NV Ramana
-
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్‌లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్‌లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్‌గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్‌లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్‌ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంగ్లిష్‌పై ‘తీర్పు’ వివక్షాపూరితం!
విజయవాడలో జరిగిన మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించడమే కాక, తత్సంబంధ జీవో నం.85ను రద్దు చేయాలని కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరడం ఏ కోణం నుండి చూసినా సమంజసనీయమైనది కాదు. గౌరవ నీయ సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయ మూర్తిగా ఆయనకిది ఏమాత్రం తగినట్లుగా లేదు. అందుకే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మోదీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంలో 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాలలోనే విద్య నేర్పాలని సూచించారు. అయితే నేటి పోటీ ప్రపంచంలో దీని అమలు అసాధ్యమని తెలిసినప్పటికీ, జస్టిస్ రమణ దీనిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఎక్కడా కోరలేదు. కానీ స్వరాష్ట్రానికి వచ్చేటప్పటికి తెలుగు మాధ్యమానికి మాత్రమే, అందునా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే తెలుగు మాధ్యమానికి తావివ్వాలని మాట్లాడుతున్నారు!ప్రైవేట్ స్కూళ్లలో కూడా తెలుగు మీడియం ప్రవేశపెట్టాలని నామమాత్రంగానైనా ఆయన ఎందుకు అడగటం లేదు? అంటే సంపన్నుల పిల్లలకు ఒక న్యాయం, పేద దళిత గ్రామీణ పిల్లలకు మరొక న్యాయం! ఇదేనా ఎవరైనా ఇవ్వవలసిన ‘తీర్పు’? ఇంగ్లిష్ మీడియంతో ప్రైవేట్ విద్యారంగం కళకళలాడాలనీ, కేవలం తెలుగు మీడియంతో నడిచే ప్రభుత్వ పాఠశాలలు వెలవెల పోవాలనీ; ‘ప్రభుత్వం వేస్ట్.. ప్రైవేట్ రంగం బెస్ట్’ అనీ... ఆయన, ఆయన వెనుక ఉన్న రాజకీయ నేతల ఉద్దేశంలా కనిపిస్తోంది.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తూ తెలుగు భాషపై ప్రేమ వెలిబుచ్చుతూ ఉంటారు. వీరి పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి! విదేశాలకు వెళ్లి వచ్చి, గొప్పగా సంపాదించుకోవాలి. కానీ పేదవాళ్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వకూడదు, వాళ్లు రాష్ట్రం దాటి వెళ్లకూడదు.జగన్ సంస్కరణలు చరిత్రాత్మకం గత ఐదేళ్లలో జగన్ దేశంలోకెల్లా అత్యధికంగా పాలనలో, పలు రంగాలలో, ముఖ్యంగా విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చి చరిత్రకెక్కారు. రాజకీయంగా జగన్ మోహన్‌రెడ్డితో విభేదిస్తే, రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప, ఆయన మీది ద్వేషంతో ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలను రద్దు చేస్తూ పోవడం ఏమాత్రం సమంజసం కాకపోగా విపరిణామాలకు దారి తీస్తుంది.ద్విభాషా పాఠ్యపుస్తకాలను, ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులను ఇచ్చినప్పటికీ, ఏ మీడియంలోనైనా చదువుకునే, పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, 90 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంనే కోరుకున్నప్పటికీ, లక్షలాదిగా ఉన్న వారి అభీష్టానికి, హక్కుకు వ్యతిరేకంగా ఈ న్యాయమూర్తి ఇలా మాట్లాడటం సరైనది కాదు. ఆయన మాట విని, ఆంగ్ల మాధ్యమంలో 9వ తరగతి వరకు వచ్చిన విద్యార్థులను నట్టేట ముంచి, తిరోగమన దిశలోకి మరల్చడం చంద్రబాబు చారిత్రక తప్పిదంగా నిలిచిపోతుంది.దీనికి బదులు, తెలుగు భాషపై తెలుగు మాధ్యమంపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ఆంగ్ల మాధ్యమాన్ని కొనసా గిస్తూనే, కేజీ టు పీజీ తెలుగు మాధ్యమ బోధనా విద్యాసంస్థలను సమాంతరంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రత్యే కంగా ఏర్పాటు చేసి, వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధులలో రిజర్వేషన్ కల్పించాలని కోరడం సముచితంగా ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రజల భాష లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని, న్యాయస్థానాలు ప్రజల భాషలోనే తీర్పులు ఇవ్వాలని ఆదేశిస్తే, నిర్దేశిత రాజ్యాంగ ఆశయాలు కూడా తద్వారా నెరవేరుతాయి.ఇలాంటి విశాల దృక్పథంతో ఆంగ్ల లేక తెలుగు మాధ్యమ అంశాలను పరిశీలించినప్పుడే ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది. అలా కాని పక్షంలో ఎన్నో వేల ఏళ్లుగా వివక్షకు గురైన అట్టడుగు పేద బడుగు వర్గాల నుండి ప్రతిఘటనను, ఇంగ్లిష్ మీడియం పరి రక్షణ ఉద్యమాలను కూటమి పాలకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈదర గోపీచంద్ వ్యాసకర్త సామాజిక ఉద్యమ కార్యకర్తమొబైల్: 94403 45494 -
బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నం
విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా! మూడు వేల ఏండ్లు నిరక్షరాస్యులుగా ఉండి ఇప్పుడిప్పుడే విద్యపట్ల కళ్లు తెరుస్తున్న ప్రజల మీద వ్యతిరేకత మంచిదా? తెలుగు భాషతో ఉద్యోగం, ఉపాధి దొరక్కపోవడం భ్రమ అంటున్నారు; మరి తెలుగులో ఐఏఎస్, ఐపీఎస్ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మొదలైన విద్యా విప్లవాన్ని వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంగ్లిష్ విద్యను కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే తప్ప ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం (English Medium) బతకదు.విజయవాడలో డిసెంబర్ 28, 29 తేదీల్లో రెండ్రోజులు ‘ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు’ జరిగాయి. ఆ సభల్లో దేశానికి చీఫ్ జస్టిస్‌గా పనిచేసి రిటైరైన జస్టిస్ ఎన్.వి. రమణ గారు (NV Ramana) వైకాపా ప్రభుత్వం ఇంగ్లిష్ విద్యను రాష్ట్రమంతటా ప్రవేశపెడుతూ తెచ్చిన జీవో నంబర్ 85 రద్దు చేయాలనీ, మొత్తం ఏపీ ప్రభుత్వ రంగ విద్యావ్యవస్థను మళ్ళీ పాత తెలుగు మీడియంలోకి మార్చాలనీ సూచించారు. ఆయన సూచనను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఒక కోర్టు ఆర్డరుగా పరిగణించి ప్రభుత్వ విద్యారంగాన్ని మళ్లీ తెలుగు మీడియంలోకి మార్చే పెను ప్రమాదం లేకపోలేదు.జస్టిస్ రమణగారు కోర్టుల్లో కేవలం ఇంగ్లిష్‌లో వాదించినవారు. జడ్జిగా తీర్పులన్నీ ఇంగ్లిష్ భాషలో రాసినవారు. ఆయనది ధనవంతమైన రైతు కుటుంబం కనుక తెలుగు మీడియం స్కూల్ విద్య నుండి వచ్చి కూడా ఇంగ్లిష్‌పై పట్టు సాధించి జ్యుడీషియల్ సిస్టమ్‌లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. కానీ గ్రామీణ కూలినాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు అలా ఎదగడం సాధ్యమా? జడ్జిగారు తెలుగు భాషతో ఉద్యోగం, ఉపాధి దొరక్కపోవడం భ్రమ అంటున్నారు.జస్టిస్ రమణగారు వకీలు నుండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎదిగిన జ్యుడీషియల్ సిస్టమ్‌లోనే చూద్దాం. తెలంగాణ హైకోర్టు నుండి కింది కోర్టుల వరకు నేను కోర్టు రూముల్లో నిలబడి చూశాను. గ్రామాల నుండి తెలుగు మీడియంలో చదువుకొని, కష్టపడి లా డిగ్రీ సంపాదించిన యువ లాయర్లు ఇప్పుడు కోర్టుల్లో చాలామంది ఉన్నారు. వారికి చట్టాలపై ఎంత పట్టు ఉన్నా ఇంగ్లిష్‌లో వాదించే భాష లేక ఎంత డిప్రెషన్‌కు గురౌతున్నారో నేను చూశాను. వారితో మాట్లాడాను. వారికి వకీలు నుండి జడ్జిగా పై కోర్టుల్లో ఎదగడానికి రాజకీయ సపోర్టు, కమ్యూనిటీ బలం లేదు. ఇంగ్లిష్ రాని, వాదించ లేని బాధతో ఆత్మగౌరవం దెబ్బ తింటుంది. ఇదే కోర్టులో ఇప్పుడు నేషనల్ లా స్కూల్స్ నుండి వస్తున్న యువ లాయర్లు చట్టంలో పట్టున్నా, లేకున్నా ఇంగ్లిష్ బలంతో కేసులు గెలుస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో లా గ్రాడ్యుయేట్స్‌ను రిక్రూట్స్ చేసుకునేటప్పుడు ఏ కంపెనీల్లో తెలుగులో ఇంటర్వ్యూ జరుగుతుందో సిస్టమ్ గురించి తెలిసిన జస్టిస్ రమణగారిని చెప్పమనండి! దేశ సంపద ఇప్పుడు ఈ కంపెనీల్లో పోగుపడి లేదా? అందులో తెలుగు భాషతో ఉద్యోగా లొస్తాయా?నేషనల్ సివిల్ సర్వీస్‌లో ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీలోనే ఇస్తున్నారు కదా! ‘ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్’ అంటున్న ఈ తెలుగు భాషకు, సివిల్ సర్వీస్‌లో ప్రశ్నపత్రం లేని గతి ఎందుకున్నది? తెలుగు భాషలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? తెలుగుపై ఇంత ప్రేమ ఉన్న జస్టిస్ రమణగారు సుప్రీం కోర్టులో ఒక ‘పిల్’ వేయించి యూపీఎస్సీ ప్రశ్నపత్రాలు అన్ని రాష్ట్ర భాషల్లో ఉండాలని ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే ప్రాంతీయ భాషల్లో చదువుకునే మొదటితరం అమ్మాయిలు, అబ్బాయిలు కొంతైనా మేలు పొందేవారు. అదే సుప్రీం కోర్టు ప్రైవేట్ రంగంలో స్కూల్ విద్య, ప్రభుత్వ రంగంలో స్కూలు విద్య దేశం మొత్తంగా ఆ యా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో ఉండాలని ఎందుకు చెప్పలేదు? ప్రైవేట్ స్కూళ్లను కన్నడలో బోధించాలని కర్ణాటక జీవో ఇచ్చినప్పుడు సుప్రీం కోర్టే తమ పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రుల ప్రాథమిక హక్కు అని చెప్పింది కదా! మరి గ్రామీణ కూలీల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ భాషల్లో చదివించుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఉండదా? జస్టిస్ రమణగారు తల్లిదండ్రుల అభిప్రాయం మళ్ళీ సేకరించండి అంటే న్యాయం ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఆ పని చేసి ఉండవచ్చు. అలా కాకుండా తెలుగులోకి మార్చాలని నిర్ణయాలు ఎలా ప్రకటిస్తారు?ఒకవైపు కేంద్ర ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం, మరోవైపు కార్పొరేట్ సంస్థలు నడిపే ఎయిర్ కండిషన్డ్ స్కూళ్ళల్లో ఇంగ్లిష్ మీడియం. ఆ స్కూళ్లలో అంతర్జాతీయ సిలబస్ ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళ నుండి ఒక బ్యాచ్ కూడా బయటికి రాకముందే జస్టిస్ రమణ గారు వారి భవిష్యత్ గురించిన ఈ జడ్జిమెంట్ ఎలా ఇచ్చారు?చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటున్నారు. ఆయన మనుమడు ఏ భాష స్కూలులో చదివి ఇప్పుడు అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ కాబోతున్నాడు? 9 ఏండ్ల మనుమని కోచ్ ఆయనకు ఏ భాషలో మాట్లాడి కోచింగ్ ఇస్తున్నాడు? బీద కుటుంబాల్లోని పిల్లలు అంత ర్జాతీయ ఆటగాళ్లు కావద్దు అనే కదా ఈ ఆలోచన.మూడు వేల ఏండ్లు నిరక్షరాస్యులుగా ఉండి ఇప్పుడిప్పుడే విద్యపట్ల కండ్లు తెరుస్తున్న ప్రజల మీద ఇంత వ్యతిరేకత మంచిదా? ఈ దేశ విద్యావంతులు, అధికారాన్ని, ధనబలాన్ని అనుభవించిన మేధావులు సైతం బీద ప్రజల సమాన విద్యా హక్కు పట్ల న్యాయబద్ధంగా మాట్లాడకపోతే ఈ బీద, అణచి వేయబడ్డ జీవితాలు ఎలా మారుతాయి? మేధావులకు తెలుగుపట్ల ప్రేమ ఉంటే ప్రపంచ భాషల్లోకి అనువాదం చెయ్యబడి నోబెల్ ప్రైజ్ పొందే పుస్తకాలు రాయాలి కాని దిక్కులేని ప్రజల జీవితాల్లో మట్టి పొయ్యడానికి సిద్ధాంతాలు అల్లకూడదు కదా!తెలుగు నిజంగానే ‘ఈస్టర్న్ ఇటాలియన్’ భాష అయితే... నన్నయ్య, తిక్కన కాలం నుండి జస్టిస్ రమణ కాలం వరకు ఇటాలియన్ భాషనే ‘తెలుగు ఆఫ్ వెస్టర్న్ వరల్డ్’ అనేంతగా ఎదిగించడానికి బీద పిల్లల తల్లిదండ్రులు అడ్డువచ్చారా? ప్రపంచ రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా! రవీంద్రనాథ్ టాగూర్‌లా బెంగాలీలో గీతాంజలి రాసి నోబెల్ బహుమతి తెచ్చినట్లు... తెలుగులో ఎటువంటి పుస్తకాలు రాయాలి, నోబెల్ బహుమతిని ఎలా తేవాలి వంటి అంశాలను చర్చిస్తే బీద ప్రజల పిల్లలు కూడా అటువంటి పుస్తకాన్ని చదివి నేర్చు కుంటారు.ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్ రమణ గారి అభిప్రాయం మాత్రమే అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూల్ విద్యపై చర్చ పూర్తిగా నిలిచిపోయింది. కనీసం తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఫోకస్ కూడా చంద్రబాబు ప్రభుత్వం పెట్టడం లేదు. స్కూళ్ల అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లన్నీ నిలిపివేశారు. క్రమంగా ప్రభుత్వ విద్యారంగాన్ని మళ్ళీ పాతబాటలోకి విద్యామంత్రిగా లోకేష్ నెడుతున్నారు.చదవండి: ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే.. 'పేద బిడ్డలకు తెలుగే'ఇప్పుడు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల పేరుతో పిల్లల భవిష్యత్తుకు ముగుతాడు వెయ్యాలనే ప్రచారం మొదలైంది. ఒక్క జస్టిస్ రమణగారే కాదు.. మండలి బుద్ధప్రసాద్ ఇటువంటి ఆలోచన కలవారే. ఇప్పుడు ఇంగ్లిష్ విద్యను ప్రభుత్వ స్కూళ్లలో కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బతకదు. ఈ విద్యా విధానాన్ని కాపాడవలసిన బాధ్యత ఒక్క వైసీపీదే కాదు... వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు ఇంగ్లిష్ విద్య పరిరక్షణ పోరాటం చేస్తే తప్ప ఈ తిరోగమన రథచక్రం ఆగదు.- ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
ఆంగ్ల మాధ్యమం గురించి జస్టిస్ రమణ ఎందుకలా అన్నారో?
కొద్ది రోజుల క్రితం రెండు వార్తలు గమనించాను. న్యాయవ్యవస్థలోనే అత్యున్నతమైన సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహించి తెలుగువారికి విశిష్టత తెచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు మీడియం గురించి మాట్లాడిన విషయం ఒకటి అయితే, ప్రముఖ విద్యావేత్త కంచ ఐలయ్య ఏపీలో జరుగుతున్న విద్యా సంస్కరణలపై చేసిన ప్రసంగం వీడియో మరొకటి. జస్టిస్ రమణ తెలుగు మీడియం పై మాట్లాడితే ఐలయ్య ఆంగ్ల మీడియం గురించి గట్టిగా వక్కాణించారు. ఐలయ్య చాలా స్పష్టంగా ఏపీలో విద్యా సంస్కరణలు కొనసాగవలసిన అవసరం గురించి వివరించారు. ఆంగ్ల మీడియం ద్వారా బలహీనవర్గాలలో ఆత్మ స్తైర్యం పెరుగుతుందని, ప్రపంచంతో పోటీ పడే అవకాశం వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. ✍️ముఖ్యమంత్రి జగన్‌ను తాను ఇంతవరకు కలవలేదని, భవిష్యత్తులో కూడా కలవవలసిన అవసరం లేదని అంటూ, ఆయన విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులు విప్లవాత్మకమైనవని చెప్పడమే తన ఉద్దేశమని ఐలయ్య తెలిపారు. ఐలయ్య చేసిన ఈ ప్రసంగానికి మీడియాలో పెద్ద ప్రాముఖ్యత లబించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కాస్త విస్తారంగానే ప్రచారం అయింది. మరో వైపు సుప్రింకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆంగ్ల మాద్యమంపై మాట్లాడిన విషయాలు తెలుగుదేశం పార్టీ పత్రికలలో ప్రముఖంగా వచ్చాయి. ✍️ ఆయన అభిప్రాయాన్ని గౌరవించవలసిందే. ఎవరూ మాతృభాషను విస్మరించకూడదు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదురువుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల మాద్యమంకు ఉన్నప్రాముఖ్యతను ఆయన గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రమణ ఆయా దేశాలకు వెళ్లినప్పుడు ఆంగ్లంలో మాట్లాడారో, లేక ఎవరినైనా దుబాసి పెట్టుకుని తెలుగులో మాట్లాడారో తెలియదు కాని, ప్రస్తుతం ఆయన చెబుతున్న విషయాలు పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆంగ్ల మాద్యమం మంచిదనే భ్రమలు వద్దు అని ఆయన అన్నారని ఈనాడు మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఇదేదో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారేమో అన్న భావన కలుగుతుంది. ఆయనకు ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు.కాని ఈనాడు మీడియా ఈ వార్త ఇచ్చిందంటే ఎంతో కొంత జగన్ ప్రభుత్వానికి నష్టం చేస్తుందని నమ్మడమే కావచ్చు. ✍️లేకుంటే ఆ వార్తకు అంత ప్రాధాన్యత ఇవ్వదు కదా! కర్నూలులో కొన్నాళ్ల క్రితం జరిగిన ఎస్టియు అంటే స్టేట్ టీచర్ల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బహుశా అది సిపిఐ మద్దతుతో నడిచే సంస్థలా ఉంది. అందుకే సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సిపిఐ తెలంగాణ మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. వైసిపి ఎమ్మెల్యే హపీజ్ ఖాన్ కూడా ఈ సభలో పాల్గొన్నా ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏపీలో సిపిఐ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పేదలకు వైసిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సైతం తప్పుపడుతున్న సిపిఐ ప్రతిపక్ష తెలుగుదేశంకు కొమ్ముకాస్తోందన్న విమర్శలు ఉన్నాయి. సిపిఐ నారాయణ చెప్పారంటూ ఏపీలో నలభైవేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రమణ నమ్మినట్లు మాట్లాడడం కూడా సముచితంగా అనిపించదు.నారాయణ తన అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతుంటారు. ✍️ఉదాహరణకు తమతో కలిసిఉన్నప్పుడు కేసీఆర్ ను హీరో అని నారాయణ పొగిడేవారు. ఆయనతో చెడగానే కేసీఆర్ అంత నియంత లేరని ద్వజమెత్తారు. ఇది వేరే సంగతి కాని ఛీఫ్ జస్టిస్ గా అత్యున్నతమైన బాధ్యతలు నిర్వహించి రిటైరైన రమణ తన గౌరవం నిలబెట్టుకునే విదంగా మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. అలాకాకుండా నారాయణ వంటివారి చెప్పుడు మాటలు విని ప్రసంగాలు చేస్తే అప్రతిష్ట పాలు అయ్యే ప్రమాదం ఉంది. నిజంగా పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి?అన్నిటిని భర్తీ చేయవలసిన అవసరం ఉందా? తదితర అంశాలను తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. రమణ అసలు ఎపీలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను పరిశీలించి ఉండకపోవచ్చు. ✍️కేవలం తన పాతమిత్రులైన టీడీపీ నేతలు చేస్తున్న ప్రచార ప్రభావంలో పడి మాట్లాడి ఉండవచ్చు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్లు ఎంత అద్వాన్నంగా ఉన్నాయో ఎన్నడైనా రమణ పరిశీలించారా? ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన విశేష మార్పులనుఎన్నడైనా చూశారా?స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేసి,రంగులు వేసి ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తయారు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం రమణ కనీస బాద్యత కాదా? స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ లను ఒకసారి ఆయన చూసి వస్తే బాగుండేది కదా! సిబిఎస్ఇ సిలబస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర విన్నూత్న అంశాలను ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్దులకు అందించాలన్న జగన్ తాపత్రయాన్ని అర్దం చేసుకోకుండా రమణ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు మాట్లాడడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని గమనించాలి.ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న అత్యాధునిక టాయిలెట్లు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఉన్న విషయాన్ని అంగీకరించరా? అసలు ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ని మార్పులు తీసుకు వస్తే టీచర్లు మరింత శ్రద్దగా, బాద్యతగా పాఠాలు చెప్పాలన్న సంగతిని కూడా రమణ వంటివారు బోదించి ఉండాల్సింది. ✍️ఆ విషయాల జోలికి వెళ్లినట్లు మీడియాలో వచ్చిన వార్తలో కనిపించలేదు. ఒకవేళ ఆ ప్రస్తావన తెచ్చి ఉంటే మంచిదే. అయితే ఇంగ్లీష్ మీడియం గురించి రమణ మాట్లాడిన తీరు మాత్రం అభ్యంతరకరం అని సోషల్ మీడియాలో విస్తారంగా కామెంట్లు వచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం బోదించాలని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్ల మీడియం గురించి ఎందుకు మాట్లాడలేదు?అంతదాకా ఎందుకు ఆయన గొప్పవారు కదా! ఆయన తన పిల్లలను తెలుగు మీడియంలోనే, అందులోను ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించానని చెప్పి ఉన్నట్లయితే చాలా మందికి స్పూర్తి దాయకం అయి ఉండేది కదా! అలాగే తన మనుమలు కూడా తెలుగు మీడియంలోనే చదువుతున్నారని అని ఉంటే ఘనంగా ఉండేది కదా! వారు ఎక్కడ ,ఏ స్కూళ్లలో చదువుతున్నారో తెలియదు కాని, బహుశా ప్రభుత్వ స్కూళ్లలో అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే పలుకుబడి కలిగినవారంతా ఇంటర్నేషనల్ స్కూళ్లలోనే చదివిస్తున్నారు కదా! తప్పు లేదు. ✍️కాని ప్రభుత్వ స్కూళ్లలోనే ఫలానా విధంగా ఉండాలని చెప్పడమే కాస్త ఆక్షేపణీయంగా అనిపిస్తుంది. న్యాయ వ్యవస్థలో ఆంగ్ల భాష ప్రాధాన్యత గురించి రమణ కు తెలియకపోదు. ఇప్పటికీ కోర్టులలో ఆంగ్లంలోనే తీర్పులు వెలువడుతుంటాయి. వాదనలన్నీ ఆంగ్లంలోనే జరుగుతుంటాయి. ఆ విషయాన్ని విస్మరించరాదు కదా? అలాగే మిగిలిన వ్యవస్థలలో కూడా ఆ పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఆంగ్ల మాద్యమమే మంచిదని భ్రమలు వద్దని చెప్పడం ద్వారా ఆంధ్ర సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందనిపిస్తుంది. మాతృభాషలోనే టీచర్లు బోధించాలని మాజీ జస్టిస్ చెప్పడం సహేతుకంగా లేదు. వారు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయాలి కదా! రమణ ఒక విదంగా ఎపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని నీరుకార్చే విధంగా మాట్లాడారనిపిస్తుంది. ఒక్కసారి రమణ ఎపీలో ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించి, పిల్లలతో మాట్లాడి వారి మనోభావాలను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ✍️ఈ మధ్య నేను కొన్ని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలతో మాట్లాడాను. ఇంగ్లీష్ మీడియం కావాలా? వద్దా? అంటే దాదాపు అంతా కావాలని బదులు చెప్పారు. ఏపీ ప్రభుత్వం పిల్లలకు టాబ్ లు ఇవ్వడాన్ని సమర్ధిస్తారా అంటే అవునని జవాబు ఇచ్చారు. ఈనాడు వంటి పత్రికలు పిల్లలకు ఇచ్చే టాబ్ లపై దరిద్రపు వార్తలను రాస్తున్న విషయాన్ని కూడా పిల్లలు గమనిస్తున్నారు. ఆ మీడియా తీరును కూడా కొందరు తప్పుపట్టారు. పరిస్థితి ఇలా ఉంటే జస్టిస్ రమణ పేద పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు కనిపించడం సమంజసంగా కాదు. ✍️తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసిన ఈనాడు అధినేత రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పిల్లలను ఆంగ్ల మీడియంలో అది కూడా కార్పొరేట్ స్కూళ్లలోనే చదివించారు. చంద్రబాబు తన మనుమడిని ఎక్కడ చదివిస్తున్నారో రమణ తెలుసుకుని దానిపై స్పందిస్తే ప్రజలకు బాగా అర్ధం అవుతుంది.టీచర్ల జీతభత్యాల గురించి తన అభిప్రాయాలు చెప్పిన మాజీ ఛీఫ్ జస్టిస్ విద్యార్దులకు ఐదో తరగతి చదివినా రెండంకెల కూడికలు కూడా రావడం లేదని అన్నారు. దీనికి టీచర్లు ఏ విధంగా బాద్యత వహించవలసి ఉందో వివరించారో లేదో తెలియదు. కచ్చితంగా టీచర్లను గౌరవించవలసిందే. ✍️వారికి అన్ని విదాలుగా సదుపాయాలు సమకూర్చవలసిందే. కాని అదే సమయంలో వారు కూడా బాద్యతగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది కదా! రాజకీయ పార్టీలకు అనుబందంగా కాకుండా పేదల కోసం ప్రభుత్వ టీచర్లు పనిచేసిన రోజున వారు ఏ డిమాండ్లు పెట్టినా సమాజం అర్దం చేసుకుంటుంది. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో జస్టిస్ రమణ వంటివారు ఇలాంటి ఉపన్యాసాలు చేయడం వల్ల వారి ఉద్దేశాలను ప్రజలు శంకించే ప్రమాదం ఉందని చెప్పకతప్పదు.అది వారికి శోభ నివ్వదు. విద్యా వేత్త కంచ ఐలయ్య పేద వర్గాలకు, బలహీనవర్గాలకు ప్రతినిదిగా మాట్లాడిన తీరును, జస్టిస్ రమణ వంటి ప్రముఖుడు ప్రసంగించిన వైనాన్ని గమనించిన మీదట ఈ కామెంట్ రాయాలనిపించింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అంతర్జాతీయ మీడియేటర్ ప్యానెల్ సభ్యుడిగా మాజీ జస్టిస్ ఎన్వీ రమణ!
సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానల్ సభ్యునిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లోని ప్రధాన తెలుగు సంస్థలైన సాంస్కృతిక కళాసారథి, తెలుగుదేశం ఫోరమ్ మొదలైన సంస్థల ప్రతినిధులు వారిని గౌరవపూర్వకంగా కలిసి తమ సంస్థల తరఫున అభినందనలు తెలియజేసి సత్కరించారు. “తెలుగువారికే గర్వకారణమైన జస్టిస్ ఎన్వీ రమణను, వారి సింగపూర్ పర్యటన సందర్భంగా కలుసుకోవడం, వారికి తమ సంస్థ గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అన్నింటిని తెలియపరచి వారి ఆశీస్సులు అభినందనలు అందుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని" 'సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ "తెలుగు వారంతా ఒక్కటిగా, ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉంటే తెలుగుని సింగపూర్ ప్రభుత్వం కూడా గుర్తించి మీరంతా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా తెలుగు భాషను సింగపూర్ ప్రభుత్వ పాఠశాలలో బోధించడం సులభతరం అవుతుందని, ఆ ప్రక్రియలో తమ సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉంటాయని" అన్నారు. ఈ సందర్భంగా సభ్యులు టేకూరి నగేష్, అమ్మయ్య చౌదరి, సతీష్ పారేపల్లి తదితరులు జస్టిస్ రమణని కలిసి సత్కరించారు. (చదవండి: ఆతిథ్యం ఇచ్చిన సింగపూర్ తెలుగు ప్రజలు!) -
తెలుగు వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్‌లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు. -
ప్లాస్టిక్ రహితంగా తిరుమల
తిరుమల/తిరుచానూరు(చంద్రగిరి): తిరుమలలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భక్తుడిపైనా ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి టీటీడీ చేస్తున్న కృషిలో భక్తులంతా భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం కోసం శనివారం టీటీడీ నిర్వహించిన సుందర తిరుమల–శుద్ధ తిరుమల కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఆయన తొలగించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తిరుమల కొండలు పవిత్రమైనవని, ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దేవుడి గది లాగే భావించి శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. టీటీడీ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని.. ఇందులో పాల్గొంటున్న ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులను ఆయన అభినందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, ఇకపై ప్రతి నెలా రెండో శనివారం సుందర తిరుమల–శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు స్వచ్ఛందంగా పాల్గొని తిరుమలను పరిశుభ్రంగా.. ప్లాస్టిక్ రహితంగా ఉంచడానికి కృషి చేయాలని కోరారు. తిరుమలకు ప్లాస్టిక్ ఉత్పత్తులను తీసుకురావద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీర బ్రహ్మం, జాయింట్ కలెక్టర్ బాలాజీ, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, టీటీడీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులు ఆయన్ని రంగనాయకుల మండపంలో లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అలాగే శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. -
మధ్యవర్తిత్వంపై త్వరలో చట్టం
సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఆ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం భారత మధ్యవర్తిత్వ దిన తొలి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మధ్యవర్తిత్వం ద్వారా కేసుల్ని రాజీ చేసుకొనే విధానాన్ని అనుసరిస్తేనే ఏ దేశమైనా న్యాయ వివాదాల సత్వర పరిష్కారం ద్వారా పురోగతి సాధిస్తుంది. ఎంఎన్సీ సంస్థల నుంచి సాధారణ స్థాయి సంస్థల్లో జరిగే ఒప్పందా ల్లో విదాదం ఏర్పడితే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్ర యించకుండా తొలి దశలో మధ్యవర్తిత్వం ద్వారా ఆ వివాదం పరిష్కరించుకొనేలా ఒప్పందం ఉండాలి. హైదరాబాద్‌లో వేలాది నిర్మాణాలు జరుగుతున్నా యి. సివిల్ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంది. తద్వారా అది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. చోళుల కాలంలోనే ‘మధ్యవర్తిత్వం’... దేశంలో చోళుల కాలం నుంచే మధ్యవర్తిత్వ ప్రయత్నాలు సాగేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి తెలిపారు. ‘వ్యాపార లావాదేవీల్లో వివాదాలను ఆర్బిట్రేషన్ విధానంలోనే పరిష్కరించుకొనేవారు. ఆర్బిట్రేషన్, చర్చలు, మధ్యవర్తిత్వం లోక్‌అదాలత్ ఇవన్నీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి (ఏడీఆర్) విభిన్న కోణాలే. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 2021–22 సమాచారం ప్రకారం దేశంలో 464 ఏడీఆర్ కేంద్రాలుంటే 397 పనిచేస్తున్నాయి. 570 మధ్యవర్తిత్వ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో ఇప్పటివరకు 53 వేల కేసులు పరిష్కారం అయ్యాయి. మధ్యవర్తిత్వ బిల్లు – 2021ను త్వరలోనే పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉంది. నిర్దిష్ట గడువులోగా మీడియేషన్ ప్రక్రియ పూర్తి (180 రోజుల్లో పూర్తి చేయాలి. లేనిపక్షంలో మరో 180 రోజులు పొడిగింపు), మధ్యవర్తుల నమోదుకు జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు, మధ్యవర్తిత్వ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నాక ఉభయ పార్టీలు అందుకు కట్టుబడి ఉండాలి. మధ్యవర్తిత్వ వ్యవహారాలన్నీ గోప్యంగా ఉంచడం వంటివి ప్రతిపాదిత బిల్లులో కీలకాంశాలు. కోవిడ్ లాక్డౌన్ వేళ ఏడీఆర్ అమల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అవి ఆన్లైన్ వివాద పరిష్కార (ఓడీఆర్) దిశగా కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడ్డాయి’అని జస్టిస్ హిమాకోహ్లి పేర్కొన్నారు. సమయం, డబ్బు ఆదా: హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటును స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో ఆర్బిట్రేషన్–మీడియేషన్ సెంటర్ ఏ ర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. ఈ సెంటర్ల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది. సింగపూర్ ఆర్బిట్రేషన్–మీడియేషన్ ఒప్పందంపై భార త్ 2019 ఆగస్టు 7న సంతకం చేసింది. శ్రీకృష్ణుడు కౌరవ, పాండవుల మధ్య రాయబారానికి ప్రయచారు. అది విఫలం కావడంతోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పెను వినాశనానికి దారితీసింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు రచ్చబండ విధానం ద్వారా స్థానికంగా వివాదాల్ని పరిష్కరించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వ విధానానికి ఆదరణ లభిస్తోంది’అని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. 33 కేసుల పరిష్కారం... ఐఏఎంసీ ఇప్పటివరకు 33 కేసుల్ని పరిష్కరించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు వెల్లడించారు. ఆర్బిట్రేషన్ ద్వారా పది కేసులు, మీడియేషన్ ద్వారా 23 కేసుల్లో మొత్తం 700 బిలియన్ డాలర్ల విలువైన వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ సీఈ వో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, సింగపూర్ ఐఏఎంసీ చైర్మన్ జార్జి లిమ్ ప్రసంగించారు. వారికి ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిక్ స్వాగతం పలికారు. తర్వాత మధ్యవర్తిత్వంపై పలు చర్చాకార్యక్రమాలు జరిగాయి. -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
నిజంగా తెలుగు భాషపై అంత ప్రేమ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా?
విజయవాడలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జరిగిన తెలుగు మహాసభలలో తెలుగు భాష ప్రాశస్త్యం, చిన్నతనం నుంచే తెలుగు నేర్చుకోవల్సిన అవసరం తదితర అంశాలపై వక్తలు మాట్లాడారు. తెలుగు భాష వికసించాలని కోరుకోవడం తప్పు కాదు. మంచిదే. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రిటైర్డ్ సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ ఎన్.వి.రమణ తదితర ప్రముఖులు ఈ సభలలో పాల్గొని తమ సందేశాలు అందించారు. వెంకయ్య నాయుడు అయితే శ్వాస ఆగితే, భాష ఆగితే అంటూ ప్రాసతో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ ప్రముఖులిద్దరని కాదు.. అక్కడ మాట్లాడినవారిలో పలువురు పరోక్షంగా ఎపిలో వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం మాట్లాడారా అన్న అనుమానం వస్తుంది. ఏపీలో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్దులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం కృషి చేస్తున్న నేపద్యంలో దానిని ఏదో రకంగా వ్యతిరేకిస్తున్నవారు ఈ సభలో తెలుగు గురించి మాట్లాడినట్లు అనిపిస్తుంది. అయితే ఎపి ప్రభుత్వం తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేసిందన్న సంగతిని వీరు విస్మరిస్తున్నారు. తెలుగుదేశం నేత, మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ పాలకులు ఇకనైనా మారాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని వెంకయ్య నాయుడు తదితరులు అభిప్రాయపడ్డారు. తెలుగు భాష మృతభాష అవుతుందేమోనని కొందరు ఆందోళన చెందారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఈ వక్తల కుటుంబాలకు చెందినవారు ఎంతమంది తెలుగులో ప్రాధమిక విద్య అభ్యసిస్తున్నది ఎందుకు చెప్పలేకపోతున్నారు. తెలుగు సంస్కృతి కోసం సభలు పెట్టవచ్చు. కానీ తెలుగు భాషకు ఏదో అయిపోతోందన్న భావన కలిగించే యత్నమే బాగోలేదు. ఏ భాష ఎప్పుడూ మరణించదు. అందులోను కోట్ల మంది మాట్లాడే భాష అంత తేలికగా పోయేటట్లయితే, ఈ పాటికి చాలా భాషలు కనుమరుగు అయి ఉండేవి. వెంకయ్య నాయుడు కాని, రమణకాని, లేదా బుద్ద ప్రసాద్ కాని, ఇలాంటి ప్రముఖులంతా తమ మనుమలు, మనుమరాళ్లను సభకు తీసుకు వచ్చి వీరిని తెలుగు భాషలోనే తాము చదివిస్తున్నామని చెప్పగలిగి ఉంటే వారిని అంతా మరింతగా మెచ్చుకునేవారు. వెంకయ్య నాయుడు కుమార్తె ఆధ్వర్యంలోని స్వర్ణభారతి ట్రస్టులో తెలుగులోనే పాఠశాల నడుపుతున్నామని చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఒకవేళ అలా జరుగుతుంటే అభినందించాల్సిందే. తెలుగుకు సంబంధించి ఏ వార్త వచ్చినా పూనకం పూనినట్లు వార్తా కధనాలు, బానర్లు పెట్టే ఈనాడు అధినేత రామోజీరావు నడిపే రమాదేవి పబ్లిక్ స్కూలలో తెలుగు మీడియంలోనే ప్రాధమిక విద్యను చెబుతామని ప్రకటించి ఉంటే గొప్పగా ఉండేది కదా? పోనీ రామోజీరావు లేదా, ఆయన వద్ద పనిచేస్తున్న ఎడిటర్లు, జర్నలిస్టులు ఎంతమంది తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించారో, చదివిస్తున్నారో తెలపగలిగి ఉంటే ఎవరైనా విశ్వసించవచ్చు. తెలుగు భాషపై అంత ప్రేమ ఉన్న ప్రవాసాంధ్రులు తమ పిల్లలను అమెరికాలో కూడా తెలుగులోనే చదివిస్తున్నారా? లేదా వారిని ఇండియాకు తీసుకు వచ్చి స్వరాష్ట్రంలో తెలుగు స్కూళ్లలో చదివిస్తున్నారా? అమెరికాలో మనవాళ్లు తమ పిల్లలకు తెలుగు నేర్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మంచిదే. ఇళ్ల వద్ద తెలుగు మాట్లాడిస్తే స్వాగతించవలసిందే. కొంతమంది కళలపట్ల ఆసక్తికలిగిన తల్లిదండ్రులు తెలుగులో పద్యపఠనం తదితర ప్రక్రియలను బోధిస్తున్నారు. ఇది సంతోషించవలసిన అంశమే. కాని అత్యధిక శాతం తెలుగువారి పిల్లలు ఇంగ్లీష్ లోనే మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నారు. తెలుగు మర్చిపోతున్నారు. వచ్చినా ఏదో పొడి, పొడి మాటలు మాట్లాడుతున్నారు. ముందుగా వారికి ఎలా తెలుగు నేర్పించాలా అన్నదానిపై తానా లేదా ఇతర తెలుగు సంస్థలు దృష్టి పెడితే బాగుంటుంది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు గురించి వారు సభలు పెట్టి విమర్శలు చేస్తే మొత్తం మారిపోతుందా? ఎపిలోనే కాదు.. తెలంగాణలో సైతం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారు. దానికి స్పష్టమైన కారణం ఉంది. ఆంగ్ల మీడియం ఉన్న స్కూళ్లకే 90 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తున్నారు.దాంతో ప్రభుత్వ స్కూళ్లు కేవలం పేదలకు, ఆర్థికంగా స్తోమత లేని బలహీనవర్గాలకే పరిమితం అవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన వైసిపి ప్రభుత్వం కాని, కెసిఆర్ ప్రభుత్వం కాని ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టాయి. కెసిఆర్‌కు ఈ విషయంలో ఇబ్బంది రాలేదు కాని, ఎపిలో జగన్ ను మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి, జనసేన, వామపక్షాలు చాలా ఇబ్బంది పెట్టే యత్నం చేశాయి. తెలుగును కంపల్సరీ సబ్జెక్టుగా చేసినా ఏదో రకంగా జగన్ ముందుకు వెళ్లకూడదని చివరికి కోర్టులను కూడా అడ్డం పెట్టుకుని టిడిపి చేసిన యాగీ ఇంతా ,అంతా కాదు. ఈనాడు, జ్యోతి వంటి పత్రికలు నానా రభస చేశాయి. పోనీ ఈ మీడియా సంస్థల యజమానుల పిల్లలు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా తెలుగులో చదువుతున్నారా అంటే అదేమీ లేదు. వీరిలో అత్యధికులు హైదరాబాద్, ముంబై వంటి నగరాలలో కార్పొరేట్ స్కూళ్లలో ఆంగ్ల మీడియంలో చదివించుకుంటున్నారు. ఎపిలో మాత్రం ఆంగ్ల మీడియం పెట్టకూడదని యాగీ చేశారు. వీరెవరూ ప్రైవేటు స్కూళ్లు ఆంగ్ల మీడియం మాత్రమే అమలు చేస్తున్నప్పుడు నోరు మెదపలేదు. అంతదాకా ఎందుకు! తెలుగు గురించి చంద్రబాబు గారు చాలా ఉపన్యాసాలు చేశారు కదా? ఆయన కుమారుడు లోకేష్‌ను ఏ మీడియంలో చదివించారు? ప్రస్తుతం ఆయన మనుమడు దేవాన్ష్‌ను కాని తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? బుద్ద ప్రసాద్ వంటి వారు ముందుగా ఈ విషయంలో సలహా ఇవ్వవలసింది వీరికి కదా! ప్రాధమిక విద్య మాతృభాషలోనే జరగాలని చెబుతున్న ఈ పెద్దలు, తమ వాళ్లు మాత్రం ఆంగ్లంలో చదివినా బాగా చదవగలరని, మిగిలినవారు అర్ధం చేసుకోలేరని ఎలా భావిస్తున్నారో అర్ధం కాదు. వీరంతా ఒక్కసారి కాకినాడ జిల్లా బెండపూడిలోని ప్రభుత్వ స్కూల్కుకు వెళ్లి, అక్కడ పిల్లలు, ఆంగ్లంతో పాటు, తెలుగు భాషలో కూడా ఎలా రాణిస్తున్నది తెలుసుకుంటే బాగుంటుంది. వారిని ఇలాంటి సంఘాలు ప్రోత్సహించి, ఏ సందేశం ఇచ్చినా వినబుద్ది అవుతుంది. చిన్నతనంలోనే ఏమి నేర్పినా పిల్లలకు బాగా వంటపడుతుందని అంటారు. తెలుగు గురించి ఇంతలా బాధ పడుతున్నవారు పాటించి చూపిస్తే కదా మిగిలినవారు ఆచరించే అవకాశం ఉండేది. చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరించడం పరిపాటిగా మారడం దురదృష్టకరం. ప్రవాసాంద్రులు తెలుగు భాష గురించి ఏ కార్యక్రమం చేసినా సంతోషమే. దానికి ముందుగా అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా వ్యవహరించగలిగితే , అప్పుడు వారు ఏమి చెప్పినా విలువ పెరుగుతుంది కదా! - హితైషి -
వ్యాపారం.. లాభాపేక్ష మాత్రమే కాకూడదు
హఫీజ్‌పేట్: వ్యాపారంలో లాభాపేక్ష మాత్రమే ప్రాధాన్యం కాకూడదని.. సమాజంలోని అసమానతలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో ‘లీడర్షిప్ సమ్మిట్–2022’ను జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యాపార విద్య చదివే విద్యార్థులకు సైతం రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రాయోజిత వ్యాజ్యాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంటే న్యాయవ్యవస్థలో సగం సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ దేశంలో న్యాయపరమైన మౌలిక సదుపాయాల స్థితి ఇంకా కొనసాగుతోందన్నారు. పెండింగ్ కేసులు న్యాయవ్యవస్థకు ఎప్పుడూ ఒక సవాల్‌గానే ఉంటాయన్నారు. వాటిని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం ఎప్పుడూ తాడుపై నడిచినట్లేనని ఆయన పేర్కొన్నారు. 16 నెలల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం.. చీఫ్ జస్టి‹స్‌గా 16 నెలలు కొనసాగిన సమయంలో సుప్రీంకోర్టు కోర్టుకు 11 మంది న్యాయమూర్తులను, పలు హైకోర్టులకు 233 మందిని న్యాయమూర్తులను నియమించడం జరిగిందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి తగిన ప్రణాళికతో ముందుకు సాగామని చెప్పారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం కూడా ప్రారంభించామని వివరించారు. ఇదిలా ఉంటే.. ఐఎస్బీ 20 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పురోభివృద్ధి సాధించిందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఐఎస్బీ ఏర్పాటు సమయంలో 250 ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై కోర్టులో కేసు వేయగా.. అదనపు అడ్వొకేట్ జనరల్‌గా ఉంటూ కేసులో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పు ఎప్పటికీ మరువలేమని చెప్పారు. ఆ తర్వాత 20 ఏళ్లకు ఇప్పుడు లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఎస్బీ భూ వ్యాజ్యానికి సంబంధించి అప్పటి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు కాపీని డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్లకు జస్టిస్ ఎన్వీ రమణ అందజేశారు. అంతకుముందు లీడర్షిప్ సమ్మిట్ ప్రాధాన్యతను మదన్ పిల్లుట్ల వివరించారు. అనంతరం మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌కుమార్, డాక్టర్ జయంతి కుమరేశ్, లైట్‌స్పీడ్ పార్ట్నర్ అభిషేక్నాగ్, ది బెటర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు అనురాధ కేడియా, మైగేట్ సీఈఓ విజయ్ అరిశెట్టి, తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఈడీ కేదార్లేలేతోపాటు పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్బీ అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు, రాష్ట్ర హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. -
విజయానికి షార్ట్ కట్లు ఉండవు: జస్టిస్ ఎన్వీ రమణ
-
గొప్ప జడ్జిని కాకపోవచ్చు.. సామాన్యుడికీ న్యాయం అందించా: జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: జీవితంలో తనకు విద్య నేర్పిన గురవులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సీజేఐ ఎన్వీరమణకు శుక్రవారం సుప్రీం కోర్టులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ ప్రసంగిస్తూ.. తన జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులో తొలిసారి కరెంటు చూసినట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లకు ట్రేడ్ యూనియన్‌కు నేతృత్వం వహించానని తెలిపారు. ఈ వృత్తిలో అనేక ఒడిదొడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలని సూచించారు కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం మొదలైందని, వృత్తి పరంగా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు.. తాను గొప్ప జడ్జీని కాకపోవచ్చు కానీ, సామాన్యూడికి న్యాయం అందించడానికి కృషి చేశానని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. చదవండి: (బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఆజాద్) ఇదిలా ఉండగా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. కాగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. చదవండి: (జార్ఖండ్ సీఎంకు షాక్.. శాసనసభ సభ్యత్వం రద్దు) -
జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీపికబురు.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ జర్నలిస్టు సంఘం దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయ మిత్రులకు తమ వాగ్ధానాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. చదవండి: జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల కోసం.. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ద్వారా అందిన తీపి కబురు అని అల్లం నారాయణ అన్నారు. అలాగే, జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. I would like to extend my gratitude to the Hon’ble Supreme Court & CJI Garu for clearing the long-standing demand of Telangana journalist society on house site allotments This will help Telangana Govt deliver on our promise to our Journalist friends 👍 — KTR (@KTRTRS) August 25, 2022 -
జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరిగింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు 12 ఏళ క్రితం ప్రభుత్వాన్ని స్థలాన్ని కేటాయించింది. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడటం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి?. రూ.8వేల నుంచి రూ.50వేల వరకు జీతం తీసుకునే 8వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం. చదవండి: (జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీపికబురు.. మంత్రి కేటీఆర్ ట్వీట్) వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి స్థలం కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్ చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి మేం అనుమతిస్తున్నాం. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్ట్ చేయాలని సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు. చదవండి: (స్కాట్లాండ్లో పలమనేరు విద్యార్థి మృతి) -
అల్లోపతిపై విమర్శలేల?
న్యూఢిల్లీ: అల్లోపతి తదితర వైద్య పద్ధతులను విమర్శించడం సరికాదని యోగ గురు బాబా రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హితవు పలికారు. రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ రవికుమార్‌ల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. రోగుల సమస్యలకు, లక్షలాది మరణాలకు అల్లోపతే కారణమంటూ జారీ చేసిన ప్రకటనలను తీవ్రంగా తప్పుబట్టింది. కోవిడ్ ఉధృతికాలంలో ఇలాంటి పలు ప్రకటనలను పతంజలి సంస్థ జారీ చేసిందని ఐఎంఏ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘రామ్‌దేవ్‌కు ఏమైంది? అల్లోపతిపై తీవ్ర విమర్శలు చేస్తూ, డాక్టర్లంటే ఏదో హంతకులన్నట్టుగా వారందరినీ తప్పుబడుతూ వార్తా పత్రికల్లో భారీ ప్రకటనలా? ఏమిటిది? ఇలా ఎలా చేస్తారు?’’ అంటూ సీజేఐ తప్పుబట్టారు. ‘ఆయనంటే మాకు గౌరవం. యోగాకు ప్రాచుర్యం కల్పించారు. టీవీల్లో రామ్‌దేవ్ యోగా ప్రోగ్రాంలను మేమూ చూసేవాళ్లం. మీ వైద్య విధానం గొప్పదనం గురించి చెప్పుకోవచ్చు. కానీ ఇలా ఇతర వైద్య విధానాలను విమర్శించడం సరికాదు’ అన్నారు. రామ్‌దేవ్ అనుసరిస్తున్న ఆయుర్వేదమో, లేదా మరేదైనా విధానమో మాత్రమే అన్ని రోగాలకూ నివారిణి అని గ్యారెంటీ ఇవ్వగలరా అని సీజేఐ ప్రశ్నించారు. ఇలాంటి విమర్శలకు దూరంగా ఉండాలని బాబా రామ్‌దేవ్‌కు సూచించారు. కేంద్రానికి, పతంజలి ఆయుర్వేద సంస్థకు నోటీసులు జారీ చేశారు. కరోనా వ్యాక్సీన్ల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యల విషయంలో ఢిల్లీ హైకోర్టు కూడా గత వారం రామ్‌దేవ్‌ను మందలించడం తెలిసిందే. -
సత్వర న్యాయమే లక్ష్యం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, అమరావతి: దేశంలోని న్యాయ స్థానాల్లో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు తక్కువ సమయంలో న్యాయం అందేలా న్యాయవాదులు పని చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతే ప్రజాస్వామ్యం మనుగడ కష్టమని, ఆ పరిస్థితి తలెత్తకుండా న్యాయ వ్యవస్థ వనిచేసేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ‘ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడటం శుభపరిణామం.. అందువల్ల నేను కూడా తెలుగులో మాట్లాడటమే సముచితం’ అంటూ సీజేఐ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. 2013 మే 11న ఈ భవనానికి శంకుస్థాపన చేసినప్పటికీ.. రాష్ట్ర విభజన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణం పూర్తవ్వడానికి ఆలస్యమైందన్నారు. అయితే మళ్లీ తన చేతుల మీదుగానే ఈ భవనం ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడకుండా న్యాయ వ్యవస్థకు ప్రత్యేక నిధులు ఇవ్వాలన్న తన ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించకపోయినా.. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు మద్దతుగా నిలిచారని అభినందించారు. విజయవాడతో, బెజవాడ బార్ అసోíసియేషన్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం సమాజంలో మార్పు కోసం అపార అనుభవం గల సీనియర్ న్యాయవాదులు జూనియర్లకు అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వాలని జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. ఈ సందర్భంగా తన ఉన్నతికి, తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి పోయిందని, అందరూ కష్టపడి పనిచేసి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం కూడా అవసరమైన నిధులు ఇచ్చి రాష్ట్రానికి సహకరించాలని కోరారు. తన పదవీ కాలంలో 240 మంది హైకోర్టు న్యాయమూర్తులను, 15 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా హైకోర్టు న్యాయ మూర్తులను నియమించామని గుర్తు చేశారు. ఈ నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. రూ.55 కోట్ల అంచనాతో మొదలైన విజయవాడ సిటీ సివిల్ కోర్టు భవన సముదాయం ప్రస్తుతం రూ.100 కోట్లు దాటిందని, ఏపీ ప్రభుత్వ సహకారంతో పనులు పూర్తి చేశామన్నారు. ఈ భవన నిర్మాణం కోసం కృషి చేసిన బెజవాడ బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులకు, పెద్దలరికీ ఆయన అభినందనలు తెలిపారు. విశాఖలో పెండింగ్‌లో ఉన్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి సీఎం సహకారం అందించాలని సీజేఐ కోరారు. భవన సముదాయంలో ఓ విభాగాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఇది అరుదైన ఘట్టం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి 2013లో జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు అదే భవన సముదాయాన్ని ఆయనే ప్రారంభించడం అరుదైన ఘట్టమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. జ్యూడీషియరీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. విజయవాడలో అధునాతన భవనంలో కోర్టులు ఏర్పాటవ్వడం ఆనందంగా ఉందన్నారు. బహుళ అంతస్తుల భవనాలలో కోర్టు హాల్స్ ఏర్పాటుతో కేసుల విచారణలో వేగం పెరుగుతుందని, పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ కోర్టుల భవన నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నూతన కోర్టు భవన సముదాయాన్ని పరిశీలిస్తున్న సీజేఐ, హైకోర్టు సీజే, సీఎం ఇదిలా ఉండగా, కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్‌ను సన్మానించాలని సభ్యులు చేసిన అభ్యర్థనను సీఎం సున్నితంగా తిరస్కరించారు. న్యాయ వ్యవస్థలో అనుభవజ్ఞులైన జస్టిస్ ఎన్వీ రమణను సత్కరించడం సముచితమని వారికి సూచించారు. వేదికపై ఈ సన్నివేశాన్ని గమనించిన న్యాయవాదులు సీఎం నిరాడంబరతను ప్రశంసించారు. సీఎం తన ప్రసంగంలో ప్రత్యేకంగా న్యాయవాదులకు కృతజ్ఞతలు చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. సీజేఐని గజమాలతో సత్కరించినప్పుడు వేదికపై సీఎం.. అందరిలో ఒక్కడిగా కలిసిపోయి సూచనలు ఇచ్చిన తీరును కరతాళ ధ్వనులతో అభినందించారు. కాగా, తొలుత కోర్టు ప్రాంగణంలో సీజేఐ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ బి.దేవానంద్, జస్టిస్ కృపాసాగర్, జస్టిస్ శ్రీనివాస్, జిల్లా జడ్జి అరుణ సాగరిక, హైకోర్టు న్యాయమూర్తులు, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం విందు (ఫొటోలు)
-
సీజేఐ ఎన్వీ రమణ, గవర్నర్ బిశ్వభూషణ్ గౌరవార్థం విందు.. హాజరైన సీఎం జగన్ దంపతులు
-
సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్
-
ఏపీ ప్రభుత్వం తరపున సీజేఐ ఎన్వీ రమణకు విందు
సాక్షి, విజయవాడ: మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ల గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ విందులో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం.. పాల్గొన్న సీజే ఎన్వీ రమణ, సీఎం జగన్ (ఫొటోలు)
-
ప్రజలకు న్యాయవ్యవస్థ చేరువలో ఉండాలి: సీజేఐ ఎన్వీ రమణ
-
కోర్టు భవనాలను సీజేఐ ప్రారంభించడం సంతోషం: సీఎం జగన్
-
విజయవాడ: ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం
సాక్షి, విజయవాడ: ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ (సీజేఐ ఎన్వీ రమణను ఉద్దేశించి).. ఇవాళ ఒక ఉన్నతస్థాయిలో ఇక్కడి కోర్టు భవనాన్ని ప్రారంభించడం.. రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. 2013లో జస్టిస్ ఎన్వీ రమణగారి చేతుల మీదుగానే ఈ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఆయన చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషం. ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం అని సీఎం జగన్ తెలిపారు. జ్యూడీషియరీకి సంబంధించి ప్రతీ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అనంతరం సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగారు తెలుగులో మాట్లాడాక.. తాను తెలుగులో మాట్లాడకపోవడం బాగోదని చెప్తూ తెలుగులోనే ప్రసంగించారు జస్టిస్ ఎన్వీ రమణ. నేను శంకుస్థాపన చేసిన బిల్డింగ్‌ను.. మళ్లీ నేనే ప్రారంభించడం ఆనందంగా ఉంది. రకరకాల కారణాలతో ఈ నిర్మాణం ఆలస్యమైంది. న్యాయ వ్యవస్థకు అదనపు నిధుల విషయంలో కేంద్రం నుంచి వ్యతిరేక వచ్చినప్పుడు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రులకు( ఏపీ సీఎం జగన్ కూడా) కృతజ్ఞతలు. పెండింగ్ కేసులు విషయంలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలనే తపన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఉండాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. విభజన అనంతరం ఏపీ ఆర్థికంగా వెనకబడిందన్న సీజేఐ.. విభజనతో నష్టపోయామన్న భావన ఏపీ ప్రజల్లో ఉందని, కాబట్టి ఈ విషయంలో కేంద్రం రాష్ట్రానికి తోడ్పాటు అందించాలని కోరారు. నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో జడ్జి ల ఖాళీలను భర్తీ చేసాను. 250 మంది హైకోర్టు జడ్జి లను, 11 మంది సుప్రీంకోర్టు జడ్జి లను నియమించగలిగాను. సీఎం వై ఎస్ జగన్ సహకారం వల్లనే ఇప్పుడు ఈ భవనం పూర్తి చేసుకోగలిగాం. విశాఖపట్నం లో కూడా ఓ భవనం చివరి దశలో ఉంది. దానితో పాటు ఇతర కోర్టు భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్‌ను కోరుతున్నాం అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య లేనట్టే.. -
విజయవాడ కోర్టుల భవన సముదాయం ప్రారంభం
-
కోర్టు కాంప్లెక్స్ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.. పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: నగరంలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని శనివారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. విజయవాడ కోర్టుతో జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడి నుంచే ఆయన తన న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సిటీ సివిల్ కోర్టు భవన సముదాయ ప్రారంభ కార్యక్రమానికి ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో సీజే రమణ, సీఎం జగన్‌లు కలిసి మొక్క నాటారు. ఇక విజయవాడ కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. ఏఎన్‌యూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో పాటు యూనివర్సిటీ ప్రదానం చేసే డాక్టరేట్‌ను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పట్టేటి రాజశేఖర్ తదితరులు పాల్గొంటారు. ఇదీ చదవండి: పొరబడిన ‘ప్రాప్తి’: నిషేధానికి గురైన రాష్ట్రాల జాబితా నుంచి ఏపీ పేరు తొలగింపు -
జడ్జీల కోసం రిక్రియేషన్ సెంటర్
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: న్యాయమూర్తుల కోసం గెస్ట్‌హౌస్‌లు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉన్నాయని.. కానీ, దేశంలోనే తొలిసారిగా హైకోర్టు జడ్జీల కోసం రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేయనుండటం ఆనందదాయకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని వికార్ మంజిల్‌లో హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన కల్చరల్ సెంటర్, గెస్ట్‌హౌస్ నిర్మాణానికి శుక్రవారం సాయంత్రం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సుదీర్ఘకాలంగా న్యాయమూర్తుల గెస్ట్‌హౌస్ అం«శం పెండింగ్‌లో ఉందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు పలు అవసరాల కోసం వస్తే వసతి కల్పనకు ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే న్యాయమూర్తులకు వసతి కల్పించేందుకు ఈ గెస్ట్‌హౌస్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో మాత్రమే జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయని, ఇప్పుడు హైకోర్టుల్లో ఆ తరహా వసతుల కల్పన చేయబోయేది తెలంగాణ హైకోర్టేనని చెప్పారు. రాష్ట్ర సర్కార్ తీరు హర్షణీయం.. ప్రతిపాదన చేయగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై సీజేఐ హర్షం వ్యక్తం చేశారు. భవనాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చెప్పడంపై ఆనందం వెలిబుచ్చారు. కోర్టులకు భవనాల నిర్మాణాలు ఎలా ఉండాలో నమూనాను రూపొందిస్తూ తయారు చేసిన ‘న్యాయ నిర్మాణ్’పుస్తకాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ భూయాన్ ఆవిష్కరించారు. జస్టిస్ పి.నవీన్‌రావు నేతృత్వంలోని కమిటీ న్యాయ నిర్మాణ్ నమూనాను రూపొందించిందని సీజేఐ తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కోర్టులకు సొంత భవనాలు లేవని, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు. కలెక్టరేట్, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ల భవనాల మాదిరిగానే ప్రజలు గుర్తించే రీతిలో కోర్టు భవనాలు జిల్లా, తాలూకా స్థాయిల్లో కూడా ఉండాలన్నారు. జడ్జీల పోస్టుల భర్తీతోపాటు మౌలిక వసతుల కల్పన చేస్తేనే న్యాయం అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 22 ఏళ్లుగా న్యాయమూర్తిగా సేవలు అందించానని, ఈ నెల 27న సుప్రీంకోర్టు సీజేగా పదవీ విరమణ చేయబోతున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఈ స్థాయికి రావడానికి, న్యాయమూర్తిగా సేవలు అందించడానికి ఎంతోమంది తనకు మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. 20 సూట్లు.. 12 డీలక్స్‌లు.. 2.27 ఎకరాల్లో నిర్మించనున్న హైకోర్టు జడ్జీల గెస్ట్‌హౌస్, కల్చరల్ సెంటర్ నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం పట్ల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధన్యవాదాలు తెలియజేశారు. రూ.50 కోట్ల వ్యయంతో ఐదు వీఐపీ సూట్లు, మరో 20 సూట్లు, 12 డీలక్స్ గదులు, సాంస్కృతిక భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, జస్టిస్ నవీన్‌రావు, పలువురు న్యాయమూర్తులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఏజీ బీఎస్ ప్రసాద్, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునాథ్, సీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, తిరుపతి: తిరుపతిలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటించారు. ఈ సందర్బంగా గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన' పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఎన్వీ రమణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సత్యశోధన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ సేవలను కొనియాడారు. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాటం చేసారని.. నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించిన వ్యక్తం గాంధీజీ అని అన్నారు. రాస్ నిర్వాహకులు, పద్మశ్రీ గ్రహీత స్వర్గీయ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అంతకుముందు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చదవండి: ‘పాడా' పనులను త్వరగా పూర్తి చేసేలా సీఎం జగన్ ఆదేశాలు తిరుమల శ్రీవారిని దర్శించకున్న సీజేఐ తిరుమల శ్రీవారిని సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో సీజేఐకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. -
అహింసా మార్గంలో స్వతంత్ర పోరాటానికి గాంధీ నడిపారు: సీజేఐ ఎన్వీ రమణ
-
తిరుపతిలో సిజెఐ ఎన్వీ రమణ పర్యటన
-
అనుచితాలు కాదు: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఉచితమంటే ఏమిటి? దేన్ని ఉచితంగా పరిగణించాలి’’ అనే కీలకమైన మౌలిక ప్రశ్నలను సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం తదితరాలను ఉచితాలుగా భావించాలా, లేక పౌరుల ప్రాథమిక హక్కుగానా అన్నది లోతుగా ఆలోచించాల్సిన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ వంటి పథకాల ద్వారా దేశ పౌరులకు అందుతున్న ఎనలేని ప్రయోజనాలను ప్రస్తావించారు. తద్వారా గ్రామీణ భారతంలో అపారంగా ఆస్తుల సృష్టి కూడా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీల ఉచిత హామీల అంశాన్ని సమగ్రంగా తేల్చడానికి ఓ నిపుణుల కమిటీ వేసే యోచన ఉందని మరోసారి చెప్పారు. రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను నియత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు వాగ్దానాలు చేయకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచనప్రాయంగా పేర్కొన్నారు. ‘‘వాగ్దానాలు చేయకుండా దేశంలోని రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచిస్తున్నాం. ఎందుకంటే సమాజంలోని భిన్న వర్గాల్లో ఆదాయం, హోదా, సదుపాయాలు, అవకాశాలపరంగా అసమానతలను రూపుమాపాలని రాజ్యాంగమే ప్రభుత్వాలకు నిర్దేశిస్తోంది. కాబట్టి గెలిచి అధికారంలోకి వస్తే ఈ నిర్దేశాన్ని సాకారం చేసేందుకు ఉచిత హామీలివ్వకుండా పార్టీలను గానీ, వ్యక్తులను గానీ నిరోధించలేం. కాకపోతే ఏది నిజమైన హామీ నిర్వచనంలోకి వస్తుందన్నదే అసలు ప్రశ్న. అలాగే అసలు ఉచితమంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముంది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివాటిని ఉచితంగా పొందవచ్చా?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘ప్రజలు గౌరవంగా జీవించడానికి అవసరమైన పథకాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపును కేవలం ఉచిత వాగ్దానాలే నిర్దేశించడం లేదు. కొన్ని పార్టీలు ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో గెలవడం లేదుగా!’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలూ తెలుసుకున్న తర్వాతే ఉచితాల మీద ఓ స్పష్టమైన నిర్ణయానికి రాగలమని సీజేఐ స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేశారు. అన్నింటిపైనా చర్చ: విపక్షాలు పిటిషన్‌పై కాంగ్రెస్, ఆప్, డీఎంకే తదితర విపక్ష పార్టీలు భిన్నమైన వ్యాఖ్యలు చేశాయి. ఉచితాలు, దేశ ఆర్థిక పరిస్థితుల మధ్య సంబంధంపై చర్చ జరగాలంటే రాజకీయ నేతలు, చట్టసభ సభ్యులు ఏమేం ప్రయోజనం పొందుతున్నారో కూడా చర్చ జరగాలని ఆప్ తన ఇంటర్వీన్ అప్లికేషన్లో పేర్కొంది. ప్రజలకు రాయితీలివ్వడాన్ని ఉచితంగా పరిగణించరాదని కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ తన అప్లికేషన్లో పేర్కొన్నారు. భారత్‌ను ప్రజాస్వామ్య దేశం నుంచి పెట్టబడీదారీ దేశంగా మార్చాలని పిటిషనర్ ప్రయత్నిస్తున్నారని డీఎంకే తరఫు సీనియర్ న్యాయవాది పి.విల్సన్ వాదించారు. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని కేంద్రం పేర్కొంది. అయితే పార్టీల ఉచిత వాగ్దానాలను నియంత్రించాల్సిన అవసరముందని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరోసారి సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టసభల్లో చట్టాలు రూపొందేదాకా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని కూడా మరోసారి సూచించింది. పదవీ విరమణ రోజున ప్రస్తావిస్తా రిజిస్ట్రీ సమస్యలు తదితరాలపై సీజేఐ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అవలంబిస్తున్న కొన్ని పద్ధతులను నియంత్రించాల్సి ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. బుధవారం విచారణ సందర్భంగా రిజిస్ట్రీతో ఓ కేసు విషయంలో ఎదురైన ఇబ్బందిని న్యాయవాది దుష్యంత్ దవే ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాత్రి ఎనిమిదింటికి దాకా కేసులకు సంబంధించిన అంశాలు విన్నాం. సమావేశాలు కూడా ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఒక కేసును విచారణ జాబితా నుంచి తొలగిస్తేనే ఈ కేసు జాబితాలో చేరింది. ఇది సరికాదు. రిజిస్ట్రీలో ఇలాంటి పద్ధతులను నియంత్రించాల్సించే’’ అన్నారు. ‘‘నా దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ నా పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు ప్రసంగంలో చెబుతా’ అని పేర్కొన్నారు. జస్టిస్ రమణ 26న పదవీ విరమణ చేయనుండటం తెలిసిందే. -
సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కృష్ణయ్య భేటీ
కాచిగూడ (హైదరాబాద్): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ఆహ్వానం మేరకు శుక్రవారం ఆయనను న్యూఢిల్లీలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువ్యక్తి ఉండటం తెలుగు జాతికి గర్వకారణమని ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, మోక్షిత్ తదితరులున్నారు. -
ఆ అభ్యర్థనలు ఆమోదయోగ్యం కాదు.. నేను అనుమతించను: ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: తమ కేసులను అత్యవసర విచారణకు తీసుకోవాలంటూ సీనియర్ న్యాయవాదులు చేస్తున్న అభ్యర్థనలు ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టంచేశారు. ‘సీనియర్ లాయర్లు ఇలా మెన్షన్ చేయడాన్ని నేను అనుమతించబోను. సుప్రీంకోర్టు పనిదినం ప్రారంభంకాగానే తమ కేసులే ముందుగా విచారణకు చేపట్టాలంటూ పలువురు సీనియర్ లాయర్ల నుంచి వినతులు ఎక్కువయ్యాయి. వారి వినతులకు ప్రాధాన్యత ఇవ్వబోను’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. అర్జెంట్ లిస్టింగ్(కేసుల విచారణ జాబితా)లో తమ కేసును జతచేయాలంటూ ఒక సీనియర్ వకీలు.. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ రమణల ధర్మాసనం ముందు క్యూలో నిల్చొని అభ్యర్థిస్తుండగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ మరుసటి రోజు మెన్షన్ చేయండని మీ ఏఓఆర్(అడ్వొకేట్ ఆన్ రికార్డ్)కు చెప్పండి’ అంటూ సీజేఐ సూచించారు. కేసులను మెన్షన్ చేసేందుకు సీనియర్ లాయర్లయిన కపిల్ సిబల్, ఏఎం సింఘ్వీలనూ సీజేఐ అనుమతించలేదు. చదవండి: (గుడ్‌న్యూస్: 2024 డిసెంబర్ 31 దాకా ‘పీఎంఏవై–అర్బన్’) -
వైవిధ్యాన్ని కొనసాగిస్తూనే విలువలు కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచీకరణతో ప్రపంచ సంస్కృతి వైపు మనం వెళుతున్నామని, ప్రపంచ సంస్కృతి యావత్తు ప్రపంచాన్ని చుట్టుముడుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఈ వైవిధ్యాన్ని కొనసాగిస్తూనే మన విలువలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్, వర్సిటీ చాన్స్‌లర్ తమిళిసై సౌందర రాజన్.. సీజేఐ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. నేటి యువత అనేక సవాళ్లను ఎదర్కొంటోందని, మన జీవన విధానం భారీ పరివర్తనకు గురయ్యిందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. మన తిండి, భాష, బట్టలు, ఆటలు, పండుగలు వగైరాలు మన గతంతో పెనవేసుకుపోయాయన్నారు. సగం భాషలు కనుమరుగయ్యే ప్రమాదం యునెస్కో 2021 నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలోమాట్లాడే 7 వేల భాషల్లో సగం భాషలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని, దీంతో భాష, సాహిత్యాన్ని కోల్పోవడంతో పాటు, జానపద కథలు, తరాల వారసత్వంగా లభించిన విజ్ఞానాన్ని కోల్పోతామని జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం క్రమంగా మారుతోందని, కొత్త వంగడాల రాకతో అనేక మార్పులొచ్చాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థ మార్పులకు లోనవడంతో పంటలు మార్పులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యార్థులు ప్రాథమిక చట్టాలు, సూత్రాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. రాజ్యాంగం, పరిపాలనపై సబ్జెక్టులను ప్రవేశపెట్టాల్సిన అవసరముందన్నారు. పౌరులు రాజ్యాంగంతో అనుసంధానించబడాలని, రాజ్యాంగమే మనకు అంతిమ రక్షణ కవచమని చెప్పారు. విద్యార్థులంతా ఉత్తరాలు రాయాలని, పుస్తకాలు చదవాలని సీజేఐ రమణ ఉద్బోధించారు. ఉత్తరాలు రాస్తే మీలో ఉన్న కవులు బయటకు వస్తారని ఆయన సూచించారు. పీవీ, కేసీఆర్ ఓయూ ప్రొడక్ట్లే.. ఉస్మానియా యూనివర్సిటీ దక్షిణ భారతదేశంలోనే మూడో పురాతన విశ్వవిద్యాలయమని, హైదరాబాద్ రాష్ట్రంలో మొదటిదని గుర్తుచేశారు. బ్రిటిష్ వలస పాలన, ఆంగ్లభాష ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ప్రాంతీయ భాషల్లో బోధనను ఓయూ ప్రారంభించి ఉన్నత విద్యలో కొత్త యుగానికి నాంది పలికిందన్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర భారత్‌గా అవతరించే వరకు వెలుగురేఖలు పంచిందన్నారు. ఎంతో మంది దార్శనికులను తయారు చేసిందని, సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా తీర్చిదిద్దడం ఓయూ ప్రత్యేకత అని కొనియాడారు. రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు ఓయూ ప్రొడక్ట్లేనని గుర్తు చేశారు. ఓయూలో చేరాలనుకున్నా.. ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో ఓయూ పాత్ర గణనీయమైందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, రాజగోపాలాచారి, నెహ్రూ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, అంబేడ్కర్ వంటి 42 మంది మహనీయులు ఓయూ నుంచి గౌరవ డాక్టర్‌ను స్వీకరించారని చెప్పారు. ఓయూ కాలేజీలో చేరాలనుకున్నా తనకా అవకాశం దక్కలేదని, కోరిక నెరవేరలేదని గత స్మృతులను నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా కాళోజీ, దాశరథి కవితలు చదివి జస్టిస్ రమణ మాతృ భాషపై గల మమకారాన్ని చాటుకున్నారు.. హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 44 గోల్డ్‌మెడల్స్, 211 పీహెచ్డీ అవార్డులను విద్యార్థులకు ప్రదానం చేశారు. లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడాలి విజయానికి సత్వర మార్గాలు ఉండవని, లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విద్యార్థులకు సూచించారు. చిన్నచిన్న లక్ష్యాలు కాకుండా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఎదురుకోవాల్సిందేన్నారు. కచ్చితంగా సమయ పాలన పాటించాలని, సాధారణంగానే ఉండాలని, అసాధారణ పనులు చేయాలన్నారు. ప్రస్తుతం ఐదు నిమిషాలు కూడా మొబైల్‌ని పక్కకు పెట్టే పరిస్థితి లేదని, ఫోన్లను దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. -
సీజేఐగా ఉదయ్ ఉమేశ్ లలిత్.. నాడు అమిత్ షా, సల్మాన్ ఖాన్ కేసుల్లో..
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎన్నో కీలక కేసుల్లో తీర్పులిచ్చి చరిత్ర సృష్టించారు. ముస్లిం మహిళలకు నోటి మాట ద్వారా విడాకులిచ్చే త్రిపుల్ తలాక్ సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దానిని రద్దు చేస్తూ తీర్పునిచ్చిన ధర్మాసనంలో జస్టిస్ యుయు లలిత్ కూడా ఉన్నారు. న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ నేరుగా సుప్రీం బెంచ్‌కు వచ్చి అత్యున్నత స్థానాన్ని అందుకున్న రెండో వ్యక్తిగా జస్టిస్ లలిత్ రికార్డులకెక్కనున్నారు. 1971 జనవరిలో 13వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ఎం సిక్రి బార్ నుంచి బెంచ్‌కు వచ్చిన తొలి వ్యక్తి. ఆగస్టు 27న జస్టిస్ లలిత్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన కేవలం 74 రోజులు మాత్రమే సీజేఐ పదవిలో ఉంటారు. ఇప్పటివరకు ఇంత తక్కువ కాలం ఎవరూ ఈ పదవిలో కొనసాగలేదు. కాగా, జస్టిస్ యు యు లలిత్ మహారాష్ట్రలో 1957 నవంబర్ 9న జన్మించారు. 1983లో న్యాయవాదిగా లలిత్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1986లో ముంబైæ నుంచి ఢిల్లీకి వచ్చారు. 2004, ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు సీనియర్ అడ్వొకేట్ అయ్యారు. క్రిమినల్ లాయర్‌గా ఎనలేని పేరు ప్రఖ్యాతులు గడించారు. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి సినీ తారల వరకు ఎందరో ఆయన క్లయింట్లుగా ఉన్నారు. బీజేపీ నాయకుడు, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిందితుడిగా ఉన్న హై ప్రొఫైల్ కేసులు సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్, తులసీరామ్ ప్రజాపతి కేసుల్ని వాదించారు. కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తరఫున కోర్టులో వాదించారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ అవినీతి కేసుల్ని, ఒకప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ వికె సింగ్ పుట్టిన తేదీ వివాదం కేసుల్ని వాదించారు. 2జీ స్పెక్ట్రమ్ కేసుల్లో సీబీఐ తరఫున వాదించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. లలిత్ది న్యాయవాదుల కుటుంబం. ఆయన తండ్రి యుఆర్ లలిత్ బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో అదనపు న్యాయమూర్తిగా ఉండేవారు. కీలక తీర్పులు బార్ నుంచి సుప్రీం కోర్టు బెంచ్‌కి నేరుగా వచ్చిన అతి కొద్ది మంది న్యాయవాదుల్లో లలిత్ ఒకరు. 2014 జూలైలో సుప్రీం కొలీజియం లలిత్‌ను న్యాయమూర్తిగా తీసుకోవాలని సిఫారసు చేసింది. 2017 ఆగస్టులో త్రిపుల్ తలాక్‌పై ఆయన ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. అయిదుగురు సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ లలిత్ ఒకరు. ఈ తీర్పు 3–2 మెజార్టీతో వెలువడింది. త్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమంటూ జస్టిస్ యుయు లలిత్ గట్టిగా చెప్పారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేకర్, న్యాయమూర్తులు, జస్టిస్ ఎస్ అబ్దుల్లా నజీర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్‌లు ఇతర సభ్యులుగా ఉన్నారు. ఆనాటి సీజేఐ, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ త్రిపుల్ తలాక్‌పై కేంద్రమే చట్టం చేయాలంటూ తీర్పునివ్వకుండా ఆరు నెలలు నిలిపివేశారు. కానీ మిగిలిన ముగ్గురు త్రిపుల్ తలాక్ రద్దుకు అనుకూలంగా ఉండడంతో ఆ తీర్పు వెలువడింది. 2020 జులైలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ ట్రావెన్కోర్ రాజ కుటుంబం హక్కేనంటూ తీర్పునిచ్చిన బెంచ్‌లో జస్టిస్ లలిత్ ఉన్నారు. పోక్సో చట్టం కింద వివాదాస్పద స్కిన్ టు స్కిన్ నేరుగా శారీరక భాగాలు తాకితేనే లైంగిక నేరం కిందకి వస్తుందంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టులో జస్టిస్ లలిత్ తోసిపుచ్చారు. ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా యూయూ లలిత్ -
నేడు జస్టిస్ ఎన్వీ రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రదానం చేయనున్నట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. గురువారం ఆయన వర్సిటీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్‌లర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షతన వర్సిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే 82వ స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్‌ను అందజేయనున్నట్లు చెప్పారు. ఇది ఓయూ 48వ గౌరవ డాక్టరేట్ అని, 21 ఏళ్ల అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దానిని ప్రదానం చేస్తున్నామని వివరించారు. 361 మందికి పీహెచ్డీ డిగ్రీలు, వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు 55 బంగారు పతకాలు అందచేయనున్నట్లు వీసీ తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ, ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీనగేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా యూయూ లలిత్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపికయ్యారు. ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు. దీంతో ఆయన పేరును ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. కాగా ఈ నెల 26వ తేదీన ఎన్వీ రమణ సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ లలిత్ భారత 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకే ఉంది. సీజేఐగా రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం యూయూ లలిత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్ న్యాయవాది. -
CJI NV Ramana: విశాఖకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
దొండపర్తి (విశాఖ దక్షిణ): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆదివారం విశాఖకు రానున్నారు. విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రా మెడికల్ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (అంకోస) ఆడిటోరియంలో సాయంత్రం జరిగే రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి) శత జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఢిల్లీకి విమానంలో పయనమవనున్నారు. ఇదీ చదవండి: ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది -
జస్టిస్ ఖన్విల్కర్ క్రమశిక్షణ గల జడ్జి: సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ శ్రమించేతత్వం, క్రమశిక్షణగల వ్యక్తి అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. సుప్రీం కొలీజియంలో భాగమైన జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఖన్విల్కర్‌తో కలిసి తాము ఏడాది కాలంలో ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాల కోసం 250 పేర్లను పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. సుప్రీం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ ఖన్విల్కర్ వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. సుప్రీంకోర్టులో ఆయన 8,446 కేసులను పరిష్కరించడంతోపాటు 187 తీర్పులను రాశారన్నారు. ఆయన శ్రమించే తత్వం అందిరికీ తెలిసిందేనన్నారు. జస్టిస్ ఖన్విల్కర్ సుప్రీంకోర్టులో సుమారు ఆరేళ్లపాటు పనిచేశారు. ఆయన పదవీ విరమణ కారణంగా అత్యున్నత న్యాయస్థానంలోని 34 జడ్జీల పోస్టులకు గాను 31 మంది మిగిలారు. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
Droupadi Murmu: అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక
న్యూఢిల్లీ: అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక కొలువుదీరడానికి సమయం ఆసన్నమయ్యింది. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(64) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయిస్తారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రమాణ స్వీకారం అనంతరం ముర్ముకు సైనిక సిబ్బంది 21 గన్ సెల్యూట్ సమర్పిస్తారని తెలిపింది. తర్వాత ఆమె ప్రసంగం ఉంటుందని పేర్కొంది. అంతకంటే ముందు రామ్‌నాథ్ కోవింద్, ముర్ము కలిసి పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌కు చేరుకుంటారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రి మంత్రులు, దౌత్యవేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనికాధిరులు పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రమాణ స్వీకారం, ప్రసంగం తర్వాత ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అక్కడ సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపదీ ముర్ము ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించనున్నారు. -
రాజకీయాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
-
NV Ramana: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
రాంచీ: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచీలో(జార్ఖండ్) శనివారం జరిగిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మీడియాలో డిబేట్ల పేరిట జరుగుతున్న ‘అతి’ విచారణలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా తమ టీవీ డిబెట్లతో కంగారు కోర్టులుగా(సరైన ఆధారాలు.. వాదప్రతివాదనలు లేని అనధికార న్యాయస్థానాలు) వ్యవహరిస్తున్నాయని, సోషల్ మీడియా కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ప్రవర్తన పక్షపాతం, అవగాహనలేమితో కూడిన సమాచారం, ప్రత్యేకించి ఒక ఎజెండా-ఆధారితంగా ఉంటోంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా.. ► సోషల్ మీడియాలో జడ్జిలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్లు చేస్తున్నారు. జడ్జిలు వాటికి అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం లేదు. దయచేసి దీనిని బలహీనతనో లేదంటే నిస్సహాయత అని పొరబడకండి అని న్యాయమూర్తులకు జస్టిస్ రమణ సూచించారు. ► ఈరోజుల్లో మీడియా టూల్స్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ, వాస్తవం ఏదో, ఏది మంచో, ఏది సరైందో నిర్ధారించలేకపోతున్నాయి. మీడియా విచారణలు.. కేసుల్లో మార్గనిర్దేశం చేయలేవు. అలాగే మీడియా ఛానెళ్లు ‘కంగారు కోర్టు’లను నడిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో.. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంటోంది. ► న్యాయం పంపిణీకి సంబంధించిన సమస్యలపై.. అవగాహన లేని, అజెండాతో కూడిన నడిచే చర్చలు ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరం. ► మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న పక్షపాత అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయి. ఈ ప్రక్రియలో.. న్యాయ పంపిణీ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ► మీ బాధ్యతను(మీడియాను ఉద్దేశించి..) అతిక్రమించడం ద్వారా మీరు మన ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తున్నారు ► ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంత స్థాయిలో జవాబుదారీతనం పని చేస్తోంది. ► ఎలక్ట్రానిక్ మీడియాకు మాత్రం జవాబుదారీతనం శూన్యంగా ఉంటోంది. ఇక సోషల్ మీడియా చాలా అధ్వాన్నంగా ఉంటోంది. ► దీనికి పరిష్కారం.. మీడియా స్వీయ నియంత్రణ పాటించడమే. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా. ప్రజలకు అవగాహన కల్పించడానికి, దేశాన్ని ఉత్తేజపరిచేందుకు ఎలక్ట్రానిక్ మీడియా తమ గొంతుకను ఉపయోగించాలి ► జడ్జిల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతి నిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు అధికారులు.. ఇలా రిటైర్మెంట్ తర్వాత సున్నిత అంశాలతో ముడిపడిన వ్యక్తులకు రక్షణ ఇస్తోంది మన దేశం. కానీ, న్యాయమూర్తుల విషయంలోనే అది జరగడం లేదు. ► కొన్ని దశాబ్దాల క్రితం వరకు.. న్యాయమూర్తి అంటే కోర్టుల ముందు పార్టీల మధ్య వివాదాల పరిష్కారానికి మాత్రమే పరిమితం అనే అంచనాలు జనాలకు ఉండేవి. ఇప్పుడు, సమాజంలో ఆలోచించదగిన ప్రతి సమస్య న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించబడుతుందని భావిస్తున్నారు. ► న్యాయం అమలు చేయడానికి, న్యాయమూర్తులు సామాజిక వాస్తవాల గురించి తెలుసుకోవాలి. సామాజిక ఏకాంతంగా పరిమితం కాకూడదు. నిష్పాక్షికత మరియు స్వతంత్రత అనేది మానసిక స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. ► న్యాయమూర్తులంటే.. పది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లిపోతారు. సెలవుల్ని ఆస్వాదిస్తారు.. వాళ్లు వాళ్ల వాళ్ల జీవితాల్లో కంఫర్ట్‌గా ఉన్నారు అనేది ఒక దురభిప్రాయం మాత్రమే. అదంతా వాస్తవం కాదు. ► ఈరోజుల్లో.. న్యాయం అందించడం అంత తేలికైన బాధ్యత కాదు. ఇది రోజురోజుకూ సవాలుగా మారుతోంది. కొన్నిసార్లు, మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏకీకృత ప్రచారాలు కూడా జరుగుతాయి ► సామాజిక వాస్తవాల విషయంలో న్యాయమూర్తులు.. చూసిచూడనట్లుగా, గుడ్డిగా వ్యవహరించకూడదు. వ్యవస్థను కాపాడటానికి నొక్కి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ► ఈ క్రమంలో.. రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చేరాలనుకున్నా. విధి వేరే దారి చూపించింది. న్యాయమూర్తి అయినందుకు బాధపడడం లేదని సీజే ఎన్వీ రమణ పేర్కొన్నారు. -
ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు
-
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు!
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయాధికారుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉమేశ్ ఉదయ్ లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్లతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసింది. ఏడుగురు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ఆ పేర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళతాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత వారు న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు. కొలీజియం సిఫారసు చేసిన వారిలో అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మీనర్సింహచక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. వీరిలో రవీంద్రబాబు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, రాధాకృష్ణ కృపాసాగర్ కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, శ్యాంసుందర్ విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, శ్రీనివాస్ కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జిగా, చక్రవర్తి హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)గా, మల్లికార్జునరావు నూజివీడు 15వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా, వెంకటరమణ హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడుగురితోపాటు ఇప్పటికే కేంద్రానికి చేరిన న్యాయవాది ఎస్.ఎం.సుభాని పేరుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుతుంది. హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులకుగాను ప్రస్తుతం 24 మంది ఉన్నారు. తాజా నియామకాలు పూర్తయితే ఇంకా ఐదుపోస్టులు ఖాళీగా ఉంటాయి. త్వరలో కొన్ని ఖాళీలను భర్తీచేసేందుకు హైకోర్టు చర్యలు తీసుకోనుంది. ఆశావహులు తమ బయోడేటాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు 1962 జూన్ 20న ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాళెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి రాఘవరావు, తల్లి సీతారావమ్మ. 1988లో న్యాయవాదిగా ఎల్‌రోల్ అయ్యారు. చీరాలలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994 మే 5న మునిసిఫ్ మేజిస్ట్రేట్‌గా జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా పనిచేశారు. 2021 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా కొనసాగుతున్నారు. బండారు శ్యాంసుందర్ 1962 సెప్టెంబర్ 1న అనంతపురంలో జన్మించారు. తండ్రి బండారు సుబ్రహ్మణ్యం, తల్లి సుబ్బలక్ష్మి. తాత బండారు రంగనాథం ప్రముఖ క్రిమినల్ న్యాయవాది. 1986లో ఎల్ఎల్బీ పూర్తిచేసి అదే ఏడాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఐదేళ్లపాటు అనంతపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1991లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. న్యాయాధికారిగా 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఊటుకూరు శ్రీనివాస్ కృష్ణాజిల్లా తిరువూరు గ్రామంలో జన్మించారు. తండ్రి లక్ష్మణరావు, తల్లి లీలావతి. భార్య లక్ష్మీప్రసన్న. మచిలీపట్నం డీఎస్ఆర్ హిందూ న్యాయకళాశాలలో న్యాయవిద్య పూర్తిచేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. వివిధ జిల్లాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు. బొప్పన వరాహలక్ష్మీనర్సింహచక్రవర్తి 1964 ఆగస్టు 15న తూర్పు గోదావరి జిల్లా కందులపాళెం గ్రామంలో జన్మించారు. తండ్రి డాక్టర్ బి.పాపారాయచౌదరి, తల్లి విజయలక్ష్మి. 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు విచారణ నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకు జడ్జిగా వ్యవహరించారు. 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ సీబీఐ కోర్టు జడ్జిగా వ్యవహరించారు. 2019లో విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు. 2020 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)గా కొనసాగుతున్నారు. తల్లాప్రగడ మల్లికార్జునరావు 1964 జనవరి 19న తూర్పు గోదావరి జిల్లా పుల్లేటికుర్రులో జన్మించారు. తండ్రి శ్రీరామచంద్రమూర్తి. తల్లి రమణ. 10వ తరగతి వరకు నేదునూరులో విద్యాభ్యాసం కొనసాగించారు. అమలాపురంలో బీఎస్సీ పూర్తిచేశారు. రాజమండ్రిలోని జి.ఎస్.కె.ఎం.లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1988–1994 వరకు అమలాపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. సీనియర్ న్యాయవాది పారెపు శ్రీరామచంద్రమూర్తి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం నూజివీడు అదనపు జిల్లా, సెషన్స్‌జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డా. వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ 1963లో జన్మించారు. తండ్రి వి.బి.కె.విఠల్, తల్లి పుష్పవతి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి బీకాం, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. అదే యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. ఏడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు. ఐదేళ్ల పాటు లెక్చరర్‌గా వ్యవహరించారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. రాజమండ్రి, పెద్దాపురం, ఒంగోలు, ఏలూరు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టు న్యాయసేవాధికార సంస్థగా పనిచేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన సతీమణి వి.ఎ.ఎల్.సత్యవతి కర్నూలు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. దుప్పల వెంకటరమణ 1963 జూన్ 3న శ్రీకాకుళం జిల్లా చినబోడేపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి అప్పన్న, తల్లి వరహాలమ్మ. తండ్రి రైల్వేశాఖలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తూ విధి నిర్వహణలోనే కన్నుమూశారు. అన్న పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు. ప్రాథమిక విద్యాభ్యాసం బోడేపల్లి, తోటాడ గ్రామాల్లో పూర్తిచేశారు. విశాఖపట్నం ఎన్.వి.పి.లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది పలు ప్రాంతాల్లో బాధ్యతలు నిర్తరించారు. టీటీడీ లా ఆఫీసర్‌గా వ్యవహరించారు. 2017–19 వరకు న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2020 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చదవండి: ఇవేం రాతలు, ఇవేం కూతలు? -
దేశంలో అలాంటి అరెస్టులే అత్యవసర సమస్యలు: సీజేఐ
జైపూర్: దేశంలో తొందరపాటు, విచక్షణారహితంగా చేసే అరెస్టులు, బెయిల్ పొందటంలో ఇబ్బందులు, ట్రయల్స్‌లో దీర్ఘకాలం జైలులో ఉంచటం వంటివి ప్రస్తుతం అత్యవసర సమస్యలుగా పేర్కొన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీల సమక్షంలో మాట్లాడారు. ఏ కేసును చూపకుండానే భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలోని ప్రక్రియ ప్రజలకు శిక్షగా అభివర్ణించారు. 'సవాళ్లు చాలా ఉన్నాయి. మన నేర న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రక్రియ ఒక శిక్షగా మారింది. తొందరపాటు, విచక్షణారహితంగా చేసే అరెస్టుల నుంచి.. బెయిల్ పొందటంలో ఇబ్బంది, ట్రయల్స్‌లో ఉన్న వారు ఎక్కువ కాలం జైలులో ఉండటం వరకు ఇవన్నీ అత్యవసర సమస్యలే. నేర న్యాయ వ్యవస్థ పరిపాలన సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం. పోలీసులకు శిక్షణ ఇవ్వటం, జైలు వ్యవస్థను ఆధునికీకరించటం వంటి వాటితో పరిపాలన సామర్థ్యాన్ని పెంచవచ్చు.' అని పేర్కొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఈ సమస్యలపై నాల్సా(నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ), లీగల్ సర్వీసెస్ అథారిటీలు దృష్టి సారించి ఏ విధంగా పరిష్కరించవచ్చో చూడాలన్నారు. జైళ్లలో మగ్గుతున్న వారిని త్వరితగతిన విడుదల చేసేందుకు 'బెయిల్ యాక్ట్' తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం ఆ వాదనలను జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారకూడదు.. రాజకీయ వ్యతిరేకత అనేది శత్రుత్వం, శాసన పనితీరు నాణ్యతపై ప్రభావం చూపే విధంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారకూడదని సూచించారు. ఇటీవల అలాంటి సంఘటనలు వెలుగు చూశాయని, అవి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం సూచనలు కావన్నారు. ఇదీ చదవండి: Vice President Election 2022: వీడిన సస్పెన్స్.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ -
న్యాయవ్యవస్థ రాజ్యాంగానికే జవాబుదారీ
సాక్షి, న్యూఢిల్లీ/శాన్ఫ్రాన్సిస్కో: భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రభుత్వ ప్రతి చర్యకు న్యాయపరమైన ఆమోదం లభిస్తుందని భావిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా రాజకీయ అవసరాలను న్యాయవ్యవస్థ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాయన్నారు. కానీ, భారత న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి.. కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్నా రాజ్యాంగ వ్యవస్థల బాధ్యతలను, వాటి పాత్రను ప్రజలు అర్థం చేసుకోలేకపోయారంటూ జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై సరైన అవగాహన లేకుంటే ప్రజలు సరైన దిశగా ఆలోచించలేరని చెప్పారు. ప్రజల్లోని ఈ అజ్ఞానమే న్యాయవ్యవస్థ స్వతంత్రను నాశనం చేయడమే ఏకైక లక్ష్యంగా ఉన్న కొన్ని శక్తులకు సహాయకారిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ శుక్రవారం రాత్రి శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ‘దేశంలో ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో తమ బాధ్యతను అద్భుతంగా నెరవేర్చారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు సైతం ఇందులో చురుగ్గా వ్యవహరించారు’అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటాయని, కానీ పరిణతి గల ఏ ప్రభుత్వమూ తన సొంత దేశం పురోగతిని దెబ్బతీసేలా విధానాలను మార్చబోదని సీజేఐ తెలిపారు. దురదృష్టవశాత్తూ భారత్‌లో మాత్రం ప్రభుత్వాలు మారినప్పుడల్లా అలాంటి సున్నితత్వం, పరిపక్వత కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతీ ఒక్కరు రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలుపంచుకోవాలి. రాజ్యాంగాన్ని సరైన రీతిలో అమలు చేసేందుకు దేశంలో రాజ్యాంగ సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. -
న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని సందర్శించిన జస్టిస్ ఎన్వీ రమణ
ఎడిసన్, న్యూ జెర్సీ: అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సందర్శించారు. న్యూజెర్సీ ఎడిసన్‌లోని శ్రీ సాయి దత్త పీఠం శివ విష్ణు మందిరంలో వేద పండితులు జస్టిస్ ఎన్వీ రమణ కు వేద మంత్రోచ్ఛారణతో స్వాగతం పలికారు. దేవాలయంలో దేవతా మూర్తులను ఆయన దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం పొందారు. సాయి దత్త పీఠం ఆలయ చైర్మన్, ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, ఆలయ బోర్డ్ డైరెక్టర్లు, స్టాఫ్, వాలంటీర్లు ఎన్.వి.రమణను కలిసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. చదవండి: ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు: వైవీ సుబ్బారెడ్డి -
ఎర్రచందనం అక్రమ రవాణా.. హత్య కంటే తీవ్రం
తిరుపతి లీగల్: ఎర్రచందనం అక్రమ రవాణాను మనిషి హత్య కంటే తీవ్రమైన నేరంగా భావించి మరణశిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఎర్రచందనం కేసుల విచారణ నిమిత్తం గురువారం రెండు కోర్టులను ప్రారంభించిన అనంతరం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో సమావేశం నిర్వహించారు. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ వాటా ఇదీ.. ప్రత్యేకతలెన్నో.. ఎన్నిక ఇలా.. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందనం తిరుపతి శేషాచలం అడవుల్లో మాత్రమే లభిస్తుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ అధికంగా ఉండడంవల్లే అక్రమ రవాణా జరుగుతోందన్నారు. స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొట్టడమే కాకుండా ప్రజలకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చట్టంలో శిక్షా కాలాన్ని, జరిమానాలను పెంచినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదన్నారు. సత్వర న్యాయం అందించాలి.. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల పాత్ర ఎంత ఉందో.. న్యాయవాదుల పాత్ర అంతే ఉందన్నారు. న్యాయవాదులు కేసులను వాయిదాలు తీసుకోకుండా కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు. భవిష్యత్తు డిజిటల్ వైపు పరుగులు తీస్తోందని, అందుకు తగ్గట్లుగా సీనియర్, జూనియర్ న్యాయవాదులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుల్లో 195 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా అందులో 167 పోస్టుల్లో హైకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు తెలిపారు. 11మంది సుప్రీంకోర్టు జడ్జిలను నియమించామన్నారు. 180 న్యాయమూర్తుల నియామక ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నట్లు సీజేఐ తెలిపారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి న్యాయమూర్తుల పనిలేకుండా కోర్టులు మాత్రమే ఉండేటట్లు భవిష్యత్తులో జరగాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. కేసుల సంఖ్య పెరుగుతోంది : హైకోర్టు సీజేఐ అనంతరం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని, ప్రధానంగా ఐదు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు త్వరలో ఎర్రచందనం కేసుల విచారణకు మరికొన్ని కోర్టులను ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం సీజేఐని న్యాయమూర్తులు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల న్యాయవాదుల సంఘాల కార్యవర్గ సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి, బదిలీపై వెళ్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమానుల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్జి భీమారావ్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, హైకోర్టు రిజి్రస్టార్ దుప్పల వెంకటరమణ, తిరుపతి న్యాయవాదుల సంఘ అధ్యక్షులు దినకర్, స్థానిక న్యాయమూర్తులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు.. ఎర్రచందనం కేసుల విచారణకు ఏర్పాటుచేసిన రెండు కోర్టులను ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక కోర్టు సెషన్స్ జడ్జిగా ఎన్.నాగరాజు, స్థానిక నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ ఇన్చార్జ్ న్యాయమూర్తిగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాలి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎర్రచందనం కేసుల విచారణకు తాజాగా ఏర్పాటుచేసిన రెండు కోర్టులే కాకుండా మరిన్ని కోర్టులను రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుచేయాలని సీజేఐ సూచించారు. కోర్టులతో పాటు న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బంది నియామకాలు వెంటనే జరగాలని అభిప్రాయపడ్డారు. కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమిస్తున్న నిధులను పెంచాలన్నారు. ఇన్ని రోజులు ఎర్రచందనం విచారణకు ప్రత్యేక కోర్టు లేకపోవడంతో ప్రస్తుతం 2,340 కేసులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అమాయక ప్రజలు వెళ్లకుండా అటవీ శాఖ సిబ్బంది అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్జీఓలను నియమించి అక్రమ రవాణాను ఆపాలని సీజేఐ సూచించారు. అడవులను కొల్లగొట్టడంవల్ల మానవజాతికి కలిగే దు్రష్పభావాలను అందరూ గమనించాలన్నారు. ఇక తుడా కాంప్లెక్స్‌లోని రెండు భవనాలను రెండు కోర్టుల ఏర్పాటుకు తక్కువ అద్దెకు ఇవ్వడానికి అంగీకరించిన చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. -
‘ఎర్రచందనం’ ప్రత్యేక న్యాయస్థానం భవనాల ప్రారంభం
తిరుపతి లీగల్: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం భవనాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం ప్రారంభించనున్నారు. ఎర్రచందనం కేసుల్లో నిందితులకు రిమాండ్, 2016 సంవత్సరానికి ముందు నమోదైన కేసుల విచారణకు ఓ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టును రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో నమోదైన ఎర్రచందనం కేసులను విచారించేందుకు రాష్ట్ర హైకోర్టు ఇటీవల జడ్జి నాగరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జూనియర్ సివిల్‌జడ్జి కోర్టుకు తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్‌ను ఇన్చార్జిగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, చిత్తూరు ఉమ్మడి జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ ఎన్.సత్యనారాయణమూర్తి కార్యక్రమంలో పాల్గొంటారు. -
వికేంద్రీకరణతో సత్వర న్యాయం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల వికేంద్రీకరణతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. న్యాయవాదులు, కక్షిదారులు దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. గురువారం హై కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కలసి 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టులను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం సీజేఐ మాట్లాడారు. తగ్గనున్న కేసుల భారం ‘జిల్లా కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో సత్వర న్యాయం అందించలేని పరిస్థితి. జిల్లా కోర్టుల విభనజతో భారం తగ్గి త్వరగా న్యాయం అందే అవకాశం లభించింది. కొత్త కోర్టుల ఏర్పాటుకు తగినట్లు న్యాయమూర్తులు, సిబ్బంది నియామకానికి సీఎం ఆమోదించడం శుభ పరిణామం. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు, హైకోర్టులో సిబ్బంది పెంపు ఇలా న్యాయవ్యవస్థ పటిష్టతలో దేశానికి తెలంగాణ తలమానికంగా నిలిచింది. హైదరాబాద్‌లో వాణిజ్య కోర్టుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఐటీకి పేరుగాంచింది. కోర్టుల్లోనూ ఐటీ సేవలను వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు. వారికి నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు న్యాయం అందించడం మన బాధ్యత ’అని సీజేఐ వివరించారు. త్వరలో మరో ఇద్దరు న్యాయమూర్తులు ‘సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి న్యాయవ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్నా. న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకు, అవగాహన పెంచేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి కొంతవరకు సఫలీకృతం అయ్యా. ప్రజలు ఆస్పత్రికి, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినట్లు న్యాయస్థానాలను ఆశ్రయించేలా తీర్చిదిద్దాం. 111 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించా. 194 హైకోర్టు ఖాళీలకు సిఫారసు చేయగా, కేంద్రం 152కు ఆమోదం తెలిపింది. వీరిలో 33 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాం. అలాగే ఇప్పటివరకు 19 మంది న్యాయమూర్తులను నియమించాం. మరో ఇద్దరిని త్వరలో నియమించనున్నాం. ఇందులో సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం..’అని తెలిపారు. ప్రజా సమస్యలకు పరిష్కారం: సీఎం ‘గతంలో తెలంగాణ హైకోర్టు ప్రారంభానికి ఇక్కడికి వచ్చా. మళ్లీ ఇప్పుడు 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టుల ప్రారంభం సందర్భంగా రావడం ఆనందదాయకం. తలసరి ఆదాయం, ఐటీ, జీఎస్డీపీ, వ్యవసాయం, పరిశ్రమలు సహా అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమనంలో దూసుకుపోతోంది. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని సీజేఐని కోరాం. ఆయన చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి వెంటనే నియామకం చేపట్టారు. ఇది హైకోర్టు పటిష్టతకు దోహదం చేసింది. 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టుల ఏర్పాటుతో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలకు స్వతంత్ర కోర్టులు రానున్నాయి. ఉమ్మడి జిల్లాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నా స్వస్థలం మెదక్ జిల్లా సిద్దిపేట. మా దగ్గరి నుంచి సంగారెడ్డి కోర్టుకు వెళ్లాలంటే 150 కి.మీ.లు పోవాలి. ఎన్నో పాట్లు పడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా 33 జిల్లాలుగా విభజించాం. ములుగు, భూపాలపల్లి చిన్న ప్రాంతాలే అయినా జిల్లాలుగా ఏర్పాటు చేశాం. న్యాయస్థానాల వికేంద్రీకరణ, సత్వర న్యాయంతో ప్రజలకు చిక్కులు తొలగిపోతాయి..’అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చదవండి: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు పరిధి దాటితే ఉపేక్షించం.. ‘న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే న్యాయమూర్తుల నియామకంతో పాటు ఇతర వసతులు ఉండాలి. దీనిపై ఏప్రిల్‌లో జరిగిన సీఎం, హైకోర్టు సీజేల భేటీలో అందరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. అయితే కొంత అవగాహన లోపంతో జాతీయ న్యాయ వ్యవస్థ నిర్మాణం జరగడం లేదు. ఈ సమావేశంలో అందరి ఏకాభిప్రాయంతో దీనిపై తీర్మానం చేయాలని భావించినా సాధ్యంకాలేదు. ఇది కార్యరూపం దాలిస్తే రాష్ట్రాలకు మంచి జరిగేది. న్యాయవ్యవస్థ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేది కాదు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తోంది. ఇటీవలి కాలంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేయడం తేలికైపోయింది. కోర్టు తీర్పులకు, ప్రభుత్వ ఆదేశాలకు వక్రభాష్యం చెప్పడం పరిపాటిగా మారింది. ఇది దురదృష్టకరం. పరిధి దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే. పరిధి దాటితే ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యం. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది..’అని సీజేఐ చెప్పారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: హైకోర్టు సీజే ‘కొత్త జ్యుడీషియల్ కోర్టుల ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. న్యాయ వ్యవస్థ మరింత బలపడుతుంది’అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.లలిత, జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ సుమలత, ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్, కా ర్యదర్శులు కల్యాణ్‌రావు, సుజన్‌కుమా ర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
32 జ్యుడీషియల్ జిల్లా కోర్టుల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ప్రాతిపదికన 32 జ్యుడీషియల్ జిల్లా (హైదరాబాద్ మినహా) కోర్టులు గురువారం ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 10 జ్యుడీషియల్ జిల్లా కోర్టులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నాయి. దాదాపు మూడేళ్ల క్రితం 10 రెవెన్యూ జిల్లాలను 33 జిల్లాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్త జ్యుడీషియల్ జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు న్యాయస్థానాలు మరింత చేరువకానున్నాయి. జిల్లా కోర్టుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పనుంది. ఇదిలాఉండగా, 33 జ్యుడీషియల్ జిల్లాలను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక జీవో జారీ చేసింది. అలాగే ఆయా జ్యుడీషియల్ కోర్టుల పరిధులను ఇందులో పేర్కొంది. -
వివాదాలకు ‘ప్రత్యామ్నాయ’ పరిష్కారాలు
శ్రీనగర్: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఇందుకోసం వివాదాల పరిష్కారానికి కక్షిదారులు ప్రత్యామ్నాయ యంత్రాంగాలను ఎంచుకొనేలా జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. కక్షిదారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే క్షేత్రస్థాయిలోని జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత వరకు వారిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించాలన్నారు. దీనివల్ల కక్షిదారులకు మేలు జరగడమే కాకుండా, కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గిపోతుందని చెప్పారు. జస్టిస్ ఎన్వీ రమణ శనివారం జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. కేసుల పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలోని లీగల్ సర్వీసెస్ అథారిటీలను సమర్థంగా వాడుకోవాలని కోరారు. కక్షిదారుల్లో నిరక్షరాస్యులు, చట్టాలపై అవగాహన లేనివారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఉంటారని, అలాంటి వారికి ఉపశమనంగా కలిగించేలా సేవలు అందించాలని న్యాయవాదులను కోరారు. వృత్తిపరమైన ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అరాచకమే.. తమ హక్కులకు, గౌరవానికి గుర్తింపు, రక్షణ లభిస్తున్నాయని ప్రజలు భావించడమే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక అని జస్టిస్ ఎన్వీ రమణ తెలియజేశారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అది అరాచకానికే దారి తీస్తుందన్నారు. న్యాయవాదుల సహాయం లేకుండా కోర్టుల్లో ఉత్తమమైన తీర్పు వెలువడే అవకాశం లేదన్నారు. తీర్పు విషయంలో బెంచ్, బార్ సంబంధం కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. కక్షిదారులకు సానుకూల వాతావరణం కల్పించేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రయత్నించాలని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడితేనే శాంతి పరిఢవిల్లుతుందన్నారు. జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో, దేశ అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్ర న్యాయశాఖ రెండు రోజుల్లోనే ఆమోదం తెలిపింది. ఈ మేరకు.. గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధులియా, గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జంషెడ్ బి పార్దివాలాల నియామకాలను ఆమోదిస్తూ శనివారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వచ్చే వారం వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యంతో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది. 1965లో జన్మించిన జస్టిస్ పార్దివాలా 1990లో గుజరాత్ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని ఓ కుగ్రామంలో 1960లో పుట్టిన జస్టిస్ ధులియా 1986లో అలహాబాద్ హైకోర్టులో లాయర్‌గా జీవితం ప్రారంభించారు. చదవండి: (భారత్ ప్రతిష్టను దెబ్బతీసేయత్నం.. డబ్ల్యూహెచ్ఓ ప్రకటనపై మంత్రుల ఆగ్రహం) -
‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టంపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ చట్టం దుర్విని యోగం కాకుండా నియంత్రించగలిగామని చెప్పా రు. దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. రాజద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ ఎస్జీ వొంబట్కెరే, ఎడిటర్స్ గిల్డ్ తదితరులు వేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇటీవల మహారాష్ట్రలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతుల అరెస్టు కేసును ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘దేశంలో ఏం జరుగుతోందో కోర్టుకు తెలుసు. హనుమాన్ చాలీసా చదువుతామన్న వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలే గానీ విస్తృత ధర్మాసనం అవసరం లేదు. సెక్షన్ 142ఏ చెల్లుబాటుపై కేదార్నా«థ్‌సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును సమర్థించాల్సి ఉంది. కేంద్రం వైఖరి చెప్పాల్సి ఉంది’’ అని ఏజీ వేణుగోపాల్ తెలిపారు. సెక్షన్ 124ఏను రద్దు చేయొచ్చు రాజద్రోహం చట్టంపై దాఖలైన పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదంటూ కేంద్రంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాదులు సిద్ధం చేసిన ముసాయిదాకు ఆమోదం రాలేదని, ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. భారతదేశంలో తమ పాలనను కాపాడుకోవడానికి బ్రిటిషర్లు చేసిన రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ఈ చట్టం కారణంగా స్వేచ్ఛాభారతంలో జర్నలిస్టులు, విద్యార్థులు అరెస్టవుతున్నారని వాపోయారు. ‘‘సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలుకు సోమవారం వరకూ సమయం ఇస్తున్నాం. విస్తృత ధర్మాసనం ఏర్పాటుపై వాదప్రతివాదులు లిఖితపూర్వక అభ్యర్థనలను శనివారం ఉదయం అందజేయాలి. మే 10 మధ్యాహ్నం విచారిస్తాం. వాయిదాకు అంగీకరించబోం’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇక పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు! సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం రెండు ఖాళీలున్నాయి. వీటి భర్తీ ప్రక్రియ మొదలయ్యింది. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులైతే సుప్రీంకోర్టు ఇక పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలాను సుప్రీం జడ్జీలుగా నియమించాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం. దీనిని ఆమోదిస్తే జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలా జడ్జిగా, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. -
తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సంయుక్త సదస్సు సందర్భంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజే పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచడంపై సీరియస్ అయ్యారు. తమ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని.. న్యాయవ్యవస్థ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది లోపలకు వెళ్లి వెనక్కు వస్తే తప్ప మరొకరు వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన తెలంగాణ న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ అంశాలను తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. చదవండి👉 (పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్) -
ముఖ్యమంత్రులు-న్యాయమూర్తుల సంయుక్త సదస్సు 2022 (ఫొటోలు)
-
కోర్టుల్లో స్థానిక భాషలకు ఊతం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తద్వారా ప్రజలు న్యాయ ప్రక్రియతో అనుసంధానమైనట్లు భావిస్తారని, వారిలో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. అంతిమంగా న్యాయ ప్రక్రియపై ప్రజల హక్కు బలపడుతుందని తెలిపారు. ఇప్పటికే సాంకేతిక విద్యలో స్థానిక భాషలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. చట్టాల గురించి సులభమైన భాషలో అర్థమయ్యేలా వివరించాలన్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. అండర్ ట్రయల్ ఖైదీల కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... సదస్సుకు చాలా సీనియర్ని ‘‘దేశంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగ సంరక్షకుడి పాత్ర పోషిస్తోంది. సీఎంలు, సీజేల సంయుక్త సదస్సు రాజ్యాంగ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. నేను చాలాకాలంగా ఈ సదస్సుకు వస్తున్నా. మొదట ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా సదస్సుకు హాజరవుతున్నా. ఒకరకంగా చెప్పాలంటే ఈ సదస్సు విషయంలో నేను చాలా సీనియర్ని. డిజిటల్ ఇండియా మిషన్ డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని సీఎంలు, ప్రధాన న్యాయమూర్తులు మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ–కోర్టుల ప్రాజెక్టును మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నాం. న్యాయ వ్యవస్థతో డిజిటల్ ఇండియాను అనుసంధానించాలి. బ్లాక్‌చెయిన్‌లు, ఎలక్ట్రానిక్ డిస్కవరీ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోఎథిక్స్ వంటి సబ్జెక్టులను అనేక దేశాల్లో న్యాయ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌లోనూ న్యాయ విద్యను అందించడం మన బాధ్యత. చట్టాల్లో సంక్లిష్టతలు, వాడుకలో లేని చట్టాలు చాలా ఉన్నాయి. 2015లో ప్రభుత్వం 1,800 చట్టాలను అప్రస్తుతంగా గుర్తించి ంది. ఇప్పటికే 1,450 చట్టాలను రద్దు చేశాం. పెండింగ్ కేసులకు మధ్యవర్తిత్వం స్థానిక కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన సాధనం. మన సమాజంలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వేల సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మధ్యవర్తిత్వ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఖాళీల భర్తీకి కృషి చేస్తున్నాం మన దేశం స్వాతంత్య్రం పొంది 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పుడు దేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నాం? 2047 నాటికి దేశ ఆకాంక్షలను నెరవేర్చగలిగేలా మన న్యాయ వ్యవస్థను ఎలా సమర్థంగా తీర్చిదిద్దాలి? ఈ ప్రశ్నలే ఈ రోజు ప్రాధాన్యతగా ఉండాలి. అమృత్ కాల్లో మన విజన్(దార్శనికత) అంతా సులభ న్యాయం, సత్వర న్యాయం, సమ న్యాయం కల్పించే న్యాయ వ్యవస్థపై ఉండాలి. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నాం. Delhi | PM Narendra Modi, Union Minister of Law & Justice Kiren Rijiju and Chief Justice of India NV Ramana attend the Joint Conference of CMs of States & Chief Justices of High Courts at Vigyan Bhawan pic.twitter.com/cmawTEOWOl — ANI (@ANI) April 30, 2022 న్యాయ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం ♦ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ♦ ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని ♦ అందరూ గౌరవించాల్సిందే ♦ కోర్టుల నిర్ణయాలను ప్రభుత్వాలు ♦ ఏళ్ల తరబడి అమలు చేయట్లేదు ♦ అందుకే వ్యాజ్యాలు పెరుగుతున్నాయ్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, అందుకు మరిన్ని చర్యలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొన్న ప్రతినిధులను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. కోర్టుల నిర్ణయాలు ఏళ్ల తరబడి అమలు కాకపోవడం వల్లే ప్రభుత్వాలపై ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాల విధి నిర్వహణ వైఫల్యం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. శనివారం ఢిల్లీలో రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలో స్పెషల్ పర్సస్ వెహికల్స్ ఏర్పాటు చేయాలన్నారు. సీఎంలు లేదా వారి తరపు ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఇందుకు ముఖ్యమంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న ప్రజాప్రతినిధుల నుంచి ఎంతో నేర్చుకొనే అవకాశం వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడానికి, ప్రస్తుతం ఉన్న సవాళ్లను గుర్తించి, పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు. సదస్సులో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... పెండింగ్ కేసులు 4.11 కోట్లు: న్యాయ వ్యవస్థలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తులు–జనాభా నిష్పత్తిని పెంచేందుకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కృషి చేయాలి. అన్ని హైకోర్టుల్లో 1,104 జడ్జీల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా, ప్రభుత్వం 388 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి నేను పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రయత్నిస్తున్నా. మరోవైపు ఈ ఆరేళ్లలో పెండింగ్ కేసుల సంఖ్య 2.65 కోట్ల నుంచి 4.11 కోట్లకు పెరిగింది. ‘పిల్’ దుర్వినియోగం కోర్టుల్లో అనవసరమైన వ్యాజ్యాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనాల వ్యాజ్యాలుగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన ‘పిల్’ను కొన్నిసార్లు ప్రాజెక్టులను నిలిపివేయడానికి, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ అవసరాలు నెరవేర్చుకోవడానికి, కార్పొరేట్లపై కక్ష తీర్చుకోవడానికి ‘పిల్’ ఓ సాధనంగా మారడం విచారకరం. కోర్టుల్లో భాషాపరమైన అడ్డంకులు తొలగించడం, సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థ బలాన్ని పెంపొందించడం వంటివి తక్షణావసరం’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. కోర్టుల్లో స్థానిక భాషలు.. ఒక్కరోజులో సాధ్యం కాదు కోర్టుల్లో స్థానిక భాషను ప్రవేశపెట్టడం వంటిసంస్కరణలను అమలు చేయడం ఒక్కరోజులో సాధ్యం కాదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. కొన్ని ప్రతికూలతలు ఉన్నందువల్ల దాన్ని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. -
ఖాళీల భర్తీకి పేర్లు పంపండి: సీజే ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు న్యాయ వ్యవస్థ తన వంతు కృషి చేసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సమష్టి కృషితో వివిధ కోర్టుల్లో ఏడాదిలో 126 జడ్జీ పోస్టులను భర్తీ చేయగలిగామని అన్నారు. త్వరలో మరో 50 నియామకాలను పూర్తి చేస్తామని తెలిపారు. ఆరేళ్ల విరామం తర్వాత శుక్రవారం ఢిల్లీలో జరిగిన 39వ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే సమస్యలను గుర్తించి, చర్చించడం హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. హైకోర్టుల్లో ఇంకా ఖాళీలు ఉన్నాయని, వీటి భర్తీ కోసం వీలైనంత త్వరగా పేర్లను పంపించాలని, అందులో సామాజిక వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు. హైకోర్టుల నుంచి ప్రభుత్వానికి 100 ప్రతిపాదనలు గత ఏడాది కాలంలో సుప్రీంకోర్టుకు 9 మంది నూతన న్యాయమూర్తులు, హైకోర్టులకు 10 మంది నూతన ప్రధాన న్యాయమూర్తులు వచ్చారని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సంబంధించి కొన్ని హైకోర్టుల స్పందన ప్రోత్సాహకరంగా ఉందన్నారు. గతేడాది తాను సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైకోర్టుల్లో నియామకాల కోసం కొలీజియం ఇప్పటివరకు 180 సిఫార్సులు చేసిందని, ఇందులో 126 నియామకాలు జరిగాయని వెల్లడించారు. మరో 54 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం ఉన్నాయని చెప్పారు. వివిధ హైకోర్టుల నుండి ప్రభుత్వానికి దాదాపు 100 ప్రతిపాదనలు అందాయన్నారు. అయితే అవి ఇంకా సుప్రీం కోర్టుకు చేరలేదన్నారు. మిగిలిన 212 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలను పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని హైకోర్టులకు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి వల్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ప్రదర్శించిన పట్టుదల, ధృఢ సంకల్పంతో న్యాయస్థానాల పనితీరు దెబ్బతినకుండా చూసుకోగలిగామని హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో కోర్టుల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడకుండా స్థిరమైన ఆన్లైన్ వ్యవస్థలను అభివృద్ధి చేశామన్నారు. సుప్రీంకోర్టులో వినూత్నమైన ఫాస్టర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. 2016లో జరిగిన ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆమోదించిన తీర్మానాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఐటీ, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, దేశంలోని అన్ని కోర్టు సముదాయాల కనెక్టివిటీ, మానవ వనరులు, జిల్లా కోర్టులు, మౌలిక సదుపాయాలు, కోర్టుల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై చర్చించారు. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ సహా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. నేడు సీఎంలు, చీఫ్ జస్టిస్‌ల సదస్సు న్యూఢిల్లీ: రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరవుతారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ సదస్సులో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రధానంగా చర్చిస్తారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలంటూ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ప్రతిపాదనను సదస్సు ఎజెండాలో చేర్చారు. న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీ, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం, ప్రజలకు న్యాయ సహాయం, న్యాయ సేవలు, ఈ–కోర్టుల ఏర్పాటు వంటి కీలక అంశాలపైనా చర్చించనున్నారు. ప్రారంభోత్సవంలో జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగిస్తారు. సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్ బదులుగా న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొననున్నారు. -
‘సత్వర న్యాయం’ దిశగా అడుగులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల సమర్థ సమన్వయం కోసం జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల çసంయుక్త సదస్సుకు రంగం సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు కొనసాగనుంది. సమావేశంలో రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు ఉమ్మడి కార్యాచరణను తీసుకొచ్చే దిశగా జరిగే ప్రయత్నాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రసంగిస్తారు. ప్రారంభ సమావేశం తర్వాత సదస్సు ఎజెండాపై ముఖ్యమంత్రులు, హైకోర్టుల సీజేలు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు చర్చలు జరుగుతాయి. దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని సీజేఐ రమణ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచనలుచేశారు. న్యాయస్థానాల్లో సరైన మౌలిక సదుపాయాలు కొరవడి న్యాయపాలికల పనితీరు వెనుకబడిందని, ఈ సమస్యలన్నింటికీ అథారిటీ ఏర్పాటే పరిష్కారమని సీజేఐ వ్యాఖ్యానించారు. అథారిటీ ఏర్పాటుతో కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. హైకోర్టులు, కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలకపాత్ర పోషిస్తున్నందున వారి అభిప్రాయాల కోసం ఈ ప్రతిపాదనను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంపింది. త్వరగా కోర్టుల్లోని జడ్జి పోస్టులను భర్తీచేయాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. కరోనా నేపథ్యంలో కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు దాఖలయ్యాయి. దీనిపై సదస్సులో చర్చించనున్నారు. సీఎం, సీజేల సదస్సు సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు తొలిసారిగా 1992లో అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు, జస్టిస్(రిటైర్డ్) మధుకర్ హీరాలాల్ కనియా సీజేఐగా ఉన్నపుడు జరిగింది. 2016 ఏప్రిల్ 24న చివరిసారిగా సదస్సు జరిగింది. ఇందులో సబార్డినేట్ కోర్టుల మౌలిక సదుపాయాలు, నేషనల్ మిషన్ ఫర్ జ్యుడీషియల్, సెలవు రోజుల్లో కోర్టుల పనితీరు, ట్రయల్ ఖైదీలకు సంబంధించిన ప్రత్యేక సూచనలతో జైళ్ల పరిస్థితులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమలు, న్యాయ–సహాయ కార్యక్రమాల బలోపేతం, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. నేడు సీజేల సమావేశం సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల 39వ సీజేల సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశం సైతం ఆరేళ్ల తర్వాత నిర్వహిస్తుండటం గమనార్హం. హైకోర్టుల్లో జడ్జీల నియామకాలు, సిబ్బంది కొరత, దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల మధ్య నెట్వర్క్ సమన్వయం మరింత పటిష్టవంతం చేయడం వంటి ప్రధాన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. -
మూడు నెలల్లో.. ముగ్గురు సీజేలు!
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు నెలల స్వల్ప వ్యవధిలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను చూడబోతోంది. ఇద్దరు సీజేలు రిటైర్ కానుండటంతో ఈ అరుదైన సందర్భం రాబోతోంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 16తో ముగుస్తుంది. ఆయన తర్వాత జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నవంబర్ 8 వరకు దాదాపు రెండు నెలల పాటు సీజేగా కొనసాగుతారు. ఆ తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్.. ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆయన రెండు సంవత్సరాల పాటు పదవీలో ఉంటారు. ఇంత తక్కువ వ్యవధిలో దేశం ముగ్గురు వేర్వేరు సీజేలను చూడటం ఇదే మొదటిసారి కానప్పటికీ.. ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలానికి సంబంధించిన సమస్య మరోసారి తెరమీదకు వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీకాలాన్ని కనీసం మూడేళ్లకు పెంచడంతోపాటు ప్రస్తుతం ఉన్న పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది నెలల్లో ఇతర న్యాయమూర్తులు కూడా పదవీ విరమణ చేయబోతున్నందున సుప్రీంకోర్టులో మరిన్ని ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. న్యాయమూర్తుల పదవీకాలం తక్కువగా ఉండటం వల్ల పెండింగ్ కేసులు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఇప్పటికే 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా వచ్చిన సీజేలకు తగింత సమయం ఉండకపోవడంతో కొత్త మార్పులను సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నారు. ప్రస్తుత వ్యవస్థను మరింత మెరుగ్గా నడిపించడానికి అవరసరమైన విధానాలను రూపొందించడానికి వీలు పడటం లేదు. చరిత్ర సృష్టించనున్న చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యలు చేపట్టనున్న జస్టిస్ డివై చంద్రచూడ్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. తండ్రీకొడుకులు సీజేలు సేవలు అందించిన అరుదైన ఖ్యాతిని వారు దక్కించుకోనున్నారు. ఆయన తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్.. 1978, ఫిబ్రవరి నుంచి 1985, జూలై వరకు సీజేగా సేవలు అందించారు. (క్లిక్: రక్షణ వ్యయంలో ఆ మూడు దేశాలే టాప్!) రానున్న నెలల్లో భారీగా ఖాళీలు సుప్రీంకోర్టులో ప్రస్తుతం రెండు న్యాయమూర్తుల పదవులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. రానున్న నెలల్లో ఈ ఖాళీల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. జస్టిస్ వినీత్ శరణ్ మే 10న, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జూన్ 7న, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ జూలై 29న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న నలుగురు మహిళా న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ ఇందిరా బెనర్జీ సెప్టెంబర్ 23న రిటైర్ కానున్నారు. జస్టిస్ హేమంత్ గుప్తా అక్టోబర్ 16న పదవీ విరమణ చేయనున్నారు. భారత్‌లోనే తక్కువ! ఇతర దేశాల్లోని న్యాయమూర్తుల పదవీకాలంతో పోలిస్తే భారతీయ న్యాయమూర్తుల పదవీకాలం తక్కువ. జడ్జిల పదవీ విరమణ వయసు యూకేలో 75, కెనడాలో 70 సంవత్సరాలుగా ఉంది. ఆస్ట్రేలియా, బెల్జియం, నార్వే వంటి దేశాలల్లోనూ న్యాయమూర్తులు 70 సంవత్సరాల వయస్సు వరకు పని చేస్తారు. అమెరికా, రష్యా, న్యూజిలాండ్, ఐస్లాండ్ దేశాల్లో న్యాయమూర్తులు జీవితకాలం సేవలు అందించే అవకాశముంది. (క్లిక్: అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులే..) -
తీర్పుల్లో మానవీయ కోణం
చెన్నై/సాక్షి ప్రతినిధి, చెన్నై: న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు నిబంధనలు, పద్ధతులను గుడ్డిగా అనుసరించరాదని, మానవీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. తీర్పులిచ్చే ముందు సామాజిక–ఆర్థికాంశాలను, సమాజంపై వాటి ప్రభావాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ‘‘నేటి ఇన్స్టంట్ నూడుల్స్ కాలంలో జనం కూడా ఇన్స్టంట్ జస్టిస్ (తక్షణ న్యాయం) కోరుకుంటున్నారు. దానివల్ల అసలైన న్యాయానికి అన్యాయం జరుగుతుందనే నిజాన్ని అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. చెన్నైలో మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో పరిపాలనా భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కోర్టులతో న్యాయం జరుగుతుందని సామాన్య జనం గట్టిగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అయితే, ‘‘కోర్టుల పద్ధతులు, భాషతో వారు మమేకం కాలేకపోతున్నారు. న్యాయ వ్యవస్థలో సామాన్యులను సైతం భాగస్వాములుగా మార్చాలి. పెళ్లి మంత్రాల్లా కాకుండా కోర్టు వ్యవహారాలను, కేసుల పురోగతిని కక్షిదారులు అర్థం చేసుకోగలగాలి’’ అన్నారు. న్యాయ వ్యవస్థ, సంస్థల బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని వివరించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందన్నారు. తీర్పు ఇవ్వడం అనేది కేవలం రాజ్యాంగ ధర్మం కాదు, అదొక సామాజిక బాధ్యత అని వెల్లడించారు. న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సమీప భవిష్యతులో ఈ సమస్య పరిష్కారమవుతున్న నమ్మకం తనకు ఉందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ)తో ఇది సాధ్యం కావొచ్చని అభిప్రాయపడ్డారు. గుర్తింపును, భాషను, సంస్కృతిని కాపాడుకోవడంలో తమిళ ప్రజలు ముందంజలో ఉంటారని ప్రశంసించారు. కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల కోసం సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటు చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా సీజేఐని కోరారు. మాతృభాషను మరవొద్దు మాతృభాష పరిరక్షణ విషయంలో తెలుగువారు తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. చెన్నైలో ప్రపంచ తెలుగు సమాఖ్య (చెన్నై) 29వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగు వారిని ఒకప్పుడు మదరాసీలు అనేవారు. తెలుగు భాష, సంస్కృతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌ను ఈ సమయంలో స్మరించుకోవాలి. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు కోరా. చెన్నైలో ఒకప్పుడు తెలుగు వారు కూడా భాగస్వాములే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయాక కర్నూలు, తర్వాత హైదరాబాద్, ప్రస్తుతం అమరావతిని రాజధానులుగా చేసుకున్నాం. మాతృభాషలో మాట్లాడేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను డిగ్రీ దాకా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా’’ అని చెప్పారు. తెలుగు ప్రజలు తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని, మాతృభాషలో మాట్లాడడం వల్ల ప్రావీణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. -
సొంతూరులో సన్మానం కిక్కేవేరు
సాక్షి, హైదరాబాద్: ‘ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అయినట్లు.. నేను ఎంత ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించినా ఈ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడినే.. న్యాయవాది రమణనే. సొంత ఊరిలో మర్యాద పొందడం అన్నది సామాన్యమైన విష యం కాదు... ఆ కిక్కే వేరు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టులో శుక్రవారం తెలంగాణ బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో చేపట్టిన సన్మానంపై ఉప్పొంగిపోయారు. గత స్మృతులను నెమరేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తనను రాజభవన్లో, వరం గల్లోనూ సన్మానించారని, తనను ఎంతో ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకున్న తెలంగాణ గడ్డకు కృతజ్ఞుడినని అన్నారు. తెలంగాణ హైకోర్టు తనకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. భాష, మర్యాద, సంస్కా రం, సంస్కృతి, జీవితంలో పోరాటం, జీవించడం వంటివి నేర్పిందని గుర్తుచేసుకున్నారు. న్యాయ వాదిగా 17 ఏళ్లు, న్యాయమూర్తిగా 13 ఏళ్లు పని చేశానని, అందుకే ఈ ప్రాంగణంలోకి వస్తే భావోద్వేగానికి గురవుతానన్నారు. తెలంగాణ అభివృద్ధికి సంతోషిస్తున్నా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు కొంత మంది ఎక్కువ క్రమశిక్షణతో కనిపిస్తున్నారని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి నిదర్శనమన్నా రు. ఐక్యతకు చిహ్నమని, అందుకే మీరు తెలంగాణను పోరాడి తెచ్చుకోవడం సామాన్య విషయం కాదన్నారు. ఆ తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే సంతోషించే వాడిలో తాను కూడా ఒకడినని చెప్పారు. తన పదవీకాలంలో ఏమి ఘన కార్యాలు చేసినా ఆ ఖ్యాతి తెలంగాణ హైకోర్టుదేనని, అపఖ్యాతి వస్తే మాత్రం ఆ బాధ్యత తనదన్నారు. కోర్టుల్లో వసతులలేమికి ఇక పరిష్కారం... తాను సీజేఐ అయ్యాక దేశ న్యాయ వ్యవస్థలో రెండు మౌలిక లోపాలను గమనించానని ఎన్వీ రమణ చెప్పారు. సామాన్యుడికి న్యాయం అందుబాటులో ఉండాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి తగిన సం ఖ్యలో కోర్టులు ఉండటం, సరైన సౌకర్యాలు ఉండ టం అవసరమన్నారు. అందుకోసమే కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించానన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే రాష్ట్రాల సీఎంలు, ప్రధాని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఈ అంశంపై చర్చిస్తామని, చర్చలు ఫలప్రదమైతే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సగం పోస్టులు భర్తీ చేశా.. ‘దేశంలోని హైకోర్టుల్లో 1,100 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ఎప్పుడూ కనీసం 400 ఖాళీలు ఉంటాయి. నేను సీజేఐ అయ్యాక 198 హైకోర్టు జడ్జీల పోస్టుల భర్తీ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపా. అందులో ఇప్పటిదాకా 130 భర్తీ అవగా మిగిలినవి కేంద్రం వద్ద పెండింగ్‌లోఉన్నాయి. మే నెలాఖరులోగా మరో 200 మంది న్యాయమూర్తుల నియామకానికి ప్రతిపాదనలు పంపుతా. తెలం గాణ హైకోర్టులో 24గా ఉన్న జడ్జీల సంఖ్యను 42కి పెంచుకున్నాం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ మరిన్ని పేర్లు పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే ఖాళీల భర్తీలో సామాజిక, ప్రాంతీయ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని సీజేఐ సూచించారు. మహిళా జడ్జీల తరఫున నినదించా... ‘ఢిల్లీలో ఇటీవల మహిళా జడ్జీలకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కార్ల్ మార్క్స్ నినా దాన్ని కాస్త మార్చి చెప్పా. మహిళలారా ఏకం కండి.. పోరాడితే పోయేదేమీ లేదు... సంకేళ్లు తప్ప అనే నినాదం ఇచ్చా. కానీ ఈ విషయంలో కొన్ని సామాజిక మాధ్యమాలు నాపై దుమ్మెత్తిపోశాయి. అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని కోరడం తప్పు అన్నా నేనేమీ లెక్కచేయను. కేవలం మహిళలకే కాదు... అన్ని ప్రాంతాలకు సమ న్యాయం ఉండాలి. అప్పుడే న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జూనియర్లకు ఆర్థిక చేయూత అందించాలి... ‘చిన్న, మధ్యతరగతి న్యాయవాదులు కోవిడ్ కాలంలో ఇబ్బందులు పడ్డారు. వృత్తిని వదిలేసి చేతివృత్తులు, ఆటోలు నడుపుకోవడం చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నా. అలాగే జూనియర్లను న్యాయమూర్తులు కాస్త కనిపెట్టి ఉండాలి. న్యాయవాదుల శిక్షణకు అకాడమీని హైదరాబాద్‌లోనే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అఖిల భారత జ్యుడీషియల్ డేటా మేనేజ్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించా. అలాగే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలి’ అని సీజేఐ సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మానవీయతని చాట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా తీవ్రత తగ్గడంతో న్యాయస్థానాలు ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. మీరు కూడా కరోనా భయం నుంచి బయటకు రండి. కోర్టు పనివేళలకన్నా అదనపు సమయాన్ని వెచ్చించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయండి. పెండింగ్ కేసుల పరిష్కారంలో మీ వంతు పాత్ర పోషించండి. వ్యవస్థలోని అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరచనిదే కార్యసిద్ధిపై హామీ ఇవ్వలేం. నిర్దేశిత లక్ష్యం, కేసుల సమర్థ నిర్వహణ ఈ విషయంలో ఎంతో వ్యత్యాసం చూపుతాయి. న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థే పునాది. పునాది బలంగా ఉంటేనే వ్యవస్థ వర్ధిల్లుతుంది. ఈ విషయంలో మీరంతా న్యాయ వ్యవస్థ పతాకం ఎల్లప్పుడూ రెపరెపలాడేలా చూడండి. న్యాయవ్యవస్థ ఉన్నతిని నిలబెట్టేందుకు మీ వంతు కృషి చేయండి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ న్యాయాధికారులకు పిలుపునిచ్చారు. రెండు రోజుల రాష్ట్ర న్యాయాధికారుల సదస్సు–2022ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్, తెలంగాణ, ఏపీ హైకోర్టు సీజేలు సతీష్‌చంద్ర శర్మ, ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవీయ కోణాన్ని చూడండి... సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ ‘సమస్యలతో కోర్టుకు వచ్చే కక్షిదారుల్లో మైనర్లు, మహిళలు, బలహీన వర్గాలు, దివ్యాంగులకు ఉండే విభిన్న అవసరాలను గుర్తించి వారిని గౌరవించండి. మీ ఎదుట ఉండే సాక్ష్యాలను పరిశీలించే సమయంలో రాజ్యాంగ విలువలు పరిరక్షించే దిశగా స్వతంత్రంగా ఆలోచించండి. విధి నిర్వహణలో భయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా జడ్జీలపై పెరుగుతున్న భౌతికదాడులను నిరోధించేందుకు కోర్టు లోపలా, బయట భద్రత పెంచాలని మార్గదర్శకాలు జారీ చేశా. మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సమయాన్ని వెచ్చిస్తూ తీర్పులు ఇవ్వండి. జడ్జీల ఆర్థిక అంశాలను త్వరలో పే కమిషన్ దృష్టికి తీసుకెళ్లి శుభవార్త వినిపిస్తా’ అని తెలిపారు. కోర్టుల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యత... ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కోర్టుల పనితీరుపై తీవ్ర ప్రభా వం చూపుతున్న మౌలిక వసతులు, ఖాళీ పోస్టుల భర్తీని ప్రధానాంశాలుగా తీసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టాం. మౌలికవసతుల కల్పన, ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలంగాణలో ఎనిమిదేళ్లుగా కోర్టులకు కొత్త భవనాలు వస్తున్నా ఇంకా చాలా చోట్ల రావాల్సిన అవసరం ఉంది. పెండింగ్ కేసులను దృష్టిలో పెట్టుకొని హైకోర్టులో బెంచీల సంఖ్యను 24 నుంచి 42కు పెం చడంతోపాటు 17 కొత్త జడ్జీలను నియమించాం. గతంలో 12 పేర్లను జడ్జీలుగా ప్రతిపాదించగా పెండింగ్‌లో ఉన్న రెండు పేర్లను త్వరలో ఆమోదిం చేందుకు ప్రయత్నిస్తా’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఉమ్మడి ఏపీలో 2016లో ఈ తరహా సదస్సు జరిగిందని, న్యాయవ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆరేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సదస్సు ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరాలి’ అని సీజేఐ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు... సీఎం కేసీఆర్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ తన తెలుగు ప్రసంగంలో ప్రశంసలు కురిపించారు. ‘నాతోపాటు న్యాయవ్యవస్థకు కూడా మిత్రుడైన కేసీఆర్ గురించి పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు. చేతికి ఎముక లేదనే సామెతకు ఆయనే ట్రేడ్‌మార్క్. వివిధ రంగాల తరహాలోనే న్యాయవ్యవస్థ అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపనకు న్యాయవ్యవస్థ తరఫున కృతజ్ఞతలు. కేంద్రం, వివిధ రాష్ట్రాలు ఉద్యోగాలను తగ్గిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను నియమిస్తున్న క్రమంలో కేసీఆర్ న్యాయవ్యవస్థలో 4,320 ఉద్యోగాలు సృష్టించారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కోసం స్థలం, నిధులు కేటాయించి భవనం నిర్మించారు. హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ విజయవంతమైతే ఇతర రాష్ట్రాలకు కూడా ఫ్రాంచైజీలు ఇస్తాం’ అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. వేదికపై ఉన్న వారికి వీణలను బహుమతిగా ఇచ్చిన సీఎం కేసీఆర్ తనకు మాత్రం నెమలి బొమ్మ ఇచ్చారంటే జాతీయ పక్షి అని ఇచ్చారేమోనని సీజేఐ చమత్కరించారు. తనకు నెమలి బొమ్మ ఇచ్చినా ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ హాస్యోక్తి విసిరారు. కాగా, యువ న్యాయ అధికారుల్లో క్రమశిక్షణా రాహిత్యం, సీనియర్ న్యాయమూర్తులను అవమానించడం సరికాదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అన్నారు. తీర్పులు వెలువరించడంలో సమయపాలన పాటించడం లేదని, బాధితులకు సరైన న్యాయం అందించేందుకు సమగ్ర మార్పులు అవసరమన్నారు. వికార్ మంజిల్‌లో నిర్మించే జడ్జీల అతిథిగృహం, సెంట్రల్ రికార్డు బ్లాక్ శిలాఫలకాలను జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. తెలంగాణ జడ్జీల అసోసియేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. యామినీరెడ్డి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి వి.రామసుబ్రమణ్యం, హైకోర్టు న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్, హైకోర్టు ఇతర జడ్జీలు, జిల్లాలు, మెజిస్ట్రే్టట్ కోర్టుల జడ్జీలు పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి కోర్టుల్లో పనిభారం: సీఎం కేసీఆర్ గోవా, సిక్కిం వంటి రాష్ట్రాలను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తలసరి ఆదా యం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో అద్భుత పురోగతిలో ఉన్న తెలంగాణలో పాలనా సంస్కరణలతో 33 జిల్లాలు ఏర్పాటైనట్లు వెల్లడిం చారు. రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య 24 నుంచి 42కు పెరిగిందని, న్యాయ విభాగంలో గతంలో 780 పోస్టులు మంజూరు చేయగా, తాజాగా 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మం జూరు చేసినట్లు చెప్పారు. ధరణి ద్వారా భూములను డిజిటలైజేషన్ చేసి కోర్టులపై అపార నమ్మకంతో రెవెన్యూ కోర్టులు రద్దు చేశామన్నారు. న్యాయమూర్తుల హోదాకు తగ్గట్లుగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతంలో 30 నుంచి 40 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహ సముదాయం నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమ శంకు స్థాపనకు రావాల్సిందిగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ఆహ్వా నించారు. పెట్టుబడుల ఆకర్షణలో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం పోటీ పెరిగిన నేపథ్యంలో తలెత్తే న్యాయ వివా దాలను న్యాయవ్యవస్థ వెంటనే పరిష్కరించా లని కోరుకుంటున్నానని, అలా జరిగితేనే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. 400 మంది హాజరైన న్యాయ అధికారుల సదస్సు న్యాయమూర్తులు తమ పనితనం మెరుగుపరుచుకునే వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఒత్తిడిలో ఉండే కక్షిదారులకు ఊరటనివ్వడంతోపాటు వివాదాల్లో మానవీయ కోణాన్ని చూడండి. సమానత్వానికి న్యాయసూత్రాలు దూరం కావనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు మీ విచక్షణను ఉపయోగించే అవకాశం ఉన్న చోట న్యాయ వ్యవస్థలోని మానవీయ కోణాన్ని చాటిచెప్పండి. – సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్, రంగారెడ్డిలోని సిటీ సివిల్ కోర్టులు, జిల్లా కోర్టుల్లో పనిభారం పెరిగింది. కొత్తగా ఏర్పాటైన 22 జిల్లాల్లో కోర్టులు ప్రారంభించాలి. కొత్త కోర్టులకు అవసరమైన స్థలాలను ఎంపిక చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధులిస్తాం. కొత్తగా ప్రారంభమయ్యే జిల్లా కోర్టుల సిబ్బంది కోసం 1,730 అదనపు పోస్టులు మంజూరు చేస్తాం. – ముఖ్యమంత్రి కేసీఆర్ -
కొత్త రాష్ట్రమైనా అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తోంది: కేసీఆర్
-
గచ్చిబౌలిలో న్యాయాధికారుల సమావేశం ప్రారంభం
-
సీజేఐ ఎన్వీ రమణకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్
సాక్షి హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చొరవతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు సీజేఐ ఎన్వీ రమణకు కేసీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గచ్చిబౌలిలో శుక్రవారం న్యాయాధికారుల సదస్సు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లోని జిల్లా న్యాయమూర్తులతో నిర్వహించిన ఈ సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సీజేఐ సూచనతో 850 అదనపు పోస్టులు మంజూరు చేశామని వెల్లడించారు. జిల్లా కోర్టులకు 1730 అదనపు పోస్టులు మంజూరు చేశామన్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్రానికి లేఖ రాశామని, హైకోర్టు బెంచీల సంఖ్య పెరిగింది కాబట్టి సిబ్బంది ఏర్పాటు చేయాలని సీజేఐ చెప్పారని తెలిపారు. కోర్టుల మీద ఉన్న అపారమైన గౌరవంతో రెవెన్యూ కోర్టులు రద్దుచేశామన్నారు. ‘జిల్లా కోర్టు భవనాల నిర్మాణం కోసం స్థలాల ఎంపిక జరుగుతోంది. హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ క్వార్టర్స్ నిర్మిస్తాం. 42 మంది న్యాయమూర్తులకు ఒకేచోట క్వార్టర్స్. క్వార్టర్స్ నిర్మాణం కోసం 30 ఎకరాల స్థలం సిద్ధంగా ఉంది. ఈ ఏడాదే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తాం.’ అని తెలిపారు. -
వర్చువల్ న్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘న్యాయం పొందటం ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంది’’ – 2021లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైరవుతూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలివి. అందుకు తగ్గట్టే కరోనా మహమ్మారి రూపంలో ఎదురైన సవాలును వర్చువల్ విధానంలో అధిగమించింది సుప్రీంకోర్టు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణలు కొనసాగించాలని 2020 మార్చిలో కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా అప్పటి సీజేఐ జస్టిస్ బాబ్డే ఇందుకు బాటలు వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దాన్ని వ్యవస్థీకృత రూపంలో ముందుకు తీసుకెళ్లి విచారణ ప్రక్రియను కొత్తపుంతలు తొక్కించారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలిచి చూపించారు. దీన్ని హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా అందిపుచ్చుకోవడంతో సామాన్యునికి న్యాయం అందే ప్రక్రియ కరోనా వేళ కూడా నిరాఘాటంగా కొనసాగింది. ఎప్పటికప్పుడు సూచనలు కరోనా వల్ల రెండేళ్లు వర్చువల్ విధానంలో సాగిన సుప్రీంకోర్టు ఈ నెల 4 నుంచి మళ్లీ భౌతిక రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రధాన కేసుల విచారణలు, వాదోపవాదాలను ఇంతకాలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన న్యాయమూర్తులు కరోనా తీవ్రత తగ్గి, ఆంక్షలు సడలటంతో భౌతిక విచారణలు మొదలు పెట్టారు. ఈ రెండేళ్ల కాలంలో వర్చువల్ విధానంలో న్యాయ సేవలందటంలో ఎలాంటి ఆటంకాలూ తలెత్తకుండా చూడటంలో సీజేఐ జస్టిస్ రమణ చురుకైన పాత్ర పోషించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకోవడం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ వచ్చారు. కోర్టు రోజువారీ వ్యవహారాలు, విచారణల్లో ఇబ్బందులు రాకుండా ఈ–కమిటీని అప్రమత్తం చేస్తూ, దాని సలహాలు, సూచనలు పకడ్బందీగా అమలయ్యేలా సీజేఐ చేసిన సూచనలు సత్ఫలితాలనిచ్చాయి. లఖీంపూర్‌ఖేరి ఘటన, పెగసస్ వంటి కీలక కేసుల విచారణలు వర్చువల్‌గానే సాగాయి. 2020 మార్చిలో మొదలు కరోనా నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలకు తెర తీసింది. నాటి సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సూచనల మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని సుప్రీంకోర్టు ఈ–కమిటీ వర్చువల్ విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. అదే బాటలో హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ విచారణ పద్ధతినే అవలంబించాయి. వర్చువల్ విచారణలు ప్రారంభమైన నెల రోజులకే సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రమణ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. కరోనా సమయంలో కోర్టు ప్రాంగణంలోనే డెస్క్‌టాప్‌లు ఏర్పాటు చేసి కవరేజీకి మీడియాను కూడా అనుమతించారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో మీడియాకు యాప్‌ను కూడా రూపొందించారు. తాను జర్నలిస్టుగా ఉన్న సమయంలోని ఇబ్బందులను ఆ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విచారణలకు వాడుతున్న యాప్‌లోని ఇబ్బందులను గుర్తించి సిస్కో వెబ్ఎక్స్ను వాడకంలోకి తెచ్చారు. జస్టిస్ రమణ సూచనల మేరకు దానిలోని లోపాలను సరిదిద్ది మెరుగు పరిచారు. వర్చువల్ విచారణలో ఇలాంటి పలు ఇబ్బందులను ఈ–కమిటీ ఆధ్వర్యంలో సీజేఐ సూచనల మేరకు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చారు. విచారణలను పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా సీజేఐ అభిప్రాయపడ్డారు. లాయర్లకు దిశానిర్దేశం వర్చువల్ విచారణల్లో లాయర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పాల్గొనడాన్ని జస్టిస్ రమణ తీవ్రంగా ఆక్షేపించారు. దీనివల్ల లాయర్లు సరిగా కనిపించపోవడమే గాక విచారణకు ఆటంకం వస్తోందన్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తూ డెస్క్‌టాప్ కొనుక్కోలేరా అని లాయర్లను ప్రశ్నించారు. వారి వస్త్రధారణ విషయంలోనూ పలు సందర్భాల్లో సూచనలు చేశారు. రెండేళ్లలో రికార్డు 2020 మార్చి 23 నుంచి 2022 మార్చి 14 వరకు రెండేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 2,18,891 కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ప్రపంచం మొత్తంలో మన సుప్రీంకోర్టు మాత్రమే కరోనా సమయంలో ఇన్ని కేసులు విచారించిందని కేంద్ర న్యాయ మంత్రి ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. దేశంలోని 24 హైకోర్టులు కూడా కరోనా వేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 61,02,859 కేసులను విచారించాయి. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టులు కరోనా వేళ 1,23,29,917 కేసులను విచారించాయి! -
మధ్యవర్తిత్వంతో న్యాయవ్యవస్థలో మార్పులు
కెవాడియా (గుజరాత్): మధ్యవర్తిత్వంతో పాటు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఏడీఆర్) యంత్రాంగాన్ని అమలు చేస్తే భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో ఉండే కొన్ని చిక్కుముళ్ల వల్ల దీనికి విస్తృత స్థాయిలో ఆమోదం ఉండాలన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా కోర్టు కేసుల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర టెంట్ సిటీలో మధ్యవర్తిత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో రాష్ట్రపతి కోవింద్, సీజేఐ జస్టిస్ రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
ఏపీ విభజన కేసు విచారిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజనకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను విచారిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. శుక్రవారం సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమ కోహ్లిల ధర్మాసనం ముందు ఉండవల్లి అరుణ్‌కుమార్ న్యాయవాదులు ప్రశాంత్‌భూషణ్, రమేశ్ అల్లంకి ఈ అంశాన్ని ప్రస్తావించారు. 2014లో ఏపీ విభజన పూర్తికాలేదని, విభజన చట్టం కొట్టేయాలని ఉండవల్లి అరుణ్‌కుమార్, మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేశారని న్యాయవాదులు తెలిపారు. ఆ సమయంలో జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ప్రతివాదులకు నోటీసులు జారీచేశారని, కానీ ఆ పిటిషన్లపై ఇప్పటివరకు విచారణ జరగలేదని చెప్పారు. 2019లో ఉండవల్లి ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ దాఖలు చేసినా ఇప్పటివరకు జాబితాలోకి రాలేదని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో తమ ప్రేయర్‌ను సవరిస్తూ పిటిషన్ వేశామన్నారు. 2014లో ఏపీ విభజన జరిగింది.. తప్పోఒప్పో ఏపీ విభజన జరిగిపోయిందని, భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు సూచించాలని కోరామన్నారు. అదే సమయంలో విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఆర్థికంగా సాయం చేయాలని సవరణ పిటిషన్ వేసినట్లు వివరించారు. తక్షణమే విచారించాలని తాము కోరడం లేదని, ఏదో ఒకరోజు తేదీని నిర్ణయించాలని న్యాయవాదులు అభ్యర్థించారు. సవరణ పిటిషన్ విచారణకు తేదీ కేటాయిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు. -
రాజకీయ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అంశాలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వానికి ఇలాంటి అంశాలను పరిశీలించడానికి తగిన అధికారం ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలు, బంగ్లాదేశ్ జాతీయులను సంవత్సరంలోగా గుర్తించి, నిర్భంధించి, దేశం నుంచి బహిష్కరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ గురువారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ‘‘పార్లమెంట్ సభ్యుల సమస్య, నామినేషన్ సమస్య, ఎన్నికల సంస్కరణలు ఇలా ప్రపంచంలోని ఎన్నో సమస్యలు, దాంతోపాటు ఇక ప్రతిరోజూ మీ కేసును మాత్రమే వినాలి! అవి రాజకీయ అంశాలు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి. మీరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను(పిల్) మేము(న్యాయస్థానం) విచారణకు స్వీకరించాల్సి వస్తే.. ఇక ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నట్టు? చట్టాలు చేయడానికి రాజ్యసభ, లోక్‌సభ ఉన్నాయి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ పిటిషన్‌కు కౌంటరు వేయాలని కేంద్రం భావిస్తే జాబితాలో చేరుస్తామని చెప్పారు. -
‘పద్మ’ గ్రహీతలకు సీజేఐ సన్మానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మ అవార్డు గ్రహీతలు నలుగురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం సన్మానించారు. వివిధ రంగాల్లో 54 మంది ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం పద్మ అవార్డులు బహూకరించడం తెలిసిందే. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన దివంగత గోసవీడు షేక్ హసన్ తరఫున ఆయన మనవడు, గరికిపాటి నరసింహారావు, సుంకర వెంకట ఆదినారాయణ రావు, దర్శనం మొగుల య్యలను సీజేఐ తన నివాసానికి ఆహ్వానించి సన్మానించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
శ్రీశైలంలో సీజేఐ ఎన్వీ రమణ ప్రత్యేక పూజలు
-
ఐఏఎంసీతో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటుతో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గచ్చిబౌలిలోని ఐకియా వెనుక భాగంలో ఐఏఎంసీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో శాశ్వత భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌తో కలిసి జస్టిస్ రమణ శనివారం భూమిపూజ చేశారు. ఐఏఎంసీకి విలువైన భూమితో పాటు నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వానికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా భవన నిర్మాణం పూర్తిచేసుకొని దుబాయ్, సింగపూర్, లండన్ ఆర్బిట్రేషన్ కేంద్రాల తరహాలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల 17, 18 తేదీల్లో దుబాయ్‌లో సెమినార్ ఏర్పాటు చేశామని, అంతర్జాతీయంగా ఆర్బిట్రేషన్ కేసులను ఆకర్షించేందుకు ఈ సెమినార్ దోహదపడుతుందని చెప్పారు. ఐఏఎంసీకి ఇప్పటికే ఆర్బిట్రేషన్ కేసులు వస్తున్నాయని, మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించడంలో ప్రపంచంలోనే మంచి గుర్తింపు సాధించబోతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో నిర్మించబోయే ఈ కేంద్రం నగరానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెడుతుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. -
Hyderabad: గచ్చిబౌలిలో IAMC బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ
-
తిరుమలలో శుభ్రత, సుందరీకరణ భేష్
తిరుమల: తిరుమలలో శుభ్రత, సుందరీకరణ చాలా బాగున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు. ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అర్చకులు ‘ఇస్తికఫాల్’ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయ ధ్వజస్తంభానికి మొక్కుకొని.. శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా.. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనవు ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆంజనేయుని జన్మస్థలంపై టీటీడీ ముద్రించిన పుస్తకాన్ని అందజేశారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మీడియాతో మాట్లాడారు. భవిష్యత్‌లో కోవిడ్ వంటి వ్యాధులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. రెండేళ్ల తర్వాత ప్రతిరోజూ వేలాది మంది సామాన్య భక్తులకు సర్వదర్శన భాగ్యం లభించడం సంతోషకరమన్నారు. శ్రీవారి ఆశీస్సులు అందుకొని భక్తులు ఆనందించే వాతావరణం ఏర్పడిందని చెప్పారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, లోకనాథం, వీజీవో బాలిరెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి సేవలో జస్టిస్ దుర్గాప్రసాదరావు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు ఆదివారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు సీజే
తిరుమల/తిరుపతి కల్చరల్/చంద్రగిరి: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ శనివారం రాత్రి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జస్టిస్ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ రమణ దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ దంపతులు శ్రీ వరాహ స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు తిరుమలకు చేరుకున్న జస్టిస్ రమణ దంపతులకు శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్, ఈవోతో పాటు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి తదితరులు స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఏర్పాటు చేసిన పంచగవ్య ఉత్పత్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో ఆకర్షణీయంగా తయారుచేసిన శ్రీవారి ఫొటోలు, ఇతర వస్తువుల స్టాల్‌ను జస్టిస్ రమణ సందర్శించారు. గో తులాభారంతో మొక్కు చెల్లింపు శనివారం సాయంత్రం అలిపిరి వద్దనున్న ఎస్వీ సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని జస్టిస్ రమణ దంపతులు సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి గో ప్రదక్షిణ చేసి వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు. గోమాతకు సరిపడా తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు. అమ్మవారి సేవలో జస్టిస్ రమణ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
యుద్దం ఆపమని పుతిన్‌ను ఆదేశించలేము కదా?
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న కారణంగా అక్కడ ఉన్న విదేశీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసి విమానాలను రద్దు చేయడంతో విద్యార్థులు స్వదేశానికి చేరుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల తరలింపుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిల్(ప్రజాహిత వ్యాజ్యం) దాఖలైంది. ఈ పిల్‌పై గురువారం విచారణ జరుగుతున్న సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూశానని.. ఓ వీడియోలో భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే విషయంలో సీజేఐ ఏం చేయలేరా అని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజేఐ స్పందిస్తూ.. విద్యార్థుల పరిస్థితుల పట్ల తమకు కూడా సానుభూతి ఉందని అన్నారు. కానీ.. యుద్దం ఆపమని తాము పుతిన్‌ను ఆదేశించలేము కదా అంటూ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను తరలించే విషయంలో భారత ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. వారి పని వారు చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో తాము ఏం చేయగలమో అటార్నీ జనరల్ సలహాలు, సూచనలతో ముందుకు సాగుతామన్నారు. -
‘ఉచితాల’పై సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: ఉచిత హామీల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్ట జూస్తున్నాయంటూ రాజకీయ పార్టీలపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరిపే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు హిందూసేన ఉపాధ్యక్షుడు సుర్జీత్‌సింగ్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించాలన్న విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సారథ్యంలోని ధర్మాసనం బుధవారం పరిశీలించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తున్నందున దీన్ని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఆయన తరఫు న్యాయవాది ధర్మానానికి విన్నవించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇచ్చిన పలు ఉచిత హామీలతో తాను కలత చెందినట్టు పిటిషన్లో యాదవ్ పేర్కొన్నారు. దీన్ని అవినీతి చర్యగా, సదరు పార్టీల తరఫు అభ్యర్థులను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల సంఘాలను, కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆప్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఉచిత హామీల బడ్జెట్ కొన్నిసార్లు అసలు బడ్జెట్‌నూ మించిపోతోందంటూ లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ వేసిన పిల్‌పై కేంద్రానికి, ఈసీకి అంతకుముందు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్!... కోలుకున్నా ఇంకా బాధిస్తునే ఉంటుంది!
NV Ramana today called Omicron a "silent killer: సుప్రీంకోర్టు భౌతిక విచారణలకు హాజరవ్వాలన్న అభ్యర్థన పై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఒమిక్రాన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని సంభోధించారు. ఒక నెల క్రితం ఈ వేరియంట్ భారినపడ్డానని తర్వాత కోలుకున్నాక కూడా తాను ఆ వేరియంట్ ప్రభావంతో ఇంకా బాధపడుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను కరోనా మొదటి వేవ్‌లోనే కరోనా వైరస్ భారిన పడ్డానని, నాలుగు రోజుల్లో కోలుకున్నానని, మళ్లీ ఇప్పుడు ఈ వేవ్‌లో భారిన పడి బయటపడ్డాక కూడా ఇంకా 25 రోజులుగా బాధపడుతూనే ఉన్నానని అన్నారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి భౌతిక విచారణకు తిరిగి రావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హైబ్రిడ్ శైలిలో విచారణలు జరుగుతున్నాయి. వారానికి రెండుసార్లు భౌతిక విచారణలు, మిగిలినవి ఆన్లైన్లో జరుగుతున్నాయి. అయితే కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదని ఇంకా 15 వేల కేసులు పెరిగాయని జస్టీస్ రమణ అన్నారు. దీనికి సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ప్రజలు మాత్రం కోలుకుంటున్నారంటూ కౌంటరిచ్చారు. వెంటనే జస్టీస్ రమణ తాము చూస్తాం అని వ్యగ్యంగా బదులిచ్చారు. ఈ మేరకు గత మూడో వేవ్‌లో సుప్రీం కోర్టు న్యాయవాదులు, సిబ్బంది అధిక సంఖ్యలో కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. (చదవండి: 10, 12వ తరగతుల ఆఫ్‌లైన్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ) -
Tribunals Vacancies: కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు ట్రిబ్యునళ్లలో ఖాళీలపై(పెండింగ్ నియామకాలు చేపట్టకపోవడంపై) సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈ వ్యవహారంపై స్పష్టమైన వైఖరి ఏంటో తెలపాలంటూ కేంద్రాన్ని వివరణ కోరింది. బుధవారం ఈ వ్యవహారంపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం.. బ్యూరోక్రసీ ఈ అంశాన్ని తేలికగా తీసుకుంటోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు నియమకాలపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరింది బెంచ్. ‘‘ఇది ట్రిబ్యునల్స్‌కు సంబంధించిన అంశం. రోజూ ప్రస్తావిస్తూనే ఉన్నాం. అయినా ఏదో మొక్కుబడిగా నియామకాలు చేపడుతున్నారు. ఎంతో మంది రిటైర్ అవుతున్నారు. బ్యూరోక్రసీ ఈ అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటోంది’’ అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, అటార్నీ జనరల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బదులుగా ఏజీ స్పందిస్తూ.. ఈ ఇష్యూ మీద ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుందన్నారు. దీంతో తదుపరి వాదనలను మూడు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. -
హిజాబ్ అంశాన్ని పెద్దది చేయకండి: సుప్రీం కోర్టు
కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. ఈ మేరకు పిటిషన్‌ను తోసిపుచ్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సాక్షి, న్యూఢిల్లీ: పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండి. ఆదేశాలు వెలువడక ముందే ఏం చేయగలం?. ఏమి జరుగుతుందో మాకు తెలుసు. దయచేసి ఈ అంశాన్ని పెద్దది చేయొద్దు. అసలు ఈ అంశాన్ని జాతీయ స్థాయి.. ఢిల్లీకి తీసుకురావడం సరైందేనా? ఒక్కసారి ఆలోచించండి. దేశ పౌరులు అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే మేము ఇక్కడ ఉన్నాం. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటాం. హిజాబ్ వ్యవహారాన్ని పెద్దది చేయకండి’’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్‌తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. అంతేకాదు విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ముస్లిం మహిళలకే నష్టమని, దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఓ విద్యార్థి పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణకు సుప్రీం నో చెప్పింది. ఇదే పిటిషన్‌పై వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. కర్ణాటక హైకోర్టు ఇంకా ఆదేశాలు (తుది) ఇవ్వకుండా.. సుప్రీం కోర్టులో ఎలా సవాలు చేస్తారు? అని ప్రశ్నించారు. హైకోర్టును తేల్చనీయండి. దీన్ని రాజకీయం, మతపరం చేయవద్దు అని తుషార్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. గురువారం ఫాతిమా బుష్రా అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం సుప్రీం తోసిపుచ్చింది. ఆమె తరపున వాదనలు వినిపించిన కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఈ అంశం దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘మేం పరిశీలిస్తాం’ అంటూ చీఫ్ జస్టిస్ రమణ అన్నారు. -
ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పదోన్నతి
సాక్షి, న్యూఢిల్లీ: ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు మేరకు సోమవారం జాబితా విడుదలైంది. జడ్జిలుగా పదోన్నతి పొందిన వాళ్లలో కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాత ఉన్నారు. -
Supreme Court: ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణకు ప్రత్యేక కమిటీ
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్ భద్రతా వైఫల్యం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై విచారించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తు ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, చండీగఢ్ డీజీపీ, ఎన్ఐఏ ఐజీ, పంజాబ్ ఏడీజీ (సెక్యూరిటీ) తదితరులు ఉంటారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో కొంత మంది నిరసనకారులు ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్‌ను ఫ్లైఓవర్‌పై 20 నిముషాలపాటు అడ్డుకోవడంతో ప్రధాని ర్యాలి రద్దయ్యింది. భటిండా విమానాశ్రయం నుంచి హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థూపం వద్దకు ప్రధాని మోదీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్‌కు భద్రతా వైఫల్యంపై అత్యున్నతస్థాయి విచారణ కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. చదవండి: కరోనా కల్లోలం: భారత్‌లో భారీగా పెరిగిన కేసులు.. -
దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బహిర్గతమైన భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు కొత్త కమిటీ ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర సర్కార్లు గతంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కమిటీల దర్యాప్తులను నిలిపివేస్తూ కొత్త కమిటీని సుప్రీంకోర్టు కొలువు తీర్చనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత కేసు విచారణ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చండీగఢ్ డీజీపీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇన్స్పెక్టర్ జనరల్, పంజాబ్– హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో భద్రతా వైఫల్యం పునరావృతం కాకుండా పటిష్ట రక్షణకు సూచనలు ఇచ్చేలా, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరగాలంటూ లాయర్స్ వాయిస్ అనే సంస్థ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. కేంద్రం రాజకీయాలు చేస్తోంది ఘటనపై పంజాబ్ ఉన్నతాధికారులను మోదీ సర్కార్ లక్ష్యంగా చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన అడ్వకేట్ జనరల్ డీఎస్ పట్వాలియా వాదించారు. ‘‘తప్పంతా పంజాబ్‌దే అని ఏకపక్షంగా తేల్చేస్తున్నారు. ఎలాంటి దర్యాప్తు, ఉత్తర్వులు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మొదలుకుని సీనియర్ ఎస్పీల వరకు మొత్తంగా ఏడు షోకాజ్ నోటీసులు పంపించారు. తప్పు మాదే అయితే నన్ను, మా రాష్ట్ర అధికారులను ఉరి తీయండి. మా వాదన వినకుండానే వైఫల్యానికి బాధ్యుతలు మీరే.. అని నిర్ధారించకండి. ఈ అంశంలో మోదీ సర్కార్ రాజకీయాలు చేస్తోంది’’ అని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు కమిటీని ఉద్దేశిస్తూ పట్వాలియా వ్యాఖ్యానించారు. వైఫల్యాలు తేలాలంటే స్వతంత్ర కమిటీ తప్పనిసరి అని ఆయన అన్నారు. కోర్టు చేసేది ఏముంటుంది?: సుప్రీం పట్వాలియా వాదనలను తోసిపుచ్చుతూ కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ‘దేశ ప్రధాని భద్రత అనేది అత్యంత కీలక అంశం. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) బ్లూ బుక్, ఇతర నియమావళి ప్రకారమే పంజాబ్ ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చాం’ అని ఆయన వివరణ ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘ప్రధాని భద్రత ఎంత ముఖ్యమైన విషయమో మాకూ తెలుసు. దానికి తీవ్రమైన అంశంగానే పరిగణిస్తున్నాం. సంబంధిత అంశం కోర్టు పరిధిలోనే ఉంది. అలాంటపుడు షోకాజ్ నోటీసుల పేరిట రాష్ట్ర అధికారులపై మీరెందుకు క్రమశిక్షణ చర్యలకు బయల్దేరారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించారు. మీరే దర్యాప్తు కొనసాగిస్తున్నపుడు మళ్లీ కోర్టుకెందుకు వచ్చారు. ఈ కోర్టు చేసేది ఏముంటుంది? ’అని తుషార్ మెహతాతో జడ్జీలు వ్యాఖ్యానించారు. మరోవైపు, వైఫల్యం ఘటనలో పంజాబ్ సీఎం, పంజాబ్ సీఎస్, డీజీపీ, ఫిరోజ్‌పూర్ ఎస్‌ఎస్‌పీల పాత్రను బయటపెట్టేలా ఎన్ఐఏ అధ్యర్వంలో దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ లాయర్ వరుణ్ సిన్హా సుప్రీంకోర్టులో పిల్ వేశారు. -
భద్రత రికార్డులను భద్రపరచండి
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని మోదీ బుధవారం నాటి పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి అన్ని రికార్డులను తక్షణమే భద్రపరచాలని పంజాబ్ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధానికి చేసిన రక్షణా ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు, కేంద్ర రక్షణ, నిఘా సంస్థల నుంచి అన్ని రకాల వివరాలను సమీకరించి భద్రపరచాలని సూచించింది. ఘటనపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీల పరిశోధనను సోమవారం వరకు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫిరోజ్‌పూర్ ఘటనపై లాయర్స్ వాయిస్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ఇది ప్రధాని భద్రతకు సంబంధించిన అంశమని గుర్తించి సంబంధిత రికార్డులన్నిటినీ భద్రపరచమని హైకోర్టు రిజిస్ట్రార్‌ను సుప్రీం ఆదేశించింది. రిజిస్ట్రార్‌కు చండీగఢ్ డీజీపీ, జాతీయ భద్రతా సంస్థకు చెందిన ఐజీ ర్యాంకుకు తగ్గని అధికారి సహకరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రిజిస్ట్రార్ జనరల్‌కు రికార్డుల అందజేత విషయంలో పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలను ఆదేశించింది. ఫిరోజ్‌పూర్ ఘటన ఉద్దేశపూర్వక కుట్రని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య కార్యదర్శి, డీజీపీలు బాధ్యతలు మరిచారని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. సీఎస్, డీజీపీపై తగిన చర్యలు(సస్పెన్షన్) తీసుకోవాలని కోరారు. అధికారిక రికార్డుల మార్పిడి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సుప్రీంను కోరారు. మాకు ఓకే జరిగిన ఘటనపై లోతైన విచారణ జరపాలన్న పిటిషనర్ డిమాండ్‌పై తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. పంజాబ్ పోలీసులు రూట్ క్లియర్ చేసిన తర్వాతే ప్రధాని కాన్వాయ్ బయలుదేరిందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ప్రధాని పర్యటనకు ముందే సిక్స్ ఫర్ జస్టిస్ అనే నిషేధిత సంస్థ చైర్మన్ పన్ను ఒక వీడియోను సర్క్యులేట్ చేసిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అందువల్ల ఈ ఘటనలో అంతర్జాతీయ ఉగ్రవాద కోణం ఉండే అవకాశం ఉందని, కనుక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జోక్యం అవసరమేనని చెప్పారు. ఘటనకు సంబంధించిన మొత్తం రికార్డులను ఎన్ఐఏ అధికారి సహకారంతో ఒక స్వతంత్ర వ్యక్తి సేకరించి భద్రపరిచేలా ఆదేశించాలన్నారు. ఇది ఒక ప్రత్యేక ఘటనని, అంతర్జాతీయంగా సిగ్గుపడేలా చేసిందన్నారు. రోడ్డు దిగ్భంధంపై స్థానిక పోలీసులు ముందుగా వార్నింగ్ వాహనంలోని వారికి సమాచారమివ్వలేదన్నారు. ఫ్లైఓవర్‌కు రెండో వైపు నిరసనకారులు చేరి ఉంటే పరిస్థితి విషమించేదన్నారు. ఇది సీరియస్ సంఘటనని తాము కూడా అంగీకరిస్తున్నట్లు పంజాబ్ అడ్వకేట్ జనరల్ పట్వాలియా తెలిపారు. పిటిషన్‌లోని అంశాలపై భేదాభిప్రాయమున్నా, ఘటనను తేలిగ్గా తీసుకోవడం లేదన్నారు. దీనితో ఎవరైనా అధికారులకు సంబంధం ఉంటే వారు విచారణ ఎదుర్కోక తప్పదన్నారు. ఘటనపై ఎలాంటి విచారణకు కోర్టు ఆదేశించినా అభ్యంతరం లేదన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ అంతర్గతమైనదని, అందువల్ల దాని విచారణ కొనసాగించే అవకాశమివ్వమని కోర్టును తుషార్ కోరారు. అయితే కేంద్ర కమిటీలో సురేశ్ ఉండకూడదని రాష్ట్ర న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఫిరోజ్‌పూర్‌కు కేంద్ర బృందం ప్రధాని భద్రతా లోపంపై విచారణకు కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ శుక్రవారం ఫిరోజ్‌పూర్ ఫ్లై ఓవర్‌ను పరిశీలించింది. ఈ ఘటనపై కేంద్రానికి పంజాబ్ ప్రభుత్వం నివేదిక అందజేసింది. ఫిరోజ్‌పూర్ ఘటనలో గుర్తుతెలియని 150 మంది నిరసనకారులపై పంజాబ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, శుక్రవారం ప్రత్యక్షంగా హాజరవ్వాలని ప్రధాని పర్యటనతో సంబంధమున్న పలువురు అధికారులకు కేంద్ర బృందం ముందే సమన్లు జారీ చేసింది. ఈ విచారణకు పంజాబ్ డీజీపీ సిద్ధార్ధ్ చటోపాధ్యాయ హాజరవలేదు. ఆగని విమర్శల పర్వం ఫిరోజ్‌పూర్ ఘటనపై ఆయా పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పంజాబ్‌లో చన్నీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ డిమాండ్ చేశారు. ప్రధాని పర్యటనలో భద్రతాలోపాలు కల్పించడం ద్వారా కాంగ్రెస్ కుట్రపూరిత బుద్ధి బయటపడిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. ఘటనపై కాంగ్రెస్ అగ్రనా యకత్వం ఎందుకు మౌనం వహిస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. మరోవైపు మోదీ హాజరవ్వాల్సిన ర్యాలీకి అతి తక్కువ మంది హాజరైన విషయం తెలిస్తే పరువు పోతుందని పసిగట్టే బీజేపీ ఈ భద్రతాలోపం నాటకం ఆడుతోందని పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే ఈ సంఘటన జరిగిందని పంజాబ్ సీఎం చన్నీ ఆరోపించారు. ప్రధానిని ర్యాలీ వద్దకు చేరకుండా రైతులు అడ్డుకోకుండా ఉండాల్సిందని, అప్పుడు ఖాళీ కుర్చీలు చూసి ప్రధాని సంతోషపడేవారని, వాటిని ఉద్దేశించి ప్రసంగించేవారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎద్దేవాచేశారు. గతంలో తన సభకు కేవలం 25 మంది వచ్చినా తాను వెళ్లి, వారితో మాట్లాడాకే వెనుతిరిగానన్నారు. ఉల్లంఘనకు మరో నిదర్శనం.. బుధవారం ప్రధాని కాన్వాయ్ పంజా బ్లోని ఫ్లైఓవర్‌పై నిలిచిపోయినప్పుడు చాలా దగ్గరగా కొందరు బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి మీడియా లో ప్రత్యక్షమైంది. వారు ‘బీజేపీ జిందాబాద్’ అని నినాదాలు చేస్తుండగా ప్రధాని కారును ఎస్పీజీ సిబ్బంది కవచంలాగా ఏర్పడి తరలించడం వీడియోలో కనిపించింది. బుధవారం ప్రధాని భద్రతా ఏర్పాట్ల ఉల్లం ఘనకు ఇది మరో ఉదాహరణ అని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రధాని కాన్వాయ్‌కు కొంత దూరంలో రైతులున్న వీడియో సైతం తాజాగా మీడియాలో షేర్ అవుతోంది. తమకన్నా బీజేపీ కార్యకర్తలే ప్రధాని కారుకు దగ్గరగా ఉన్నారని కొందరు రైతులు ఆరోపించారు. చదవండి: నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ -
వార్తల్లో అభిప్రాయాలను జొప్పించొద్దు: సీజేఐ
ముంబై: సొంత అభిప్రాయాలతో కూడిన వార్తలు ప్రమాదకరమైనవని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హెచ్చరించారు. ఆరోగ్యవంతమైన పజ్రాస్వామ్యానికి నిర్భయమైన, స్వతంత్య్రమైన పత్రికా వ్యవస్థ అవసరమని, అయితే వార్తలను ఊహలతో నింపడం వ్యవస్థకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. సొంత ఆలోచనలను వార్తాకథనాల్లోకి చొప్పించడం కూడదని, స్వీయ అభిప్రాయాలను నిజ నివేదికలకు దూరంగా ఉంచాలని జర్నలిస్టులకు సూచించారు. రెడ్ ఇంక్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అవార్డు పొందిన విజేతలను ఆయన అభినందించారు. స్వీయ భావాలు వార్తలను ప్రభావితం చేయకుండా పనిచేయాలని, ఒకరకంగా జర్నలిస్టులు సైతం న్యాయమూర్తులేనని ఆయన అన్నారు. నిజాలను మాత్రమే రిపోర్టు చేయాలని కోరారు. జడ్జిలను విలన్లుగా చూపడం వంటి విషయాలపై పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, జాతీయ ప్రయోజనాల కోసం అంతా కలిసిపనిచేయాలని కోరారు. 2020 జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు మరణానంతరం సిద్ధిఖీని ఎంపిక చేశారు. అఫ్గాన్‌లో రిపోర్టింగ్ చేస్తూ సిద్ధిఖీ తాలిబన్ కాల్పుల్లో మరణించారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు రమణ నివాళులర్పించారు. -
ప్రజల మనిషి నవలను చదివాను: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: ప్రతిఒక్కరూ పుస్తకం చదివి, ఇతరులతో చదివించడాన్ని ఒక ఉద్యమంలా ముం దుకు తీసుకెళ్లాలని భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రపంచగతిని సాహిత్యమే మార్చిందని, ఎంతోమంది మహానుభావులు ప్రపంచాన్ని అర్థం చేసుకొని రాసిన గ్రం థాలే సమాజాలను ముందుకు నడిపించేందుకు దోహదం చేశాయని అన్నారు. గాంధీజీ, నెహ్రూ వంటి జాతీయనేతలు రాసిన పుస్తకాలు జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. హైదరాబాద్ 34వ జాతీయ పుస్తక ప్రదర్శన ముగింపు సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జస్టిస్ రమణ మాట్లాడుతూ చదివేవాళ్లు కరువవుతున్నారని, పుస్త కం భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతున్న తరుణంలో వేలాదిమంది యువత పుస్తక ప్రదర్శనలో కనిపించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. పుస్తకం భవిష్యత్తు ప్రశ్నార్థం కాబోదని, అది సజీవంగానే ఉంటుందనే ఆశ చిగురించిందని చెప్పారు. తాను చదువుకొనే రోజుల్లో కోఠిలోని నవయుగ, విశాలాంధ్ర వంటి పుస్తకాల షాపుల్లోనే పుస్తకాలు లభించేవని పేర్కొన్నారు. డిజిటల్ రీడింగ్ ప్రమాదకరం ఇప్పుడు చదవాల్సిన అవసరం లేకుండా, చదివి వినిపించే డిజిటల్ రీడర్స్ అందుబాటులోకి వచ్చాయని, కానీ ఈ పద్ధతి ప్రమాదకరమని జస్టిస్ రమణ చెప్పారు. పుస్తకాలు, పత్రికలు చదివినప్పుడే మేధోవికాసం లభిస్తుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలు పుస్తకాలను చదివేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. తాను చిన్నప్పుడు రోజూ గ్రంథాలయానికి వెళ్లి మూడు, నాలుగు గంటలపాటు పత్రికలు, పుస్తకాలు చదివేవాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం స్కూళ్లలో గ్రంథాలయాలు, ఆటస్థలాలులేవని, వాటి ఏర్పాటుకు అందరూ కృషి చేయాలన్నారు.భావాల వ్యక్తీకరణకు లేఖలు రాయడానికి మించిన మార్గం లేదని చెప్పారు. నేనూ ఓ పుస్తకం రాస్తా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, తగి నన్ని నిధులు ఇవ్వాలని జస్టిస్ రమణ కోరారు. మహాకవి శ్రీశ్రీ 1930 నుంచే రచనలు చేసినప్పటికీ ఆయన మహాప్రస్థానం వెలువడిన తరు వాతే ఎంతోమంది చదివి చైతన్య వంతులయ్యా రని అన్నారు. పుస్తక ప్రచురణ సంస్థల కష్టాలు తనకు తెలుసునని, లా చదివే రోజుల్లో కొంతకాలంపాటు ‘నడుస్తున్న చరిత్ర’పత్రిక నిర్వహించి చాలా కష్టాలు పడ్డానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నో అద్భుతమైన పుస్తకాలు తెలుగులో వస్తున్నాయని, హైదరాబాద్ బుక్ ట్రస్టు ప్రచురించిన మేరీ టైలర్ జైలు జీవితం పుస్తకం చాలా బాగుందన్నారు. తాను చదువుకొనే రోజుల్లో అమ్మ నవలను ఎన్నోసార్లు చదివినట్లు చెప్పారు. పదవీ విరమణ అనంతరం పుస్తకాలు చదువుతానని, ఒక పుస్తకం కూడా రాస్తానని జస్టిస్ రమణ చెప్పారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకికి చెందిన ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం వ్యవస్థాపకుడు, దాశరథీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృ తిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, కోశాధికారి పి.రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగులోనే తీర్పులివ్వాలి మన తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టు తీర్పులను తెలుగు, హిందీ భాషల్లో వెలువరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సుప్రీంకోర్టు తీర్పులను ఇప్పటికే కొంతకాలంగా ప్రాంతీయ భాషల్లోకి అనువదించి వెబ్సైట్లో ఉంచుతున్నట్లు చెప్పారు. తాను గతంలో హైకోర్టులో పనిచేసిన సమయంలో తెలుగులోనే తీర్పులివ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో జూబ్లీహాలులో జడ్జిలకు సంవత్సరం పాటు శిక్షణ ఇప్పించామన్నారు. ఈ శిక్షణ పొంది తెలుగులోనే తీర్పులిచ్చిన వారిని అభినందించి, అవార్డులు కూడా అంద చేశామని ఆయన గుర్తుచేశారు. -
విద్వేష ప్రసంగాలపై సీజేఐకి 76 మంది లాయర్ల లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ, హరిద్వార్‌లలో ఇటీవల జరిగిన ధర్మసంసద్ల సందర్భంగా పలువురి విద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ ఎన్వీ రమణకు 75మంది న్యాయవాదులు లేఖ రాశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రసంగించిన వారు సమాజంలో విద్వేషాలను ప్రేరేపించడమే కాదు, ఒక మతానికి చెందిన వారందరినీ చంపేయాలని బహిరంగంగా పిలుపునిచ్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రసంగాలు దేశ సమగ్రత, ఐక్యతలకు గొడ్డలిపెట్టుగా మారడమే కాదు, లక్షలాది ముస్లిం పౌరుల జీవితాలను ప్రమాదంలో పడవేశాయన్నారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో సీనియర్ లాయర్లు సల్మాన్ ఖుర్షీద్, దుష్యంత్ దవే, మీనాక్షి అరోరా ఉన్నారు. -
మీ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చింది
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా నియమితులైన తరువాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన తనకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రజలిచ్చిన ఆతిథ్యం, చూపిన ప్రేమాభిమానాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతోషం వ్యక్తం చేశారు. ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, తేనీటి విందుకు హాజరైన ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పర్యటన సాఫీగా, సౌకర్యవంతంగా సాగేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రికి, మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, పాత్రికేయులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. సమయాభావం వల్ల ఎందరినో కలవలేకపోయానని, అందరినీ కలిసే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని జస్టిస్ రమణ తెలిపారు. తెలుగు ప్రజల ఆశీర్వాద బలమే తనను ఈ స్థాయికి చేర్చిందని, ఆ ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర పర్యటనను ముగించుకున్న నేపథ్యంలో జస్టిస్ రమణ సోమవారం ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘ఎప్పటి నుంచో నా స్వగ్రామం పొన్నవరానికి వెళ్లి రావాలనుకున్నాను. సుప్రీంకోర్టుకు శీతాకాలపు సెలవులు రావడంతో నా ఆలోచనలను అమల్లో పెట్టే అవకాశం దొరికింది. ఎంతో ఉత్సాహంగా స్వగ్రామానికి బయలుదేరాను. ఆంధ్రప్రదేశ్‌లో కాలుమోపిన నాటినుంచి ప్రజలు నన్ను అపారమైన ప్రేమాభిమానాలతో ముంచెత్తారు. దీనిని నేను, నా కుటుంబ సభ్యులు ఎన్నటికీ మరువజాలం. పొన్నవరం పొలిమేరల నుంచి ఊరేగింపుతో నన్ను తీసుకెళ్లిన వైనం ఎంతో కదలించింది. మా ఇద్దరి కుమార్తెలకు మరోసారి.. అల్లుళ్లు, చిన్నారి మనుమరాళ్లకు తొలిసారి నా ఊరిని చూపించగలగడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆప్తులు ఎంతోమంది కలుస్తుంటే భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ఎంతోమంది ఎన్నో రంగాలకు చెందిన వారు నన్ను పలకరించేందుకు వచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు. న్యాయవాద వృత్తిలో నడక నేర్పిన బెజవాడ బార్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగుల సంఘం, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అతితక్కువ కాలంలో అసాధారణ ఏర్పాట్లతో నన్నూ, నా సతీమణిని సత్కారాలతో ముంచెత్తారు. ఈ పర్యటనలో నా వెంట ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులపట్ల అభిమానం, గౌరవం శ్లాఘనీయం. ఏపీలో అడుగుపెట్టిన నాటినుంచి నా బాగోగులు చూసుకున్న ఏపీ ప్రోటోకాల్ సిబ్బందికి, పోలీసులకు, రాజ్‌భవన్ సిబ్బందికి, మొత్తం అధికార యంత్రాంగానికి నా కృతజ్ఞతలు. హైదరాబాద్‌లో బయల్దేరి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు, తిరిగి ఏపీ నుంచి హైదరాబాద్ చేరే వరకు సకల సదుపాయాలు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు కూడా నా కృతజ్ఞతలు’. సుప్రీంకోర్టు సీజేకి ఘన స్వాగతం కాగా, ఏపీలో పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్‌కు కుటుంబ సమేతంగా బయలుదేరిన సీజేఐ ఎన్వీ రమణ సూర్యాపేటలో జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. -
తెలుగు ప్రజల ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది: ఎన్వీరమణ
సాక్షి, కృష్ణాజిల్లా: తెలుగు ప్రజల ఆశీర్వాదమే తనను ఈ స్థాయికి చేర్చిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ అన్నారు. పొన్నవరం పర్యటనపై సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పర్యటనకు సహకరించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబ సభ్యులకు సొంత గ్రామం చూపించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆతిథ్యమిచ్చిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి సీఎం జగన్‌కి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగులు, రోటరీ క్లబ్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
స్వతంత్ర ప్రతిపత్తి గల ‘పీపీ’ వ్యవస్థ అవసరం
సాక్షి, అమరావతి: సామాన్యులకు పూర్తి న్యాయం అందాలన్నా, కోర్టుల్లో కేసులు పేరుకుపోకుండా ఉండాలన్నా స్వతంత్ర ప్రతిపత్తి గల పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. దిగువ కోర్టుల్లో స్థానిక భాషలోనే వాదనలు జరగాలని, అప్పుడే సామాన్యుడికి న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్లో జస్టిస్ రమణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జస్టిస్ రమణ మాట్లాడుతూ.. న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరిస్తే కేసులు త్వరితగతిన పరిష్కారం కావడంతోపాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందన్నారు. తన ప్రస్థానం బెజవాడ బార్ అసోసియేషన్ నుంచే మొదలైందని చెబుతూ.. జూనియర్ అడ్వకేట్‌గా ఇక్కడ ప్రాక్టీస్ చేసిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. గత ప్రభుత్వాలు న్యాయవ్యవస్థపై సరైన శ్రద్ధ చూపలేదని, పదకొండేళ్లుగా కోర్టుకు సొంత భవనం లేనప్పటికీ న్యాయవాదులు సహనంగా ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అడ్వకేట్లు కొంత సమయాన్ని ఉచిత న్యాయ సహాయం చేసేందుకు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రసంగించారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణతో పాటు ఆసోసియేషన్ సభ్యులూ పాల్గొన్నారు. ఇక తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన మణి మాస్టారును సీజేఐ సత్కరించారు. -
సమాజానికి మీరే మార్గదర్శకులు
సాక్షి, అమరావతి: న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులని, ప్రజా సమస్యల పరిష్కారానికి వారు కృషిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. న్యాయవాదులు తమ శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నన్నాళ్లు ఓ తెలుగువాడిగా న్యాయవ్యవస్థ కీర్తిని ఇనుమడింపజేస్తానని తెలిపారు. హైకోర్టులో కొత్త జడ్జీల నియామకాలు వీలైనంత త్వరలో పూర్తయ్యే అవకాశముందని చెప్పారు. ఖాళీల భర్తీ విషయంలో హైకోర్టు సీజేకు లేఖ రాశామని, పేర్లు పంపితే ఆమోదిస్తామన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగుల సంఘం సంయుక్తంగా ఆదివారం ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా హాజరయ్యారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె. జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి, ఇతర కార్యవర్గ ప్రతినిధులు, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, బార్ కౌన్సిల్ ఇతర సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ ప్రతినిధులు గజమాలలతో సన్మానించారు. శాలువాలు కప్పి జ్ఞాపికలు బహూకరించారు. ఇతర న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ , హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాలను కూడా శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు ఇచ్చారు. అనంతరం వివిధ జిల్లాల్లోని న్యాయవాద సంఘాలకు చెందిన న్యాయవాదులు జస్టిస్ రమణను సన్మానించేందుకు పెద్ద సంఖ్యలో వేదికపైకి రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మాస్కులు లేకుండా పైకి రావడం, ఒకరినొకరు తోసుకుంటూ వస్తుండటంతో జస్టిస్ రమణ ఒకింత అసహనం వ్యక్తంచేసి న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. నేనేమీ సినిమా హీరోను కాదు ‘ఈ పర్యటనలో నాపై మీరు చూపిన ఆదరణ, అభిమానం, ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞతలు. ప్రతీ ఒక్కరూ శాలువా కప్పాలని, దండ వేయాలని, ఫొటో తీసుకోవాలన్న తాపత్రయాన్ని పక్కన పెట్టండి. నేను ఇక్కడి వాడినే. నేనేమీ సినిమా హీరోను కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అయ్యాక కొందరు నా ప్రమాణ స్వీకారానికి ఢిల్లీకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, కోవిడ్ కారణంగా అది సాధ్యపడలేదు. మనం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటే మళ్లీ కోవిడ్ విజృంభించే ప్రమాదం ఉంది’.. అని న్యాయవాదులకు హితబోధ చేశారు. ఎక్కువసేపు జరిగితే వారూ పారిపోవచ్చు.. ‘మీరు నాపై ఎంత ప్రేమ కురిపిస్తున్నారో నాకు తెలుసు. గత మూడ్రోజులుగా వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. కొద్దిసేపట్లో గవర్నర్ వద్ద తేనీటి విందుకు వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది న్యాయమూర్తులు బిజీ షెడ్యూల్‌వల్ల అలిసిపోయారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ అలసిపోయి నావల్ల కాదంటూ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ సమావేశం ఎక్కువసేపు జరిగితే నా సహచర మిత్రులు జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ కూడా పారిపోయే పరిస్థితి ఉంటుంది’.. అని జస్టిస్ రమణ అన్నారు. ఇక అప్పటికే మ.3.30 గంటల సమయం కావడంతో కార్యక్రమానికి వచ్చిన వారు భోజనం చేయకపోవడంతో మిగిలిన న్యాయమూర్తులు ప్రసంగించే అవకాశం లేకుండాపోయింది. జస్టిస్ ఎన్వీ రమణ హైకోర్టు వద్దకు వస్తుండగా మార్గమధ్యంలో రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డ అమరావతి రైతులకు అభివాదం చేస్తూ హైకోర్టు ప్రాంగణం చేరుకున్నారు. కార్యక్రమానికి ముందు జస్టిస్ ఎన్వీ రమణ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రెండవ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు మీడియాను అనుమతించలేదు. -
సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ తేనీటి విందు
-
రాజ్‌భవన్‌లో సీజేఐ ఎన్వీ రమణకు తేనీటి విందు
-
సీజేఐకి గవర్నర్ తేనీటి విందు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతులను గవర్నర్ ప్రత్యేకప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్వాగతం పలికారు. రాజ్‌భవన్ వద్ద పోలీసులు ప్రధాన న్యాయమూర్తికి గౌరవ వందనం సమర్పించారు. అప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జస్టిస్ ఎన్వీ రమణకు ఎదురేగి స్వాగతం పలికి దర్బార్ హాల్లోకి తోడ్కొని వచ్చారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులతో తేనీటి విందులో సతీ సమేతంగా పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయిన సీజేఐ కాసేపు సమకాలీన అంశాలపై చర్చించారు. ఈ విందు సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతులను సత్కరించి జ్ఞాపికలు అందించారు. గవర్నర్‌తో సీజేఐ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా, సీఎం వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాలను కూడా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఉన్నతాధికారులు ప్రవీణ్‌ప్రకాశ్, ధనుంజయ్‌రెడ్డి, ముత్యాల రాజు, కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు -
న్యాయవాదులు సమాజానికి మార్గ దర్శకులు
-
రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకపాత్ర
సాక్షి, అమరావతి/పెనమలూరు:సవాళ్లను ఎదుర్కొంటూనే రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ లా కళాశాలలో ఆదివారం దివంగత జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక సభలో ‘భారత న్యాయవ్యవస్థ–భవిష్యత్తు సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. స్వాతంత్య్రం అనంతరం దేశం ఎన్నో సవాళ్లను, సంస్కరణలను చూసిందన్నారు. ఈ క్రమంలోనే పరిపాలన వ్యవస్థ నుంచి సరైన సహకారం లేకపోవడం కూడా న్యాయ వ్యవస్థకు ప్రధాన సమస్యగా మారిందన్నారు. సమాజంలో న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటారనే అపోహ ఉందన్నారు. న్యాయ వ్యవస్థతో కలిసి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు న్యాయమూర్తిని ఎంపిక చేస్తాయనే విషయాన్ని తెలిసిన వారు కూడా అసత్య ప్రచారంలో ఉండటం విచారకరమన్నారు. సీజేఐ ఏమన్నారంటే.. సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి.. ఇంటర్నెట్ ద్వారా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. హ్యాకింగ్, మనీలాండరింగ్, వర్చువల్ కరెన్సీ ద్వారా క్రైమ్ ఫండింగ్ చేస్తున్నారు. క్రిమినల్ చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రావాలి. న్యాయ వ్యవస్థలో సాంకేతిక నిపుణులకు భాగస్వామ్యం కల్పించాలి. న్యాయాధికారులు కూడా సాంకేతిక విజ్ఞానంపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకు సరైన భద్రత లభించడంలేదు. గృహ, వైద్య సదుపాయాలు కూడా దక్కడంలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.60 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండగా వీటిల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ కేసులే. అందరి సహకారం ఉంటేనే న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతకుముందు.. జస్టిస్ లావు వెంకటేశ్వర్లు చిత్రపటానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు సతీమణి నాగేంద్రమ్మకు పాదాభివందనం చేశారు. విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు అని విశ్వసించి ఆయన స్వగ్రామం పెదనందిపాడులో గ్రంథాలయ స్థాపనతో పాటు వాలీబాల్ క్రీడను వెంకటేశ్వర్లు ప్రోత్సహించారని జస్టిస్ రమణ చెప్పారు. ఆయన ఆదర్శాలే తనయుడు జస్టిస్ లావు నాగేశ్వరరావుకు స్ఫూర్తి అయ్యాయని కొనియాడారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ వీఎస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొన్నారు. ఇది దురదృష్టం.. న్యాయాధికారులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయి. తీర్పులు అనుకూలంగా రాకపోతే సామాజిక మాధ్యమాల ద్వారా జడ్జిలపై బురదజల్లుతున్నారు. కోర్టులు జోక్యం చేసుకుని ఉత్తర్వులు జారీచేస్తే తప్ప అధికారులు ఈ విషయంలో స్పందించకపోవడం దురదృష్టకరం. న్యాయవ్యవస్థ నిర్భయంగా పనిచేసే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా వ్యవహరించాలి. వారు కోర్టులకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. వారి ఎంపిక కోసం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. న్యాయ వ్యవస్థలోని ఖాళీలను భర్తీచేయడంలో కేంద్రం సత్వర చర్యలు చేపడుతోంది. మీడియా ట్రయల్స్ (వ్యాఖ్యలు, కథనాలు) కేసుల నిర్ణయానికి మార్గదర్శకం కావు. చట్టసభలు చట్టాలు చేసే ముందు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సమస్యలు ఉత్పన్నం కావు. మెజార్టీ ఉన్నంత మాత్రాన ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు చేయడం కుదరదు. తప్పనిసరిగా రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాల్సిందే. న్యాయస్థానాల ఆదేశాలను ప్రభుత్వాలు గౌరవించకపోవడం వ్యవస్థల్లో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. న్యాయ సమీక్ష పరిధిని పరిమితం చేయాలనుకోవడం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చదవండి: ఇది శుభపరిణామం: జస్టిస్ ఎన్వీ రమణ -
ఏపీలో మూడవరోజు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన
-
ఏపీలో మూడవ రోజు సీజేఐ ఎన్వీ రమణ పర్యటన
-
ఇది శుభపరిణామం: జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం సామాన్యుడు సైతం రాజ్యాంగం గురించి చర్చించే పరిస్థితి వచ్చిందని, ఇది ఎంతో శుభ పరిణామమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. రాజ్యాంగం గురించి, హక్కుల గురించి ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శనమన్నారు. రాజ్యాంగం కేవలం గ్రంథాలయాలకు, బహిరంగ సభల్లో ప్రసంగాలకు పరిమితం కాకూడదని, దానిపై చర్చోప చర్చలు జరిగినప్పుడే ప్రజలకు తమ హక్కుల గురించి పూర్తి స్థాయి అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. శనివారం విజయవాడ సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు జస్టిస్ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. జీవిత సాఫల్య పురస్కారం ద్వారా తాను సాధించాల్సింది, చేయాల్సింది ఇంకా చాలా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ఓ తెలుగువాడిగా శాయశక్తులా తన పరిధి మేరకు పని చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని చెప్పారు. తెలుగువాడి గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించకుండా తెలుగువాడి కీర్తిని ఎగురవేస్తానని, ఇది తాను ఇస్తున్న హామీ అని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కోర్టులో జరిగేది కక్షిదారుడికి అర్థం కావాలి ► రాజ్యాంగంపై ప్రజల్లో చర్చ మొదలైన నేపథ్యంలో వారికి వారి హక్కుల గురించి తెలియచేసి చైతన్య పరచాలి. ఇందులో రోటరీ క్లబ్ భాగస్వామ్యం కావాలి. ► దేశం ఎంత అభివృద్ధి సాధించినా.. నిరక్షరాస్యత, అనారోగ్యం, మౌలిక సదుపాయాల లేమి, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలు పీడిస్తున్నాయి. ఇవి పరిష్కారం కావాలంటే ప్రజల్లో చైతన్యం అవసరం. ఈ దిశగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ► న్యాయ పాలన అన్నది చాలా ముఖ్యం. అది లేకపోతే అరాచకం పెరిగిపోతుంది. ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. న్యాయ పాలన అమలు కోసం న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలి. న్యాయ పాలన గురించి ప్రజలకు తెలిసేలా మేధావి వర్గం పనిచేయాలి. ► కోర్టులు, పోలీసుల దగ్గరకు వెళ్లకూడదన్న నిశ్చిత అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. అయితే హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు కచ్చితంగా న్యాయ స్థానాలను ఆశ్రయించాలి. అలాంటి పరిస్థితిలో న్యాయ స్థానాలు తప్పక జోక్యం చేసుకుంటాయి. ఇందులో మరో మాటకు తావు లేదు. ► కోర్టులో జరిగేది ప్రతిదీ కక్షిదారునికి అర్థమైనప్పుడే న్యాయ వ్యవస్థపై విశ్వాసం రెట్టింపు అవుతుంది. కోర్టుల్లో మౌలిక వసతులు పెరగాలి. కోర్టు భవనాల నిర్మాణాలు జరగాలి. ఇందు కోసమే జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జ్యుడిషియల్ ఇన్ఫ్రా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సంస్కరణలు అవసరమే ► న్యాయ వ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయ వ్యవస్థ గురించి అట్టడుగు వర్గాల ప్రజలు కూడా తెలుసుకునేలా సరళీకరణ, భారతీయీకరణ జరగాలి. ► ఓ వ్యక్తి దాఖలు చేసిన కేసులో ఏం వాదనలు జరుగుతున్నాయి.. కోర్టు ఏమంటోంది.. ఏం తీర్పు చెప్పింది.. అన్న విషయాలు అతనికి స్వయంగా అర్థమైనప్పుడే న్యాయ వ్యవస్థ సరళీకరణ అయినట్లుగా భావించాలి. న్యాయ వ్యవస్థ అర్థం కాని బ్రహ్మ పదార్థంలా ఉండకూడదు. ► న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలు అర్థం కానప్పుడు ప్రజలు న్యాయ స్థానాలకు బదులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారు. ఇలా ప్రత్యామ్నాయాల వైపు వెళ్లడం బెజవాడ ప్రజలకు అలవాటు. ఆ దిశగా వెళ్లొద్దని కోరుతున్నా. పెండింగ్‌లో 4.60 కోట్ల కేసులు ► ప్రస్తుతం దేశంలో 4.60 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఈ కేసుల సంఖ్య పెద్దది కాదు. వాయిదాలు వేయకుండా సత్వర పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి. ఈ దిశగా ప్రభుత్వానికి సైతం పాత్ర ఉంది. ► ప్రతి ఒక్కరూ చట్ట పరిధికి లోబడి పనిచేస్తే కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉందదు. అన్ని వ్యవస్థలు తమ పరిధులకు లోబడి పని చేయాలి. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేలా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. ► న్యాయ వ్యవస్థలో మార్పు దిశగా చర్యలు చేపట్టాం. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. అవసరమైన చోట గట్టిగా మాట్లాడుతున్నా. తెలుగు శిథిలం కాకుండా చూడాలి ► తెలుగు భాష శిథిలం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మాతృభాషలో విద్య చాలా అవసరం. మాతృభాషలో ఆలోచనలు చేసినప్పుడే పనుల్లో విజయం సాధ్యమవుతుంది. ► మన విజయానికి మాతృభాషే పునాది. ఆ పునాదిని కూల్చేసే పరిస్థితి రాకూడదు. తెలుగు భాష గొప్పదనం, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ► అనంతరం నిర్వాహకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మలను సన్మానించారు. జీవిత సాఫల్యం పురస్కారంతో పాటు ఇచ్చే నగదు బహుమతిని సీజేఐ జస్టిస్ రమణ.. అనాథ బాలల ఆశ్రమాలకు వితరణ కింద అందజేశారు. ► ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు పట్టాభి రామయ్య, సుబ్బరామయ్య నాయుడు, ఎం.రామారావు, డాక్టర్ మోహన్ ప్రసాద్, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నివాసంలో ఏర్పాటు చేసిన విందులో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. విజయవాడ చైతన్యం చూపాలి ► విజయవాడ ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడి నుంచి ఎంతో మంది నేతలు జాతీయ స్థాయిలో కీర్తి గడించారు. విజయవాడతో నాకు ఎన్నో గొప్ప స్మృతులు ఉన్నాయి. న్యాయ విద్యను పూర్తి చేసి హైదరాబాద్‌కు వెళ్లాను. అతికష్టం మీద విజయవాడను వీడాల్సి వచ్చింది. ► అయినప్పటికీ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి శని, ఆదివారాలు ఇక్కడే గడిపే వాడిని. కళలు, సంస్కృతి, రచనలకు బెజవాడ ఎంతో పేరుగాంచింది. అయితే ఇప్పుడు నేను ఊహించిన విధంగా బెజవాడ లేదు. ఇందుకు నేను విచారిస్తున్నా. మరోసారి జూలు విదిల్చి చైతన్యం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. నా ఉన్నతికి కారణమైన ఈ ప్రాంతాన్ని ఎన్నటికీ మరువను. -
ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్లాలి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్ష
సాక్షి, అమరావతి/గుణదల (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని.. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆకాంక్షించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన తనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేనేటి విందుకు ఆహ్వానించటం సంతోషంగా ఉందని సీజేఐ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం ఏర్పాటు చేసిన ‘హై టీ’ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు తన తరఫున, తన కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 1965 తర్వాత ఏపీ నుంచి తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం ఇదే తొలిసారన్నారు. ఇది తెలుగు జాతికి అత్యంత గర్వకారణమని, సీఎంగా తనకు ఎంతో సంతోషదాయకమన్నారు. సీజేఐ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన హై టీ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ సతీమణి శివమాల, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తదితరులు సీజేఐకు సీఎం సాదర స్వాగతం అంతకుముందు.. జస్టిస్ ఎన్. వెంకట రమణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. సీజేఐ సతీమణి శివమాల, సీఎం సతీమణి వైఎస్ భారతి, ఇతర ప్రముఖుల్లో కొందరు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాంగణంలోకి జస్టిస్ ఎన్వీ రమణను సాదరంగా తోడ్కొని వచ్చిన సీఎం.. అక్కడ తన మంత్రివర్గ సహచరులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులను సీజేఐకు పరిచయం చేశారు. అలాగే జడ్జిలు, ఇతర న్యాయాధికారులను ఇరువురూ పలకరించారు. అనంతరం.. జస్టిస్ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. కార్యక్రమానికి హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు సీజే సతీష్‌చంద్ర శర్మ, రెండు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులను కూడా సీఎం సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కొడాలి నాని, కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ సతీమణి శివమాలకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న వైఎస్ భారతి జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన ప్రముఖులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణను శనివారం పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. కనకదుర్గ అమ్మవారి దర్శనానంతరం శనివారం ఉదయం వెంకటరమణ దంపతులు నోవోటెల్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జస్టిస్ వెంకటరమణ ఆప్యాయంగా పలకరించారు. న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, జుడీషియల్ సిబ్బందికి తగిన సలహాలు ఇచ్చారు. ముందుగా డిప్యూటి సీఎం నారాయణస్వామి ఎన్వీ రమణను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన వారిలో రహదారులు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ జె. నివాస్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సంగీత కళాకారులు అన్నవరపు రామస్వామి, పర్యావరణవేత్త ప్రొఫెసర్ అజయ్ కాట్రగడ్డ, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కావూరి సాంబశివరావు,అచ్చెన్నాయుడు ఉన్నారు. -
సీజేఐ ఎన్వీ రమణకు తేనీటి విందు
-
సీజేఐ ఎన్వీ రమణ దంపతులకు ఘన సత్కారం
-
సీజేఐ ఎన్వీ రమణ దంపతులకు ఘన సత్కారం
విజయవాడ: ఏపీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఘన సత్కారం లభించింది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలోనే జస్టిస్ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని రోటరీ క్లబ్ అందజేసింది. మరొకవైపు నగరంలోని సిద్ధార్ధ అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన పౌర సన్మానసభలో సీజేఐ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు జడ్జి జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీఎస్ హైకోర్టు సీజే సతీష్ చంద్రలు హాజరయ్యారు. చదవండి: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు -
ముగిసిన తేనీటి విందు
-
సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు
-
సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు
విజయవాడ: ఏపీ పర్యటనలో ఉన్న సీజేఐ ఎన్వీ రమణకు ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐకు ఇచ్చిన తేనీటీ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణకు సీఎం వైఎస్ జగన్ దంపతులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్ జస్టిస్‌లు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు. అంతకుముందు నోవాటెల్ హోటల్లో సీజేఐ ఎన్వీ రమణను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్ జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్.. నోవాటెల్ హోటల్లో సీజేఐని కలిసి తేనీటి విందుకు ఆహ్వానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సీజేఐ ఎన్వీ రమణను కలిసిన సీఎం జగన్ -
సీజేఐ ఎన్వీ రమణను కలిసిన సీఎం జగన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల వైఎస్సార్ జిల్లా పర్యటన ముగిసింది. పలు అభివృద్ధికార్యక్రమాల శంకుస్థాపన, పథకాల అమలు, ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం శనివారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు. ముందుగా నోవాటెల్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. -
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు
-
స్వగ్రామంలో సీజేఐ ఎన్వీ రమణ
-
తెలుగువాడినైనందుకు గర్వపడుతున్నా
నేను పుట్టిన ఈ పొన్నవరం గ్రామం ఎంతో చైతన్యవంతమైనది. ఇక్కడే ఐదో తరగతి వరకు చదువుకున్నాను. ఈ గ్రామం వల్లే నేను అన్ని విషయాల్లో చైతన్యవంతుడిగా ఉండేవాడిని. తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగువారంతా ఎప్పటికీ మరువకూడదు. – సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సాక్షి, అమరావతి/నందిగామ: ‘కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గం కన్నా మిన్న అంటారు.. దీనికి నేను మాతృభాషను కూడా జోడిస్తాను.. తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నాను’.. అని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. ‘పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు’ అన్న మహాత్ముని మాటలూ అక్షర సత్యమని, ఎంత అత్యున్నత స్థాయికి ఎదిగిన వారైనా పల్లె బిడ్డలే అని చెప్పారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి శుక్రవారం విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు అత్యంత ఇష్టమైన ఎడ్లబండిపై ఆయనను మేళతాళాల మధ్య ఊరేగించారు. పెద్దఎత్తున స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు జాతీయ జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పటికీ తన మూలాలు ఈ గ్రామంలోనే ఉన్నాయని.. ఢిల్లీకి రాజైనా.. తాను ఎప్పటికీ పల్లె బిడ్డనే అని అన్నారు. గ్రామస్తులే తనకు తల్లిదండ్రులని, గ్రామాన్ని వదలి ఎంతో కాలమైనా, అత్యున్నత స్థానంలో ఉండి తన స్వగ్రామానికి రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు రాజు, మార్కండేయులును ఆయన గుర్తుచేసుకున్నారు. ఇటువంటి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులవల్లే తాను దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కాగలిగానన్నారు. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మా ఊరు ఎంతో చైతన్యవంతమైంది గ్రామంతో తనకున్న అనుబంధాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గ్రామంలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నానని, చిన్నప్పుడు కూడా ఎప్పుడూ తాను ఎవ్వరితోనూ దెబ్బలు తినలేదని, తన పుట్టిన ఊరు ఎంతో చైతన్యవంతమైందని, ఈ గ్రామంవల్లే తాను అన్ని విషయాల్లో ఎంతో చైతన్యవంతుడిగా ఉండేవాడినన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి గ్రామంలో మూడు పార్టీలు మాత్రమే ఉండేవని, వీటివల్ల ఎప్పుడూ ఎటువంటి ఘర్షణ వాతావరణం నెలకొనలేదని, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుండటం తనకు సంతోషంగా ఉందన్నారు. వీరులపాడు మండలం కమ్యూనిస్టులకు కంచుకోట అని, తన తండ్రి కూడా కమ్యూనిస్టు మద్దతుదారుగా ఉండే వారన్నారు. తనకు రాజకీయాలపట్ల కూడా ఎంతో ఆసక్తి ఉండేదని, అప్పట్లో స్వతంత్ర పార్టీకి మద్దతిచ్చానని సీజేఐ గుర్తుచేసుకున్నారు. మెట్ట ప్రాంతం కావడంతో అప్పట్లో ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని.. కానీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఆ సమస్య కొంతమేర పరిష్కారమైందన్నారు. దేశమంతా అభివృద్ధి పథంలో సాగుతున్న రోజుల్లో సైతం రాజకీయంగా ఎంతో చైతన్యవంతంగా ఉన్న తన ప్రాంతం ఇప్పటికీ పెద్దగా అభివృద్ధి చెందకపోవడం తనను బాధించిందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలంతా ఐక్యంగా ఉండి వాటిని పరిష్కరించుకోవడానికి నడుం బిగించాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని మరువకూడదు తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగువారు ఎప్పటికీ మరువకూడదని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా, తెలుగు జాతి గొప్పదనాన్ని పలువురు చెబుతుండటం మనకు గర్వకారణమన్నారు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలను ఎల్లవేళలా కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ తెలుగు వారిది కావడం గర్వకారణమన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో మన తెలుగు వారే అనేక నిర్మాణ సంస్థలు స్థాపించారని.. ఉగ్రవాదులకు భయపడకుండా ఆఫ్గానిస్తాన్ పార్లమెంట్‌ను నిర్మించిన ఘనత మన తెలుగువారిదేనన్నారు. తెలుగు ప్రజల ప్రతిష్టకు ఏ మాత్రం భంగం కలగకుండా తాను ప్రవర్తిస్తానని కూడా హమీ ఇస్తున్నానని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. తెలుగు జాతికి గర్వకారణం : మంత్రి పెద్దిరెడ్డి సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారతదేశ అత్యున్న న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ తెలుగు జాతికే గర్వకారణమని కొనియాడారు. పట్టుదల, కృషి, అకుంఠిత దీక్షవల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని, ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే తత్వం సీజే సొంతమని, దానిని ప్రతిఒక్కరూ అలవరచుకోవాలన్నారు. ఒక తెలుగు వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం యావత్ తెలుగు వారు గర్వపడాల్సిన విషయమన్నారు. దేశానికే వన్నెతెచ్చే విధంగా ఆయన పనిచేస్తారని, ఇటువంటి ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ, న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్, సత్యనారాయణమూర్తి, మానవేంద్రరాయ్, బట్టు దేవానంద్, లలితకుమారి, కృషమోహన్, జయసూర్య, మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, వసంత కృష్ణప్రసాద్, భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ జె. నివాస్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (ఆ సినిమాలకు పెట్టిన ఖర్చెంత.. పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? -
కోర్టుల ఆధునీకరణతోనే సత్వర న్యాయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశంలో కోర్టుల ఆధునీకరణతోనే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా కేసులు పెండింగ్‌లో ఉండటానికి జడ్జీల కొరత ఒక్కటే కారణం కాదని.. సరైన మౌలికవసతులు లేకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు పనిచేయలేకపోతున్నారన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపించినా ఇప్పటివరకు స్పందన లేదన్నారు. ఆదివారం హనుమకొండలో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయంతోపాటు పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టును సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, ఎ.రాజశేఖర్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి, హనుమకొండ కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ పి.నవీన్‌రావు, వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నందికొండ నర్సింగ్‌రావు, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేపీ ఈశ్వర్నాథ్, ఉపాధ్యక్షుడు మహాత్మ, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు జయాకర్, జనార్దన్, సంజీవరావు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీజేఐ ప్రసంగించారు. ‘శిథిలావస్థకు చేరుకున్న కోర్టులను పునర్నిర్మించాలని సీజేఐ అయ్యాక అనుకున్నా. అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం తెప్పించాం. కోర్టుల్లో మౌలిక సౌకర్యాల ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై జూలైలో కేంద్రానికి ఇండియన్ జ్యుడీషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రతిపాదన పంపాం. దీనిపై న్యాయ శాఖ నుంచి ఇంకా స్పందన రాలేదు. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై కేంద్రం చట్టం తెస్తుందని ఆశిస్తున్నా’అని సీజేఐ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు... హనుమకొండలో కోర్టుల భవన సముదాయ నిర్మాణానికి కేంద్రం నిధులివ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ కోర్టును నిర్మించడం అభినందనీయమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఇది న్యాయ వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌరవమన్నారు. కాకతీయ రాజులు అందించిన ఘనమైన వారసత్వానికి దీటుగా హనుమకొండ నూతన కోర్టు భవనాలు రూపుదిద్దుకున్నాయని ప్రశంసించారు. హనుమకొండ మాదిరిగా దేశంలోని అన్ని కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఏ వేదికపై ప్రధానిని కలిసినా కోర్టుల్లో మౌలికసదుపాయాల కల్పన, మొబైల్ కోర్టుల సౌకర్యం, యువ న్యాయవాదులను ప్రోత్సహించేలా కృషి చేయాలని కోరతానని తెలిపారు. ఓరుగల్లుతో బంధం.. కవితలతో ప్రసంగం ‘తెలుగు వాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుడెందుకురా.. అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకు రా!’అంటూ కాళోజీ కవితతో సీజేఐ ఎన్వీ రమణ తన ప్రసంగాన్ని మొదలెట్టారు. ‘కవులు, స్వాతంత్య్ర పోరాటయోధులు, విప్లవకారులు తిరిగిన నేల ఓరుగల్లు. వరంగల్‌తో నాకు అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఇక్కడ ఆర్ఈసీలో కార్యక్రమాలకు హాజరయ్యా. నాకు ఇక్కడ బంధువులు, మిత్రులు ఉన్నారు. బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడు, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు లాంటి సరస్వతీ పుత్రులకు జన్మనిచ్చిన నేల ఇది. దేశానికి ప్రధానిని ప్రసాదిం చిన ప్రాంతం ఓరుగల్లు. నియంతృత్వ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు ఇది పుట్టినిల్లు’అంటూ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వరంగల్‌తో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ‘నా తెలంగాణ కోటి రత నాల వీణ అన్నారు దాశరథి. ఆయన గర్జన.. పరపీడన విముక్తికి, పోరాటాలకు ఊపిరినిచ్చింది. పోరుగల్లుకు.. ఓరుగల్లుకు.. వరంగల్లుకు వందనం’అని సీజేఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాతృభాష ప్రాధాన్యతను మరోసారి గురు ్తచేశారు. తల్లిదండ్రులంతా పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలని, మాతృభాషను గౌరవించాలన్నారు. ‘రామప్ప’ను చూసి మురిసిపోయా.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దివ్యక్షేత్రాన్ని సందర్శించి మురిసిపోయా. మనకున్న గొప్ప చారిత్రక సంపదను యునెస్కో గుర్తించింది. ఇది అందరూ గర్వించాల్సిన విషయం. వేయిస్తంభాల ఆలయం శిలా, కళా వైభవానికి ఖ్యాతి. ఈ ఆలయం చూసేందుకు రెండు కళ్లూ చాలవు’అని సీజేఐ వ్యాఖ్యానించారు. భద్రకాళి ఆలయంలో పూజలు... వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం బహూకరించిన బంగారు కిరీటంతోపాటు జటమకుటాలను అర్చకులు అమ్మవారికి అలంకరించారు. అనంతరం వేయిస్తంభాల గుడిని రమణ దంపతులు దర్శించుకున్నారు. -
సమాన న్యాయంతోనే సార్థకత
సాక్షి, మేడ్చల్ జిల్లా/శామీర్‌పేట్: న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. హక్కులు, న్యాయం కోసం పోరాడేందుకు యువత ముందుకు రావాలని, యువత తమ శక్తిని పూర్తిగా వినియోగించుకున్నపుడే మెరుగైన భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పారు. ఆదివారం శామీర్‌పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయ విద్యార్థులు క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని, భాష ఏదైనా సమాచార సేకరణ సమర్థవంతగా ఉండాలన్నారు. న్యాయ విద్యా ర్థులు ఉన్నతస్థాయికి వెళ్లేందుకు ముందుగా విచారణ అనుభవాన్ని పొందాలని సూచించారు. విశ్వవిద్యాలయాల కంటే ప్రజలతో ప్రత్యక్షంగా నేర్చుకున్న పాఠాలే మేధోసంపత్తి ఎదుగుదలకు దోహదపడతాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అంతకుముందు వర్సిటీలో విద్యార్థుల హాస్టళ్ల భవనాలతోపాటు డైనింగ్ హాలును హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, నల్సార్ చాన్స్‌లర్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. గోల్డ్ మెడల్స్ అందజేత 2020, 2021 సంవత్సరాల్లో గోల్డ్‌మెడల్స్ సాధించిన 104 మంది విద్యార్థులకు జస్టిస్ రమణ గోల్డ్ మెడల్స్ అందజేశారు. అలాగే వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి పట్టాలను అందజేసి అభినందించారు. అనంతరం నల్సార్ వర్సిటీ రూపొందించిన పలు రివ్యూ డాక్యుమెంటరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రీ, జస్టిస్ పి.వెంకటరమణా రెడ్డి, కార్మిక మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పూజలు చేసి..ప్రతి శిల్పమూ చూసి..
వెంకటాపురం(ఎం): రామప్ప కళాసంపదకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఫిదా అయ్యారు. ఆలయంలో శిల్పాల సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని శనివారం సాయంత్రం ఆయన కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు పూర్ణకుంభంతో భారత ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి జస్టిస్ రమణ దంపతులతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టూరిజం గైడ్ విజయ్‌కుమార్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావులు ఆలయ చరిత్ర, శిల్పాకళా విశిష్టతను వివరించారు. గర్భగుడి ముందు ఉన్న సప్తస్వరాలు పలికే పొన్నచెట్టు శిల్పాన్ని సుప్రీం చీఫ్ జస్టిస్ స్వయంగా మీటారు. ఒకే శిల్పంలో వివిధ చోట్ల వేర్వేరు శబ్దాలు వస్తాయని గైడ్ వివరించారు. రామప్ప ఆలయాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారని, అదే తరహాలో ప్రస్తుతం అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తున్నారని ప్రొఫెసర్ పాండురంగారావు వెల్లడించారు. ఆలయంలో గంటా ఇరవై నిమిషాల పాటు సాగిన పర్యటనలో ప్రతి శిల్పం గురించి జస్టిస్ ఎన్వీ రమణ అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 6.30 గంటల తరువాత ఆయన హనుమకొండకు బయలుదేరారు. ఆయన వెంట ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన జడ్జి నరసింగరావు, అదనపు జడ్జి అనిల్‌కుమార్, ములుగు సివిల్ జడ్జి రాంచందర్‌రావు, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ మహేశ్‌నాథ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు ఉన్నారు. రాత్రి వరంగల్‌లోని నిట్‌లో సీజేఐ రమణ బస చేశారు. ఆదివారం ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన భవన సముదాయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. -
రాజీకి రాచబాట
సాక్షి, హైదరాబాద్: రాజీ, మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపారుల మధ్య వివాదాలను పరిష్కరించడంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) కీలకపాత్ర పోషిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. దేశంలో ఆర్బిట్రేషన్, మీడియేషన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని వీకే టవర్స్‌లో ఏర్పాటు చేసిన దేశ తొలి ఐఏఎంసీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో కలసి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్‌ను ఏఐఎంసీ ప్రోత్సహిస్తుందని, తక్కువ ఖర్చు, స్వల్ప సమయంలో వివాదాల పరిష్కారానికి ఐఏఎంసీ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు సూచించగా ఆరు నెలల్లోనే ఈ కేంద్రం ప్రారంభానికి అడుగులు పడ్డాయన్నారు. ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, అన్ని రకాలుగా ఈ ప్రదేశం అనువైన వేదికన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో స్వల్ప వ్యవధిలోనే వసతి కల్పించిందని, శాశ్వత భవన నిర్మాణం కోసం భూమిని కూడా కేటాయించిందని సీజేఐ ప్రశంసించారు. దేశ, విదేశాలకు చెందిన అనేక వివాదాలు ఈ కేంద్రానికి రానున్నాయని తెలిపారు. ప్రారంభానికి ముందే పెద్ద కేసు: సీఎం కేసీఆర్ ఐఏఎంసీ ప్రారంభానికి ముందే లలిత్ మోదీ కుటుంబ వివాదానికి సంబంధించిన పెద్ద కేసు పరిష్కారం కోసం ఈ సంస్థకు వచ్చిందని, ఈ కేంద్రం విజయవంతం అవుతుందనడానికి ఇదే శుభసూచకమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయంగా పురోగమిస్తోందని, అన్ని రంగాలకు చిరునామాగా మారనుందన్నారు. కోర్టుల్లో పరిష్కారానికి నోచుకోని కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఐఏఎంసీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని, రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగే ఒప్పందాల్లో వివాదాల పరిష్కారానికి ఈ కేంద్రాన్ని ఆశ్రయించేలా చట్టానికి సవరణలు తెస్తామని కేసీఆర్ తెలిపారు. ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన భారత న్యాయ శిఖరం జస్టిస్ రమణకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఐఏఎంసీ వెబ్‌సైట్‌ను కేసీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జస్టిస్ హిమాకోహ్లి, పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, న్యాయమూర్తులు, మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ నాగార్జున, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) శనివారం ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ఐఏఎంసీ ప్రారంభించడం ఆనందంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజీ-మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తక్కువ కాలంలో మంచి వసతులతో ఐఏఎంసీ ఏర్పాటైందని.. ఐఏఎంసీ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్‌కు ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు! అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్: సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్ పురోగమిస్తోందని.. అనేక రంగాల్లో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతోందన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన పాత్ర పోషించారన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. -
హెచ్‌సీఏ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తాం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కార్యకలాపాల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం మాజీ క్రీడాకారులు, న్యాయమూర్తుల పేర్లు ప్రతిపాదించాలని పిటిషనర్లకు సూచించింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్ జస్టిస్ దీపక్‌వర్మ నియామకంపై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హెచ్‌సీఏ , బడ్డింగ్‌స్టార్ క్రికెట్ క్లబ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. -
మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం
సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వంతో వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, చిట్టచివరి ప్రత్యామ్నాయంగానే న్యాయస్థానాలను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను ఈ నెల 18న హైదరాబాద్‌లో ప్రారంభించనున్న సందర్భంగా శనివారం నగరంలోని హెచ్ఐసీసీలో భాగస్వామ్యపక్షాలతో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సదస్సుకు జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నంబర్ వన్ నగరం హైదరాబాద్... భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నా ఇక్కడ వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని సీజేఐ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయ ఆర్టిట్రేషన్ అండ్ మీడియేషన్ కేంద్రాలు పారిస్, సింగపూర్, లండన్, హాంకాంగ్‌లలో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అనేక కారణాలున్నాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నంబర్ వన్‌గా ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే, రోడ్డు రవాణా మార్గాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని ఈ ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరా. ఆరు నెలల వ్యవధిలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెంటర్ ఏర్పాటుకు కేసీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించింది. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి (అప్పటి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ హిమాకోహ్లి, కేంద్రం శాశ్వత భవన నిర్మాణం కోసం భూమి కేటాయించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల రూపకర్త పీవీ ‘‘ఈ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఆర్థిక సంస్కరణల ఫలితంగా చట్టాల్లోనూ అనేక మార్పులు వచ్చాయి. తీర్పులు చెప్పడానికి కోర్టులే అవసరం లేదు. లా పట్టాలు తీసుకొని న్యాయం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు కూడా న్యాయం చేయొచ్చు. తప్పొప్పులు తెలుసుకొని ఎవరైనా తీర్పు చెప్పొచ్చు. సామాన్యులకు సైతం ఆర్బిట్రేషన్ కేంద్రాలతో న్యాయం జరగాలి. సమస్యను అర్థం చేసుకొనే శక్తి ఉన్నవాళ్లు, విశ్వసనీయత ఉన్నవాళ్లు తీర్పులు చెప్పొచ్చు. గరికపాటి లాంటి అవధానులు, గుర్తింపు పొందిన వక్తలు ఆర్బిట్రేషన్ కేంద్రం ప్యానల్లో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నా. అలాగే పెద్దలు, విజ్ఞులు పాల్గొని అనేక సమస్యలు పరిష్కారం చేయొచ్చు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ పీఎస్ నరసింహ, తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఇరురాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రచ్చబండలాంటిదే: సీఎం కేసీఆర్ దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో మధ్యవర్తిత్వం ఎప్పటి నుంచో ఉంది. వివిధ కారణాల వల్ల పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయి. ఆలస్యమైనా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావడం సంతోషం. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతం. ఈ కేంద్రంలో వ్యాపారుల మధ్య వివాదాలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఏఐఎంసీ కోసం తాత్కాలికంగా 25 వేల చదరపు అడుగులు కేటాయించాం. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయించాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉత్తమ ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చాం: మంత్రి కేటీఆర్ ‘‘ప్రపంచంలోనే ఉత్తమ పారిశ్రామిక పాలసీని రాష్ట్రంలో తీసుకొచ్చాం. దీని ద్వారా 15 రోజుల్లోనే ఏకగవాక్ష పద్ధతిలో అనుమతులు లభిస్తాయి. పరిశ్రమలకు ఆ గడువులోగా అనుమతులు రాకపోతే అనుమతి వచ్చినట్లు భావించవచ్చు. అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తే ఐఏఎస్ అధికారులకూ జరిమానా విధించేలా మార్గదర్శకాలను రూపొందించాం. ఈ విధానం ద్వారా 17,500 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. తద్వారా రూ. 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరికింది. పరోక్షంగా అంతకు రెండింతల మందికి ఉపాధి లభించింది. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు ద్వారా మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వివాదాల పరిష్కారానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిపుణులను ఏర్పాటు చేస్తుంది’’ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. చరిత్రాత్మక ఘట్టం: ఒవైసీ ‘హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు ఓ చరిత్రాత్మక ఘట్టం. దేశంలోని కోర్టుల్లో పెద్ద ఎత్తున పెండింగ్ కేసుల్లా కాకుండా మధ్యవర్తిత్వం, మీడియేషన్లో అంతర్జాతీయ రాజధానిగా హైదరాబాద్ గుర్తింపు పొందుతుందని ఆశిస్తున్నా’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
తెలుగు ఔన్నత్యాన్ని అందరూ కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష సంస్కృతీ ఔన్నత్యాలను తెలుగువారంతా కాపాడుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలుగు భాషా సంస్కృతులను దిగజార్చేలా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తూంటే తెలుగువాడిగా ఎంతో ఆవేదనకు గురవుతున్నట్లు చెప్పారు. అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకలకు జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వాలు మద్దతు ఇవ్వట్లేదు... ఘంటసాల వంటి మహానుభావులు తెలుగుభాషా సంస్కృతులను ఉన్నత శిఖరాలకు చేర్చారని, తెలుగు భాష ప్రతిష్టను పెంచారని జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. కానీ ప్రస్తుత పరిణామాలు బాధ కలిగిస్తున్నాయన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని దిగజార్చుకోవడం సరికాదన్నారు. జీవన పోరాటంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పరభాషలు నేర్చుకోవడం తప్పనిసరిగా మారినప్పటికీ అందుకోసం మన భాషను తక్కువ చేయొద్దని హితవు పలికారు. ప్రభుత్వాలు సైతం తెలుగు భాషాభివృద్ధికి మద్దతు ఇవ్వడం లేదని, ఆంగ్లం నేర్చుకొంటేనే భవిష్యత్తు బాగుంటుందనే అపోహను సృష్టిస్తున్నాయన్నారు. ఈ ధోరణి ఏమాత్రం సరైంది కాదన్నారు. ఇప్పటి నటులకు తెలుగు సరిగ్గా రావట్లేదు.. ఒకప్పుడు సినిమాలు చూసి తెలుగు ఉచ్ఛారణను నేర్చుకున్నామని, తెలుగు భాషకు సినిమాలు పట్టం కట్టాయని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పటి తెలుగు సినీనటులు, గాయనీగాయకులకు తెలుగు సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా బాధ్యతగా తెలుగు నేర్చుకోవాలని సూచించారు. సినీరంగమే తెలుగు వైభవాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని కోరారు. సామాజిక స్పృహగల సినిమాలు మాత్రమే చర్చనీయాంశమవుతాయని, అలాంటి మంచి సినిమాలు తీయాలంటే భాష, సాహిత్య, సంస్కృతులపై ఎంతో పట్టు ఉండాలన్నారు. గానకోకిలకు ఘన సన్మానం... ఈ సందర్భంగా గానకోకిల పి.సుశీలను ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారంతో జస్టిస్ ఎన్వీ రమణ ఘనంగా సత్కరించారు. ఆమెకు రూ. లక్ష నగదు, నూతన వస్త్రాలు, శాలువాను ప్రదానం చేశారు. ఘంటసాలతో కలసి వేలాది పాటలు పాడిన తాను ఆయన శతజయంతి సందర్భంగా పురస్కారాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సుశీల చెప్పారు. ఈ సందర్భంగా ఆహూతుల కోరిక మేరకు ఆమె కొన్ని పాటలు పాడి అలరించారు. ఏపీలోనూ నిర్వహిస్తాం... ఘంటసాల శతజయంతి ఉత్సవాలకు ఏడాదిపాటు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఏపీలోనూ ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చోడవరం ఎమ్మెల్యే ధర్మేంద్ర తెలిపారు. కార్యక్రమానికి ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ వేడుకలో సీనియర్ నటి కృష్ణవేణితోపాటు నటులు మురళీమోహన్, ఆర్. నారాయణమూర్తి, మంజుభార్గవి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వివేకానంద ఆసుపత్రి ఎండీ డాక్టర్ వి. గీత, సంగమం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సంజయ్ కిషోర్, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేడుకల ప్రారంభంలో జయశ్రీ, శశికళల సారథ్యంలో 100 మంది చిన్నారులు ఘంటసాల పాటలు ఆలపించి ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు. -
కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలి: సీజేఐ
సాక్షి, హైదరాబాద్: ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లో వివాదాలకు పరిష్కారం లభిస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హెచ్ఐసీసీలో మీడియేషన్, ఆర్బిట్రేషన్‌పై జరిగిన సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల పరిశ్రమల్లో వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. వివాదాల పరిష్కరానికి మధ్యవర్తిత్వాలు ముఖ్యమన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్‌కు హైదరాబాద్ అనుకూలమని తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారం సత్వరమే జరగాలన్నారు. కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలన్నారు. ఏళ్ల తరబడి కోర్టు కేసుల ద్వారా సమయం వృధా అవుతోందన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీజేఐ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: Omicron: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు ‘లార్డ్ కృష్ణ కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం చేశాడు. ఎవరికైనా వ్యక్తి గత జీవితంలో సమస్యలు వస్తే వారిని మనం దూరంగా పెడుతాం. ప్రతిరోజు సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడు. బిజినెస్‌లో సమస్యలు వస్తే కోర్టులకు వస్తారు. 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలి. అంతర్జాతీయ పరిస్,సింగపూర్, లండన్, హంకాంగ్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడం చాలా సంతోషం. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీలు సహకారం కూడా ఎంతో అవసరం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నంబర్‌వన్‌గా ఉంది. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేనని’’ సీజేఐ అన్నారు. త్వరలో శాశ్వత భవనం: సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) ఏర్పాటు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రస్తుతం 25 వేల చదరపు అడుగుల స్థలం కేటాయించామని, శాశ్వత భవనం కోసం త్వరలో పుప్పాలగూడలో భూమి కేటాయిస్తామని సీఎం తెలిపారు. -
కాలుష్యంపై ఏం చేస్తారో చెప్పండి?: సుప్రీం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)–ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతోందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిష్క్రియాపరత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని అరికట్టడానికి ఏం చేస్తారో చెప్పాలని పేర్కొంది. 24 గంటల్లోగా పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమైతే తామే అసాధారణ చర్యలకు పూనుకుంటామని తేల్చిచెప్పింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో గాలి నాణ్యతను పెంచాలని, పరిసర రాష్ట్రాల రైతులకు పంట వ్యర్థాలను నిర్మూలించే యంత్రాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పర్యావరణవేత్త ఆదిత్య దూబే, న్యాయ విద్యార్థి అమన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కాలుష్యం స్థాయిలు పడిపోయేలా కఠిన చర్యలు చేపడతారని తాము ఆశిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమం ‘రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్’పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలు ష్యంపై ప్రచారం పేరిట బ్యానర్లు చేతికి ఇచ్చి చిన్నపిల్లలను రోడ్లపై నిలబెడుతున్నారని, వారి ఆరో గ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. ఢిల్లీలో నేటినుంచి స్కూళ్లు మూసివేత దేశ రాజధానిలో అన్ని పాఠశాలలను శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. బోర్డు పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని వెల్లడించింది. ఢిల్లీ పాఠశాలల్లో భౌతికంగా తరగతులు నిర్వహిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహించిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ప్రతిస్పందించింది. -
నిషేధం ఉన్నా పనులు సాగుతున్నాయా ?
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కట్టడాల నిర్మాణం, కూల్చివేతలపై నిషేధం అమల్లో ఉన్నా సరే మోదీ సర్కార్ సెంట్రల్ విస్టా పనులను నిరాటంకంగా కొనసాగిస్తోందని సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లో న్యాయవాది వికాస్ సింగ్ ఆరోపించారు. దీంతో సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ నిషేధం ఉన్నా సరే ప్రభుత్వం సెంట్రల్ విస్టా పనులను కొనసాగిస్తోందా? అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు సూటిగా ప్రశ్నించింది. ‘ ఈరోజు ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ దారుణంగా 419కు పెరిగిపోయింది. ఇక్కడ కాలుష్యం రోజురోజుకూ ఎక్కువవుతోంది. కాలుష్య నియంత్రణపై రాష్ట్రాలకు ఆదేశాలిచ్చామంటారు. కాగితాలపై అంతా బాగానే ఉంటుంది. వాస్తవానికొచ్చేసరికి మార్పు శూన్యం’ అని సీజే జస్టిస్ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉన్నా రోజూ కాలుష్యం పెరుగుతుండటంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించారు. -
విచక్షణతో వ్యాఖ్యలు చెయ్యాలి
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో జడ్జీలు వ్యాఖ్యలు చేసేటప్పుడు విచక్షణతో చేయాలని రాష్ట్రపతి కోవింద్ హితవు పలికారు. జడ్జీలు తమ వ్యాఖ్యలకి తప్పుడు భాష్యాలు కల్పించే అవకాశం ఇవ్వకూడదన్నారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ విక్షచణారహితంగా వ్యాఖ్యలు చేస్తే వాటిని సరిగా అర్థం చేసుకోలేరని అన్నారు. అంతిమంగా న్యాయవ్యవస్థ సక్రమంగా నడవదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగదినోత్సవాల ముగింపు సమావేశంలో శనివారం కోవింద్ మాట్లాడారు. భారతీయ సంప్రదాయంలో న్యాయమూర్తులకు ఒక హోదా ఉందని, స్థితప్రజ్ఞతకు, నైతికతకు మారుపేరుగా వారు ఉంటారని కొనియాడారు. ‘మన దేశంలో తీర్పులిచ్చిన సమయంలో ఎంతో వివేకాన్ని ప్రదర్శిస్తూ వ్యాఖ్యలు చేసే న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. వారు చేసే వ్యాఖ్యలు భవిష్యత్ తరాలకు బాటలు వేసేలా ఉన్నాయి. అత్యున్నత ప్రమాణాలకే న్యాయవ్యవస్థ కట్టుబడి ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యానికి న్యాయం మూలాధారం లాంటిది. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు సామరస్యపూర్వక ధోరణిలో కలిసి ముందుకు సాగినపుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. రాజ్యాంగంలో ప్రతి వ్యవస్థకూ దాని పరిధిని నిర్దేశించారు. దానికి లోబడే ఈ వ్యవస్థలు పనిచేస్తాయి’ అని కోవింద్ అన్నారు. ఆ చట్టాలతో న్యాయవ్యవస్థపై భారం: సీజేఐ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ శాసనవ్యవస్థ తాను చేసే చట్టాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అంచనా వేయకుండా, అధ్యయనాలు నిర్వహించకుండా వాటిని ఆమోదించడం వల్ల ఒక్కోసారి అతి పెద్ద సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. దాని వల్ల కేసుల సంఖ్య పెరిగిపోయి న్యాయవ్యవస్థపై పెనుభారం పడుతోందన్నారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల్ని పెంచనంతవరకు పెండింగ్ కేసులు తగ్గుముఖం పట్టవని అన్నారు. పార్లమెంటు లేదంటే రాష్ట్రాల అసెంబ్లీలు చేసిన చట్టాలను, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను అమలు చేయడం కష్టసాధ్యమనే పరిస్థితులు ఎప్పటికీ ఏర్పడకూడదని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. -
ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలకమైన చర్యలు చేపట్టబోతున్నట్లు బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. నగరంలోకి నిత్యావసర సరుకు రవాణాల వాహనాలు తప్ప ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు తెలిపింది. విద్యా సంస్థలను మూసివేయడంతోపాటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 థర్మల్ పవర్ ప్లాంట్లలో కేవలం ఐదు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతిస్తామని, మిగిలినవి ఈ నెలాఖరు వరకూ మూసివేయనున్నట్లు పేర్కొంది. ఎన్టీపీసీ ఝాజ్జర్, మహాత్మాగాంధీ టీపీఎస్, సీఎల్పీ ఝాజ్జర్, పానిపట్ టీపీఎస్, హెచ్పీజీఎల్సీ, నభాపవర్ లిమిటెడ్ టీపీఎస్ రాజ్‌పురా, తల్వాండి సాబో టీపీఎస్ మాన్సాలను అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒక అఫిడవిట్‌ను సమర్పించారు. ఈ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించడానికి వీలుగా పరిసర రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తొలగించడానికి రైతులకు ఉచితంగా యంత్రాలను అందజేయాలని కోరుతూ పర్యావరణ కార్యకర్త ఆదిత్య దూబే, న్యాయ విద్యార్థి అమన్ బాంకా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ‘గాలి నాణ్యత నిర్వహణ కమిషన్’ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ఢిల్లీతోపాటు పరిసర రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు నవంబర్ 15న ఇచ్చిన ఆదేశాల ప్రకారం నవంబర్ 16న గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ అత్యవసర సమావేశం ఏర్పాట చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. నిర్వహణ కమిషన్ నిర్ణయాలు/ఆదేశాలు ► ఢిల్లీ, పరిసర రాష్ట్రాలు గ్యాస్‌తో అనుసంధానమైన పరిశ్రమలను గ్యాస్‌తోనే నడిపేలా చూడాలి. అనుమతి లేని ఇంధనాలతో నడిచే పరిశ్రమలను వెంటనే మూసివేయాలి. ► నిత్యావసర సరకులను తరలించే ట్రక్కులు మినహా మిగతా ట్రక్కులకు ఈ నెల 21 వరకు ఢిల్లీలోకి ప్రవేశం నిషేధించాలి. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు రహదారులపై తిరగకుండా చూడాలి. ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని సీఎన్జీ బస్సులను అందుబాటులో తీసుకురావాలి. ► నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేయాలి, స్మాగ్ టవర్లు ఉపయోగించాలి. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో (హాట్స్పాట్లు) రోజుకి కనీసం మూడుసార్లు స్ప్రింకర్లు, డస్ట్ సప్రెసెంట్లు ఉపయోగించాలి. ► అత్యసవర సేవలకు మినహా డీజిల్ జనరేటర్లు వినియోగాన్ని కచ్చితంగా నిషేధించాలి. ► దేశ రాజధాని ప్రాంత రాష్ట్రాలు నవంబరు 21 వరకూ కనీసం 50 శాతం ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలి. ప్రైవేట్ సంస్థలను ఆ దిశగా ప్రోత్సహించాలి. ► తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను మూసివేయాలి. ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలి. నిర్ణయాలన్నీ కోర్టులే తీసుకోవాలా?: సుప్రీం ఢిల్లీలో కాలుష్యానికి కారణం పంట వ్యర్థాల దహనమేనని అనడం సమంజసం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కొందరు వ్యక్తులు స్టార్ హోటళ్లలో కూర్చొని, నాలుగైదు శాతం కాలుష్యానికి కారణమయ్యే రైతులపై నిందలు వేస్తున్నారని ఆక్షేపించింది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ‘వారం రోజులపాటు పంట వ్యర్థాలు దహనం చేయొద్దని రైతుల్ని కోరాలని ఇప్పటికే కేంద్రానికి సూచించాం. టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో ఎవరి అజెండా ప్రకారం వారు మాట్లాడుతున్నారు. ఇదే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తోంది’ అని కోర్టు పేర్కొంది. నిర్మాణాలు, పరిశ్రమల కార్యకలాపాలు ఏడాది పొడవునా సాగుతూనే ఉంటాయని, వాటిపై చర్యలు తీసుకోకుండా పంట వ్యర్థాల దహనం గురించే ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీసింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఒక రకమైన ఉదాసీనత పెరిగిందని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు కోరుకోవడం లేదని తప్పుపట్టారు. అన్ని నిర్ణయాలు కోర్టులే తీసుకోవాలని వారు ఆశిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిష్క్రియాపరత్వం ఎందుకని ప్రశ్నించారు. పిటిషనర్ తరపున అడ్వొకేట్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. వాయు కాలుష్యంపై అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారే గానీ ఏదీ జరగడం లేదని తెలిపారు. పంట వ్యర్థాల దహనాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని కోరారు. పంట వ్యర్థాల దహనం 36 శాతం కాలుష్యానికి కారణమవుతున్నట్లు ‘సఫర్’ అధ్యయనం చెబుతోందని ఢిల్లీ ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ పేర్కొన్నారు. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ సూచనలను పాటించాలని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏడాదికి రూ.లక్ష కోట్ల నష్టం కరోనా ధాటికి ఢిల్లీ విలవిలలాడిపోయింది. కోవిడ్‌తో గత 18 నెలల్లో 25 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఏడాదిన్నరలో ఎన్నోసార్లు కఠినమైన లాక్డౌన్లు విధించి కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ కరోనా కంటే ప్రతీ ఏడాది కాలుష్యం అనే భూతం ఢిల్లీని భయపెడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టైనా ఎందుకు లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాలుష్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత ఏడాది ఢిల్లీలో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఢిల్లీలో కాలుష్యంతో నిండిన ఒక రహదారి కరోనా తరహాలో కాలుష్యం ఆరోగ్యంతో పాటు ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తోంది. ప్రతీ ఏడాది దేశ రాజధానికి లక్ష కోట్ల రూపాయల నష్టం వస్తోంది. అయినప్పటికీ కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వాల్లో కదలిక రావడం లేదు. ప్రఖ్యాత లాన్సెట్ మ్యాగజైన్ ప్రకారం 2019లో భారత్‌లో కాలుష్యం బారిన పడి 16.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు ఏడాది శిలాజ ఇంధనాల కాలుష్యంతో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని హార్వార్డ్ అధ్యయనం తేటతెల్లం చేస్తోంది. కాలుష్య నష్టాన్ని ఎలా లెక్కిస్తారు ? కాలుష్యం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని రెండు పద్ధతుల్లో లెక్కిస్తారు. ఉత్పత్తి సామర్థ్యమున్న ప్రజలు ముందుగానే మరణించడం, కాలుష్యంతో అనారోగ్యం పాలైన వారికి చికిత్స చెయ్యడానికైన ఖర్చు, పని చేసే ప్రాంతాల్లో దగ్గు, జలుబుతో బాధపడడం వల్ల పడిపోయిన ఉత్పాదకత వంటి వాటినన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కాలుష్యంతో ఏర్పడిన నష్టాన్ని లెక్కిస్తారు. ఆ విధంగా చూసుకుంటే కాలుష్యంతో దేశ జీడీపీలో 4.5 శాతం నష్టం ప్రతీ ఏడాది వాటిల్లుతోంది. గ్రీన్‌పీస్ సంస్థ వేసిన అంచనాల ప్రకారం గత ఏడాది కాలుష్యంతో ఢిల్లీ రాష్ట్ర జీడీపీలో 13 శాతం అంటే దాదాపు రూ.60 వేల కోట్ల నష్టం వాటిల్లింది. విల్లింగ్ టు పే (డబ్ల్యూటీపీ) అనే విధానంలోనూ కాలుష్య నష్టాన్ని లెక్కిస్తారు. దీని ప్రకారం కాలుష్య నివారణకు ప్రజలు ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్న లెక్కల ఆధారంగా చూస్తే ఢిల్లీకి ఏడాదికి లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతోంది. కాలుష్య సమస్య నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేవీ శాశ్వత చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆలయ పూజాదికాల్లో జోక్యం చేసుకోం
సాక్షి, న్యూఢిల్లీ: ఆలయాల రోజువారీ పూజాదికాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సంప్రదాయాలు పాటించడం లేదని అనుమానమొస్తే తగిన సాక్ష్యాధారాలతో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కైంకర్యాల్లో టీటీడీ సంప్రదాయాలు పాటించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. టీటీడీ దాఖలు చేసిన కౌంటరు పిటిషన్‌తో సంతృప్తి చెందడంలేదని, తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అభిషేకాలు, దర్శనాలు, బ్రహ్మోత్సవం తదితర అంశాల్లో సంప్రదాయాలు పాటించడం లేదని పేర్కొన్నారు. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇవ్వలేదా అని టీటీడీ న్యాయవాదిని జస్టిస్ హిమకోహ్లి ప్రశ్నించారు. పిటిషనర్ సందేహాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో నివృత్తి చేశామని టీటీడీ న్యాయవాది తెలిపారు. సంప్రదాయాల ప్రకారం పూజాదికాలు జరుగుతున్నాయని సమగ్రంగా పిటిషనర్‌కు వివరించాలని, దీనికి ఎనిమిది వారాల గడువు ఇస్తున్నామని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సంప్రదాయాలు పాటించడంలో లోపాలుంటే ట్రయల్ కోర్టును లేదా తగిన వేదికను ఆశ్రయించాలని జస్టిస్ ఏఎస్ బోపన్న సూచించారు. ప్రాథమిక హక్కుగా భావించి పిటిషన్ దాఖలు చేశానని పిటిషనర్ పేర్కొనగా.. హిమకోహ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసును మరో కోణంలోకి తీసుకెళ్లొద్దన్నారు. పిటిషన్ కొట్టేస్తామని, సివిల్ సూట్ దాఖలు చేసుకోమని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ‘పూజాదికాలు కాకుండా పాలనపరమైన నిర్లక్ష్యంపై ఎవరు కోర్టు దృష్టికి తీసుకొచ్చినా టీటీడీని ప్రశ్నిస్తాం. కొబ్బరికాయలు ఎలా కొట్టాలి, హారతి ఎలా ఇవ్వాలి అనేది న్యాయస్థానాలు నిర్ణయించవు. ఆలయ దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోం. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఎనిమిది వారాల్లో టీటీడీ సమాధానం ఇవ్వాలి. టీటీడీ లోపాలపై సాక్ష్యాధారాలుంటే పిటిషనర్ ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చు’ అని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ సమయంలో పిటిషనర్ కోర్టు సూచనలు పాటించకపోవడంతో జస్టిస్ ఎన్వీ రమణ పలుసార్లు వారించారు. సహనం పాటించాలని, కోర్టులు ప్రసంగాల కోసం కాదని, పిటిషన్ ప్రచారం కోసం దాఖలు చేసినట్లుగా భావించి కొట్టేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతను కాపాడుకోవాలి
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను అన్ని స్థాయిల్లోనూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, సమగ్రతల పరిరక్షణ, ప్రచారం అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు, జిల్లా కోర్టుల పని తీరుపైనే భారత న్యాయ వ్యవస్థ ఔన్నత్యం ఆధారపడి ఉందని, ఆ కోర్టులు ఇచ్చే తీర్పుల ద్వారా లక్షలాది మందికి ఈ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎన్ఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన, ప్రచార కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన కోర్టులు ఇచ్చే తీర్పులు సమాజంపై అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయని, సంక్షేమ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఎంతో కీలకమైనదని ఉద్ఘాటించారు. ‘‘ట్రయల్ కోర్టు, జిల్లా కోర్టుల పనితీరును ఆధారంగా చేసుకొని భారత న్యాయవ్యవస్థపై లక్షలాది మంది అంచనాలు ఏర్పాటు చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో కోర్టులు బలోపేతమైతేనే ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటవుతుంది. అందుకే న్యాయ వ్యవస్థ స్వతంత్రం, సమగ్రతలను కాపాడుకోవడానికి మించి దేనికి ప్రాధాన్యం లేదు’’ అని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను ఉద్దేశించి తొలిసారిగా ముఖాముఖి మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ ‘‘రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతల్ని చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తించాలి. అప్పుడే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది. కింద కోర్టులు ఇచ్చిన తీర్పులు సామాజికంగా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఆ తీర్పులు అందరికీ అర్థమయ్యేలా సులభమైన భాషలో స్పష్టంగా ఉండాలి’’ అని ఉద్బోధించారు. -
ఢిల్లీలో ఊపిరి ఆడట్లేదు
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని, అత్యవసర పరిస్థితి కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. రెండు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తే మంచిదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం సూచించింది. ఇళ్లల్లో కూడా మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయని జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్ని తీయడంతో పిల్లలు ఎక్కువగా కాలుష్యం బారిన పడుతున్నారని ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం పెరిగిపోవడానికి పంట వ్యర్థాలను కాల్చడమే కారణమని కేవలం రైతుల్ని మాత్రమే నిందించడం తగదన్నారు. వాహనాల నుంచి కాలుష్యం, బాణాసంచా కాల్చడం, పారిశ్రామిక వ్యర్థాలు వంటివన్నీ కూడా వాయుకాలుష్యాన్ని తీవ్రతరం చేస్తున్నాయని అన్నారు. ఏక్యూఐని 500 పాయింట్ల నుంచి 200కి తగ్గించడానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి.. రెండు రోజుల లాక్డౌన్ సహా అత్యవసరంగా చర్యలేమైనా తీసుకోండి..అని ధర్మాసనం పేర్కొంది. గాలిలో కాలుష్యాన్ని తగ్గించి శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన స్మాగ్ టవర్లు చేస్తున్నాయా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన అడ్వకేట్ రాహుల్ మెహ్రా.. సెప్టెంబర్ 30న ఏక్యూఐ 84 ఉంటే ప్రస్తుతం 474కి పెరిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం కాలుష్యం రోజుకి 20 సిగరెట్లు కాల్చిన దానితో సమానమని అన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం 6.30కి ఏక్యూఐ 427గా ఉంది. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) వారం రోజులు పాఠశాలలు బంద్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో బడుల్ని సోమవారం నుంచి వారం రోజులు మూసివేయనున్నట్లు్ల సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ సమయంలో స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తారని చెప్పారు. ప్రైవేటు కార్యాలయాలు కూడా ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించారు. నిర్మాణ రంగం పనుల్ని నవంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. (చదవండి: వావ్ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్ సినిమాలో మాదిరి ఎగురుతోంది!!) -
‘సీజే బదిలీ ప్రజా ప్రయోజనాల కోసమేనా?’
సాక్షి, న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్య్రం, లౌకికవాదం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, ఆరోగ్య హక్కు, రాష్ట్ర జవాబుదారీతనంపై అనేక ఉత్తర్వులు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీని ఎందుకు బదిలీ చేశారంటూ సుప్రీంకోర్టు కొలీజియంను ఆ కోర్టు లాయర్లు ప్రశ్నించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. జస్టిస్ సంజీబ్ బెనర్జీని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం సిఫార్సుపై మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోపే బదిలీ చేయడం ప్రజా ప్రయోజనం కోసమా? లేక మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా? అని తమ లేఖలో ప్రశ్నించారు. 75 మంది న్యాయమూర్తులుండే మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ఇద్దరు న్యాయమూర్తులుండే మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయడం విస్తుగొలిపే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోం దని పేర్కొన్నారు. ఈ తరహా బదిలీ నిజాయితీ కలిగిన న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ ప్రతిష్టను సైతం దిగజారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ బస్సులు రావడంలేదని.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు బాలిక ఫిర్యాదు
సాక్షి,రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిడేడు గ్రామానికి చెందిన ఓ బాలిక ఆర్టీసీ బస్సులు సరిగా నడవడంలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది. తాను పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడపడం లేదనే విషయాన్ని సీజేఐకి ఓ లేఖ ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం బాలిక వైష్ణవి 8వ తరగతి చదువుతోంది. అయితే విద్యార్థిని అభ్యర్థనపై స్పందించిన సీజేఐ.. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులను తక్షణమే పునరుద్ధరించినట్లు వెల్లడించారు. అదేవిధంగా బస్సుల పునరుద్ధరణపై అప్రమత్తం చేసినందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
41–ఎ దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: నేర విచారణ చట్టం (సీఆర్పీసీ) సెక్షన్ 41–ఎను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టుల న్యాయవాదుల సంఘం సహాయ కార్యదర్శి జక్కుల లక్ష్మణ్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ (నల్సా)ను ఆదేశించారు. స్పందించిన నల్సా..లక్ష్మణ్ లేఖపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థను సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పి.నవీన్‌రావు నేతృత్వంలోని సంస్థ త్వరలోనే సమావేశమై తగిన నిర్ణయం తీసుకోనుంది. ‘కొన్నేళ్లుగా నేను కేంద్ర ప్రభుత్వంతోపాటు పలుమార్లు సుప్రీంకోర్టుకు లేఖ రాసినా స్పందన లేదు. 41–ఎను అడ్డుపెట్టుకొని పోలీసులు నిందితులను వేధిస్తున్నారు. లంచం ఇస్తే స్టేషన్లోనే బెయిల్ ఇస్తున్నారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాలను జతచేస్తూ గత ఆగస్టు 26న సీజేఐకి రాసిన లేఖకు ఇంత త్వరగా స్పందన వస్తుందని అనుకోలేదు. సీజేఐకి కృతజ్ఞతలు’అని లక్ష్మణ్ మీడియాతో పేర్కొన్నారు. -
గోప్యత హక్కు చాలా ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొంతమంది విపక్ష నేతలు, ప్రముఖులు, పాత్రికేయులపై నిఘా ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ వినియోగించిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు కమిటీ నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో 300మందికి పైగా మొబైల్ ఫోన్లపై నిఘా ఉంచారంటూ మనోహర్‌లాల్ శర్మ, ఎడిటర్స్ గిల్డ్ సహా పలువురు జర్నలిస్టులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం 46 పేజీల తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని తామే ఏర్పాటు చేస్తామన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రజాస్వామ్య దేశంలో అక్రమంగా వ్యక్తులపై నిఘా పెట్టడాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది. జాతీయ భద్రతతో ముడిపడిన అంశమని చెప్పి కేంద్రం ప్రతిదాన్నీ దాటవేయలేదని స్పష్టం చేసింది. పౌరుల వ్యక్తిగత గోపత్య హక్కుకు సంబంధించి ఇటీవలికాలంలో అత్యంత కీలకమైన తీర్పును వెలువరిస్తూ... జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పి... న్యాయవ్యవస్థను మౌనప్రేక్షక పాత్రకు పరిమితం చేయలేరని విస్పష్టంగా పేర్కొంది. నిపుణుల కమిటీని వారి సమాచారాన్ని వ్యక్తిగతంగా సేకరించి, పరిశీలించి నియమించామని తెలిపింది. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, నెట్వర్క్, హార్డ్‌వేర్ వంటి సాంకేతిక అంశాల్లో అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను ఎంపిక చేసి పారదర్శక దర్యాప్తు నిమిత్తం కమిటీలో నియమించామని పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ కమిటీకి నేతృత్వం వహిస్తారని, దర్యాప్తు పారదర్శకంగా, సమర్థంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కమిటీకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓసీ)ను తీర్పులో పొందుపరిచింది. కమిటీ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పెగాసస్‌పై సమగ్రంగా పరిశీలించి, దర్యాప్తు అనంతరం నివేదికను కోర్టుకు అందించాలని కమిటీని ఆదేశించింది. ఎనిమిది వారాల అనంతరం ఈ అంశంపై విచారణ చేస్తామని పేర్కొంది. కోర్టు నియమించిన కమిటీకి కావాల్సిన వసతి, ఇతరత్రా సౌకర్యాలు, సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏజెన్సీలు అందించాలని ఆదేశించింది. దేశప్రజలపై విదేశీ ఏజెన్సీలు, ప్రైవేటు సంస్థలు నిఘా ఉంచడాన్ని గమనించిన ధర్మాసనం ఈ అంశాన్ని కూడా దర్యాప్తు చేయాలని కమిటీని ఆదేశించింది. నిబంధనలకు లోబడే ఉండాలి... దేశంలో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాల్సి ఉందన్న సుప్రీంకోర్టు జాతీయ భద్రత విషయంలో న్యాయవ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది, అయితే, న్యాయసమీక్షకు వ్యతిరేకంగా దేన్నిపడితే దాన్ని నిషేధించే అవకాశం లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత అనేది ఎప్పుడుపడితే అప్పుడు ఉపయోగించే అంశం కాదని తెలిపింది. ఆ ప్రస్తావన వచ్చినపుడల్లా న్యాయవ్యవస్థ జోక్యం అవసరమని అభిప్రాయపడడం లేదని తెలిపింది. జాతీయ భద్రతపై భయాందోళనలు తలెత్తినపుడల్లా కేంద్రానికి తప్పించుకొనే అవశాకం వస్తుందని కాదని, అలాగని తిరస్కరించే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినపుడు కేంద్రం తననితాను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సమాచారం బహిర్గతం కావడం అనేది జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేస్తుందని చెప్పి దీనిపై కోర్టు అన్నివేళలా మౌనంగా వ్యవహరించబోదని స్పష్టం చేసింది. దేశంలో ప్రజలందరికి గోప్యత హక్కు చాలా ముఖ్యమని పేర్కొంది. ప్రజల జీవితాలు మెరుగుకావడానికి సాంకేతిక సాధనమైనప్పటికీ దాని వల్లే గోప్యత ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిపింది. ‘గోప్యత అనేది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలకు మాత్రమే సంబంధించింది కాదు. గోప్యత ఉల్లంఘనల నుంచి ప్రతి పౌరుడికి రక్షణ, భద్రత ఉండాలి. ఇదే వ్యక్తిగత స్వేచ్ఛను ఉయోగించుకునేలా చేస్తుంది‘ అని ధర్మాసనం పేర్కొంది. ఇతర హక్కుల మాదిరిగానే గోప్యత హక్కు కూడా పరిమితులకు లోబడే ఉంటుందని, అవి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటానికి నిఘా ఎంతో అవసరమని, ఈ పరిస్థితుల్లో వ్యక్తుల గోప్యత హక్కులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం వస్తుందని, ఇది జాతీయ భద్రత, ప్రయోజనాల కోసమే నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. గోప్యత హక్కు ఉల్లంఘన ఆరోపణల విషయంలో సదరు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం సరైనా సాక్ష్యాధారాల ద్వారానే జరగాలని తెలిపింది. ప్రజాస్వామ్య దేశాల్లో విచక్షణారహితంగా వ్యక్తులపై నిఘా, గూఢచర్యం అనుమతించడానికి వీల్లేదని పేర్కొంది. మీడియాపై నిఘా అనేది పబ్లిక్ వాచ్ డాగ్ పాత్రపై దాడి చేసినట్లుగా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలా చేయడం కచ్చితత్వంతో కూడిన నమ్మదగిన సమాచారాన్ని అందించే పత్రిక సామర్థ్యాన్ని అణగదొక్కడమేనని పేర్కొంది. పెగాసస్‌పై తొలి ఆరోపణల నుంచి కేంద్రం తగిన వైఖరి వెల్లడించలేదని, అయినప్పటికీ రెండేళ్లుగా కోర్టు తగిన సమయం ఇచ్చిందని తెలిపింది. జాతీయ భద్రతా సమస్యలను ప్రభావితం చేసే ఏ సమాచారాన్నైనా బహిర్గతం చేయాలని కేంద్రంపై తామెప్పుడు ఒత్తిడి చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీ సభ్యులు జస్టిస్ ఆర్వీ రవీంద్రన్: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఇటీవల కుట్ర ఆరోపణలు వచ్చినపుడు విచారణకు నియమితులైన జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. జస్టిస్ రవీంద్రన్ న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్బీఎస్ఏ)కు 2013 నుంచి 2019 వరకూ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆలోక్ జోషి: 1976 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆలోక్ జోషి ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్త డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విశేషమైన దర్యాప్తు అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. రిసెర్చ్, ఎనాలసిస్ వింగ్ (రా)లో కార్యదర్శిగా, నేషనల్ టెక్నికల్ రిసెర్చీ ఆర్గనైజేషన్‌కు ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ రవీంద్రన్‌కు సహాయకారిగా ఈ కమిటీలో సభ్యుడిగా సుప్రీంకోర్టు నియమించింది. డాక్టర్ సందీప్ ఒబెరాయ్ : ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యురిటీ నిపుణుడుగా గుర్తింపు పొందారు. టీసీఎస్ సైబర్ సెక్యూరిటీస్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల రంగంలో సదుపాయాల అభివృద్ధికి సబ్ కమిటీ అయిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండరైజేషన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్, జాయింట్ టెక్నికల్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. సాంకేతిక కమిటీ సభ్యులు డాక్టర్ నవీన్‌కుమార్ చౌధరి: సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ అయిన నవీన్ కుమార్ గుజరాత్‌లోని నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ డీన్‌గా పనిచేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేయడంతోపాటు సైబర్ సెక్యూరిటీ ఎనేబులర్‌గా, సైబర్ సెక్యురిటీ నిపుణుడిగా పేరుగాంచారు. సైబర్ సెక్యూరిటీ పాలసీ, నెట్వర్క్, వల్నరబిలిటీ అసెస్మెంట్, పెనట్రేషన్ టెస్టింగ్‌లో అనుభవంగల వారు. డాక్టర్ పి.ప్రభాహరన్: కేరళలోని అమృత విశ్వ విద్యాపీఠంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ప్రభాహరన్. కంప్యూటర్ సైన్స్, సెక్యూరిటీకి సంబంధించి రెండు దశాబ్దాల అనుభవం ఈయన సొంతం. మాల్వేర్ డిటెక్షన్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్సెక్యూరిటీ, కాంప్లెక్స్ బైనరీ ఎనాలసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో నిపుణులు. పలు జర్నల్స్‌లో ప్రభాహరన్ వ్యాసాలు ప్రచురితమయ్యాయి. డాక్టర్ అశ్విన్ అనిల్ గుమస్తే: బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్‌టెక్నాలజీ (ఐఐటీ)లో కంప్యూటర్‌సైన్స్ ఇంజినీరింగ్‌లో ఇన్స్టిట్యూట్ ఛైర్ అసోసియేట్ ప్రొఫెసర్. ఈయన పేరు మీద 20 యూఎస్ పేటెంట్లు ఉన్నాయి. 150 పత్రాలు వివిధ «జర్నల్స్‌లో ప్రచురితం కాగా మూడు పుస్తకాలు రాశారు. విక్రమ్‌సారాభాయ్ అవార్డు (2012), శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (2018)లో అందుకొన్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజిటింగ్ ప్రొఫెసర్. పరిశీలించే అంశాలు... భారతీయుల ఫోన్లు, ఇతరత్రా పరికరాలను పెగాసస్ స్పైవేర్‌ను వినియోగించి వారి సంభాషణలను ఆలకించడం, ఫోన్లలో నిల్వ ఉన్న సమాచారాన్ని సేకరించడం, లేదా ఇతరత్రా ప్రయోజనాల కోసం వినియోగించడం కేంద్ర ప్రభుత్వం చేసిందా?. అలా చేస్తే బాధితుల వివరాలు ఏంటి? పెగాసస్ వినియోగించి 2019లో భారతీయుల వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఏయే చర్యలు తీసుకుంది ?. కేంద్రం పెగాసస్ సహా ఏ తరహావైనా స్పైవేర్లను కలిగి ఉందా? భారతీయులపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాన్ని వినియోగించిందా?. ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ భారతీయులపై ఆ తరహా స్పైవేర్‌ను వినియోగించి ఉంటే ఏ చట్ట ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం లేదా ప్రోటోకాల్, న్యాయ సంబంధిత అంశం ద్వారా చేపట్టింది? భారతదేశానికి సంబంధించిన సంస్థ/వ్యక్తులు స్పైవేర్ వినియోగించినట్లైతే వారికి ఉన్న అధికారం ఏంటి? ఇతరత్రా సంబంధిత అంశాలు, ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అనేది కమిటీ పరిశీలించాలి. -
మౌలిక సదుపాయాలు అధ్వానం
ముంబై: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. అందరికీ న్యాయం అందాలంటే, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కానీ మన కోర్టుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ ఒక ప్రణాళిక లేకుండా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌కు చెందిన భవనాలను శనివారం సీజేఐ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. న్యాయశాఖ మంత్రి ఎదుటే జస్టిస్ రమణ తన ఆవేదనంతా బయటపెట్టారు. దేశంలోని చాలా కోర్టుల్లో సరైన సదుపాయాలు లేవని, కొన్ని కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాలు ఉంటేనే న్యాయవ్యవస్థ బాగుంటుందని, న్యాయవ్యవస్థ సమర్థంగా పనిచేస్తే ఆర్థిక రంగం వృద్ధి చెందుతుందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. 2018లో సరైన సమయంలో తీర్పులు రాకపోవడం వల్ల దేశం వార్షిక జీడీపీలో 9% మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైనట్టుగా ఈ సందర్భంగా జస్టిస్ రమణ చెప్పారు. ఇప్పుడు తాను ప్రారంభించిన ఔరంగాబాద్ కోర్టు భవన నిర్మాణం 2011లో మొదలైందని, అది పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందంటే ప్రణాళికలో ఎన్ని లోపాలున్నాయో తెలుస్తోందని అన్నారు. కేవలం క్రిమినల్స్, బాధితులు మాత్రమే కోర్టు గుమ్మం తొక్కుతారన్న అభిప్రాయం ఇప్పటికీ సామాన్యుల్లో నెలకొని ఉందని.. చాలా మంది తాము అసలు కోర్టు ముఖం కూడా చూడలేదని గర్వంగా చెప్పుకుంటారన్న జస్టిస్ రమణ అలాంటి ఆలోచనల్ని రూపుమాపి అందరూ తమ హక్కుల సాధనకు కోర్టుకు వచ్చే పరిస్థితులు కల్పించాలన్నారు. ప్రజలు కోర్టుకు రావడానికి సంకోచపడే రోజులు పోవాలని, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉండడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. దృఢమైన న్యాయవ్యవస్థతో ప్రజాస్వామ్యం విజయవంతం: రిజిజు జస్టిస్ ఎన్.వి. రమణ మౌలిక సదుపాయాల అంశం గురించి ఆందోళన వ్యక్తం చేయడానికి ముందే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ప్రసంగంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే దృఢమైన న్యాయవ్యవస్థ ఉండాలన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9 వేల కోట్లు కేటాయిస్తూ గత మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ బడ్జెట్‌తో 4 వేల కోర్టు భవనాలు, న్యాయమూర్తులకు 4 వేల నివాసాలు కట్టించి ఇస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాయని రిజిజు చెప్పారు. కోర్టుల్లో పరిస్థితి ఇదీ..! కోర్టుల్లో మౌలికసదుపాయాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో జస్టిస్ రమణ గణాంకాలతో సహా వివరించారు. ‘‘దేశవ్యాప్తంగా 20,143 కోర్టు భవనాలు ఉన్నాయి. 16% కోర్టుల్లో కనీసం టాయిలెట్లు లేవు. 26% కోర్టుల్లో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ సదుపాయం లేదు. కేవలం 54% కోర్టుల్లోనే రక్షిత మంచినీరు లభిస్తోంది. 5% కోర్టుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. 32% కోర్టుల్లో రికార్డు రూములు విడిగా ఉన్నాయి. 51%కోర్టుల్లో మాత్రమే లైబ్రరీ సదుపాయం ఉంది. కేవలం 27% కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచా రణ చేయడానికి వీలుగా న్యాయమూర్తుల టేబుల్‌పై కంప్యూటర్లు ఉన్నాయి’’ అని తెలిపారు. -
అశ్వ వాహన సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అశ్వ వాహనంపై శ్రీవారు దర్శనమిస్తున్నారు. అశ్వ వాహన సేవలో సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొన్నారు. (చదవండి: బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సీఎం జగన్) జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు. రేపు(శుక్రవారం) ఉదయం చక్రస్నాన మహోత్సవంలో సీజేఐ పాల్గొననున్నారు. తిరుమల పర్యటనకు విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలంతా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నారు. చదవండి: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ సర్కార్ నిర్ణయం -
నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీసింది. ఇతర హత్యల కేసుల్లోనూ నిందితుల పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ఘాటుగా ప్రశ్నించింది. ఈ ఘటనపై వేరే దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని, అప్పటిదాకా ఆధారాలను భద్రంగా ఉంచాలని డీజీపీకి కోర్టు మాటగా చెప్పాలని యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనను సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రధాన నిందితుడికి సమన్లు జారీ చేశామని చెప్పారు. 8 మంది మృతికి కారణమైన ఘటనలో సాధారణంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. బాధితుల శరీరాల్లో బుల్లెట్ గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు హరీష్ సాల్వే చెప్పగా.. ఇదే కారణంతో అరెస్టు చేయలేదా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని సీజేఐ తెలిపారు. దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడతామంటూ అక్టోబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా, లఖీపూర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలను జస్టిస్ ఎన్.వి.రమణ కలుస్తారంటూ ఓ ఆంగ్ల పత్రిక ట్వీట్ చేయడంపై సీజేఐ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అదేసమయంలో ఈ రకంగా చేయడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న తాను లక్నోకు ఎలా వెళ్లగలని ప్రశ్నించారు. మిశ్రాను తొలగించకపోతే 18న రైల్ రోకో: కిసాన్‌మోర్చా లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను ఈ నెల 11వ తేదీలోగా పదవి నుంచి తొలగించకపోతే 18న రైల్ రోకో చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితులను వారం రోజుల్లోగా అరెస్టు చేయకపోతే ప్రధాని మోదీ నివాసాన్ని దిగ్బంధిస్తామని దళిత నేత, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు. ఆశిష్‌ను అరెస్టు చేసేదాకా నిరాహార దీక్ష కొనసాగిస్తానని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఆయన శుక్రవారం నిరాహార దీక్ష ప్రారంభించారు. సమన్లకు స్పందించని ఆశిష్ శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ యూపీ పోలీసులు జారీ చేసిన సమన్లకు ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా స్పందించలేదు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ పోలీసులు తాజాగా నోటీసు జారీ చేశారు. ఆశిష్ అనారోగ్యం కారణంగా శుక్రవారం పోలీసుల విచారణకు రాలేకపోయాడని అజయ్‌కుమార్ మిశ్రా చెప్పారు. కాగా, లఖీమ్‌పూర్ ఖేరిని ప్రతిపక్ష నేతలు సందర్శిస్తుండడం పట్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్ వ్యంగ్యంగా స్పందించారు. వారిది రాజకీయ పర్యాటక కార్యక్రమం(పొలిటికల్ టూరిజం) అని ఎద్దేవా చేశారు. -
సమన్యాయం అందించేందుకు సహకరించండి!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అందరికీ సమన్యాయం అందించడానికి ప్రజా ప్రభుత్వాలు సహకారమందించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. వివిధ కోర్టుల్లో ఖాళీల పూరింపునకు కొలీజయం చేసిన సిఫార్సులను సత్వరమే ఆమోదించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సిఫార్సుల సత్వర అమలుతో పెండింగ్ కేసుల సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చన్నారు. ఇప్పటికే పలు సిఫార్సులను ఆమోదించామని, త్వరలో మిగిలినవాటికి అనుమతినిస్తామన్న కేంద్ర న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌తో న్యాయవ్యవస్థలో నెలకొన్న లోతైన సమస్యలు బయటపడ్డాయన్నారు. బలహీనవర్గాలకు సత్వర సమన్యాయం అందాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని నల్సా(జాతీయ న్యాయసేవల అథారిటీ) ఆధ్వర్యంలో ఆరువారాలు సాగే ‘పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్, అవుట్‌రీచ్ క్యాంపెయిన్’ను రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ శనివారం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమంతోనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమని గాంధీ భావించేవారని రమణ గుర్తు చేశారు. సమ్మిళిత వృద్ధి మాత్రమే స్థిరమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి దారి తీస్తుందనేది కాదనలేని సత్యమని తెలిపారు. సమన్యాయం తక్షణ అవసరం సమన్యాయం అందించకుండా సామాజిక ఆర్థిక సమానత్వం సాధించడం అసాధ్యమన్నారు. దీన్ని గుర్తించి అందరికీ సమన్యాయం అందించేందుకు కార్యనిర్వాహక, చట్టసభలు, న్యాయవ్యవస్థలు కలిసి పనిచేయాలన్నారు. ప్రజాస్వామ్య నాణ్యత నాణ్యమైన న్యాయంపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజాస్వామ్య దేశంలో సంస్థల్ని నిలబెట్టేది ప్రజల విశ్వాసం, నమ్మకమేనని పునరుద్ఘాటించారు. రెండున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైన నల్సా కోట్లాదిమందికి సేవలందించిందన్నారు. గాందీజీ జయంతినాడు మొదలైన ఈ కార్యక్రమం నెహ్రూ జయంతి రోజున ముగుస్తుందన్నారు. న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు చేరుకోవడానికి యతి్నస్తున్నామని, దీనికి అందరి సహకారం కావాలన్నారు. న్యాయవాది అయిన రాష్ట్రపతిని పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు రమణ చెప్పారు. చట్టపరమైన సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్రపతి అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభివృద్ధికి పాటుపడాలి సీనియర్ న్యాయవాదులు మహాత్మా గాంధీ ఆదర్శాలను పాటించి, పేదలకు సేవలందించాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. మహిళాభివృద్ధికి అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళాభివృద్ది భావన నుంచి మహిళల వల్ల అభివృద్ధి అనే భావనకు మరలాలన్నారు. సహేతుకమైన మూల్యానికి ఉత్తమ న్యాయ ప్రతిభ అందుబాటులో ఉండాలని గాంధీ కోరుకునేవారన్నారు. లాయర్లు తమ సమయంలో కొంత బలహీనవర్గాల సేవలకు కేటాయించాలన్నారు. కోర్టు బయట పరిష్కారాలను గాం«దీజీ బలంగా విశ్వసించేవారన్నారు. న్యాయవాద వృత్తిలో మహిళల పాత్ర మరింత పెరగాలన్నారు. స్వాతంత్య్రోద్యమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. అందరికీ న్యాయ సేవలు అందించడానికి నల్సా చేస్తున్న సేవలనుకోవింద్ ప్రశంసించారు. -
పోలీసులపై ఫిర్యాదుల విచారణకు స్థాయీ సంఘం
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు మధ్య ఉండే సన్నిహిత సంబంధాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీల అండ చూసుకొని బ్యూరోక్రాట్లు ,ముఖ్యంగా పోలీసు అధికారులు ఎలా ప్రవర్తిస్తారో తనకు తెలుసునన్నారు. పోలీసుల అకృత్యాలపై అందిన ఫిర్యాదులను విచారించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సస్పెండైన పోలీసు అధికారి గుర్జీందర్ పాల్ సింగ్ తనపై దేశద్రోహం, అవినీతి, బలవంతపు వసూళ్లకు సంబంధించి నమోదైన క్రిమినల్ కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం విచారించింది. నేతల అండతో చెలరేగే పోలీసు అధికారుల్ని న్యాయవ్యవస్థ కాపాడలేదని సీజేఐ వ్యాఖ్యానించారు. పోలీసు అధికారుల దౌర్జన్యాలపై దాఖలైన పిటిషన్ల విచారణకు స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందని చెప్పారు. -
16 మందికి న్యాయమూర్తులుగా పదోన్నతి!
న్యూఢిల్లీ: దేశంలో నాలుగు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి గాను సుప్రీంకోర్టు కొలీజియం 16 పేర్లను సూచించింది. బాంబే, గుజరాత్, ఒడిశా, పంజాబ్–హరియాణాల హైకోర్టుల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సమావేశమై 16 మంది పేర్లను సూచించింది. వీరిలో ఆరుగురు జ్యుడీషియల్ ఆఫీసర్లు కాగా, మరో 10 మంది అడ్వొకేట్లు ఉన్నారు. వీరికి పదోన్నతి కల్పించి, హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం పేర్కొంది. ఈ మేరకు గురువారం ఆ జాబితాను తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. నలుగురు జ్యుడీషియల్ అధికారులు ఎల్.పన్సారే, ఎస్.సి.మోరె, యూ.ఎస్.జోషి ఫాల్కే , బి.పి.దేశ్‌పాండేలను బాంబే హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. అడ్వొకేట్లు ఆదిత్యకుమార్ మహాపాత్రా, మృగాంక శేఖర్ సాహూ, జ్యుడీషియల్ ఆఫీసర్లు రాధాకృష్ణ పట్నాయక్, శశికాంత్ మిశ్రాలకు ఒడిశా హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసింది. గుజరాత్ హైకోర్టుకు అడ్వొకేట్లు మౌన మనీష్ భట్, సమీర్ జె.దేవ్, హేమంత్ ఎం.పృచ్ఛక్, సందీప్ ఎన్.భట్, అనిరుద్ధ ప్రద్యుమ్న, నీరల్ రష్మీకాంత్ మెహతా, నిషా మహేంద్రభాయ్ ఠాగూర్ పేర్లను సూచించింది. పంజాబ్–హరియాణా హైకోర్టుకు అడ్వొకేట్ సందీప్ మౌడ్గిల్ పేరును సూచించింది. ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణతోపాటు జస్టిస్ యు.యు.లలిత్, ఎ.ఎం.ఖాన్వి ల్కర్లతో కూడిన కొలీజియం హైకోర్టుల్లో జడ్జీ పోస్టుల ఖాళీల భర్తీకి సత్వర చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జస్టిస్ ఎన్.వి.రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 100 మంది పేర్లను సూచించారు. సుప్రీంకోర్టులో ఉన్న తొమ్మిది ఖాళీలను భర్తీ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టుల్లో 1,080 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది మే నాటికి 420 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఖాళీలని్నంటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి కొలీజియం కృషి చేస్తోంది. -
ధిక్కారణాధికారాన్ని తొలగించలేరు!
న్యూఢిల్లీ: కోర్టులకు ఉండే ధిక్కార శిక్షాధికారాన్ని ఎలాంటి చట్టంతో తొలగించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక ఎన్జీఓ చైర్‌పర్సన్‌ను కోర్టు ధిక్కారం కింద విచారిస్తూ గతంలో విధించిన రూ.25 లక్షల జరిమానాను చెల్లించకపోవడం ధిక్కరణేనని స్పష్టం చేసింది. ముద్దాయివి ధిక్కరణ చర్యలేనని, అలాంటి వాటిని శిక్షించకుండా కోర్టు వదిలేయదని జస్టిస్ సంజయ్ కిషన్‌తో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. సూరజ్ ట్రస్ట్ ఇండియా అనే సంస్థ అధిపతి రాజీవ్ దైయాపై కోర్టు ధిక్కార ఆరోపణలను సుప్రీం విచారించింది. గతంలో రాజీవ్ 64 ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. అయితే ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. దీంతో రాజీవ్‌కు సుప్రీంకోర్టు రూ.25 లక్షల జరిమానాను 2017లో విధించింది. దీనిపై పునఃపరిశీలన జరపాలని రాజీవ్ తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు రాజీవ్‌ది ధిక్కారమేనని తేలి్చచెప్పింది. రాజీవ్ కోర్టులపై బురద జల్లుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ధిక్కారణాధికారం తమకు రాజ్యాంగం ఇచి్చందని తెలిపింది. రాష్ట్రపతితో జస్టిస్ ఎన్.వి. రమణ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. శనివారం విజ్ఞాన్ భవన్లో న్యాయ సేవలపై అవగా హనా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ సదస్సు వివరాలను జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రపతికి వివరించారు. -
టీటీడీలో తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు
సాక్షి, న్యూఢిల్లీ: టీటీడీలో తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌తో జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడుతూ.. ‘పేరు ఇలా ఉందేమిటి? అసలు పేరు ఏమిటి’ అని అడిగారు. తన పేరు శ్రీవారి దాసానుదాసుడు అని, ఏలూరి శేషయ్య కుమారుడినని, అందరూ తనను శ్రీవారి దాదా అని పిలుస్తారని పిటిషనర్ చెప్పగా, వ్యవహారాల్లో అసలు పేరు ఉపయోగించాలని హితవు పలికారు. పిటిషనర్ వ్యక్తిగతంగా వాదన వినిపించడానికి అనుమతి ఇవ్వడంతో తిరుమలలో పూజలు సంప్రదాయంగా జరగడం లేదంటూ సమస్యలు ఏకరువు పెడుతుండగా.. జస్టిస్ ఎన్వీ రమణ అతన్ని నిలువరించారు. ‘పిటిషన్‌ను జాబితాలో త్వరగా చేర్చాలని ప్రతిరోజూ రిజిస్ట్రీని బెదిరిస్తారా? ఏమంత అత్యవసరం వచ్చింది? పూజలు ఎలా నిర్వహించాలి? ఎప్పుడు నిర్వహించాలో జోక్యం చేసుకొనే అవసరం ఏమిటి? ఏ చట్ట ప్రకారం కోర్టులు జోక్యం చేసుకోవాలి? ఇదేమైనా రాజ్యాంగ ఉల్లంఘనా? ఎంత మందిని దర్శనానికి అనుమతించాలనే అంశంపై టీటీడీని ప్రశ్నించడం ప్రాథమిక హక్కు కిందకు రాదు. నాతో సహా న్యాయమూర్తులు అందరూ శ్రీవేంకటేశ్వరస్వామి వారికి భక్తులే. పూజలు సంప్రదాయంగా జరగాలనే కోరుకుంటాం’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ దశలో పిటిషనర్ జోక్యం చేసుకోబోగా వారిస్తూ.. శ్రీవారి భక్తులకు సహనం ఉండాలని సూచించారు. గతేడాది మార్చిలో పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారని టీటీడీ తరఫు న్యాయవాది సత్య సభర్వాల్‌ను ప్రశ్నించారు. వారం రోజుల్లో కౌంటరు దాఖలు చేస్తామని ఆయన తెలుపడంతో తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. -
50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: యాభై శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ‘‘వేలాది సంవత్సరాల అణచివేత ఇక చాలు, న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు.. ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. మీరు చింతిస్తూ కూర్చోకూడదు. ఆగ్రహంతో గట్టిగా నినదించాలి. 50 శాతం రిజర్వేషన్లు కావాలని బలంగా డిమాండ్ చేయాలి. నా మద్దతు మీకు ఉంటుంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌లోని మహిళా న్యాయవాదులు ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల్లో మహిళలు 15 శాతమే ‘‘దిగువ న్యాయస్థానాల్లో మహిళా జడ్జీలు కేవలం 30 శాతం లోపే ఉన్నారు. హైకోర్టుల్లో 11.5 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టులో 11 నుంచి 12 శాతం ఉన్నారు. దేశంలోని మొత్తం 17 లక్షల న్యాయవాదుల్లో 15 శాతం మాత్రమే మహిళలున్నారు. బార్ కౌన్సిళ్లలో ఎన్నికైన ప్రతినిధుల్లో కేవలం 2 శాతం మాత్రమే మహిళలు. బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళల ప్రాతినిధ్యం లేదు. దీన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైన దిద్దుబాటు చర్యల గురించి కార్యనిర్వాహక వ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తా. ఉన్నత న్యాయస్థానాల్లో అంతరాన్ని తగ్గించడానికి సహచర కొలీజియం సభ్యులు కూడా చొరవ చూపడం సంతోషంగా ఉంది. న్యాయవాద వృత్తిలోకి రావడానికి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ అడ్డంకులు, లింగ వివక్ష ఎదుర్కొంటున్నారు. చాలామంది క్లయింట్లు పురుష న్యాయవాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోర్టు గదుల్లో సౌలభ్యంగా లేని వాతావరణం, మౌలికవసతుల లేమి, రద్దీగా ఉండే కోర్టు గదులు, వాష్‌రూమ్స్ లేమి వంటివి మహిళలు న్యాయవాద వృత్తిలోకి రావడానికి అడ్డంకిగా ఉంటున్నాయి. 6 వేల ట్రయల్ కోర్టుల్లో 22 శాతం కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని నా సర్వేలో తేలింది. మహిళలకు మరింతగా స్వాగతం పలికే వాతావరణం కల్పించాలి. న్యాయ విద్యలో లింగ నిష్పత్తిపై దృష్టి సారించాలి. తొలి చర్యగా న్యాయ కళాశాలలు, యూనివర్సిటీలలో మహిళలకు తగినంతగా రిజర్వేషన్లు కలి్పంచాలి. మహిళా జడ్జీలు, లాయర్లు గణనీయంగా పెరుగుతారు. అన్ని రంగాల్లోకి మహిళలు వచ్చేలా స్ఫూర్తి కావాలి. న్యాయవాద వృత్తిలో లింగ అసమానతలు తొలగించడానికి తీసుకొనే చర్యలకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. సీనియర్ న్యాయవాదుల ఎంపికకు త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రత్యక్ష విచారణ విషయానికొస్తే.. దీని వల్ల జడ్జీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. లాయర్లకే ఒకింత ఇబ్బంది. దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని భావిస్తున్నాం. థర్డ్‌వేవ్ రాకూడదని ప్రారి్థద్దాం. ప్రత్యక్ష విచారణకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పట్ల అడ్వొకేట్ల అసోసియేషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని సరిచేయాలని రిజిస్ట్రీని ఆదేశించా. మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని సీజేఐ జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు. వలస పాలకుల చట్టాలతో ఇబ్బందులు: జస్టిస్ పి.ఎస్.నరసింహ వలస పాలకుల హయాం నాటి కాలం చెల్లిన చట్టాలు, వాటికి ఇచ్చిన భాష్యాలతో భారత్ 70 ఏళ్లకు పైగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను లోతుగా అధ్యయనం చేసి వాటికి కొత్త వివరణ ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనే ఉందని అన్నారు. సుప్రీంకోర్టు బెంచ్‌లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండడం అసాధారణమైన విషయమన్నారు. కోర్టుల్లో 50 శాతానికి మహిళలు పరిమితమవకుండా ఇంకా ఎక్కువ మంది ఉండాలన్నదే తన ఆకాంక్షని చెప్పారు. ప్రతిభ ఆధారంగా ఎంత ఎక్కువ మంది మహిళలుంటే అంత మంచిదని, మగవారి కంటే మహిళలే లోతైన ఆలోచన చేస్తారని జస్టిస్ నరసింహ కొనియాడారు. -
ఇదే చివరిసారి.. గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారుచేసిన గణేశ్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. అదికూడా ఈ ఏడాది నిమజ్జనానికే అను మతి ఇస్తున్నామని స్పష్టంచేసింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన వేడుకలకు ఇదే చివరి అవకాశమని, ఇది పునరావృతం కారాదని తేల్చిచెప్పింది. హుస్సేన్‌సాగర్, చిన్నచిన్న ఇతరత్రా చెరువుల్లో పీఓపీతో చేసిన వినాయక ప్రతిమల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ధర్మాసనంలో జస్టిస్ హిమాకోహ్లి ఉన్నప్పటికీ గతంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ అంశంలో ఆదేశాలు ఇచ్చిన కారణంగా ఈ కేసు విచారణలో భాగస్వామ్యం కాలేనని చెప్పారు. చదవండి: 2nd ICT Policy: ఐదు అంశాలు.. పన్నెండు రంగాలు తరచూ ఈ సమస్య వస్తోంది... తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. గణేశ్ విగ్రహాల నిమజ్జనం వల్ల పర్యావరణ కాలుష్యం కానీయబోమని చెప్పారు. ప్రతిమ నిమజ్జనం ఒక క్రేన్‌తో చేస్తామని, వెంటనే మరో క్రేన్‌తో వాటిని బయటకు తీసి ఘనవ్యర్థాల నిర్వహణ నిమిత్తం తరలించి రీసైక్లింగ్ చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయబోమని నివేదించారు. ‘‘దురదృష్టవశాత్తు ఈ సమస్య హైదరాబాద్‌లో తరచూ వస్తూ ఉంటుంది. కోర్టు అనేక మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అన్నింటినీ పాటించడం లేదు. ఏటా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం నిర్వహిస్తున్నారు. అది కాలుష్యానికి కారణమవుతోంది. సొలిసిటర్ జనరల్ వాదనలు పరిగణనలోకి తీసుకుంటే పీవోపీ ప్రతిమల నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనం అయిన వెంటనే విగ్రహాలను తీసేస్తామని అంటున్నారు. ఈ దిశగా నిమజ్జనం రోజున కార్యక్రమాలపై హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. ఇదే చివరి అవకాశం’అని ధర్మాసనం పేర్కొంది. పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. చదవండి: మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు చివరి నిమిషంలో వస్తారు.. ‘హుస్సేన్‌సాగర్ పరిశుభ్రతకు ఏటా ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చిస్తున్న విషయం మీకు (తుషార్ మెహతా) తెలియదు. ఏటా నిమజ్జనానికి అనుమతినిస్తే సుందరీకరణ కోసం వెచ్చించడం ఎందుకు? దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. చివరి నిమిషంలో వస్తారు. అసలు ఏం జరుగుతోంది’అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఇకపై సమర్థవంతంగా ప్రణాళిక చేపడతామని అఫిడవిట్లో హామీ ఇచ్చామని, వేడుకల మధ్య తలెత్తిన సమస్యలకు ఓ పరిష్కారం గుర్తించామని తుషార్ మెహతా తెలిపారు. ఈ సమయంలో హైకోర్టులో పిటిషన్‌దారు వేణుమాధవ్ అభిప్రాయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ అడిగారు. 2005 నుంచి పిటిషన్లు వేసుకుంటూ వస్తున్నానని వేణుమాధవ్ తెలిపారు. ‘క్రమశిక్షణ, ప్రజల మద్దతు ఎంతో అవసరం. లక్షలాది మంది ప్రజలు వచ్చినప్పుడు ఈ సరస్సుకు వెళ్లు ఆ సరస్సుకి వెళ్లు అని చెప్పడం సాధ్యమేనా? ప్రజలు వారంతట వారే వస్తారు. భారీ ప్రతిమలు అనుమతించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పీవోపీ నిషేధానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తిగా లేం. చివరి నిమిషంలో అసాధ్యమైన వాటిని అమలు చేయాలని మేం ఆదేశించలేం. ఈ ఏడాదికి మాత్రం అనుమతి ఇస్తున్నాం. వచ్చే ఏడాది తప్పకుండా కోర్టు ఆదేశాలు పాటిస్తామని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి’అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. పిటిషనర్ ఫిర్యాదులోని ఇతరత్రా అంశాల్లో జోక్యం చేసుకోబోమని వాటిని హైకోర్టు పరిష్కరిస్తుందన్నారు. -
ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం: కేంద్రం
-
‘పెగాసస్ అంశంపై కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదు’
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ ప్రారంభం అయ్యింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా, పెగాసస్ అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ఈ అంశంపై మరో అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. కేంద్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిందా లేదా అన్నది అఫిడవిట్లో చర్చించే అంశం కాదు అని స్పష్టం చేసింది. విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా వాటిని అఫిడవిట్లో పొందుపర్చాలని తాము అనుకోవడం లేదని కేంద్రం సుప్రీం కోర్టు ఎదుట తమ వాదనలను వినిపించింది. కాగా, దీనిపై స్పందించిన ధర్మాసనం దేశ భద్రత, శాంతి భద్రతల అంశాలలోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. అదే విధంగా డిఫెన్స్ తదితర విషయాలు అడగట్లేదని తెలిపింది. పెగాసస్ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని ధర్మాసనం కేంద్రానికి తెలిపింది. చదవండి: ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేలా భారత బలగాలకు వ్యూహాత్మక శిక్షణ ! -
న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల లేమి!
అలహాబాద్: భారతీయ కోర్టులు ఇప్పటికీ అసంపూర్ణ మౌలిక సదుపాయాలతో పనిచేస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటి‹Ùపాలన అనంతరం న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం రాజ్యమేలిందన్నారు. పరిష్కారానికే జాతీయ జ్యుడీíÙయల్ ఇన్ఫ్రా కార్పొరేషన్(ఎన్‌జేఐసీ) ఏర్పాటుతోనే ఈసమస్యకు పరిష్కారమని సూచించారు. ఉత్తరప్రదేశ్జాతీయ లా యూనివర్సిటీ, అలహాబాద్ హైకోర్టు నూతన భవన సదుపాయం శంకుస్థాపనలో రాష్ట్రపతితో పాటు ఆయన పాల్గొన్నారు. దేశీయ కోర్టుల్లో మెరుగైన వసతులు లేకపోవడం విచారకరమని, దీనివల్ల న్యాయసిబ్బంది పనితీరుపై ప్రభావం కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం ఎన్‌జేఐసీ ఏర్పాటేనని అభిప్రాయపడ్డారు. దేశంలోని జాతీయ ఆస్తుల నిర్మాణ సంస్థలతో కలిసి ఎన్‌జేఐసీ పనిచేస్తుందని, జాతీయ కోర్టు డెవలప్మెంట్ ప్రాజెక్టుకు నమూనాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. సరైన మౌలికవసతుల కల్పనతో న్యాయం పొందే మార్గం మరింత సుగమం అవుతుందన్నారు. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడాన్ని ప్రస్తావిస్తూ, నూతన భవనంతో జ్యుడీషియరీ మరింత చురుగ్గా పనిచేసి పెండింగులను తగ్గిస్తుందని ఆశించారు. తీర్పులను వ్యవహారిక భాషలోకి అనువదించాన్న సూచన రాష్ట్రపతి కోవింద్దేనని ఆయన ప్రశంసించారు. ఆ తీర్పు సాహసోపేతం 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి జగ్మోహన్లాల్ సిన్హా ఇచి్చన తీర్పు అత్యంత సాహసోపేతమైనదని సీజేఐ రమణ ప్రశంసించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇందిర ఎన్నికను చెల్లకుండా చేసిన ఈ తీర్పు దేశంలో ఒక కుదుపు తెచ్చిందన్నారు. దీనికారణంగానే చివరకు ఇందిర ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. అలహాబాద్ హైకోర్టుకు 150 సంవత్సరాల చరిత్రుందని కొనియాడారు. ఇక్కడనుంచి అనేకమంది గొప్ప న్యాయవాదులు, న్యాయమూర్తులు వచ్చారన్నారు. దీంతో పాటు అలహాబాద్ నగర ప్రాశస్త్యాన్ని కూడా ఆయన ప్రస్తుతించారు. -
భర్తీ చేయకుండా నిర్వీర్యం చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అహనం వ్యక్తం చేసింది. వారంలోగా తీరు మార్చుకోవాలని పేర్కొంది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, ఢిల్లీ బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ మధ్యప్రదేశ్, అమర్జీత్ సింగ్ బేడిలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వాఖ్యలు చేసింది. మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి: కోర్టు తీర్పుల్ని కేంద్రం గౌరవించడంలేదని స్పష్టంగా అర్థమవుతోందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. ట్రైబ్యునళ్లలో ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలో చెప్పండి, ఆయా అంశాలపై ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాదిన్నరగా ఖాళీలు భర్తీ కాక మూసివేత దశలోకి వచ్చేలా ఉన్నా... ట్రైబ్యునళ్లలో ఎందుకు నియామకాలు చేపట్టడం లేదని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తమకు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. 1. కొత్త చట్టం అమలుపై స్టే ఇచ్చి ట్రైబ్యునళ్లను మూసివేయడం. 2. సుప్రీంకోర్టే ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయడం. 3. కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడం. కేంద్రంతో ఘర్షణ పడాలని తాము భావించడం లేదని, ఇటీవల సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకం విషయంలో కొలీజియం సిఫారసులను ఆమోదించినందుకు సంతోషంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఖాళీలతో చైర్పర్సన్లు, సభ్యులు లేక ట్రైబ్యునళ్లు కూలిపోయేలా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా వాటి నిర్వీర్యానికి కారణం అవుతున్నారని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ట్రైబ్యునళ్లను మూసివేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం నోటిఫై అయినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కొత్త చట్టం ఖాళీల భర్తీకి మార్గం సుగమం చేస్తుంది. సెర్చ్, సెలక్షన్ కమిటీ సిఫారసులను కేంద్రం తీసుకుంటుంది’ అని తుషార్ మెహతా తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ), నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)వంటి వాటిల్లో అనేక ఖాళీలున్నాయని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ట్రిబ్యునళ్లలో ఖాళీల వల్ల అనేక కేసులు పరిష్కారం కావడం లేదన్నారు. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా బ్యూరోక్రాట్లతో సమావేశమై పలు పేర్లు సిఫారసు చేశామని, అయినా నియామకాలు చేపట్టలేదని... ఇదంతా వృథా ప్రయాస అయిందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఖాళీల భర్తీకి సంబంధించి వివరాలను తదుపరి విచారణకు అందజేస్తామని మెహతా చెప్పడంతో ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని ధర్మాసనం పేర్కొంది. ‘‘మీపై మాకు విశ్వాసం ఉంది. ఇలాంటి చట్టాలు చేయమని ప్రభుత్వానికి ఎప్పుడూ సూచించరు . ప్రభుత్వం దగ్గర ఉండే కొందరు బ్యూరోక్రాట్లు సలహాలు ఇస్తారు. ఒకవేళ ఏదైనా తీర్పు వస్తే కొత్త చట్టం రూపొందించమని చెబుతారు. ప్రస్తుతం బ్యూరోక్రసీ పనితీరు ఇలా ఉంది. అది మాకు తెలుసు. కానీ సీరియస్ అంశం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ మేమెంతో నిరుత్సాహం చెందాం. మేం చెప్పదలచుకున్నది ఇదే’’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు. మూడు నాలుగు రోజులపాటు సమయం ఇస్తే... ఈలోగా భర్తీ చేస్తామని తుషార్ మెహతా చెప్పడంతో సోమవారానికి విచారణ వాయిదా వేస్తున్నామని కోర్టు పేర్కొంది. సోమవారానికి ఖాళీల భర్తీ కాకుంటే ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి పది రోజులు సమయం ఇస్తూ ధర్మాసనం ఆగస్టు 16న ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ట్రైబ్యునల్ సభ్యుల పదవీకాలం తగ్గించడం, ఇతర సేవలను తగ్గిస్తూ కేంద్రం తీసుకొచి్చన ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం, 2021ను ఇటీవల పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ట్రిబ్యునల్ సభ్యుడు లేదా చైర్పర్సన్ నియామకానికి కనీస వయసు 50 ఏళ్లు ఉండాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, ట్రైబ్యునళ్ల చైర్పర్సన్ల పదవీకాలం ఐదేళ్లు ఉండాలని ఆ మేరకు చట్టంలో పొందుపరచాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇవే అంశాలు మళ్లీ కొత్త చట్టంలో రావడంతో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా అంశాలు కేంద్రం విస్మరించడంతో తమ తీర్పులు పాటించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. గతంలో కొట్టివేసిన చట్టానికి కొత్త చట్టం అచ్చు నకలులా ఉందని పేర్కొంది. -
మా సహనాన్ని పరీక్షిస్తున్నారా?: సీజే ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్ ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. భర్తీ విషయంలో అలసత్వం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో సోమవారం వాదనలు జరగ్గా.. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలతో పాటు కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం మీద గౌరవం లేనట్లు మాకనిపిస్తోంది. మా సహనాన్ని పరీక్షిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఒక వారంలో ట్రిబ్యునల్స్ ఖాళీల భర్తీపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి సీజే నేతృత్వంలోని న్యాయమూర్తుల బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక సోలిసిటర్ జనరల్ మెహతాకి మూడు అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపిన సీజే రమణ.. నియమకాలు చేపట్టడం, ట్రిబ్యునల్స్‌ను మొత్తంగా మూసేయడం, నియమాకాలకు తమకు(సుప్రీం) అవకాశం ఇచ్చి.. కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధపడడం ఆప్షన్స్‌ను కేంద్రం ముందు ఉంచారు. ‘‘మేం అసహనంతో ఉన్నాం. ప్రభుత్వంతో ఇబ్బందికర వాతావరణం మేం కోరుకోవట్లేదు’’ అని సీజే వ్యాఖ్యానించారు. దానికి ప్రతిగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా‘‘ప్రభుత్వమూ ఇబ్బందికర పరిస్థితుల్ని కోరుకోవట్లేద’’ని తెలిపారు. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ దాఖలు చేసిన ట్రిబ్యునల్ ఖాళీల భర్తీ పిటిషన్‌పై.. చీఫ్ జస్టీస్ రమణ, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపుతోంది. ఈ క్రమంలోనే సోమవారం కేంద్రానికి నోటీసులు జారీచేసి.. తదుపరి విచారణను సెప్టెంబర్13కి వాయిదా వేసింది. చదవండి: వరవరరావు బెయిల్ మరోసారి పొడిగింపు -
కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
-
న్యాయవ్యవస్థలో ఖాళీల సత్వర భర్తీ!
సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్లో ఖాళీలు భారీగా పెరిగిపోవడం దేశీయ న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో కొలిజయం సిఫార్సులను కేంద్రం వేగంగా ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ జ్యుడీషియల్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని, దీనిపై త్వరలో కేంద్రానికి నివేదికనిస్తామని చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సత్కార సభలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టుకు ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను వేగంగా ఆమోదించినందుకు ప్రధానికి, న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీని సత్వరమే పూర్తిచేయాలని తాను భావించానని, ఈ భావన నెరవేరడం ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇటీవలే కొలీజియం పలు హైకోర్టులకు పలువురు జడ్జిల పేర్లను సిఫార్సు చేసిందని, ప్రభుత్వం వీలయినంత త్వరగా వీటికి ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. అన్ని హైకోర్టుల్లో కలిపి దాదాపు 41 శాతం పదవులు ఖాళీగా ఉన్నాయని, వచ్చే నెలలోపు వీటిలో 90 శాతం నియామకాలు జరగవచ్చని అంచనా వేశారు. ఖాళీల భర్తీలో సహకరించిన కొలీజియం సభ్యులను అభినందించారు. మౌలిక వసతుల కల్పన దేశ న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరతను తీర్చేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని జస్టిస్ రమణ చెప్పారు. చాలా కాలంగా మౌలిక సదుపాయాల పెంపుపై తాను దృష్టి పెట్టానని, ఈ సమస్యను ఒక కాలపరిమితితో పరిష్కరించేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ విషయంపై దేశవ్యాప్త నివేదిక సేకరణ పూర్తయిందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదన కేంద్ర న్యాయశాఖ మంత్రికి చేరుతుందని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధిక వ్యయప్రయాసల వల్ల లక్షలాది మంది ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారన్నారు. మహిళలను స్వాగతించాలి పలువురు మహిళలు న్యాయవాదులుగా కొనసాగుతున్నా, వీరిలో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నతస్థానాలకు చేరుకుంటున్నారని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్ల తర్వాత, అన్ని స్థాయిలలో మహిళలకు కనీసం 50% ప్రాతినిథ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరు ఆశించారని, కానీ ఎంతో కష్టం తరువాత సుప్రీంకోర్టులో మహిళా జడ్జీల సంఖ్య 11 శాతానికి పెరిగిందన్నారు. న్యాయవాద వృత్తిలోకి మహిళలను మరింత ఎక్కువగా స్వాగతించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా సహోద్యోగులను గౌరవించడంతో పాటు వారి పట్ల హుందాగా వ్యవహరించాలని సూచించారు. పేదలు, మహిళలు, రైతులు, కారి్మకులు, వెనుకబడినవారు తమ చట్టపరమైన హక్కులను వినియోగించుకొనేందుకు సహాయం చేయాలని, సాధ్యమైనప్పుడల్లా ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చెప్పారు. న్యాయవాద వృత్తిలోకి ఆహా్వనం సామాజిక పరిస్థితుల్లో మార్పు కారణంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయవాదులు, న్యాయమూర్తులు అయ్యేందుకు అవకాశాలు వస్తున్నాయని సీజేఐ చెప్పారు. కానీ ఇప్పటికీ గ్రామీణ, బలహీన వర్గాల నుంచి ఎక్కువ మంది ఔత్సాహికులు న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టట్లేదని భావిస్తున్నానన్నారు. న్యాయవాద వృత్తి ఇంకా పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని, మరింత మంది ఈ వృత్తిలోకి రావాలని ఆయన స్వాగతించారు. సభలో సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, వైస్ చైర్మన్ రామజోగేశ్వరరావు, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ జీఎల్ నాగేశ్వరరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహా రెడ్డి, వైస్‌చైర్మన్ కె.సునీల్ గౌడ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
‘స్త్రీలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’
న్యూఢిల్లీ: ‘‘లా అంటే నేటికి కూడా ధనవంతులు మాత్రమే చదవగలిగే కోర్సుగానే చూస్తున్నారు.. కాకపోతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వస్తుంది. అలానే న్యాయవాద వృత్తిని స్వీకరించే మహిళల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందన్నారు’’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. దేశంలోని పలు కోర్టుల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే హైకోర్టులలో ఉన్న ఖాళీల్లో 90శాతం పోస్టులను మరో నెల రోజుల వ్యవధిలో పూర్తిచేయనున్నట్లు ఎన్వీ రమణ తెలిపారు. ఎలాంటి వివాదం లేకుండానే కేవలం ఆరు రోజుల్లోనే సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తుల నియాకమానికి అనుమతులిచ్చినందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకి జస్టిస్ రమణ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఏడు దశాబ్దాల చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘లా కోర్సు అనగానే కేవలం ధనవంతులు మాత్రమే చదవగలిగేదిగా చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అవకాశాలు పెరుగుతున్నాయి. న్యాయవాద వృత్తి నేటికి కూడా పట్టణ వాసులకు సంబంధించిన వృత్తిగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఈ వృత్తిల్లో స్థిరంగా కొనసాగవచ్చు అని ఎవరూ హామీ ఇవ్వలేకపోతున్నారు. అందుకే న్యాయవాద వృత్తిని స్వీకరించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది’’ అన్నారు. అలానే కోర్టుల్లో మౌలిక సౌకర్యాలకు సంబంధించి ఎన్వీ రమణ.. కేంద్ర న్యాయ శాఖ మంత్రికి నివేదిక సమర్పించారు. (చదవండి: ఇదేం బాధ్యతారాహిత్యం) ఈ సందర్భంగా ఎన్వీ రమణ కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘‘సుప్రీంకోర్టులో కేవలం 11 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారనే విషయాన్ని తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాను. నేను హైకోర్టులో పని చేసే రోజుల్లో మహిళా జడ్జీల కోసం కనీసం టాయిలెట్స్ కూడా ఉండేవి కావు. నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాను’’ అన్నారు. దేశవ్యాప్తంగా పది హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68 మంది పేర్లను ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఎకానమీ పురోగమిస్తోందన్న వార్తలు చదివాం!)