CJI NV Ramana Attends High Tea Hosted By Govt of AP
Sakshi News home page

సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు

Published Sat, Dec 25 2021 5:29 PM | Last Updated on Sat, Dec 25 2021 10:05 PM

CJI NV Ramana Attends High Tea Hosted By Govt of AP - Sakshi

విజయవాడ: ఏపీ పర్యటనలో ఉన్న సీజేఐ ఎన్వీ రమణకు ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐకు ఇచ్చిన తేనీటీ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణకు సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్‌ జస్టిస్‌లు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు.  అంతకుముందు నోవాటెల్‌ హోటల్‌లో సీజేఐ ఎన్వీ రమణను సీఎం వైఎస్‌ జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్‌ జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్‌.. నోవాటెల్‌ హోటల్‌లో సీజేఐని కలిసి తేనీటి విందుకు ఆహ్వానించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: సీజేఐ ఎన్వీ రమణను కలిసిన సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement