న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్ భద్రతా వైఫల్యం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై విచారించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తు ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, చండీగఢ్ డీజీపీ, ఎన్ఐఏ ఐజీ, పంజాబ్ ఏడీజీ (సెక్యూరిటీ) తదితరులు ఉంటారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో కొంత మంది నిరసనకారులు ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్‌ను ఫ్లైఓవర్‌పై 20 నిముషాలపాటు అడ్డుకోవడంతో ప్రధాని ర్యాలి రద్దయ్యింది. భటిండా విమానాశ్రయం నుంచి హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థూపం వద్దకు ప్రధాని మోదీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్‌కు భద్రతా వైఫల్యంపై అత్యున్నతస్థాయి విచారణ కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment