
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కార్యకలాపాల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం మాజీ క్రీడాకారులు, న్యాయమూర్తుల పేర్లు ప్రతిపాదించాలని పిటిషనర్లకు సూచించింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్ జస్టిస్ దీపక్‌వర్మ నియామకంపై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హెచ్‌సీఏ , బడ్డింగ్‌స్టార్ క్రికెట్ క్లబ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment