
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. భారత్ దిగ్గజ హకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళులు అర్పించారు. క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్‌చంద్‌కు గొప్ప నివాళి అని పేర్కొన్నారు.
అందరి భాగస్వామ్యంతోనే భారత్ క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుందని అన్నారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ క్రీడాకారులు విశేషమైన ప్రతిభ కనబర్చారని అన్నారు. సాధించిన 7 పతకాలలో.. హకీ విభాగంలో ఒక పతకం గెలుచుకున్నామని తెలిపారు. ఇదే స్పూర్తిని భవిష్యత్‌లో కూడా కొనసాగించాలని అన్నారు.