న్యూఢిల్లీ : అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన తర్వాత ప్రజలు చూపిన సహనం, నిగ్రహం, పరిపక్వతను పరిశీలిస్తే జాతి ప్రయోజనాల కంటే మాకు ఏది ముఖ్యం కాదని రుజువు చేసి చూపారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన మన కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. చారిత్రక తీర్పు తర్వాత దేశం కొత్తం మార్గం, కొత్త సంకల్పంతో ముందుకు సాగుతుందని తెలిపారు. కొత్త సంకల్పంతో అడుగులు వేస్తున్న దేశానికి శాంతి, ఐక్యత, సద్భావన వంటి అనుభూతులను పంచుతూ ముందుకు సాగాలనేది తన కోరిక అని మోదీ వెల్లడించారు.
ఈ సందర్భంగా మన్‌కీబాత్‌లో అయోధ్య సమస్యపై 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం, సమాజం, ప్రజలు సహృద్భావం, శాంతి సామరస్యాన్ని ఎలా కొనసాగించారో ఆయన గుర్తు చేశారు. ఈసారి కూడా నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు 130 కోట్ల మంది భారతీయులు శాంతి, ఐక్యతను పెంపొందించుకొని మెలిగిన తీరు తనకు సంతోషం కలిగించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు అయోధ్య వివాదం పై సుదీర్ఘ న్యాయ పోరాటం ముగిసిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో దేశ ప్రజలకు మరోసారి న్యాయవ్యవస్థ పై అపారమైన గౌరవం పెరిగిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. నిజమైన అర్థంతో తీర్పును వెల్లడించి సుప్రీకోర్టు న్యాయవ్యవస్థ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించిందని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment