
'అర్జున' కు రోహిత్ పేరు ప్రతిపాదన
కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం అర్జున అవార్డు కోసం 2015 సంవత్సరానికి రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించాలని ఆదివారం సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు.
కోల్కతా: కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం అర్జున అవార్డు కోసం 2015 సంవత్సరానికి రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించాలని ఆదివారం సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృతి చెందిన క్రికెటర్లు అంకిత్ కేసరి, గౌరవ్ కపూర్‌లకు ఈ సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు.
డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ప్రపంచకప్‌తో ముగియడంతో బీసీసీఐ, కోచ్ ఎంపికపై దృష్టి పెట్టింది. అందు కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ సభ్యులుగా ఉంటారు.