మీరట్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సర్ధనలో ప్రధాని మోదీ.. స్పోర్ట్స్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ఒకప్పటి నేరస్థుల గడ్డ త్వరలో క్రీడాకారులకు అడ్డాగా మారబోతుందని అన్నారు. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో "ఖేల్ ఖేల్" అంటూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుకునేవాళ్లని.. యోగి ప్రభుత్వం వచ్చాక ఆ నేరస్తులంతా ఇప్పుడు "జైల్ జైల్" అంటూ ఊసలు లెక్కబెడుతున్నారని సెటైర్లు వేసారు. 700 కోట్లతో దాదాపు 92 ఎకరాల్లో యూనివర్సిటీని నిర్మించనున్నట్లు పేర్కొన్న ప్రధాని.. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టారు.
చదవండి: అతి త్వరలో పుజారాను సాగనంపడం ఖాయం..!
ఒకప్పటి నేరస్థుల గడ్డ.. త్వరలో క్రీడాకారులకు అడ్డా: ప్రధాని మోదీ
Published Sun, Jan 2 2022 5:30 PM | Last Updated on Sun, Jan 2 2022 5:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment