ఇండియాలో ఇంతే. ఎవరేం చేయలేరు. మన పని మనం చేసుకోవాల్సిందే’’ – ట్విట్టర్లో హెచ్.ఎస్.ప్రణయ్ ఆవేదన ‘‘ఆటగాళ్ల విజయంలో కోచ్‌ల పాత్ర ఎంతో ఉంటుంది. నేను ఆ కోచ్‌ల వల్లే ఎదిగాను. జస్పాల్రాణా షూటింగ్లో ఉత్తమ కోచ్. మను భాకర్, సౌరభ్ చౌదరి, అనీశ్ భన్వాలాలను ప్రపంచశ్రేణి షూటర్లుగా తీర్చిదిద్దారు. అలాంటి రాణాను విస్మరించడం సరికాదు. ఇలాంటి తప్పటడుగులు టోక్యో ఒలింపిక్స్‌లో ప్రభావం చూపిస్తాయి’’ – ఒలింపిక్స్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా దీప, జడేజా, పూనమ్, అజయ్, బర్మన్ -
ప్రతిష్టాత్మక అవార్డుకు రవీంద్ర జడేజా నామినేట్
నూఢిల్లీ : భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను అర్జున అవార్డుకు సెలక్షన్ కమిటీ నామినేట్ చేసింది. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓడిపోయినా, రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌షోతో అందరి మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. హేమాహేమీలు వెనుదిరిగినా తన బ్యాటింగ్ నైపుణ్యంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 59 బంతుల్లో 77 పరుగులు, రెండు వికెట్లు పడగొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. కానీ ఆఖర్లో జడేజా, ధోనీ ఔటవ్వడంతో ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించిన విషయం విదితమే. భారత్ తరఫున జడేజా 156 వన్డేలు, 41 టెస్టులు, 42 టీ20లు ఆడాడు. జస్టిస్ (రిటైర్డ్) ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు నామినేట్ చేసింది. బీసీసీఐ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు రవీంద్ర జడేజాతో పాటు, జస్ప్రిత్ బూమ్రాను, మహ్మద్ షమీలను కూడా సిఫార్సు చేసింది. జడేజాతో పాటు, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్స్ తేజేందర్ పాల్సింగ్తూర్, మహ్మద్ అనాస్, స్వప్నా బార్మన్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు గుర్ప్రీత్ సింగ్ సంధు, హాకీ ప్లేయర్ చింగ్లెన్సానా సింగ్ కంగుజమ్, షూటర్ అంజుమ్ మోద్గిల్ తదితరులను సెలక్షన్ కమిటీ నామినేట్ చేసింది. మరోవైపు దేశ అత్యున్నత క్రీడా అవార్డు.. రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు దీపా మాలిక్ నామినేట్ అయ్యారు. ఈమె రియో పారాలింపిక్స్‌లో షాట్‌పుట్ విభాగంలో వెండి పతకాన్ని సాధించారు. దీపా మాలిక్ 2017లో పద్మశ్రీ, 2012లో అర్జున అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ మేరీ కోమ్ తన వ్యక్తిగత కోచ్ చోతేలాల్ యాదవ్‌కు ద్రోణాచార్య అవార్డు రానందున తనంతట తానే ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనలేదు. మరోవైపు రెజ్లర్ బజ్రంగ్ పునియా ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డు మార్గదర్శకాల ప్రకారం.. ఓ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో నాలుగు సంవత్సరాలుగా స్థిరమైన ప్రదర్శన కనబరచాలి. అవార్డు సిఫారసు చేసే సంవత్సరంలో అత్యుత్తమంగా రాణించి ఉండాలి. వీటితో పాటు నాయకత్వ లక్షణాలు, క్రీడా నైపుణ్యం, క్రమశిక్షణను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు నామినేట్ చేస్తారు. -
హర్భజన్, ద్యుతీ చంద్ నామినేషన్లు తిరస్కరణ!
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలకు భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్, టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్‌సింగ్ నామినేషన్లను కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించింది. అర్జున అవార్డుకు ద్యుతీచంద్, ఖేల్‌రత్న అవార్డుకు హర్భజన్‌సింగ్ నామినేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడువు ముగిసిన తర్వాత దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)కు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. ‘ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడువు ముగిసిన తరువాత నామినేషన్లు దాఖలు చేయడంతో వారి పేర్లను తిరస్కరించారు. ముఖ్యంగా ద్యుతీ చంద్ విషయంలో గడువు ముగియడమే కాకుండా, ఆమె పతకాలు కూడా ర్యాంకింగ్ క్రమంలో లేవు. దీంతో మంత్రిత్వ శాఖ పతకాల ప్రకారం ర్యాంకింగ్ ఇవ్వాలని అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ)ను కోరింది. అయితే వచ్చిన నామినేషన్స్‌లో ఆమె ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఆమె పేరును తిరస్కరించారు’ అని ఆ అధికారి చెప్పుకొచ్చారు. హర్భజన్ సింగ్ విషయానికి వస్తే దరఖాస్తులు స్వీకరణకు ఏప్రిల్ 30 ఆఖరి తేదీ కాగా, పంజాబ్ ప్రభుత్వం రెండు నెలలు ఆలస్యంగా పంపించింది. ఇదిలా ఉంటే, తన నామినేషన్ తిరస్కరణకు గురవడంపై ద్యుతీ చంద్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసింది. అనంతరం మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశాను. ఇటలీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో నేను గెలిచిన స్వర్ణ పతాకాన్ని ఆయనకు చూపించాను. నా ఫైల్‌ను పంపించాలని కోరాను. దానికి ఆయన అర్జున అవార్డుకు నామినేషన్‌ను తిరిగి పంపిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాబోయే పోటీలకు సిద్ధమవ్వాలని సూచించారు. అర్జున అవార్డు అవకాశాన్ని ఇంకా కోల్పోలేదు. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. రాష్ట్రంలో ఎన్నికలు, తుఫాను వల్ల నా నామినేషన్‌ను ఆలస్యంగా పంపించినట్లు తెలుసు’’అని అన్నారు. -
‘అర్జున’కు నలుగురు క్రికెటర్ల పేర్లు సిఫార్సు
ముంబై: ప్రతిష్ఠాత్మక అర్జున పురస్కారానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రతిపాదనలు పంపింది. 2019 అర్జున అవార్డులకు సంబంధించి ముగ్గురు పురుష క్రికెటర్లతో పాటు ఒక మహిళా క్రికెటర్ పేరును బీసీసీఐ ప్రతిపాదించింది. టీమిండియా క్రికెటర్లలో స్టార్ బౌలర్లు బుమ్రా, మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పేర్లను ప్రతిపాదించగా.. మహిళా క్రికెటర్లలో పూనమ్ యాదవ్ పేరును సూచించింది. సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీతో క్రికెట్ జీఎం సాబా కరీమ్ సమావేశమై వీరి పేర్లను సిఫార్సు చేశారు. ఇటీవల కాలంలో బుమ్రా నిలకడగా రాణిస్తూ టీమిండియా ప్రధాన పేసర్‌గా సేవలందిస్తున్నాడు. అదే సమయంలో షమీ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకుని భారత జట్టులో కీలక బౌలర్‌గా మారిపోయాడు. ఇక రవీంద్ర జడేజా టెస్టుల్లో, వన్డేల్లో ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకుంటున్నాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులో రవీంద్ర జడేజా మూడో స్పిన్నర్‌గా చోటు దక్కించుకున్నాడు. -
అర్జున అవార్డు గ్రహీత.. ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్నాడు!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో రజత పతక విజేత... ‘అర్జున’ అవార్డు గ్రహీత...ఈ ఘనతలేవీ కూడా ఒక అంతర్జాతీయ బాక్సర్‌కు చిరుద్యోగం, ఆర్థిక భద్రతను ఇవ్వలేకపోయాయి. ఫలితంగా అప్పులు తీర్చుకునేందుకు అతను రోడ్డుపై ఐస్ క్రీమ్‌లు అమ్ముకోవాల్సిన దీన స్థితి! 30 ఏళ్ల భారత వెటరన్ బాక్సర్ దినేశ్ కుమార్ పరిస్థితి ఇది. చాలా మందిలాగే హరియాణాలోని బాక్సింగ్ అడ్డా భివాని నుంచి వెలుగులోకి వచ్చిన దినేశ్ అంతర్జాతీయ స్థాయిలో 17 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు సాధించాడు. 2010లో చైనాలోని గ్వాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో దినేశ్ 81 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. అతని ప్రదర్శనకు గాను అదే ఏడాది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ‘అర్జున’ పురస్కారం కూడా అందుకున్నాడు. 2014 కామన్వెల్త్ క్రీడలకు కొద్ది రోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదం అతని కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేని దినేశ్ గత నాలుగేళ్లలో తీవ్రంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ‘నన్ను బాక్సర్‌గా తీర్చిదిద్దేందుకే మా నాన్న ఎన్నో అప్పులు చేశారు. అవన్నీ తీరక ముందే నాకు ప్రమాదం జరిగింది. చికిత్స కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఒక అంతర్జాతీయ ఆటగాడిగా నాకు గత ప్రభుత్వంతో పాటు ఇప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయం చేయలేదు. చిన్నపాటి ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నాకు రోజు గడవడంతో పాటు అప్పులు తీర్చాలంటే మరో మార్గం లేదు. అందుకే ఇలా తోపుడు బండిపై రోడ్డు మీద కుల్ఫీ (ఐస్‌క్రీమ్)లు అమ్మేందుకు సిద్ధమయ్యాను’ అని దినేశ్ కుమార్ ఆవేదనగా చెప్పాడు. 2018 ఆసియా క్రీడల విజేతలకు భారీ మొత్తంలో నగదు పురస్కారాలు ప్రకటించిన హరియాణా ప్రభుత్వం దినేశ్లాంటి గత విజేతను ఇప్పటిౖకైనా ఆదుకుంటుందేమో వేచి చూడాలి. -
కోహ్లికి ఖేల్‌రత్న.. సిక్కి రెడ్డికి అర్జున
సాక్షి, న్యూఢిల్లీ: క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డుని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అందుకోనున్నాడు. 2018 సంవత్సరానికి గానూ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది కోహ్లీతో పాటు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానులకు ఖేల్‌రత్న అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒక్కరికే అర్జున అవార్డు ఖాయమైంది. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ ప్లేయర్ సిక్కి రెడ్డి అర్జున అవార్డు పురస్కారం అందుకోనున్నారు. ఇక గతకొంత కాలంగా టేబుల్ టెన్నిస్‌లో ఎంతో మందికి శిక్షణనిస్తూ ఎన్నో పతకాలు సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కోచ్ శ్రీనివాస్ దోణాచార్య అవార్డు అందుకోనున్నారు. ఈ క్రీడా పురస్కారాలను సెప్టెంబర్ 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఓ కార్యక్రమంలో క్రీడాకారులు అందుకోనున్నారు. అవార్డు గ్రహీతలకు వైఎస్ జగన్ అభినందనలు కేంద్రం ప్రకటించిన క్రీడా పురస్కారాలకు ఎంపికైన క్రీడాకారులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కోచ్ శ్రీనివాసరావు, బాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. ఇరువురుకి లభించిన అవార్డులు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వ కారణమని పేర్కొన్నారు. ఇక గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా అవార్డులకు ఎంపికైన ఇరు రాష్ట్రాలకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి, కోచ్ శ్రీనివాస్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాది క్రీడా పురస్కారాలకు ఎంపికైనది వీరే.. రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న: విరాట్ కోహ్లి (క్రికెట్), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్). అర్జున అవార్డు: నేలకుర్తి సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), హిమ దాస్ (అథ్లెటిక్స్), స్మృతి మంధాన (క్రికెట్), సవిత పూనియా (హాకీ), రాహీ సర్నోబాత్ (షూటింగ్), శ్రేయసి సింగ్ (షూటింగ్), మనిక బాత్రా (టేబుల్ టెన్నిస్), పూజా కడియాన్ (వుషు), నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రోహన్ బోపన్న (టెన్నిస్), జి. సత్యన్ (టేబుల్ టెన్నిస్), జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), సతీశ్ కుమార్ (బాక్సింగ్), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), అంకుర్ మిట్టల్ (షూటింగ్), సుమీత్ (రెజ్లింగ్), రవి రాథోడ్ (పోలో), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), అంకుర్ ధామ (పారాథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్). ద్రోణాచార్య అవార్డు: జీవన్‌జ్యోత్ తేజ (ఆర్చరీ), ఎస్.ఎస్.పన్ను (అథ్లెటిక్స్), సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్), విజయ్ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), ఎ. శ్రీనివాసరావు (టేబుల్ టెన్నిస్) క్లారెన్స్ లోబో (హాకీ), తారక్ సిన్హా (క్రికెట్), జీవన్ కుమార్ శర్మ (జూడో), వి.ఆర్.బీడు (అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ అవార్డు: సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ చెత్రి (హాకీ), బాబీ అలోసియస్ (అథ్లెటిక్స్), దత్తాత్రేయ దాదూ చౌగ్లే (రెజ్లింగ్). -
‘అర్జున’కు బాక్సర్ అమిత్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన బాక్సర్ అమిత్ పంఘాల్‌ను ‘అర్జున’ అవార్డు కోసం భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నామినేట్ చేసింది. ఇండోనేసియా ఆతిథ్యమిచ్చిన క్రీడల్లో అతను లైట్ ఫ్లయ్ వెయిట్ (49 కేజీలు) ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)ను కంగుతినిపించాడు. దీంతో అతన్ని క్రీడాపురస్కారానికి నామినేట్ చేసినట్లు బీఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సోనియా లాథర్, గౌరవ్ బిధూరిలను నామినేట్ చేశారు. 22 ఏళ్ల అమిత్ తన నామినేషన్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. ‘నా పేరు నామినేట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. దీనిపై నాకంటే నా పతకమే బాగా మాట్లాడుతుంది’ అని చెప్పాడు. -
యుద్ధకళలతోనే మహిళలకు రక్షణ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : దేశవ్యాప్తంగా మహిళల ఆత్మరక్షణకు పాఠశాలల స్థాయిలోనే యుద్ధ కళలు నేర్పాలని అర్జున అవార్డు గ్రహీత పూనమ్ చోప్రా అభిప్రాయపడ్డారు. అనంతలో జరుగుతున్న రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ముఖ్య అతిథిగా ఆమె విచ్చేశారు. అనంతరం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక విషయాలు పంచుకున్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన పూనమ్ 1984 నుంచి ఇప్పటి వరకు జూడో క్రీడలో ఉంటూ 35 సార్లు ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. వివిధ కేటగిరీలకు చెందిన 22 మెడల్స్‌ను అందుకున్నారు. సాక్షి: జూడో క్రీడ గురించి మీ మాటల్లో .. పూనమ్: మార్షల్ ఆర్ట్స్‌లో మొదటి స్థానంలో జూడో క్రీడ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడ అత్యంత ప్రాచుర్యం పొందింది. కాలి వేలి నుంచి తల జుట్టు వరకూ ఈ క్రీడ ఉపయోగపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా జూడో క్రీడ 2వ స్థానంలో ఉంది. ఈ క్రీడను 1984 నుంచి ఆడుతున్నా. ఇప్పటి వరకు ఈ క్రీడకు ప్రాతినిధ్యం వహించా. సాక్షి: ఒలింపిక్స్‌లో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించారా? పూనమ్: ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున 1996లో ప్రాతినిధ్యం వహించా. ఏషియన్ గేమ్స్‌లో 29 ఏళ్ల తరువాత 1993లో చైనాలోని మకావూలో నిర్వహించిన జూడో క్రీడలో సిల్వర్ మెడల్ సాధించా. 1994లో జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన ఏకైక మహిళగా కీర్తిని సాధించా. సాక్షి: మహిళల ఆత్మరక్షణకు జూడో క్రీడ ఏవిధంగా ఉపయోగపడుతుంది? పూనమ్: జూడో క్రీడ అంటేనే సెల్ఫ్ డిఫెన్స్ అని అర్థం. ఇందులో బ్లాక్ బెల్ట్ సాధించిన వారు నాతోపాటు నలుగురి నుంచి ఐదుగురిని రక్షించగలదు. ప్రత్యర్థి వద్ద తుపాకి, నాన్చాక్, చాకు వంటి ఆయుధాలను సైతం ఎదుర్కునేందుకు వీలుంటుంది. ఈ క్రీడను రెజ్లింగ్‌లో అంతర్భాగంగా చెప్పొచ్చు. కానీ జపాన్‌కు సంబంధించిన క్రీడా పరిభాష దీనిలో మిళితమై ఉంటుంది. దీంతో పూర్తి ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంది. సాక్షి: ఏఏ దేశాల్లో ఈ క్రీడ ప్రాచుర్యం పొందింది. పూనమ్: ఈ క్రీడ ప్రధానంగా రష్యా, ఫ్రాన్స్, క్యూబా, కొరియా, జపాన్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో దీన్ని ఆడతారు. తరువాత స్థానంలో భారత్ ఉంది. సాక్షి: క్రీడలకు దేశంలో ఎలాంటి ఆదరణ లభిస్తుంది? పూనమ్:ప్రభుత్వాలు చేయూతనందించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయస్థాయికి ఎదిగిన తరువాత, పతకం సాధించిన తరువాత వారికి సహాయం చేస్తున్నారు. క్రీడాకారుడికి ముందునుంచే చేయూతనందిస్తే మరింత మెరుగైన ప్రతిభ సాధించొచ్చు. సాక్షి: భారత్ ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు చేయాల్సిన విధి ఏమిటి? పూనమ్: ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుతోపాటు అకాడమీలను, క్లబ్‌లను అత్యధిక సంఖ్యలో ఏర్పాటు చేసి, క్రీడాకారులకు ఉన్నత శ్రేణి శిక్షణ అందించాలి. వారికి ప్రోత్సాహకాలను అందించి ఆదుకోవాలి. సాక్షి: స్పోర్ట్స్ పాలసీపై మీ అభిప్రాయం? పూనమ్:హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్హుడా దీన్ని ప్రవేశ పెట్టారు. వారిని అనుసరించి గతంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ దీన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. క్రీడాకారులకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. సాక్షి: ఇండియాలో ఏఏ రాష్ట్రాలు జూడో క్రీడలో రాణిస్తున్నాయి? పూనమ్: దేశ వ్యాప్తంగా క్రీడ బాగా అభివృద్ధి సాధించింది. ముంబయ్, పూణే, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో అధిక సంఖ్యలో ఆడుతున్నారు. సాక్షి: మీకు భారత ప్రభుత్వం అర్జున అవార్డును ఎప్పుడు అందించింది? పూనమ్:భారత ప్రభుత్వం 1996లో అర్జున అవార్డు అందించింది. అదే ఏడాదిలో జూడలో అవార్డు సాధించిన ఏకైక మహిళగా కీర్తింపబడ్డా. సాక్షి: ఆర్డీటీ గురించి మీ మాటల్లో... పూనమ్:విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఆర్డీటీ వల్ల నేడు ఈ ప్రాంతానికి వచ్చేందుకు వీలైంది. ఇక్కడ 5 క్రీడల్లో శిక్షణ అందించడం ద్వారా ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశవ్యాప్తంగా క్రీడాభివృద్ధికి ఇలాంటి సంస్థలు సహకరించాలి. -
మహిళా ఉద్యోగిపై దాడి.. ప్రముఖ బాక్సర్‌పై కేసు
చండీగఢ్ : మహిళా ఉద్యోగిపై దాడి చేశారని ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహిత జై భగవాన్‌పై హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒలంపిక్ విజేత జై భగవాన్ ఫతేహాబాద్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు హిసార్‌లో లోని లక్ష్మీవిహార్ సమీపంలో మద్యం షాపు ఉంది. నిబంధనలకు విరుద్దంగా మద్యం అమ్ముతున్నారని ఆరోపనలు రావడంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గత నెల 19న రాత్రి 9 గంటలకు హీసార్ మహిళా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీవిహార్కు చేరుకొని మద్యం షాపు డాక్యుమెంట్లను చూపించాలని కోరారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జైభగవాన్ ఆమెపై దాడికి పాల్పడ్డారు. నిబంధనల ప్రకారమే మద్యం విక్రయిస్తున్నామంటూ ఆమెను అడ్డుకున్నారు. తన మనుషులతో ఆమెను చుట్టుముట్టారు. అసభ్యకరపదజాలంతో దూషించారు. గంటకు పైగా ఆమె కారును చుట్టిముట్టారు. దీంతో ఈ విషయాన్ని ఆమె పై అధికారుల వద్దకు తీసుకెళ్లారు. జై భగవాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా హిసార్ డిప్యూటీ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్(డీఈటీసీ) ని కోరారు. జై భగవాన్ వివాదంపై విచారణ చేపట్టాల్సిందిగా డీఈటీసీ హిరాస్ ఎస్పీని ఆదేశించారు. దీంతో ఈ నెల జూన్12 న భగవాన్‌పై కేసు నమోదు చేశారు. -
‘క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం’
సాక్షి, విజయవాడ: ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన జ్యోతి సురేఖ, ఆమె తండ్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆర్చరీ కోచ్ చెరుకూరి సత్యనారాయణ గురువారం ర్యాలీ నిర్వహించారు. స్ధానిక మొగల్రాజ్ పురం సిద్ధార్థ కాలేజీ నుంచి శాప్ కార్యాలయం వరకు తలపెట్టిన ర్యాలీలో 13 జిల్లాలకు చెందిన ఆర్చరీ అసోసియేషన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ.. జ్యోతి సురేఖ, అమె తండ్రితో పది రోజుల్లో క్షమాపణ చెప్పిస్తామని శాప్ చైర్మన్ హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు క్షమాపణ చెప్పలేదన్నారు. వారిద్దరూ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తానని ఆయన తెలిపారు. తనను, తన కుటుంబాన్ని జ్యోతి సురేఖ అవమానించారని మండిపడ్డారు. గురుశిష్య సంబంధాలను సురేఖ గౌరవించాలని సూచించారు. జోత్యి సురేఖ ఏపీ తరపున ఆడడం లేదన్నారు. మరోవైపు ఆర్చరీ క్రీడాకారులకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నగదు, ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆరోపణలపై జ్యోతి సురేఖ క్షమాపణ చెప్పాలి
-
వాళ్లిద్దరూ నా పరువు తీశారు
విజయవాడ : ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన జ్యోతి సురేఖ, ఆమె తండ్రి ఈ రోజు నా పరువు బజారున పడేశారని చెరుకూరి వోల్గా ఆర్చరీ సెంటర్ నిర్వాహకుడు చెరుకూరి సత్యనారాయణ అన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..తాను అడగని డబ్బులకు అడిగినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను హాస్టల్ వార్డెన్ అని సంభోదించి పరువు తీశారని చెప్పారు. ఆమె మాటలు ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. తన మీద చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు చెప్పి రాద్ధాంతం చేస్తే ప్రభుత్వం సురేఖకు ఇవ్వాల్సిన ఉద్యోగం, ఇంటి స్థలం, డబ్బులు ఇస్తుందని ఈ డ్రామా నడిపించారని విమర్శించారు. 2007 నుంచి 2013 మార్చి వరకు మా అకాడమీలో జ్యోతి సురేఖ శిక్షణ తీసుకుందని, నా కుమారుడు చనిపోయిన తర్వాత అకాడమీ సురేఖది అన్నట్లు సురేఖ తండ్రి ప్రవర్తించేవాడని విమర్శించారు. సురేఖ ఆంధ్రప్రదేశ్ తరపున ఆడటం లేదని, పెట్రోలియం శాఖ తరపున ఆడుతోందని వెల్లడించారు. అటువంటి సురేఖకు ఏపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి కుదరదని చెప్పారు. తన అకాడమీలో శిక్షణ తీసుకుని తాను కోచ్ కాదంటే ఎలా అని ప్రశ్నించారు. తన కుమారునికి రాని అవార్డు, జ్యోతి సురేఖకు ఎలా వచ్చిందని సూటిగా అడిగారు. గురువును అవమానించడం సురేఖకు తగదన్నారు. తమకు క్షమాపణ చెప్పే వరకు తన కుమారుడి సమాధి దగ్గర నిరసన దీక్ష చేస్తామని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ (శాప్), కోచ్‌లు తనకు రావాల్సిన నజరానాలను అడ్డుకుంటున్నారని అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. -
‘అర్జున’ జ్యోతి ఆవేదన
విజయవాడ స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ (శాప్), కోచ్‌లు తనకు రావాల్సిన నజరానాలను అడ్డుకుంటున్నారని అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆరోపించింది. తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అర్జున అవార్డు పొందిన తర్వాత సీఎం చంద్రబాబు రూ.కోటి నజరానా ప్రకటించినా ఇప్పటివరకు అందలేదని తెలిపింది. సహాయం చేయకపోగా అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 3న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో తనకు కోచ్‌గా చెరుకూరి సత్యనారాయణను చూపిస్తూ రూ.15 లక్షల మంజూరు చేయడాన్ని ఖండించింది. తనకు ఏనాడు ఆయన కోచ్‌గా వ్యవహరించలేదని స్పష్టం చేసింది. తన కోచ్‌లు జె.రామారావు, జీవన్‌జ్యోత్‌సింగ్ అని స్పష్టం చేసింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా చెరుకూరి సత్యనారాయణ అడ్డుకున్నారని దీంతో పెట్రోలియం స్పోర్ట్స్ బోర్డ్ తరఫున ఆడాల్సి వచ్చిందని తెలిపింది. 2013లోనే ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పింది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఇంటి స్థలం, గ్రూపు–1 ఉద్యోగాన్ని ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం స్పందించకపోతే సోమవారం నుంచి నిరాహార దీక్షకు దిగుతానని పేర్కొంది. బేసిక్ కోచ్‌ను నేనే: చెరుకూరి సత్యనారాయణ జ్యోతి సురేఖకు నేను, నా కుమారుడు లెనిన్ శిక్షణ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చాం. నేనే బేసిక్ కోచ్‌ని. క్రీడా పాలసీ ప్రకారం బేసిక్ కోచ్‌లకు గౌరవ ఇన్సెంటివ్‌లు ఇస్తారు. అదే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. నేను కోచ్‌ను కాదని సురేఖ తండ్రి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఆర్చరీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది నా కుమారుడు లెనిన్. శాప్ నా కుమారుడిని అర్జున, ద్రోణాచార్య అవార్డులకు రిఫర్ చేయడం లేదు. -
మన్‌ప్రీత్‌కు అర్జున, చెత్రికి ధ్యాన్‌చంద్...
న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్, మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘అర్జున’ అవార్డుకు పరిశీలించాలని హాకీ ఇండియా (హెచ్ఐ) భారత ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇతనితో పాటు మరో ఇద్దరిని కూడా నామినేట్ చేసింది. మిడ్‌ఫీల్డర్ ధరమ్వీర్ సింగ్, మహిళల జట్టు గోల్ కీపర్ సవితను హెచ్ఐ సిఫార్సు చేసింది. దశాబ్దానికి పైగా మహిళల హాకీ జట్టుకు సేవలందించిన మాజీ ప్లేయర్ సంగాయి ఇబెంహల్ చాను, పురుషుల మాజీ కెప్టెన్ భరత్ చెత్రిలను ‘ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య’ పురస్కారానికి... కోచ్ బి.ఎస్.చౌహాన్‌ను ‘ద్రోణాచార్య’ అవార్డుకు ప్రతిపాదించామని హెచ్ఐ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ తెలిపారు. -
‘అర్జున’కు సిక్కి రెడ్డి పేరు సిఫారసు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ‘అర్జున అవార్డు’కు సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిక్కి రెడ్డి పేరును ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ నామినేట్ చేశారు. ఇటీవలే గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న సిక్కి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి కాంస్య పతకం సాధించింది. -
‘అర్జున’కు ధావన్, స్మృతి పేర్లు
న్యూఢిల్లీ: ఓపెనర్లు శిఖర్ ధావన్, స్మృతి మంధాన పేర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అర్జున అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ధావన్ ప్రస్తుతం టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో సేవలందిస్తుండగా... స్మృతి ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లలో పరుగుల వరద పారించింది. మరోవైపు లార్డ్స్‌లో మే 31న వెస్టిండీస్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య జరుగనున్న చారిటీ టి20 మ్యాచ్ కోసం బీసీసీఐ దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా పేర్లను పంపింది. వీరిద్దరు వరల్డ్ ఎలెవన్ తరఫున ఆడనున్నారు. -
‘అర్జున’కు ధావన్, మంధాన
-
‘అర్జున’కు ధావన్, మంధాన
సాక్షి, ముంబై: క్రీడల్లో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డుకు టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానల పేర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రతిపాదించింది. ఈ విషయాన్ని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి బుధవారం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఈ ఆటగాళ్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకే వారిని అర్జున అవార్డుతో సత్కరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శిఖర్ ధావన్ ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సన్‌రైజర్స్ తొలి రెండు మ్యాచ్‌లు గెలవడంలో ధావన్ పెద్దన్నపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయి, ఇంగ్లండ్‌పై టీమిండియా వన్డే సిరీస్ గెలవడంలో మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పాత్ర మరువలేనిది. -
అర్జునా అవార్డుకు మనికా బత్రా పేరు సిఫార్సు
-
క్రీడా పురస్కారాల కార్యక్రమానికి పుజారా దూరం
న్యూఢిల్లీ: ‘అర్జున’ అవార్డు పొందిన భారత స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా... న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నేడు(మంగళవారం) జరిగే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొనడంలేదు. ఇంగ్లండ్‌లోని కౌంటీ క్రికెట్ పోటీల్లో ఆడుతున్నందున తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని పుజారా తెలిపాడు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ) ‘అర్జున’ అవార్డులను... గంగుల ప్రసాద్ (బ్యాడ్మింటన్) ‘ద్రోణాచార్య’ అవార్డును, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ షాహిద్ హకీమ్ (ఫుట్‌బాల్) ‘ధ్యాన్‌చంద్’ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా స్వీకరించనున్నారు. -
‘అర్జున’కు నేనూ అర్హుడినే: సంధూ
న్యూఢిల్లీ: ‘అర్జున’ అవార్డుల విషయంలో మరో క్రీడాకారుడు నిరసన గళం విప్పాడు. మూడోసారి కూడా ఈ అవార్డు కోసం తనను విస్మరించడంపై భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత జట్టులో అతను సభ్యుడు. ‘ఈసారి కచ్చితంగా నా పేరు జాబితాలో ఉంటుందని భావించాను. అయితే అర్హత ఉన్నప్పటికీ నన్ను పరిగణనలోకి తీసుకోకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది’ అని 28 ఏళ్ల సంధూ తెలిపాడు. తనకు సహచరుడు సౌరవ్ ఘోషాల్‌కు మద్దతు తెలుపుతూ 2014లోనే అతడికి అర్జున రావాల్సిందని అన్నాడు. అయితే సంధూ టీమ్ ఈవెంట్స్‌లో కీలకంగా ఉంటున్నా... వ్యక్తిగత విభాగంలో ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించకపోవడం అతడి అవకాశాలను దెబ్బతీస్తోంది. -
సురేఖకు ప్రధాని అభినందన
‘అర్జున అవార్డు’కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన మోదీ... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, మురళీమోహన్, ‘శాప్’ చైర్మన్ పీఆర్ మోహన్ తదితరులు సురేఖ వెంట ఉన్నారు. -
'ఆమె నా కూతురైనందుకు గర్వపడుతున్నా'
ఢిల్లీ: అత్యున్నత క్రీడా పురస్కారాలలో ఒకటైన అర్జున అవార్డుకు టీమిండియా మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్‌కౌర్ పేరును ప్రతిపాదించడంపై ఆమె తండ్రి హర్మందర్ సింగ్ బుళ్లార్ హర్షం వ్యక్తం చేశారు. ఆడపిల్లలు భారమని ఎందరో తల్లిదండ్రులు భావిస్తుంటారు కానీ ఆడపిల్లకు తండ్రిని కావడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. కూతురిగా హర్మన్‌ప్రీత్‌ను అందించిన దేవుడికి రుణపడి ఉంటానన్నారు. తన కూతురు హర్మన్ ప్రీత్ పేరును అర్జున అవార్డు కోసం పరిగణనలోకి తీసుకున్నందుకు ప్రభుత్వానికి, బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ పలు కీలక ఇన్నింగ్స్ ఆడింది. ముఖ్యంగా సెమీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ సెంచరీతో జట్టును ఫైనల్ చేర్చడం ఒకటి. భుజం గాయం బాధిస్తున్నప్పటికీ.. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లోనూ హాఫ్ సెంచరీతో హర్మన్ ప్రీత్ కీలక ప్రదర్శణ చేసింది. మన జాతీయ క్రీడైన హాకీలో సుదీర్ఘకాలంగా ముఖ్య భూమిక పోషిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్, పారా ఒలింపియన్ దేవేందర్ ఝఝారియాను ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించగా.. అర్జునకు సిఫారుసు చేసిన వారిలో క్రికెటర్లు చటేశ్వర పుజరా(పురుష క్రికెటర్), హర్మన్ ప్రీత్ కౌర్ (మహిళా క్రికెటర్)లతో పాటు పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మరియప్పన్ తంగవేలు, వరుణ్ భాటి, గోల్ఫర్ ఎస్ ఎస్ పీ చవ్రాసియా, హాకీ ఆటగాడు ఎస్ వీ సునీల్ సహా 17 మంది ఉన్నారు. -
‘అర్జున’కు సిక్కి, సుమీత్ పేర్లు ప్రతిపాదన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు కోసం ఈసారి బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులు సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి పేర్లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదించింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ జాతీయ జట్టులో రెగ్యులర్ సభ్యులుగా మారిన వీరిద్దరిని ‘అర్జున’ కోసం నామినేట్ చేసినట్లు ‘బాయ్’ అధికారి ఒకరు తెలిపారు. కాగా వీరిద్దరూ త్వరలో వివాహబంధంతో ఒకటి కానున్నారు. ఫిబ్రవరిలో సుమీత్, సిక్కిల నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ అంతర్జాతీయ టోర్నీలో ప్రణవ్ చోప్రాతో మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్‌ను గెలిచిన సిక్కిరెడ్డి... అశ్విని పొన్నప్పతో కలిసి మహిళల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ కూడా అశ్విని పొన్నప్పతో కలిసి సయ్యద్ మోడీ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. గతేడాది కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయం విజేతగా నిలిచింది. -
'అర్జున'కు పుజారా పేరు ప్రతిపాదన
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా పురస్కారం అర్జున అవార్డు కోసం భారత క్రికెటర్ చటేశ్వర పుజారా పేరును భారత క్రికెట్ కంట్రోల్(బీసీసీఐ) బోర్డు ప్రతిపాదించింది. గత సీజన్ లో అద్భుతమైన ఆట తీరును కనబరిచిన పుజారాకు అర్జున అవార్డును నామినేట్ చేస్తూ సోమవారం సమావేశమైన బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మహిళా క్రికెట్ సభ్యురాలు హర్మన్ ప్రీత్ కౌర్ పేరును కూడా బీసీసీఐ ప్రతిపాదించింది. అయితే క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న కోసం మాత్రం బీసీసీఐ నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదు. 'మేము రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కోసం ఎవరు పేరు ప్రతిపాదించడంల లేదు. కేవలం చటేశ్వర పుజరా, హర్మన్ ప్రీత్ పేర్లను మాత్రమే అర్జున అవార్డు కోసం నామినేట్ చేశాం. వారిద్దరి ప్రదర్శన ఆధారంగానే అర్జునకు ఎంపికకు ప్రతిపాదించాం'అని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
మహిళా షూటర్‌పై అత్యాచారం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ జాతీయ స్థాయి మహిళా షూటర్‌పై సహచర ఆటగాడే అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ అర్జున అవార్డీ షూటర్ చివరికి మోసం చేసి పరారయ్యాడు. దీంతో మహిళా షూటర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న ఈ షూటర్ రెండేళ్ల నుంచి తెలుసని... భారత స్పోర్ట్స అథారిటీ (సాయ్) షూటింగ్ రేంజిలో జాతీయ చాంపియన్‌షిప్స్ కోసం జరిగిన శిక్షణ సందర్భంగా పరిచయం అయ్యాడని మహిళా షూటర్ తన ఫిర్యాదులో పేర్కొంది. వివాహం చేసుకుంటానని నమ్మించి, గత నెలలో పానీయంలో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడని తెలిపింది. వైద్యపరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్టు చెప్పారు. మరోవైపు ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) పేర్కొంది. అయితే మీడియా ద్వారానే ఈ విషయం తెలుసుకున్నామని, ఢిల్లీ పోలీసుల నుంచి పూర్తి వివరాలు అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్ఆర్ఏఐ కార్యదర్శి రాజీవ్ భాటియా తెలిపారు. -
‘అర్జున’ను అందుకున్న రోహిత్, రహానే
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే అర్జున పురస్కారాలను అందుకున్నారు. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి విజయ్ గోయల్ వారికి ఈ క్రీడా పురస్కారాలను అందించారు. అవార్డు కింద చెరో రూ.5 లక్షల నగదుతో పాటు ప్రతిమను అందించారు. జాతీయ క్రీడా దినోత్సవం రోజున రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొనలేదు. భారత్‌లో క్రికెట్‌కు అమిత ఆదరణ ఉన్నా, ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మిగతా ఆటలకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తోందని మంత్రి గోయల్ తెలిపారు. -
ఖేల్ రత్న అవార్డులకు ప్రాతిపదిక ఏంటీ?
న్యూఢిల్లీ: క్రీడాకారులకు భారత ప్రభుత్వం ఏటా ఇచ్చే అత్యుత్తమ ‘ఖేల్ రత్న’ అవార్డును ఈసారి నలుగురు ఒలింపిక్ క్రీడాకారులకు ఇచ్చిన విషయం తెల్సిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సోమవారం ఈ అవార్డు అందుకున్న గ్రహీతల్లో పీవీ సింధు, సాక్షి మాలిక్‌లు ఒలింపిక్ మెడల్స్ అందుకున్నవారుకాగా, దీపా కర్మాకర్, జీతూ రాయ్‌లు ఒలింపిక్స్‌లో గట్టి పోటీ ఇచ్చినా పతకం రానివారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఖేల్ రత్న అవార్డులతోపాటు రెండవ అత్యుత్తమ అవార్డు అయిన అర్జున అవార్డులను 15 మంది క్రీడాకారులకు అందజేసింది. ద్రోణాచార్య, ద్యాన్‌చంద్ లాంటి అవార్డుల విషయాన్ని పక్కన పెడితే ఖేల్ రత్న, అర్జున అవార్డులను ప్రదానం చేస్తున్న తీరును గమనిస్తే కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న క్రైటేరియా ఏమిటనే సందేహం రాకపోదు. క్రీడా రంగంలో వరుసగా నాలుగేళ్లపాటు ‘స్పెక్టాక్యులర్ (అద్భుతంగా)’, ‘అవుట్ స్టాండింగ్ (అసాధారణం)’ రాణించిన క్రీడాకారులకు ఈ అవార్డులను ఇవ్వాలని కేంద్ర క్రీడాశాఖ మార్గదర్శకాలు తెలియజేస్తున్నాయి. స్పెక్టాక్యులర్, అవుట్ స్టాండింగ్ అనే పదాలకు సరైన నిర్వచనమే మార్గదర్శకాల్లో లేదు. అంటే కేంద్రంలో అధికారంలోవున్న ఏ ప్రభుత్వమైనా ఈ పదాలను ఎలాగైనా వాడుకోవచ్చన్నమాట. ఖేల్‌రత్న, అర్జున అవార్డుల కోసం క్రీడాకారులను ఎంపిక చేయడానికి మాజీ క్రీడాకారులు, మాజీ అవార్డు గ్రహీతలు, ఒలింపియన్స్, క్రీడల జర్నలిస్టులు, నిపుణులు, క్రీడల నిర్వాహకులు, కామెంటేటర్లతో కూడిన ఓ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ అవార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. వివిధ రకాల క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులు గత నాలుగేళ్లలో సాధించిన విజయాలేమిటో పరిశీలించి వాటికి 80 మార్కులు వేస్తుంది. ఆ తర్వాత వారి ఒవరాల్ ప్రతిభను పరిగణలోకి తీసుకొని మరో 20 వెయిటేజ్ మార్కులు వేసే అధికారం కమిటీకి ఉంది. ఆ తర్వాత అవార్డులకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను కేంద్ర క్రీడల శాఖ మంత్రికి పంపిస్తుంది. తుది నిర్ణయం ఆ మంత్రియే తీసుకోవాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పులను సూచించే అధికారం కూడా ఆ మంత్రికి ఉంటుంది. ఇప్పటి వరకు ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు ఎంపిక చేయడంలో పారదర్శకత పాటించారా? అత్యుత్తమ అవార్డు అయిన ఖేల్ రత్ననే పరిగణలోకి తీసుకుంటే ఆయా కాలాల్లో అంతర్జాతీయ క్రికెట్ రంగంలో బాగా రాణించిన రాహుల్ ద్రవిడ్ (24,208 పరుగులు), సౌరభ్ గంగూలి (18,575 పరుగులతోపాటు ఉత్తమ కెప్టెన్‌గా గుర్తింపు)కి, దేశంలోనే అత్యధిక వికెట్లు తీసుకున్న అనిల్ కుంబ్లే (956 వికెట్లు)లను ఎందుకు విస్మరించారు.? క్రికెట్లో సచిన్‌కు తప్పా ఎవరికి ఖేల్ రత్న ఇవ్వలేదని, ఆ క్రీడను అవార్డు కోసం అంతగా పరిగణలోకి తీసుకోమని సమాధానం వచ్చినట్లయితే 12 మేజర్స్‌లో విజయం సాధించిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మహేశ్ భూమతిని ఎందుకు విస్మరించారనే ప్రశ్న తలెత్తక మానదు. 1999 నుంచి 2002 మధ్య ఆయన కనీసం ఐదు మేజర్స్‌లో విజయం సాధించారు. చెస్‌లో విశ్వనాథ ఆనంద్‌కు మొట్టమొదటిసారిగా 1991–1992లో ఖేల్ రత్న అవార్డు రాగా ఎక్కువ మందికి షూటింగ్‌లోనే ఖేల్ రత్న అవార్డులు వచ్చాయి. ఏ క్రీడలను ప్రోత్సాహించాలనుకుంటున్నారో, ఎవరికి అవార్డులు వస్తాయో సందేహాస్పదంగా ఉంటోంది. ఒలింపిక్స్‌లో ఉత్తమంగా రాణించారనే ఉద్దేశంలో ఈసారి నలుగురు ఒలింపియన్లకు ఖేల్ రత్న అవార్డులు ఇచ్చారని సరిపెట్టుకోవచ్చు. ప్రతిసారి అలా జరగడం లేదుకదా, ప్రతి ఏడాది ఒలింపిక్స్ ఉండవుకదా! అందుకని ఎంపిక క్రైటేరియానే మార్చాల్సి ఉంటుందేమో! -
పతకం తెస్తే పురస్కారం గ్యారంటీ!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో పతకాలు సాధించే క్రీడాకారులను తక్షణమే తగురీతిలో గుర్తిస్తామని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ హామీయిచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ లో పతకాలు గెలిస్తే అవార్డులు ఇస్తామని ప్రకటించింది. విజేతల పేర్లను ఈ ఏడాది రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులకు పరిగణన తీసుకుంటామని వెల్లడించింది. దీంతో ఒలింపిక్స్ లో ఆటగాళ్లు పతకాలు గెలిచిన తర్వాత అవార్డుల కోసం ఏడాది కాలం పాటు వేచిచూడాల్సిన అవసరం తప్పింది. వ్యక్తిగత విభాగంలో పతకాలు సాధించిన వారి పేర్లను దేశ అత్యున్నత క్రీడాపురస్కారం 'రాజీవ్ ఖేల్ రత్న'కు సిఫారసు చేస్తామని చెప్పింది. క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటనతో ఒలింపిక్స్ లో పాల్గొనబోయే ఆటగాళ్లకు సరికొత్త ప్రోత్సాహం లభించినట్టైంది. -
కోహ్లీకి ఖేల్ రత్న, రహానేకు అర్జున సిఫార్సు
* అర్జునకు రహానే * బీసీసీఐ ప్రతిపాదన న్యూఢిల్లీ: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర’కు బీసీసీఐ ప్రతిపాదించింది. అలాగే అర్జున అవార్డు కోసం అజింక్యా రహానే పేరును కూడా క్రీడా శాఖకు సిఫారసు చేసింది. వీరిద్దరి పేర్లను సెలక్షన్ కమిటీకి పంపినట్టు క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఖేల్త్న్ర కోహ్లిని వరిస్తే నాలుగేళ్ల అనంతరం ఈ అవార్డును దక్కించుకున్న మూడో క్రికెటర్‌గా నిలుస్తాడు. గతంలో సచిన్, ధోని అందుకున్నారు. ఖేల్ రత్నకు రూ.7.5 లక్షలు, అర్జునకు రూ.5 లక్షలు అందిస్తారు. ఈ పురస్కారం విషయంలో కోహ్లికి స్క్వాష్ చాంపియన్ దీపికా పళ్లికాల్, గోల్ఫర్ అనిర్బాన్ లాహిరి, ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత షూటర్ జితూ రాయ్, రన్నర్ టింటూ లూకాలతో పోటీ ఎదురుకానుంది. -
‘అర్జున’ విజేత నరీందర్ ఆత్మహత్య
జలంధర్: అర్జున అవార్డు గ్రహీత, అసిస్టెంట్ కమాండెంట్ నరీందర్ సింగ్(45) ఉరివేసుకుని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలో ఓ హత్య కేసుకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదు కావడంతో ఈయనను రెండేళ్ల క్రితం సస్పెండ్ చేసినట్లు జలంధర్ పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి మానసిక వేదనతో ఉన్న కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చెప్పారు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కాగా ఓ మహిళా పోలీస్ అధికారిపై ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినట్లు నరీందర్పై ఆరోపణలు కూడా ఉన్నట్లు మరో అధికారి పేర్కొన్నారు. నరీందర్ జూడో క్రీడాకారుడు. కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్‌లో పాల్గొని సత్తా చాటాడు. 1998లో కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రదానం చేసింది. -
దేశం కోసం ఆడటం గౌరవం
తాను శక్తి ఉన్నంత వరకూ భారత్ తరఫునే బరిలోకి దిగుతానని అర్జున అవార్డీ మన్ దీప్ జంగ్రా స్పష్టం చేశాడు. బాక్సింగ్ లో తన సీనియర్ విజయేందర్ ఈ నెలలో ప్రొఫెషనల్ బాక్సింగ్ అరంగేట్రం పై స్పందించిన మన్ దీప్.. సీనియర్ గా విజయేందర్ పై చాలా గౌరవం ఉందని అన్నాడు. అతడి ఆట చూస్తూనే పెరిగాం అని గుర్తుచేసుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా రాణించాలనేది అతడి వ్యక్తిగత నిర్ణయం అని అన్నాడు. కానీ.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవ మని..చెప్పాడు. విజయేందర్ క్వీన్స్ బెర్రీ ప్రమోషన్స్ తో ఒప్పందం వల్ల ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆడే అవకాశం వచ్చిందని తెలిపాడు. తాను ఇలాంటి ఆఫర్ ను తిరస్కరిస్తానని స్పష్టం చేశాడు. డబ్బు కోసం ఆడటం కంటే.. దేశం కోసం తనకు సంతోషాన్ని ఇస్తుందని అన్నాడు. -
వీళ్లు మనకు తెలుసునా..!
గతవారం ఢిల్లీలో క్రీడా ఆవార్డుల కార్యక్రమం ముగిసింది. జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియా వరకూ అంతా రాజీవ్ ఖేల్ రత్న సానియా మీర్జా ఫోటోను ప్రముఖంగా ప్రచురించాయి. ప్రొఫెషనల్ టెన్నిస్ లో సానియా సాధించిన విజయాలకు ఖేల్ రత్న ఖచ్చితంగా సముచితమైన గౌరవమే..అయితే సానియా తో పాటు మరో డజను మంది ఆటగాళ్లు గత ఏడాది కాలంగా తమ తమ రంగాల్లో చూపిన అత్యుత్తమ ప్రదర్శనకు అర్జున అవార్డులు గెలుచుకున్నారు. దురదృష్ట వశాత్తు వీరిని మీడియా పట్టించుకోలేదు. అవార్డుల వెనక రాజకీయాలు... క్రీడా బోర్డుల అతి చొరవ, అనేక వివాదాలు మాత్రమే మీడియా దృష్టిని ఆకర్షస్తాయి. ఆటలంటే.. క్రికెట్, చెస్, సానియా, సైనాలు మాత్రమే కాదు అని ఎంతో మంది తమ అద్వితీయ ఆటతీరుతో నిరూపిస్తున్నా.. కోట్లాది భారతీయుల గుర్తింపునకు మాత్రం నోచుకోవడం లేదు.. అలాంటి అన్ సంగ్ హీరోస్ దేశంలో చాలా మందే ఉన్నా.. కనీసం ఈ ఏడాది రాష్ట్ర పతి చేతులతో అవార్డులు పొందిన క్రీడాకారుల ఎంత మంది మనకు తెలుసు.. ? సందీప్ కుమార్: ఆర్చరీ పూనేకి చెందిన సందీప్ కుమార్ ఆసియా క్రీడల్లో పటిష్ట కొరియాని మట్టి కరిపించి ఈ విభాగంలో తొలి బంగారు పతకాన్ని భారత్ కు అందించాడు. పూనమ్మ: అథ్లెటిక్స్ ఆఫ్రికా, యూరప్, అమెరికాలు డామినేట్ చేసే ఈ విభాగంలో మన పూవమ్మ ప్రపంచ 42 రెండో ర్యాంక్ లో కొనసాగుతోంది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400మీటర్ల వ్యక్తిగత కాంస్య పతకంతో పాటు, బంగారు పతకం గెలుచుకున్న 4X400 మీటర్ల రిలే టీమ్ లో సభ్యురాలు. అంతే కాదు ఆసియా స్థాయిలో బోలెడు వ్యక్తిగ పతకాలు సాధించి.. అర్జున అవార్డుకు అర్హత పొందింది. దీపా కుమార్: జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్స్ లో దీపా కుమార్ చరిత్రే సృష్టించింది. గ్లాస్కో కామన్ వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించి.. ఈ విభాగంలో పోడియం ఫినిష్ ఇచ్చిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. ఆసియా క్రీడల్లో పతకం తృటిలో కోల్పోయినా.. దీపా ప్రదర్శన విమర్శకుల ప్రశంసలందుకుంది. శ్రీజేష్ : హాకీ మన జాతీయ క్రీడా హాకీలో అద్భుత ప్రదర్శనకు గానూ.. శ్రీజేష్ అర్జున అవార్డు అందుకున్నాడు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం అందుకున్న భారత జట్టు గోల్ కీపర్ శ్రీజేష్. అంతే కాదు. ఈ క్రీడల్లో పాకిస్తాన్ మ్యాచ్ లో శ్రీజేష్ అద్వితీయ ప్రదర్శన ఆయనకు ఆర్జున అవార్డు తెచ్చిపెట్టింది. ఫైనల్లో పాకిస్థాన్ సంధించిన రెండు పెనాల్టీ స్ట్రోక్ లను శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఇక 2014 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. సతీష్ కుమార్: వెయిట్ లిఫ్టింగ్ అనామకుడిగా కామన్ వెల్త్ క్రీడల్లో అడుగు పెట్టిన ఈ 23ఏల్ల తమిళనాడు క్రీడాకారుడు... 77 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో గేమ్స్ రికార్డు బద్దలు కొట్టడమే కాదు.. బంగారు పతకాన్ని సాధించాడు. స్వరణ్ సింగ్ : రోయింగ్ 2012 సమ్మర్ ఓలింపిక్స్ లో రోయింగ్ లో ఫైనల్ కు చేరిన స్వరణ్.... 2013 ఆసియా రోయింగ్ చాంఫియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. ఇక 2014 ఆసియా క్రీడల్లో తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతూ కూడా కాంస్య పతకాన్ని సాధించాడు. ఇక అందరికంటే స్పెషల్ క్రీడాకారుడిని వరించి అర్జున అవార్డు మరింత వన్నెలద్దుకుంది. అతని పేరు శరత్ గైక్వాడ్. వివిద విభాగాల్లో అత్యధిక మెడల్స్ సాధించిన ప్రఖ్యాత క్రీడాకారిణి పీటీ ఉష రికార్డును బద్దలు కొట్టిన శరత్ బెంగుళూరు వాసి. 2014 ఆసియా క్రీడల్లో ప్యారా స్విమ్మింగ్ విభాగంలో 6 పతకాలు సాధించాడు. 2012లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్న శరత్.. భారత్ తరఫున పారాలంపిక్స్ కు వెళ్లిన తొలి భారతీయ క్రీడాకారుడు కావడం గమనార్హం. -
తెలుగు తేజం శ్రీకాంత్‌కు అర్జున అవార్డు
-
ఖేల్ రత్న సానియా
-
ఖేల్ రత్న సానియా
♦ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న టెన్నిస్ ప్లేయర్ ♦ అర్జున అవార్డు స్వీకరించిన శ్రీకాంత్, అనూప్ న్యూఢిల్లీ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న’ అవార్డును అందుకుంది. శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. అవార్డు కింద పతకం, సర్టిఫికెట్తో పాటు ఏడున్నర లక్షల నగదును బహుకరించారు. మెరూన్ రంగు చీర, పైన బ్లేజర్ ధరించిన ఈ హైదరాబాదీ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, అవార్డు స్వీకరించే సమయంలో దర్బాల్ హాల్లోని అతిథులు చప్పట్లతో ఘనంగా స్వాగతించారు. కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌తో పాటు రోలర్ స్కేటింగ్ ప్లేయర్ అనూప్ కుమార్ యామా ‘అర్జున’ అవార్డులను ప్రణబ్ చేతుల మీదుగా స్వీకరించారు. అవార్డు కింద జ్ఞాపిక, సర్టిఫికెట్, 5 లక్షల నగదును ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ మాజీ ప్లేయర్ శివ ప్రకాశ్ మిశ్రాకు ‘ద్రోణచార్య’, సాయిబాబా వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌కు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ’ పురస్కారాలను అందజేశారు. అర్జున అవార్డుకు ఎంపికైన క్రికెటర్ రోహిత్, బాక్సర్ మన్దీప్ జాంగ్రా, రన్నర్ ఎం.ఆర్.పూవమ్మ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అర్జున గ్రహీతలు: శ్రీజేశ్ (హాకీ), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్), సందీప్ కుమార్ (ఆర్చరీ), బబిత (రెజ్లింగ్), భజరంగ్ (రెజ్లింగ్), స్వరణ్ సింగ్ విర్క్ (రోయింగ్), సతీశ్ శివలింగం (వెయిట్‌లిఫ్టింగ్), సంతోయ్ దేవి (వుషు), శరత్ గైక్వాడ్ (పారా సెయిలింగ్), మంజీత్ చిల్లర్ (కబడ్డీ), అభిలాష మహత్రే (కబడ్డీ). ద్రోణాచార్య గ్రహీతలు: నావల్ సింగ్ (అథ్లెటిక్స్-పారా స్పోర్ట్స్), అనూప్ సింగ్ (రెజ్లింగ్), హర్భన్స్ సింగ్ (అథ్లెటిక్స్-లైఫ్‌టైమ్), స్వతంతర్ రాజ్‌సింగ్ (బాక్సింగ్-లైఫ్‌టైమ్), నీహర్ అమీన్ (స్విమ్మింగ్-లైఫ్‌టైమ్). ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు: రోమియో జేమ్స్ (హాకీ), శివ ప్రకాశ్ మిశ్రా (టెన్నిస్), టీపీపీ నాయర్ (వాలీబాల్). కేసీఆర్ అభినందన ఖేల్ రత్న స్వీకరించిన సానియాకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రభుత్వం గుర్తిస్తే గర్వంగా ఉంటుంది. ఈ అవార్డు కోసం నా పేరు ప్రతిపాదించిన క్రీడాశాఖకు కృతజ్ఞతలు. నేను మరింత బాగా ఆడాలనే స్ఫూర్తిని ఈ అవార్డు అందిస్తుంది. ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన ఘనతలు దక్కాయి. అవార్డు అందుకునేందుకు భారత్‌కు రావడానికి యూఎస్ ఓపెన్ నిర్వాహకులు సహకరించారు. నా మ్యాచ్‌లను వాయిదా వేశారు. - సానియా -
సానియాకు ఖేల్ రత్న, శ్రీకాంత్ కు అర్జున
న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. క్రీడా అత్యున్నత పురస్కారం 'రాజీవ్ ఖేల్ రత్న'ను ఆమె దక్కించుకుంది. బ్యాడ్మింటన్ తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కు అర్జున అవార్డు దక్కింది. 17 మందికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అర్జున అవార్డులు ప్రకటించింది. అర్జున అవార్డు పొందిన క్రీడాకారులు వీరే... కిదాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్) రోహిత్ శర్మ (క్రికెట్) పి.ఆర్. శ్రీజేష్ (హాకీ) దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్) జీతూ రాయ్ (షూటింగ్) సందీప్ కుమార్ (విలువిద్య) మన్దీప్ జంగ్రా (బాక్సింగ్) బబిత (రెజ్లింగ్) బజరంగ్ (రెజ్లింగ్) స్వర్ణ్ సింగ్ విర్క్ (రోయింగ్) సతీష్ శివలింగం (వెయిట్ లిఫ్టింగ్) యుమ్నమ్ సంతోయి దేవి (వుషు) శరత్ గైక్వాడ్ (పారా సైలింగ్) ఎంఆర్ పూర్వమ్మ (అథ్లెటిక్స్) మన్జీత్ చిల్లర్ (కబడ్డీ) అభిలాషా మాత్రే (కబడ్డీ) అనూప్ కుమార్ యామా (రోలర్ స్కేటింగ్) -
అశ్విన్‌కు ‘అర్జున’ అవార్డు అందజేత
న్యూఢిల్లీ: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును శుక్రవారం అందజేశారు. క్రికెటర్ గతేడాది ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. అయితే ఇంగ్లండ్ పర్యటన కారణంగా ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి అశ్విన్ హాజరుకాలేకపోయాడు. దీంతో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా అతను పురస్కారాన్ని స్వీకరించాడు. అవార్డును సాధించినందుకు చాలా గర్వంగా ఉందని స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. ‘క్రికెట్‌తో నా ప్రయాణం ఆనందంగా సాగుతోంది. ఓ రకంగా నేను చాలా అదృష్టవంతుడిని. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. దేశానికి ఆడటం నాకు లభించిన అతి పెద్ద డిగ్రీ. మరింత మెరుగ్గా దేశానికి సేవలందిస్తూ ఎన్నో అవార్డులను సాధించాలని కోరుకుంటున్నా’ అని అశ్విన్ పేర్కొన్నాడు. -
'అర్జున' కు రోహిత్ పేరు ప్రతిపాదన
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం అర్జున అవార్డు కోసం 2015 సంవత్సరానికి రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించాలని ఆదివారం సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృతి చెందిన క్రికెటర్లు అంకిత్ కేసరి, గౌరవ్ కపూర్లకు ఈ సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ప్రపంచకప్‌తో ముగియడంతో బీసీసీఐ, కోచ్ ఎంపికపై దృష్టి పెట్టింది. అందు కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ సభ్యులుగా ఉంటారు. -
నా పేరు మనోజ్...మీకు తెలుసా కపిల్!
మాజీ క్రికెటర్‌పై బాక్సర్ ధ్వజం‘అర్జున’ స్వీకరించిన మనోజ్ న్యూఢిల్లీ: భారత మేటి బాక్సర్ మనోజ్ కుమార్ ఎట్టకేలకు ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును స్వీకరించాడు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఈ హరియాణా బాక్సర్‌కు పురస్కారాన్ని అందజేశారు. తనను అవార్డుకు ఎంపిక చేయకపోవడంతో పాటు నువ్వు ఎవరో నాకు తెలీదన్న కమిటీ చైర్మన్ కపిల్దేవ్పై ఈ సందర్భంగా ధ్వజమెత్తాడు. ‘ఈ రోజు కపిల్‌కు ఒక మాట చెప్పదల్చుకున్నా. నా పేరు మనోజ్ కుమార్. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్‌ను’ అని వ్యాఖ్యానించాడు. తాను సాధించిన విజయాలకు సులువుగా రావాల్సిన అవార్డును ఎంతో కష్టపడి సాధించుకోవాల్సి వచ్చిందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నా ఘనతలను బట్టి చూస్తే ఈ అవార్డుకు నేను అర్హుడిని. డోపింగ్ విషయంలో ఎవరో నాపై వ్యతిరేక ఆరోపణలు చేశారు. అయితే అదంతా అబద్ధం. అర్జున జాబితా నుంచి నా పేరు తొలగించి కాంస్యం గెలిచిన వారికి అవార్డు ఇస్తున్నారని కపిల్‌కు గుర్తు చేశా. అయితే ఇలాంటి విషయాలు నాతో మాట్లాడొద్దని ఆయన ఫోన్ కట్ చేశారు’ అని మనోజ్ వెల్లడించాడు. -
అనుకున్నది సాధించాడు
బాక్సర్ మనోజ్‌కు ‘అర్జున’ న్యూఢిల్లీ: అన్ని అర్హతలు ఉన్నా... ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో కోర్టుకెక్కిన భారత స్టార్ బాక్సర్ మనోజ్ కుమార్ అనుకున్నది సాధించాడు. ఈ అవార్డు కోసం అతడి పేరును పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు సూచించడంతో కేంద్ర క్రీడా శాఖ అతడి నామినేషన్‌పై ఆమోద ముద్ర వేసింది. ఇంచియాన్‌లో ఆసియా గేమ్స్ ముగిసిన అనంతరం మనోజ్‌కు అర్జున అవార్డును అందిస్తామని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరన్ తెలిపారు. కపిల్ దేవ్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ మనోజ్ విషయంలో పొరపాటు పడి అతడు డోపింగ్‌లో దొరికినట్టు భావించి మరో బాక్సర్ జై భగవాన్ను ఎంపిక చేసింది. ఈవిషయమై మనోజ్ పట్టు వదలకుండా పోరాడాడు. ‘అర్జున దక్కనున్నందుకు ఆనందంగా ఉంది. ఓవరాల్‌గా మా సోదరుడు రాజేశ్ నా తరఫున ఒంటరి పోరాటం చేశాడు. నావైపు న్యాయం ఉన్నందుకే కోర్టుకెక్కాల్సి వచ్చింది. క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి ఓంకార్ ఖేడియా ఈ శుభవార్తను మా సోదరుడు మంగళవారమే చెప్పినా నాకు ఈరోజు (బుధవారం) తెలిసింది’ అని మనోజ్ ఆనందం వ్యక్తం చేశాడు. -
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
-
క్రీడాశాఖపై కోర్టుకెళతా: మనోజ్
పాటియాలా: అర్జున అవార్డుల జాబితాలో తన పేరును చేర్చకపోవడాన్ని అవమానంగా భావిస్తున్న బాక్సర్ మనోజ్‌కుమార్.. తనకు జరిగిన అన్యాయంపై కోర్టుకు వెళతానంటున్నాడు. కపిల్‌దేవ్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ.. ‘అర్జున’ కోసం ముందుగా నిర్ణయించిన 15 మంది క్రీడాకారుల జాబితాపై మంగళవారం సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో ఎటువంటి మార్పులూ చేయరాదని కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో మనోజ్ స్పందించాడు. ‘క్రీడాశాఖ కార్యదర్శి, సాయ్ డీజీ జిజి థామ్సన్‌లు మంగళవారం నాటి సమావేశంలో నా పేరును చేరుస్తామని మాట ఇచ్చారు. వారు మాటను నిలబెట్టుకోకపోగా, నాకు డోపింగ్‌కు పాల్పడిన చరిత్ర ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని మనోజ్ అన్నాడు. మనోజ్ సోదరుడు, కోచ్ రాజేష్‌కుమార్ మాట్లాడుతూ.. అర్జున అవార్డుకు గత నాలుగేళ్ల ప్రదర్శననే పరిగణనలోకి తీసుకుంటారని, ఈసారి దక్కకపోతే.. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన మనోజ్‌కు వచ్చే ఏడాది ఆ అవకాశం ఉండదని అన్నారు. -
ఒక్క రాష్ట్రం నుంచే అన్ని పేర్లు సిఫార్సు చేస్తారా?
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని అర్జున్ అవార్డులకు నియమించబడ్డ కమిటీ చేసిన సిఫార్సులపై వివాదం చెలరేగుతోంది. అత్యున్నత క్రీడాకారులను మాత్రమే ఖేల్ రత్న ఎంపిక చేయాలని కపిల్ కమిటీ సిఫార్సుచేసినా.. ఒక్క రాష్ట్రం నుంచి ఐదుగురు క్రీడాకారులను అర్జున అవార్డుకు సిఫార్సు చేయడం కాస్తా విమర్శలకు తావిస్తోంది. 15 మందిని అర్జున అవార్డులకు సిఫార్సు చేస్తే.. అందులో అధికశాతం మందిని ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఎంపిక చేశారని హాకీ సెక్రటరీ జనరల్ నరీందర్ బత్రా ప్రశ్నించారు. ఆ ఎంపిక ఎలా జరిగిందో చెప్పాలని కపిల్ కమిటీని నిలదీశారు. తాము హాకీ నుంచి పంపిన ఏడుగురు ఆటగాళ్ల పేర్లలో ఏ ఒక్కరిని అర్జునకు సిఫార్సు చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కపిల్ కమిటీలో ఉన్న మాజీ హాకీ ఆటగాడు అనుపమ్ గులాటీ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమని బత్రా తెలిపారు. అయితే గత నాలుగేళ్ల నుంచి హాకీలో సరైన విజయాలు లేకపోవడంతో ఆటగాళ్ల పేర్లను కమిటీ ముందు పెట్టలేదని గులాటీ చెప్పడం సరైన విధానం కాదన్నారు. హాకీకి సంబంధించి ఆటగాళ్లను ఎంపిక చేసి వారికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బత్రా అభిప్రాయపడ్డారు. గతంలో గంట కంటే ఎక్కువ సేపు కమిటీ సమావేశం అయిన దాఖలు లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఈసారి ఐదు గంటలకు పైగా జరిగిన సమావేశంలో తీవ్ర తర్జన భర్జనల అనంతరం అర్జున అవార్డులకు క్రీడాకారులను సిఫారుసు చేసింది. అయితే రాజీవ్ ఖేల్ రత్నకు మాత్రం తాజా కమిటీలో ఎవరి పేరును సిఫారుసు చేయకపోవడం గమనార్హం. ఈ అవార్డును అత్యున్నత క్రీడాకారులకే ఇవ్వాలని కపిల్ నేతృత్వంలోని కమిటీ సూచించినట్లు సమాచారం. -
హైదరాబాదీ సాజి థామస్‌కు అర్జున అవార్డు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రోయింగ్ క్రీడాకారుడు సాజి థామస్, భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు. భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని అవార్డుల కమిటీ.. అర్జున అవార్డుకు ఆటగాళ్ల పేర్లను నామినేట్ చేసింది. అర్జున అవార్డుకు థామస్, అశ్విన్‌తో పాటు షూటర్ హీనా సిద్ధు, అభిషేక్ వర్మ (ఆర్చరీ), టింటూ లూకా (అథ్లెటిక్స్), గిరీశ (పారాలంపిక్స్), దిజు (బ్యాడ్మింటన్), గీతూ ఆన్ జోసె (బాస్కెట్ బాల్), జై భగవాన్ (బాక్సింగ్), అనిర్బన్ (గోల్ఫ్), మమతా పూజారి (కబడ్డీ), అనక అలంకమని (స్వ్కాష్), టామ్ జోసెఫ్ (వాలీబాల్), రేణుబాల చాను (వెయిట్ లిఫ్టింగ్), సునీల్ రానా (రెజ్లింగ్) పేర్లను నామినేట్ చేశారు. కాగా ఖేల్‌రత్న అవార్డుకు ఎవరి పేరును సిఫారసు చేయలేదు. -
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు పద్మభూషణ్ అవార్డు
నాగండ్ల (ఇంకొల్లు), న్యూస్‌లైన్: బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించిన పుల్లెల గోపీచంద్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును శనివారం ప్రకటించడంతో ఆయన స్వగ్రామం ఇంకొల్లు మండలం నాగండ్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ కీర్తి కిరీటంలో ఇప్పటికే ఎన్నో అవార్డులున్నాయి. గతంలో అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్త్న్ర, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డులు ఆయనకు లభించాయి. గోపీచంద్ ప్రాథమిక విద్య ఒంగోలులోనే పద్మభూషణుడు పూర్తిచేశారు. ఉన్నత విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. పిన్ని మాంచాల ప్రోద్బలంతో అన్నదమ్ములు బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తి కనబరిచారు. గోపీచంద్, ఆయన అన్న రాజశేఖర్ ఇద్దరూ డబుల్స్ ఆడుతూ జాతీయ క్రీడాకారులుగా మంచి గుర్తింపు పొందారు. రాజశేఖర్‌కు ఐటీఐ సీటు లభించడంతో క్రీడలకు స్వస్తి పలికారు. తల్లి సుబ్బరావమ్మ గృహిణి కాగా తండ్రి పుల్లెల శుభాష్‌చంద్రబోస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. గోపీచంద్‌కు పద్మభూషణ్ అవార్డు లభించడంతో ఆయన స్వగ్రామంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలు గోరంట్ల వీరయ్య, ఆదిలక్ష్మిలతో పాటు ఆలిండియా బ్యాడ్మింటన్ కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, బాబాయిలు సోమేపల్లి రామ్మోహన్రావు, మార్కండేయులు, కొరిటాల శివప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. -
‘అర్జున’ అందుకున్న సింధు
న్యూఢిల్లీ: హైదరాబాద్ స్టార్ షట్లర్ పి.వి.సింధు... ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అందుకుంది. ఐబీఎల్ ఫైనల్ కారణంగా ఆగస్టు 31న రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ అవార్డుల వేడుకకు సింధు గైర్హాజరైన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం జరిగిన సాయ్ గవర్నింగ్ బాడీ సమావేశం సందర్భంగా జితేంద్ర... అవార్డు ప్రతిమతో పాటు రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని ఆమెకు అందజేశారు. -
తండ్రిని మించిన తనయ!
సాక్షి, హైదరాబాద్: గత కొన్నాళ్లుగా వాలీబాల్ మాజీ ఆటగాడు పీవీ రమణ ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. కుమార్తె పీవీ సింధు విజయాలతో ఆయన పులకరించిపోతున్నారు. ఐబీఎల్ వేలంలో భారీ మొత్తానికి సింధు ఎంపిక కావడం, ఆ తర్వాత సంచలన విజయాలు, తాజాగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడం ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తింది. ఇప్పుడు ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ సింధు ‘అర్జున’ అవార్డుకు నామినేట్ అయింది. దీంతో రమణ ఉబ్బితబ్బిబ్బయ్యారు. తండ్రి, కూతురుకు విభిన్న క్రీడాంశాల్లో అర్జున అవార్డు రావడం చాలా గర్వంగా అనిపిస్తోందని ఆయన స్పందించారు. ‘నాకు తెలిసి భారత క్రీడా చరిత్రలో ఇలా సాధించినవారు ఎవరూ లేరు. దాదాపు రెండేళ్లుగా నిలకడైన ప్రదర్శన ఇచ్చిన సింధు కష్టానికి ఫలితం దక్కింది. 18 ఏళ్ల వయసులోనే ఆమె ఈ పురస్కారానికి ఎంపిక కావడం నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తోంది. ఇప్పుడు ఆమెపై మరింత బాధ్యత పెరిగింది. భవిష్యత్తులోనూ బాగా ఆడి మరిన్ని విజయాలు అందుకోవాలన్నదే మా కోరిక’ అని రమణ పుత్రికోత్సాహంతో ‘సాక్షి’తో చెప్పారు. 1963లో పుట్టిన రమణ 38 ఏళ్ల వయసులో 2001లో అర్జున అవార్డు అందుకున్నారు. 1986లో సియోల్ ఆసియా క్రీడల్లో పతకం నెగ్గిన భారత సీనియర్ వాలీబాల్ జట్టులో ఆయన సభ్యుడు. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా దశాబ్దానికి పైగా ఆడినా ‘అర్జున’ ఆయన చెంతకు చేరడానికి దాదాపు పదిహేనేళ్లు పట్టింది. అయితే ఇప్పుడు సింధు మాత్రం సీనియర్ సర్క్యూట్‌లోకి ప్రవేశించిన ఏడాది కాలానికే ఈ పురస్కారానికి ఎంపిక కావడం విశేషం. 16 ఏళ్ల వయసులోనే జాతీయ చాంపియన్‌గా నిలిచిన సింధు... అండర్-19 ఆసియా చాంపియన్‌షిప్ నెగ్గిన ఏకైక భారత క్రీడాకారిణి. యూత్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఆమె విజేతగా నిలిచింది. సీనియర్ విభాగంలో మాల్దీవ్స్ చాలెంజర్ టోర్నీ నెగ్గి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సింధు... ఈ ఏడాది మలేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గి కెరీర్లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.