Major Dhyan Chand
-
ఖేల్‌రత్న వివాదం: తొలిసారి స్పందించిన మనూ భాకర్
దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీ జాబితాలో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్, భారత షూటర్ మను భాకర్(Manu Bhaker)కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని రెపరెపలాడించిన మనును ప్రతిష్టాత్మక ఖేల్ రత్న(Major Dhyan Chand Khel Ratna) అవార్డుకు నామినెట్ చేయకపోవడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ క్రమంలో నామినీల జాబితాలో మను పేరు లేకపోవడంపై ఆమె రామ్ కిషన్ భాకర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమార్తెను షూటర్ కాకుండా, క్రికెటర్‌ను చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. అదేవిధంగా తన పేరు లేకపోవడంతో మను కూడా బాధపడిందని కిషన్ భాకర్ వ్యాఖ్యనించారు. తాజాగా ఈ విషయంపై మను భాకర్ తొలిసారి స్పందించారు. అవార్డుల కంటే దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే తన లక్ష్యమని మను చెప్పకొచ్చారు. "అవార్డుల గురుంచి నేను ఎప్పుడూ ఆలోచించను. ఒక అథ్లెట్‌గా దేశం తరపున ఆడి మరిన్ని పతకాలు తీసుకు రావడమే నా లక్ష్యం.దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అనవసరమైన ఊహాగానాలు ప్రచారం చేయవద్దు. నామినేషన్ కోసం అప్లై చేసేటప్పుడు పొరపాటు జరిగిందని అనుకుంటున్నా" ఎక్స్‌లో రాసుకొచ్చారు.కాగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం.. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేర్లను నామినేట్ చేసింది. ప్యారిస్ ఒలిపింక్స్-2024 షూటింగ్లో మను రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
‘ధ్యాన్‌చంద్’ ఇకపై అర్జున లైఫ్‌టైమ్ అవార్డుగా...
క్రీడాకారులకు దివంగత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ పేరిట ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారం పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మార్చింది. ఆటగాళ్లు తమ కెరీర్లో కనబరిచిన విశేష సేవలకు గుర్తింపుగా 2002 నుంచి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డును ప్రదానం చేయడం మొదలు పెట్టారు. దీన్ని ఇకపై ‘అర్జున లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డుగా అందజేయనున్నారు.ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పతకాలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2023లో మంజూష కన్వర్ (షట్లర్), వినీత్ కుమార్ (హాకీ), కవిత సెల్వరాజ్ (కబడ్డీ)లకు ఈ జీవితసాఫల్య పురస్కారాన్ని అందజేశారు.ఈ ఏడాది అవార్డుల కోసం నామినేషన్లను దాఖలు చేసేందుకు వచ్చే నెల 14వ తేదీ వరకు గడువు ఉంది. ‘ఖేలో ఇండియా’ భాగంగా యూనివర్సిటీ స్థాయిలో జరిగే పోటీల్లో ఓవరాల్ విజేతకు మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీని అందజేస్తారు. వీటితో పాటు ఎప్పట్లాగే ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులు కూడా ఉంటాయి. -
పటిష్ట జట్టుతో పోటీ అంటే సవాలే: భారత కెప్టెన్
ఢిల్లీలో హాకీ మ్యాచ్ ఆడనుండటం ఎంతో సంతోషంగా ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. ఇది కేవలం రెండు జట్ల మధ్య పోటీ కాదని.. దేశ రాజధానిలోని యువత హాకీ వైపు ఆకర్షితులయ్యేలా స్ఫూర్తి నింపేందుకు తమకు దక్కిన గొప్ప అవకాశమని పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జర్మనీ హాకీ జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది. ప్యారిస్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 23, 24న ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా దాదాపు దశాబ్ద కాలం తర్వాత తొలిసారి ఢిల్లీ అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. ప్రపంచ హాకీలో జర్మనీ అగ్రశ్రేణి జట్టుఈ నేపథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘దేశ రాజధానిలో.. చారిత్రాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ఆడనుండటం మాకు దక్కిన గొప్ప గౌరవం. ఎంతో ప్రత్యేకం కూడా! దేశ రాజధానిలో మరోసారి హాకీ స్ఫూర్తిని జ్వలింపచేసే అవకాశం రావడం.. ఆ జట్టుకు నేను సారథిగా ఉండటం నా అదృష్టం.ప్రపంచ హాకీలో జర్మనీ అగ్రశ్రేణి జట్టుగా ఉంది.వారితో పోటీ పడటం అంటే కఠిన సవాలుకు ఎదురీదడమే. అయితే, ప్రత్యర్థి ఎంత పటిష్టంగా ఉంటే మాలోని అత్యుత్తమ ప్రదర్శన అంతగా బయటకు వస్తుంది’’ అని పేర్కొన్నాడు. కాగా భారత హాకీ జట్టు ఇటీవలే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.హాకీలో ఇరు జట్లకు గొప్ప వారసత్వం ఉంది‘భారత్, జర్మనీ హాకీ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించనున్నాం. ఇది ఆట ఉన్నతితో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢమయ్యేందుకు తోడ్పడుతుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య సమరం రసవత్తరంగా సాగడం ఖాయమని హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్ పేర్కొన్నాడు. ‘భారత్, జర్మనీ మధ్య హాకీ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తికరమే. హాకీలో ఇరు జట్లకు గొప్ప వారసత్వం ఉంది. జర్మనీ వంటి పటిష్ట జట్టుతో తలపడేందుకు టీమిండియా ప్లేయర్లు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు’ అని భోళానాథ్ సింగ్ అన్నాడు.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
ఆదివాసీల అభ్యున్నతికి ప్రాధాన్యం
న్యూఢిల్లీ: దేశంలోని ఆదివాసీల అభ్యున్నతి కోసం కేంద్రం ఎంతో చేస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మెగా జాతీయ ఆదివాసీల ఉత్సవం ‘ఆది మహోత్సవ్’ను గురువారం ప్రధాని ప్రారంభించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయో చాటి చెప్పడానికి, ఆదివాసీలు తయారు చేసిన వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించడానికి అవకాశం కల్పిస్తూ వారి అభ్యున్నతి కోసం తాము అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి కృషి చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్లో నిధులు భారీగా కేటాయిస్తున్నామని, మొట్టమొదటి సారిగా ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ముని రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టినది తమ ప్రభుత్వమేనని సగర్వంగా చెబుతున్నామని పేర్కొన్నారు. ఢిల్లీ దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని ప్రజలందరూ తప్పనిసరిగా ఆది మహోత్సవ్‌ను సందర్శించి, ఆదివాసీలు తయారు చేసిన వస్తువుల్ని కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంంలో ఆదివాసీల పాత్ర మరువలేనిదని, వారి త్యాగాలను గుర్తుంచుకోవాలన్నారు. అమృత కాలంలో ఆదివాసీలను తిరిగి వెలుగులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుంటున్నామని మోదీ తెలిపారు. బొట్టు బొట్టు కాపాడుకోవాలి దేశంలో నీటి సంరక్షణ అత్యంత ఆందోళన కలిగించే అంశమని మోదీ అన్నారు. ప్రకృతితో మనకున్న భావోద్వేగ బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకొని నీటి వనరుల్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర జల శక్తి శాఖ, బ్రహ్మకుమారిలు సంయుక్తంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త ప్రచారం జల్ జన్ అభియాన్‌ను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. రాజస్థాన్‌లోని బ్రహ్మకుమారిల ప్రధాన కార్యాలయంలో ఉన్న వారినుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. -
నేడు ‘వీర్ బాల్ దివస్’.. పాల్గొననున్న ప్రధాని, కేంద్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: సిక్కుల పదవ గురువైన గురుగోవింద్ సింగ్ ఇద్దరు చిన్న కుమారులైన (సాహెబ్‌జాదేలు) బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగల్ ధైర్య, సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ.. ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న ‘వీర బాల్ దివస్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఇందులో భాగంగా.. నేడు (డిసెంబర్ 26 , సోమవారం) ఢిల్లీలో.. వీర బాల్ దివస్ ను పురస్కరించుకుని ఘనంగా ‘షాబాద్ కీర్తన్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దాదాపు 3 వందల మంది బాల కీర్తనీలు ‘షాబాద్ కీర్తన్’ను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. అనంతరం దాదాపు 3వేల మంది చిన్నారుల ఆధ్వర్యంలో జరిగే మార్చ్ పాస్ట్ ను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు.షాహెబ్‌జాదేల ధైర్య సాహసాలను, త్యాగాలను గుర్తుచేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా, విద్యార్థుల కోసం పాఠశాలలు, కాలేజీల్లో వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. రైల్వే స్టేషన్లు, పెట్రోల్ పంపులు, విమానాశ్రయాల్లో డిజిటిల్ ప్రదర్శనలను ఏర్పాటుచేయనున్నారు. ఇక 2022 జనవరి 9న శ్రీ గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 1704వ సంవత్సరంలో మొగలు నవాబ్ అయిన వజీర్ ఖాన్.. మతం మారాలంటూ ఇద్దరు షహజాదేలను చిత్రహింసలు పెట్టారు. అయినా ధర్మాన్ని మార్చుకునేందుకు 9 ఏళ్ల జోరావర్ సింగ్, 7 ఏళ్ల ఫతేసింగ్ నిరాకరించారు. 1704 డిసెంబర్ 26న వీరిద్దరు బలిదానం చెందారు. వీరి త్యాగాన్ని, ధైర్య, సాహసాలను స్మరించుకుంటూ కేంద్రం ఈ ఏడాది నుంచి డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించనుంది. చదవండి: Roundup 2022: మెరుపులు..మరకలు -
జాతీయ క్రీడా దినోత్సవం.. దిగ్గజ హాకీ ప్లేయర్ జయంతిని పురస్కరించుకుని..!
హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్ట్ 29న జరిగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా సంఘాలు ఘనంగా జరుపుకున్నాయి. ఆసియా కప్‌లో టీమిండియా పాక్‌ను మట్టికరింపించిన మరుసటి రోజే జాతీయ క్రీడా దినోత్సవం ఉండటంతో ఈ వేడుకలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. Greetings on National Sports Day and tributes to Major Dhyan Chand Ji on his birth anniversary. The recent years have been great for sports. May this trend continue. May sports keep gaining popularity across India. pic.twitter.com/g04aqModJT — Narendra Modi (@narendramodi) August 29, 2022 దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్, క్రికెటేతర క్రీడా సంఘాలు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి వేడులకు ఘనంగా నిర్వహించాయి. ధ్యాన్‌చంద్ 117వ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాకీ పితామహుడికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. ఇటీవలి కాలంలో భారత్ క్రీడల్లో విశేషంగా రాణిస్తుందని, భారత్ మున్ముందు ఇదే జోరును కొనసాగించాలని ప్రధాని ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. ప్రధాని తన ట్వీట్లో ధ్యాన్‌చంద్‌తో పాటు ఇతర క్రీడలకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. కాగా, వివిధ క్రీడాంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజల రోజువారీ జీవితంలో ఆటలను భాగం చేయాలనే ఉద్దేశంతో 2012లో హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన రోజును నాటి కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. నాటి నుంచి ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ క్రీడా సంఘాలు స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. చదవండి: Asia Cup 2022: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉత్కంఠ పోరులో విజయం -
స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
మీరట్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సర్ధనలో ప్రధాని మోదీ.. స్పోర్ట్స్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ఒకప్పటి నేరస్థుల గడ్డ త్వరలో క్రీడాకారులకు అడ్డాగా మారబోతుందని అన్నారు. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో "ఖేల్ ఖేల్" అంటూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుకునేవాళ్లని.. యోగి ప్రభుత్వం వచ్చాక ఆ నేరస్తులంతా ఇప్పుడు "జైల్ జైల్" అంటూ ఊసలు లెక్కబెడుతున్నారని సెటైర్లు వేసారు. 700 కోట్లతో దాదాపు 92 ఎకరాల్లో యూనివర్సిటీని నిర్మించనున్నట్లు పేర్కొన్న ప్రధాని.. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టారు. చదవండి: అతి త్వరలో పుజారాను సాగనంపడం ఖాయం..! -
పీఎం నరేంద్ర మోదీ: సీఎం యోగి ఆధ్వర్యంలో ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి
-
‘క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్‌చంద్‌కు గొప్పనివాళి’
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. భారత్ దిగ్గజ హకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళులు అర్పించారు. క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్‌చంద్‌కు గొప్ప నివాళి అని పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యంతోనే భారత్ క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుందని అన్నారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ క్రీడాకారులు విశేషమైన ప్రతిభ కనబర్చారని అన్నారు. సాధించిన 7 పతకాలలో.. హకీ విభాగంలో ఒక పతకం గెలుచుకున్నామని తెలిపారు. ఇదే స్పూర్తిని భవిష్యత్‌లో కూడా కొనసాగించాలని అన్నారు. చదవండి: త్వరలో సిద్ధూ, అమరీందర్‌లతో రావత్ చర్చలు -
ధర్మాన కృష్ణదాస్ అంటే జిల్లాల్లో క్రీడాకారుడిగానే తెలుసు
సాక్షి, శ్రీకాకుళం: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకొని జిల్లాలోని ఎన్టీఆర్ఎంహెచ్ స్కూల్ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజయరయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ షూటింగ్ అకాడమీ , విక్రాంత్ బాడ్మింటన్ అకాడమీలను ప్రారంభించారు. అనంతరం కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రిగా క్రీడలంటే నాకు చాలా ఇష్టం. ఏపీలోని అన్ని జిల్లాలకు క్రీడాకారుడిగానే కృష్ణదాస్ అంటే తెలుసు.క్రీడలతోనే నాకు గుర్తింపు వచ్చింది. స్కూల్లో పాస్ మార్కులు వస్తే చాలనుకునేవాడిని ఆటల కోసమే విశాఖ వెళ్లి డిగ్రీలో చేరాను.గతంలో క్రీడలు ఎంతో దయనీయస్థితిలో ఉండేవి.. ప్రస్తుతం క్రీడలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఆన్ స్పోర్ట్స్ క్రీడలు నేటికీ నిరాదరణకు గురవుతున్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం . ఈ విషయం పై ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైద్యం కోసం వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. క్రీడల కోసం కొంత ఖర్చు చేస్తే ... వైద్యానికి పెట్టే ఖర్చు కొంత తగ్గుతుందనేది నా భావన క్రీడలకు ఖర్చు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే క్రీడాకారులను ప్రోత్సహించాలి. సమాజం పట్ల గౌరవం , క్రమశిక్షణ ఒక్క క్రీడాకారుడికే ఉంటాయి.' అని మంత్రి చెప్పుకొచ్చారు. -
రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రీడాకారులకు అందించే అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు. ఈ పురస్కారం పేరు మారింది. ఈ అవార్డును ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా శుక్రవారం మార్చారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్లో ప్రకటించారు. దేశ ప్రజలందరి నుంచి వచ్చిన విజ్ఞప్తులతో వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ పేరు మీదుగా ఖేల్‌రత్న పురస్కారం 1991-92లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రీడాకారులకు అవార్డులు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు రాజీవ్ పేరు తొలగించి ధ్యాన్‌చంద్ పేరు పెట్టారు. ధ్యాన్‌చంద్ భారత హకీ దిగ్గజం. ధ్యాన్‌చంద్ కెప్టెన్సీలో హకీ జట్టు మూడుసార్లు వరుసగా ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. అంతటి గొప్ప వ్యక్తి జయంతిని (ఆగస్టు 29) జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో మళ్లీ భారత హాకీ జట్టు పతకం పొందింది. మహిళల జట్టు సెమీ ఫైనల్ వరకు వెళ్లి అద్భుత ప్రదర్శన చేసినా నిరాశ చెందారు. అయినా వారి పోరాటాన్ని దేశం కీర్తించింది. వీటన్నింటినీ చూస్తుంటే హాకీకి పూర్వ వైభవం వచ్చిందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హాకీ దిగ్గజంగా ఉన్న ధ్యాన్‌చంద్ పేరు పెట్టడంతో మళ్లీ హాకీ క్రీడకు మంచి రోజులు రానున్నాయి. I have been getting many requests from citizens across India to name the Khel Ratna Award after Major Dhyan Chand. I thank them for their views. Respecting their sentiment, the Khel Ratna Award will hereby be called the Major Dhyan Chand Khel Ratna Award! Jai Hind! pic.twitter.com/zbStlMNHdq — Narendra Modi (@narendramodi) August 6, 2021 -
ఉత్తమ ఆటగాడిగా శ్రీజేష్
బెంగళూరు: ఈ ఏడాది ‘అత్యుత్తమ హాకీ ఆటగాడు’ అవార్డును భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో దీపికాకు ఈ పురస్కారం లభించింది. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో హాకీ ఇండియా (హెచ్ఐ) వార్షిక అవార్డులను ప్రదానం చేసింది. ఈ ఇద్దరికి చెరో రూ. 25 లక్షల నగదుతో పాటు ట్రోఫీలను బహూకరించారు. దివంగత కెప్టెన్ శంకర్ లక్ష్మణ్‌కు... ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. ఈ అవార్డు కింద రూ. 30 లక్షల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. భారత్ తరఫున 100 మ్యాచ్‌లు ఆడినందుకు ధర్మవీర్ సింగ్, కొతాజిత్ సింగ్, బీరేంద్ర లక్రా, సుశీలా చానులకు తలా రూ. 50 వేల నగదు పురస్కారం, ట్రోఫీని ఇచ్చారు. 200 మ్యాచ్‌లు ఆడిన వీఆర్ రఘునాథ్, గుర్బాజ్ సింగ్‌లకు చెరో లక్ష చొప్పున ఇచ్చారు. 36 ఏళ్ల తర్వాత రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మహిళల జట్టును ఈ సందర్భంగా సత్కరించారు.