‘ధ్యాన్‌చంద్‌’ ఇకపై అర్జున లైఫ్‌టైమ్‌ అవార్డుగా... | Dhyan Chand Lifetime Award Discontinued By Sports Ministry To Be | Sakshi
Sakshi News home page

‘ధ్యాన్‌చంద్‌’ ఇకపై అర్జున లైఫ్‌టైమ్‌ అవార్డుగా...

Published Fri, Oct 25 2024 10:30 AM | Last Updated on Fri, Oct 25 2024 11:15 AM

Dhyan Chand Lifetime Award Discontinued By Sports Ministry To Be

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కవిత సెల్వరాజ్‌కు అవార్డు(ఫైల్‌ ఫొటో)

క్రీడాకారులకు దివంగత హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ పేరిట ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారం పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మార్చింది.  ఆటగాళ్లు తమ కెరీర్లో కనబరిచిన విశేష సేవలకు గుర్తింపుగా 2002 నుంచి ‘ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డును ప్రదానం చేయడం మొదలు పెట్టారు. దీన్ని ఇకపై ‘అర్జున లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డుగా అందజేయనున్నారు.

ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల్లో దేశానికి పతకాలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2023లో మంజూష కన్వర్‌ (షట్లర్‌), వినీత్‌ కుమార్‌ (హాకీ), కవిత సెల్వరాజ్‌ (కబడ్డీ)లకు ఈ జీవితసాఫల్య పురస్కారాన్ని అందజేశారు.

ఈ ఏడాది అవార్డుల కోసం నామినేషన్లను దాఖలు చేసేందుకు వచ్చే నెల 14వ తేదీ వరకు గడువు ఉంది. ‘ఖేలో ఇండియా’ భాగంగా యూనివర్సిటీ స్థాయిలో జరిగే పోటీల్లో ఓవరాల్‌ విజేతకు మౌలానా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ ట్రోఫీని అందజేస్తారు. వీటితో పాటు ఎప్పట్లాగే ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులు కూడా ఉంటాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement