
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న కోర్టు భవనం
తిరుపతి లీగల్: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం భవనాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ గురువారం ప్రారంభించనున్నారు. ఎర్రచందనం కేసుల్లో నిందితులకు రిమాండ్, 2016 సంవత్సరానికి ముందు నమోదైన కేసుల విచారణకు ఓ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టును రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేస్తోంది.
చిత్తూరు ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో నమోదైన ఎర్రచందనం కేసులను విచారించేందుకు రాష్ట్ర హైకోర్టు ఇటీవల జడ్జి నాగరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జూనియర్ సివిల్‌జడ్జి కోర్టుకు తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్‌ను ఇన్‌చార్జిగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, చిత్తూరు ఉమ్మడి జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ ఎన్.సత్యనారాయణమూర్తి కార్యక్రమంలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment